2023
స్వయం-సమృద్ధి మనల్ని బలపరుస్తుంది
2023 ఆగష్టు


“స్వయం-సమృద్ధి మనల్ని బలపరుస్తుంది,” లియహోనా, ఆగ. 2023.

లియహోనా నెలవారీ సందేశము, 2023 ఆగష్టు

స్వయం-సమృద్ధి మనల్ని బలపరుస్తుంది

చిత్రం
గిన్నెలు కడుగుతున్న ఇద్దరు వ్యక్తులు

స్వయం-సమృద్ధిగా ఉండటం అంటే మన మరియు మన కుటుంబాల అవసరతల కొరకు మనం శ్రద్ధ తీర్చుకోగలమని అర్థం. మనము స్వయం-సమృద్ధి కలిగియున్నప్పుడు, మనము ప్రభువుకు ఉత్తమంగా సేవ చేయగలము మరియు ఇతరుల కొరకు శ్రద్ధ తీసుకోగలుగుతాము. స్వయం-సమృద్ధి అనగా మన సమస్యలను మనం ఒంటరిగా ఎదుర్కోవాలని అర్ధము కాదు. మనకు అవసరమైనప్పుడు స్నేహితులు, కుటుంబం, వార్డు లేదా శాఖ సభ్యులు మరియు నిపుణుల నుండి సహాయం కోసం కోరవచ్చు.

స్వయం-సమృద్ధి యొక్క సూత్రములు

స్వయం-సమృద్ధి కలిగియుండటానికి విద్య, విధేయత, మరియు కష్టపడి పనిచేయుట అవసరము. మన గురించి మనం శ్రద్ధ తీసుకోవడానికి మనం శాయశక్తులా ప్రయత్నంచేసి, అవసరమైనప్పుడు సహాయం కొరకు ఇతరులను అడగవచ్చు. అయినప్పటికిని, నిజంగా స్వయం-సమృద్ధి గలవారిగా కావడానికి, మనం యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండటానికి తప్పక నేర్చుకోవాలి. మనకై మనం సహాయపడటానికి పని చేసినప్పుడు, ఆయన మనల్ని బలపరుస్తాడు.

చిత్రం
జోడించిన చేతులు

ఆత్మీయమైన స్వయం సమృద్ధి

యేసు క్రీస్తును గూర్చిన మన సాక్ష్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయడం ద్వారా మనం మన ఆత్మీయమైన స్వయం సమృద్ధిని నిర్మించుకోవచ్చు మనము ప్రార్థన చేసినప్పుడు, లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు, సంఘానికి హాజరైనప్పుడు, ఆజ్ఞలకు విధేయులమైనప్పుడు, క్రీస్తుకు దగ్గరయ్యే ఇతర పనులను చేస్తున్నప్పుడు మనం దీనిని చేస్తాము. ఆయన మనకు సహాయపడటానికి సమ్మతిస్తున్నాడని ఎరియుండుట జీవితం కష్టమైనప్పుడు కూడ బలంగా నిలిచియుండటానికి మనకు విశ్వాసాన్నిస్తుంది.

ఐహికమైన స్వయం సమృద్ధి

ఐహికమైన స్వయం సమృద్ధి మనకు, మన కుటుంబము యొక్క శారీరక అవసరతలను శ్రద్ధ తీసుకొనుటను కలిపియున్నది. ఇది ఆహారము, గృహము, ఆరోగ్యము, మరియు ఇతర అవసరతలను కలిపియున్నది. మంచి విద్యను పొందడం, అవసరమైన నైపుణ్యాలను నేర్చుకొనడం లేక విశదపరచడం, కష్టపడి పనిచేయడం, మన సమయాన్ని తెలివిగా ఉపయోగించడం, మరియు మన డబ్బును సరిగా నిర్వహించుకోవడం ద్వారా దీనిని మనం చేయగలము.

చిత్రం
కలిసి నడుస్తున్న ముగ్గురు స్త్రీలు

భావోద్వేగమైన స్వయంసమృద్ధి

భావోద్వేగమైన స్వయంసమృద్ధి అనగా భావోద్వేగమైన సవాళ్ళను ధైర్యము మరియు విశ్వాసముతో పొందుపరచుకొనే సామర్ధ్యము. మనందరికీ సవాళ్ళు, ఎదురు దెబ్బలను కలిగియుంటాము. సువార్తకు ధన్యవాదాలు, వాటికి ఎలా స్పందించాలో మనం ఎంపిక చేయగలమని మనమెరుగుదుము. ప్రభువునందు విశ్వాసంతో ప్రతిస్పందించడం వల్ల ఇతర కష్టాలను మరింత నిరీక్షణతో ఎదుర్కొనే మన సామర్థ్యం పెరుగుతుంది.

విద్య

మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ఈ జీవితాంతం మరియు తదుపరి జీవితంలో మన మనస్సులను విద్యావంతులుగా చేసుకోవాలని, మన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే, అంత ఎక్కువగా మనం మంచి కోసం మంచి ప్రభావాన్ని కలిగియుండగలము, మనకు, మన కుటుంబానికి మరియు అవసరతలో ఉన్న వారికి అందించగలము.

చిత్రం
ఒక సంచి మోస్తున్న యువకుడు

స్వయం-సమృద్ధి కలిగియుండుట వలన దీవెనలు

మన స్వయం-సమృద్ధిని మెరుగుపరచుకొన్నప్పుడు, మనము గొప్ప ఆశ మరియు శాంతితో దీవించబడతామని ప్రవక్తలు బోధించారు. మన కుటుంబాలకు మరియు అవసరతలో ఉన్న ఇతరులకు సహాయపడగలుగుతాము. మనము ఎక్కువ అవకాశాలతో మరియు అభివృద్ధి చెందుటను కొనసాగించే సామర్ధ్యముతో దీవించబడతాము.

సంఘ వనరులు

మీ స్టేకు స్వయం-సమృద్ధి సమూహములను అందివ్వవచ్చు. ఇవి మీకు స్వయం-సమృద్ధి యొక్క సూత్రములు మరియు మీ డబ్బును నిర్వహించుట లేదా ఒక మంచి ఉద్యోగాన్ని వెదకడం వంటి నైపుణ్యాలను మీకు బోధించగలవు. సువార్త గ్రంథాలయములో సంబంధిత వనరులను కూడా మీరు కనుగొనవచ్చు. “Books and Lessons” మరియు తరువాత “Self-Reliance,” ఎంపిక చేయండి.

ముద్రించు