2022
ఆయనను మీరు ఎలా వింటారు?
2022 మార్చి


“ఆయనను మీరు ఎలా వింటారు?,” యౌవనుల బలము కొరకు, 2022 మార్చి.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2022 మార్చి.

ఆయనను మీరు ఎలా వింటారు?

చిత్రం
పజిల్ భాగాలు
చిత్రం
పజిల్-పీస్ ఆకారాలు లేని వ్యక్తులు

ఒక్సానా గ్రివినా దృష్టాంతాలు

పరిశుద్ధాత్మ నుండి మనము పొందే శాంతికరమైన నడిపింపుతోపాటు, ఎప్పటికప్పుడు, దేవుడు మనలో ప్రతిఒక్కరిని ఎరుగునని, మనల్ని ప్రేమిస్తున్నారని, మనల్ని దీవిస్తారని ఆయన శక్తివంతంగా మరియు చాలా వ్యక్తిగతంగా అభయమిస్తున్నారు. అప్పుడు, మన కష్టమైన క్షణాలలో, దేవుడు మనకు అభయమిచ్చి, మనల్ని ఆశీర్వదించినప్పుడు గత అనుభవాలను గూర్చి రక్షకుడు మనకు జ్ఞాపకం చేస్తారు.

మీ స్వంత జీవితం గురించి ఆలోచించండి. ఈ అనుభవాలు మన జీవితాల్లో కీలకమైన సమయాల్లో రావచ్చు లేదా మొదట్లో అవాంఛనీయ సంఘటనలుగా అనిపించవచ్చు. ఆ ఆత్మీయంగా నిర్వచించే క్షణాలు వేర్వేరు సమయాలలో, వేర్వేరు విధాలుగా వస్తాయి, మనలో ప్రతిఒక్కరికి వ్యక్తిగతీకరించబడింది.

కొన్నిసార్లు మనము “హఠాత్తుగా కలిగిన ఆలోచనలు ” మరియు అప్పుడప్పుడు జ్ఞానము స్వచ్ఛంగా ప్రవహము పొందుతామని జోసెఫ్ స్మిత్ వివరించారు.1

అటువంటి అనుభవము ఎన్నడూ కలిగిలేదని చెప్పిన నిజాయితీగల వ్యక్తికి స్పందించి, అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఇలా సలహా ఇచ్చారు, “బహుశా మీ ప్రార్థనలు మరలా, మరలా జవాబివ్వబడినవి, కానీ మీరు చాలా గొప్ప సూచన లేక బిగ్గరగల స్వరము కొరకు చూసి మీకు జవాబు రాలేదని మీరు అనుకుంటున్నారు.”2

ఇటీవల అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పటం మేము విన్నాము: “ఈ ముఖ్యమైన ప్రశ్న గురించి మీరు లోతుగా, తరచుగా ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను: ఆయనను మీరు ఎలా ఆలకిస్తారు? మంచిగా, మరింత తరచుగా ఆయనను వినటానికి అవసరమైనది చేయమని కూడా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.”3

ముద్రించు