“మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” లేఖన అధ్యయన ఉపాయములు (2021)
“మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” లేఖన అధ్యయన ఉపాయములు
మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు
మీ కుటుంబము సువార్తను నేర్చుకోవడానికి సహాయపడేందుకు క్రమం తప్పని కుటుంబ లేఖన అధ్యయనము ఒక శక్తివంతమైన మార్గము. మీ ప్రయత్నాలలో స్థిరంగా ఉండడం కంటే కుటుంబంగా మీరు ఎంత చదివారో మరియు ఎంతసేపు చదివారో అన్నది అంత ముఖ్యమైనది కాదు. మీ కుటుంబ జీవితంలో లేఖన అధ్యయనాన్ని ఒక ముఖ్యమైన భాగంగా మీరు చేస్తున్నప్పుడు, యేసు క్రీస్తుకు దగ్గరవడానికి మరియు ఆయన వాక్య పునాదిపై వారి సాక్ష్యాలను నిర్మించడానికి మీ కుటుంబ సభ్యులకు మీరు సహాయం చేస్తారు.
క్రింది ప్రశ్నలను పరిగణించండి:
-
స్వయంగా లేఖనాలను అధ్యయనం చేయడానికి కుటుంబ సభ్యులను మీరు ఎలా ప్రోత్సహించగలరు?
-
వారు నేర్చుకుంటున్న వాటిని పంచుకునేలా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి మీరు ఏమి చేయగలరు?
-
లేఖనాలలో మీరు నేర్చుకుంటున్న సూత్రాలను రోజువారీ బోధనా సందర్భాల్లో మీరెలా నొక్కి చెప్పగలరు?
సువార్త అభ్యాసానికి, బోధనకు గృహము ఆదర్శవంతమైన స్థలం అని గుర్తుంచుకోండి. సంఘ తరగతిలో సాధ్యం కాని మార్గాల్లో మీరు ఇంటివద్ద సువార్తను నేర్చుకోగలరు మరియు బోధించగలరు. లేఖనాలనుండి నేర్చుకొనుటకు మీ కుటుంబానికి సహాయపడేందుకు మార్గాలు ఆలోచించినప్పుడు సృజనాత్మకంగా ఉండండి. మీ కుటుంబ లేఖన అధ్యయనాన్ని పెంపొందించడానికి క్రింది ఉపాయాలలో కొన్నింటిని పరిగణించండి.
సంగీతాన్ని ఉపయోగించండి
లేఖనాలలో బోధించబడిన సూత్రాలను బలోపేతం చేయడానికి పాటలను పాడండి.
అర్థవంతమైన లేఖనాలను పంచుకోండి
వారి వ్యక్తిగత అధ్యయనంలో అర్థవంతమైనవిగా కనుగొన్న లేఖన భాగాలను పంచుకోవడానికి కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వండి.
మీ స్వంత పదాలను ఉపయోగించండి
మీరు అధ్యయనం చేసే లేఖనాల నుండి వారు నేర్చుకున్న వాటిని వారి స్వంత మాటలలో సంగ్రహించడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.
మీ జీవితానికి లేఖనాలను అన్వయించుకోండి
ఒక లేఖన భాగాన్ని చదివిన తరువాత, వారి జీవితాలకు ఆ భాగం వర్తించే మార్గాలను పంచుకోమని కుటుంబ సభ్యులను అడగండి.
ఒక ప్రశ్న అడగండి
ఒక సువార్త ప్రశ్న అడగమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి, ఆపై ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సహాయపడే వచనాల కోసం వెదకండి.
ఒక లేఖనాన్ని ప్రదర్శించండి
మీకు అర్థవంతముగా అనిపించే ఒక వచనం ఎంచుకోండి మరియు కుటుంబ సభ్యులు తరచూ చూసే చోట దాన్ని ప్రదర్శించండి. ప్రదర్శించడానికి లేఖనాన్ని ఎంపిక చేయడానికి వంతులవారీగా కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.
ఒక లేఖన జాబితాను తయారు చేయండి
ఒక కుటుంబంగా, రాబోయే వారంలో మీరు చర్చించదలిచిన అనేక వచనాలను ఎంచుకోండి.
లేఖనాలను కంఠస్థం చేయండి
మీ కుటుంబానికి అర్థవంతంగా అనిపించే ఒక లేఖన భాగాన్ని ఎంచుకోండి మరియు ప్రతిరోజూ పునరావృతం చేయడం ద్వారా లేదా జ్ఞాపకశక్తి ఆట ఆడడం ద్వారా దాన్ని కంఠస్థం చేయమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.
వస్తు పాఠాలను పంచుకోండి
ఒక కుటుంబంగా మీరు చదువుతున్న అధ్యాయాలు మరియు వచనాలకు సంబంధించిన వస్తువులను కనుగొనండి. ప్రతి వస్తువు లేఖనాల్లోని బోధనలతో కలిగి ఉన్న సంబంధం గురించి మాట్లాడేందుకు కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.
ఒక అంశాన్ని ఎంచుకోండి
కుటుంబం కలిసి అధ్యయనం చేసే అంశాన్ని కుటుంబ సభ్యులు వంతులవారీగా ఎంచుకోనివ్వండి. ఒక అంశం గురించి లేఖన భాగాలను కనుగొనడానికి విషయ దీపిక, బైబిలు నిఘంటువు, లేదా లేఖన దీపిక (scriptures.ChurchofJesusChrist.org) ఉపయోగించండి.
ఒక చిత్రాన్ని గీయండి
కుటుంబంగా కొన్ని వచనాలను చదవండి, తరువాత మీరు చదివిన వాటికి సంబంధించినది ఏదైనా గీయడానికి కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వండి. ఒక్కొక్కరు గీసిన చిత్రాల గురించి చర్చించడానికి సమయం కేటాయించండి.
ఒక కథను నటించండి
ఒక కథ చదివిన తరువాత, దాన్ని నటించడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. తరువాత, మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబముగా అనుభవిస్తున్న విషయాలతో ఆ కథ ఎలా సంబంధం కలిగి ఉందో అనేదాని గురించి మాట్లాడండి.
ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు: “ప్రతి కుటుంబ ప్రార్థన, కుటుంబ లేఖన అధ్యయనము యొక్క ప్రతి భాగము మరియు ప్రతి కుటుంబ గృహ సాయంకాలము మన ఆత్మ అనే బొమ్మలువేసే వస్త్రముపైన కుంచెతో గీసిన గీత వంటిది. ఏ ఒక్క సంఘటన చాలా ఆకట్టుకునేదిగా లేదా చిరస్మరణీయమైనదిగా కనిపించకపోవచ్చు. కానీ ఏవిధంగా పసుపు, బంగారు మరియు గోధుమ రంగుల గీతలు ఒకదానికి ఒకటి చక్కగా ఇమిడిపోయి ఒక గొప్ప ఆకర్షణీయమైన కళాఖండాన్ని ఉత్పత్తి చేస్తాయో, అదేవిధంగా నిలకడగా మనం చేసే చిన్న చిన్న పనులు ప్రాముఖ్యమైన ఆత్మీయ ఫలితాలకు దారి తీస్తాయి“ (“More Diligent and Concerned at Home,” Liahona, Nov. 2009, 19–20).