2023
దేవాలయానికి హాజరగుటకు సిద్ధపడుట
2023 డిసెంబరు


“దేవాలయానికి హాజరగుటకు సిద్ధపడుట,” లియహోనా, 2023 డిసెంబరు.

లియహోనా, నెలవారీ సందేశము 2023 డిసెంబరు

దేవాలయానికి హాజరగుటకు సిద్ధపడుట

చిత్రం
ఓగ్డెన్ యూటా దేవాలయమునొద్దకు జనులు నడుచుట

మార్క్ బ్రూన్సన్ తీసిన ఓగ్డెన్ యూటా దేవాలయము యొక్క ఛాయాచిత్రము.

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ దేవాలయములలో మనము మన కొరకు, మరియు మన పూర్వీకుల కొరకు పవిత్ర నిబంధనలు మరియు విధులు నిర్వహించవచ్చును. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యెడల మన ప్రేమ మరియు కృతజ్ఞతను చూపుటకు మనము దేవాలయమునకు హాజరగుదుము. యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకొని మరియు ఆ ప్రకారము జీవించుట వలన మనము దేవాలయానికి హాజరగుటకు సిద్ధపడగలము. దేవాలయములను గురించి మరింత సమాచారము కొరకు: 2021 అక్టోబరు లియహోనా సంచికలోని “దేవాలయ కార్యము” చూడండి

చిత్రం
డర్బన్ దక్షిణ ఆఫ్రికా దేవాలయము యొక్క బయట వ్రాయబడిన మాటలు

మాత్యూ రీయర్ తీసిన డర్బన్ దక్షిణ ఆఫ్రికా దేవాలయము యొక్క ఛాయాచిత్రము

ప్రభువు యొక్క మందిరము

దేవాలయములు “ప్రభువు యొక్క మందిరములని” పిలువబడును. ఆ పవిత్ర స్థలములలోనె దేవుని ఆత్మను మరియు మనకొరకు ఆయన ప్రేమను అనుభూతి చెందగలము. నిత్య జీవము కొరకు సిద్ధపడుటకు, నిబంధనలు చేయుటకు మరియు ప్రత్యేక విధులను నిర్వర్తించుటకు ఆ స్థలములు మనలను సిద్ధము చేయును. (దేవునికి, ఆయన బిడ్డలకు మధ్య పవిత్ర వాగ్దానములే నిబంధనలు.) విశ్వాసంతో నిబంధనలను, మరియు విధులను గైకొనుట వలన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో ప్రత్యేక బాంధవ్యమును పొందుటకు సహాయపడును.

చిత్రం
గ్వాయాక్విల్ ఈక్వాడార్ దేవాలయము వెలుపల యవ్వనస్తులు నిలువబడి యుండుట

జేన్ బింగ్ హాం తీసిన గ్వాయాక్విల్ ఈక్వాడార్ దేవాలయము ఛాయాచిత్రము.

దేవాలయమునకు ఎవరు హాజరు కాగలరు?

12 సంవత్సరాలు నిండినప్పటి నుండి సంఘ సభ్యులు మృతులైన వారికి బాప్తిస్మము ఆచరించ వచ్చును. సభ్యులు వరము పొందుటకు అతను లేక ఆమె కనీసం 18 వయసు కలిగి, సంఘములో కనీసము ఒక సంవత్సరము సభ్యత్వము కలిగి, దేవాలయ నిబంధనలను ఆచరించి మరియు పాటించుటకు ఆశకలిగి యుండవలెను (General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints{, 27.2.2, ChurchofJesusChrist.org). ఇదివరకే దేవాలయ దీవెనలు పొందిన ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ, యొక్క వివాహబంధం దేవాలయంలో శాశ్వతంగా ముద్రింపబడవచ్చును.

