2023
పరిశుద్ధాత్మ మనకు సహాయపడగలదు
2023 జూన్


“పరిశుద్ధాత్మ మనకు సహాయపడగలదు,” లియహోనా, 2023 జూన్.

లియహోనా నెలవారీ సందేశము, 2023 జూన్

పరిశుద్ధాత్మ మనకు సహాయపడగలదు

చిత్రం
మనిషి కూర్చోని, సూర్యోదయాన్ని గమనించుట

పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో మూడవ సభ్యుడు. లేఖనాలు ఆయనను ఆత్మగా, పరిశుద్ధాత్మగా, లేదా ఆదరణకర్తగా కూడ సూచిస్తాయి. ఆయన స్వరము వినుట మనం నేర్చుకొన్నప్పుడు, ఆయన మనకు యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తాడు మరియు సువార్త యొక్క సత్యములను నేర్చుకోవడానికి మనకు సహాయపడతాడు.

త్రియేక దేవునిలో సభ్యుడు

పరలోక తండ్రి, యేసు క్రీస్తు, మరియు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. వారు మనల్ని ప్రేమిస్తున్నారు మరియు రక్షణ ప్రణాళికను అమలు చేయడానికి ఐక్యతగా పనిచేస్తారు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మాంసము, ఎముకలు గల శరీరాలను కలిగియున్నప్పటికినీ, పరిశుద్ధాత్మ శరీరము కలిగిలేడు. ఆయన ఒక ఆత్మ.

చిత్రం
తండ్రి మరియు కుమారుని యొక్క రంగుల-గాజు చిత్రము

తండ్రి మరియు కుమారుని యొక్క సాక్ష్యము

పరిశుద్ధాత్మ “తండ్రి మరియు కుమారునిని గూర్చి సాక్ష్యమిచ్చును” (2 నీఫై 31:18). దీని అర్ధము పరిశుద్ధాత్మ ద్వారా మనము పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తును గూర్చి ఒక సాక్ష్యమును పొందగలము.

సత్యమును గూర్చి సాక్ష్యమిస్తుంది

పరిశుద్ధాత్మ సమస్త సత్యమును గూర్చి సాక్ష్యమిస్తుంది. రక్షణ ప్రణాళిక, దేవుని ఆజ్ఞలు, పునఃస్థాపన, మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము కలిపి సువార్త---సత్యమని తెలుసుకోవడానికి ఆయన మనకు సహాయపడతాడు. మనము ప్రార్థించుట కొనసాగించి, ఆజ్ఞలు పాటించి, మరియు సువార్తను అధ్యయనము చేయుట కొనసాగించినప్పుడు ఆయన మన సాక్ష్యాన్ని బలపరుస్తాడు.

చిత్రం
చేయి ఒక దిక్సూచిని పట్టుకొనుట

మనల్ని నడిపిస్తాడు మరియు కాపాడతాడు.

పరిశుద్ధాత్మ మన నిర్ణయాలను నడిపించగలదు మరియు శారీరక, ఆత్మీయ అపాయముల నుండి మనల్ని కాపాడగలదు. మనము ప్రార్థించి, సరైన దానిని చేయడానికి ప్రయత్నించిన యెడల, మన ప్రశ్నలకు జవాబులను కనుగొనడానికి ఆయన మనకు సహాయపడతాడు. ఆయన “మంచిని చేయుటకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12) మనల్ని ఎల్లప్పుడు నడిపించును.

మనల్ని ఓదార్చును

కొన్నిసార్లు పరిశుద్ధాత్మ “ఆదరణకర్తగా” (యోహాను 14:26) సూచించబడ్డాడు. మనము ఆందోళన చెంది, విచారించి, లేదా భయపడినప్పుడు, ఆయన మనల్ని “నిరీక్షణతోను, పరిపూర్ణమైన ప్రేమతోను” (మొరోనై 8:26) నింపగలడు. మనము దేవుని యొక్క ప్రేమను అనుభూతి చెందడానికి ఆయన సహాయపడినప్పుడు, మనము నిరాశను జయించగలము మరియు మన శ్రమలందు బలపరచబడతాము.

పరిశుద్ధాత్మ వరము

మనము బాప్తీస్మము పొందిన తరువాత, నిర్ధారణ అని పిలవబడిన విధిలో మనము పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందుతాము. ఈ వరమును మనము పొందాక, మనము నీతిగా జీవించినంత వరకు పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన సహవాసమును కలిగియుంటాము.

చిత్రం
లేఖనాలను చదువుతున్న స్త్రీ

జె. కర్క్ రిచర్డ్స్ చేత దృష్టాంతము

మనము పరిశుద్ధాత్మను ఎలా వింటాము

పరిశుద్ధాత్మ జనులతో వేర్వేరు విధాలుగా సంభాషిస్తుంది. ఇవి ఏమి చెప్పాలి లేక చేయాలో శాంతికరమైన, ఆదరణనిచ్చే భావనలు లేదా అంతర్‌జ్ఞానములు కలిగియుండవచ్చు. నడిపింపు కొరకు మనము ప్రార్థించి మరియు ఆయన ప్రేరేపణలను విన్నప్పుడు, ఆయన మనతో ఎలా మాట్లాడతాడో మనము నేర్చుకోగలము.

ముద్రించు