2023
యాజకత్వ దీవెనలు
2023 మార్చి


“యాజకత్వ దీవెనలు,” లియహోనా, 2023 మార్చి.

లియహోనా నెలవారీ సందేశము, 2023 మార్చి

యాజకత్వ దీవెనలు

చిత్రం
పన్నెండుమంది అపొస్తలులను నియమిస్తున్న క్రీస్తు

Christ ordaining the Twelve Apostles [పన్నెండుమంది అపొస్తలులను నియమిస్తున్న క్రీస్తు], హ్యారీ ఆండర్సన్ చేత

మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న వారు ప్రేరేపణ ద్వారా యాజకత్వ దీవెనను ఇస్తారు. యాజకత్వ దీవెనలు, దేవుని బిడ్డలందరికీ ఆయన శక్తిని, స్వస్థతను, ఆదరణను మరియు మార్గదర్శకత్వాన్ని పొందడాన్ని సాధ్యం చేస్తాయి.

యాజకత్వము

యాజకత్వము అనేది దేవుని శక్తి మరియు అధికారం. మెల్కీసెదెకు యాజకత్వాన్ని కలిగియున్న యోగ్యులైన పురుషులు యాజకత్వ దీవెనలు ఇచ్చినప్పుడు యేసు క్రీస్తు నామములో వ్యవహరిస్తారు. వారు ఈ దీవెనలను ఇస్తున్నప్పుడు, ఇతరులను దీవించడంలో రక్షకుని మాదిరిని వారు అనుసరిస్తారు.

చిత్రం
తల పైన ఉంచబడిన చేతులు

డేవిడ్ వింటర్స్ చేత ఛాయాచిత్రము

దీవెనలు ఎలా ఇవ్వబడతాయి

యాజకత్వ దీవెనలు తల పైన చేతులుంచుట ద్వారా ఇవ్వబడతాయి. మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న వ్యక్తి తన చేతులను దీవెనలు పొందుతున్న వ్యక్తి తలపై ఉంచుతాడు. తర్వాత అతడు ఆత్మ నిర్దేశించినట్లుగా దీవెనలు ఇస్తాడు. దీవెనలు ఇచ్చేవారు మరియు వాటిని స్వీకరించేవారు దేవునిపై విశ్వాసాన్ని సాధన చేస్తారు, ఆయన చిత్తము మరియు సమయపాలనపై నమ్మకముంచుతారు.

పిల్లలకు నామకరణం చేయడం మరియు దీవించడం

ఒక బిడ్డ జన్మించిన తర్వాత, యాజకత్వము కలిగియున్న వారు అతనికి లేదా ఆమెకు నామకరణం చేస్తారు మరియు దీవెన ఇస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:70 చూడండి). ఇది సాధారణంగా ఉపవాసము మరియు సాక్ష్యపు కూడికలో జరుగుతుంది. ముందుగా, బిడ్డకు నామకరణం చేస్తారు. తర్వాత యాజకత్వము కలిగియున్న వారు ఆ బిడ్డకు దీవెన ఇస్తారు.

చిత్రం
అనారోగ్యంతో ఉన్న బాలుడు యాజకత్వ దీవెనలు పొందుట

వెల్డెన్ సి. ఆండర్సన్ చేత ఛాయాచిత్రం

రోగుల కొరకు దీవెనలు

మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న వారు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దీవెనలు ఇవ్వవచ్చు. ఈ విధమైన దీవెన రెండు భాగాలను కలిగి ఉంటుంది: తైలంతో అభిషేకించడం మరియు అభిషేకాన్ని ముద్రవేయడం. మొదట, యాజకత్వము కలిగియున్న ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడిన లేదా దీవించబడిన ఆలివ్ నూనె యొక్క ఒక చుక్కను వ్యక్తి తలపై వేసి, ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత యాజకత్వము కలిగియున్న మరొకరు అభిషేకాన్ని ముద్ర వేసి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన విధముగా ఆ వ్యక్తికి దీవెన ఇస్తారు.

ఆదరణ మరియు ఉపదేశము యొక్క దీవెనలు

మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న వారు కుటుంబ సభ్యులకు మరియు వారిని అభ్యర్థించే ఇతరులకు ఆదరణ మరియు ఉపదేశము యొక్క దీవెనలు ఇవ్వగలరు. మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న తండ్రి తన పిల్లలకు పితృ దీవెనలను ఇవ్వగలడు. పిల్లలు ప్రత్యేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ఇవి విశేషముగా సహాయపడగలవు.

పిలుపులలో సేవ చేయడానికి సభ్యులను ప్రత్యేకపరచడం

సంఘ సభ్యులు పిలుపులను స్వీకరించి, సేవ చేయడానికి వారు ప్రత్యేకపరచబడినప్పుడు వారికి ఒక దీవెన ఇవ్వబడుతుంది. ఒక యాజకత్వ నాయకుడు ఆ పిలుపులో పని చేసే అధికారాన్ని వారికి అనుగ్రహిస్తాడు. వారి సేవలో వారికి సహాయం చేయడానికి యాజకత్వ నాయకుడు వారికి ఒక దీవెన కూడా ఇస్తాడు.

చిత్రం
తన గోత్రజనక దీవెనను చదువుతున్న స్త్రీ

షానా స్టీఫెన్సన్ చేత ఛాయాచిత్రం

గోత్రజనక దీవెనలు

యోగ్యులైన ప్రతీ సంఘ సభ్యుడు గోత్రజనక దీవెనలు పొందవచ్చు. ఈ దీవెన ప్రభువు నుండి వ్యక్తిగత ఉపదేశాన్ని ఇస్తుంది. ఇది ఒక వ్యక్తికి జీవితాంతం మార్గదర్శకత్వాన్ని మరియు ఆదరణను అందిస్తుంది. ఇది ఇశ్రాయేలు వంశములో ఆ వ్యక్తి యొక్క గోత్రమును కూడా తెలియజేస్తుంది. నియమితుడైన గోత్రజనకుడు మాత్రమే ఈ రకమైన దీవెనలు ఇవ్వగలడు.

ముద్రించు