నిబంధనలు మరియు విధులు

మీరు దేవాలయములో నిబంధనలు చేయుదురు మరియు విధులు నిర్వహించుదురు. “దేవునితో నిబంధన సంబంధంలోనికి ప్రవేశించడం మనల్ని ఆయనతో ఒక విధంగా బంధిస్తుంది, అది జీవితానికి సంబంధించిన ప్రతిదానిని సులభతరం చేస్తుంది.” (రస్సెల్ ఎమ్. నెల్సన్, ”లోకమును జయించి, విశ్రాంతి కనుగొనుడి,” లియహోనా, 2022 నవంబరు, 97). దేవాలయ విధి యాజకత్వ అధికారం ద్వారా నిర్వహించబడే ఒక పవిత్ర భౌతిక ఆచారం. దేవాలయ విధులు లోతైన పరమార్ధం కలిగియున్నవి. ఉదాహరణకు, మీరు ఒక విధిని నిర్వహించుచున్నప్పుడు మీరు ఆయన యొక్క నిబంధనలను గైకొనుటకు మరియు పాటించుటకు సమ్మతిని తెలియచేస్తున్నారు.

వ్యక్తిగత సిద్ధపాటు

యేసు క్రీస్తు బోధలను అనుసరించుట మరియు బాప్తీస్మము సమయమున దేవునితో చేసిన నిబంధనలను పాటించుట ద్వారా ఆత్మయందు సిద్ధపడుము. సంఘ వనరులైన లేఖనములను మరియు సర్వసభ్య సమావేశ ప్రసంగాలను కూడా అధ్యయనం చేయవచ్చును. Temples.ChurchofJesusChrist.org దేవాలయములో హాజరైనప్పుడు ఏమి కోరవచ్చునో ఆ సమాచారం అందించును. అందులో దేవాలయ సంబంధిత నిబంధనలు, విధులు, మరియు సూచక చిహ్నాముల అర్ధం, మరిన్ని వివరములు లభించును.

చిత్రం
నావూ ఇల్లినాయ్ దేవాలయం వెలుపల

ఈవ్ టఫ్ట్ తీసిన నావూ ఇల్లినాయ్ దేవాలయం ఛాయాచిత్రము

సూచక చిహ్నాల విధానం

ప్రభువు తరచు సూచక చిహ్నాలను ఉపయోగించి బోధించును. ఉదాహరణకు, బాప్తీస్మము—నీటిలో ముంచబడి మరియు పైకి లేపబడుట—నీలోని పాత వ్యక్తి మరణించుట, మరియు నీలోని క్రొత్త వ్యక్తి పునర్జన్మించుటను సూచించుచున్నది. (రోమా 6:3—6). దేవాలయ విధులు యేసు క్రీస్తును మరియు ఆయన ప్రాయశ్చిత్త బలిని సూచించును దేవాలయములో హాజరైన మొదటి సారే సూచక చిహ్నాలన్నిటిని అర్ధం చేసుకొనుట కష్టము కావచ్చును, కానీ జీవితంలో మళ్ళీ మళ్ళీ దేవాలయానికి వెళ్ళుట ద్వారా అభ్యాసమును కొనసాగించవచ్చును.

దేవాలయ సిఫారసు

దేవాలయములో ప్రవేశించుటకు మీరు సిద్ధపడి అర్హులు కావలెను. దేవాలయములో ప్రవేశించుటకు సిఫారసును మీ బిషప్పుగాని శాఖాధ్యక్షుడు; స్టేకు లేదా మిషను అధ్యక్షుడు; వద్ద ముఖాముఖి పరీక్ష పిమ్మట పొంద వచ్చును. మీరు యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకారం జీవిస్తున్నారని నిర్దారించుటకు ఈ నాయకులు కొన్ని నియమిత ప్రశ్నలు అడుగుదురు. మీ నాయకులు ఈ ప్రశ్నలను గూర్చి ముందుగా మీతో మాట్లాడవచ్చును.

మీ పూర్వీకుల కొరకు దేవాలయమునకు తిరిగి వచ్చుట

పరలోక తండ్రి ఆయన బిడ్డలందరు ఆయనతో నిబంధన చేసుకోవలెననియు పవిత్ర విధులు నిర్వహించవలెననియు కోరుచున్నారు. సువార్తను గ్రహించక ముందే మరణించిన వారికి బాప్తీస్మము, దేవాలయ దీవెన వంటి విధులు దేవాలయములోనే నిర్వహించవలెను. మరణించియున్న మీ కుటుంబ సభ్యులకొరకు విధులు నిర్వహించుటకు మీరు దేవాలయమునకు మరలా వెళ్ల వచ్చును.

ముద్రించు