ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకాలు
వ్యక్తిగత కష్టాలు లేక మన నియంత్రణను మించిన లోక పరిస్థితులు మన మార్గాన్ని చీకటిగా చేసినప్పుడు, మన జీవితపు గ్రంథములో నుండి ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకాలు ముందున్న రోడ్డును ప్రకాశవంతం చేయడానికి సహాయపడే ప్రకాశించే రాళ్లు.
మొదటి దర్శనము జరిగిన పధ్దెనిమిది సంవత్సరాల తరువాత, ప్రవక్త జోసెఫ్ స్మిత్ తన అనుభవము గురించి విస్తృతమైన వివరణను వ్రాసాడు. అతడు వ్యతిరేకతను, హింస, వేధింపులు, బెదిరింపులు, మరియు క్రూరమైన దాడులు ఎదుర్కొన్నాడు.1 అయినప్పటికినీ అతడు తన మొదటి దర్శనమును గూర్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చుట కొనసాగించాడు: “నేను నిజంగా ఒక వెలుగును చూసాను, మరియు ఆ వెలుగు మధ్యలో ఇద్దరు వ్యక్తులను చూసాను, వారు వాస్తవంగా నాతో మాట్లాడారు; నేను ఒక దర్శనము చూసానని చెప్పినందుకు నేను ద్వేషించబడ్డాను మరియు హింసింపబడ్డాను, అయినప్పటికినీ, అది సత్యము. … నేను దానిని ఎరుగుదును, మరియు దేవునికి అది తెలుసని నేను ఎరుగుదును, మరియు నేను దానిని నిరాకరించలేను.”2
తన కష్టమైన గడియలలో, జోసెఫ్ ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన దానిగురించి ఆలోచించాడు మరియు అతడి కొరకు దేవుని ప్రేమ యొక్క నిశ్చయతను మరియు చాలా కాలంగా ప్రవచించబడిన పునఃస్థాపన కొరకు ప్రపంచమును సిద్ధపరచిన సంఘటనలను జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఆత్మీయ ప్రయాణము గురించి ఆలోచిస్తూ, జోసెఫ్ చెప్పాడు: “నా చరిత్రను నమ్మనందుకు నేను ఎవరినీ నిందించను. నాకు కలిగిన దానిని నేను అనుభవించియుండకపోతే, నాకై నేను నమ్మను.”2
కాని అనుభవాలు నిజమైనవి, మరియు అతడు వాటిని ఎన్నడూ మరచిపోలేదు లేక నిరాకరించలేదు, అతడు కార్తేజ్‌కు వెళ్లినప్పుడు తన సాక్ష్యమును మౌనంగా నిర్ధారించాడు. “వధకు వెళ్లు గొఱ్ఱె వలె నేను వెళుతున్నాను,” “కానీ వేసవి ఉదయము వలె నేను నెమ్మదిగా ఉన్నాను; దేవునితో లేక ఇతర వ్యక్తులతో నా పరస్పర చర్యలలో నేను చేసిన ఏదైన గురించి అపరాధ భావనను అనుభవించలేదు.”4
మీ ఆత్మీయంగా నిర్వచించే అనుభవాలు
ప్రవక్త జోసెఫ్ యొక్క మాదిరిలో మనకు ఒక పాఠమున్నది. పరిశుద్ధాత్మ నుండి మనము పొందే శాంతికరమైన నడిపింపుతోపాటు, అప్పుడప్పుడు, దేవుడు మనలో ప్రతిఒక్కరిని ఎరుగునని, మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన ప్రత్యేకంగా, బహిరంగంగా మనల్ని దీవిస్తాడని ఆయన శక్తివంతంగా మరియు చాలా వ్యక్తిగతంగా అభయమిస్తున్నాడు. అప్పుడు, మన కష్టమైన క్షణాలలో, దేవుడు మనకు అభయమిచ్చి, మనల్ని ఆశీర్వదించినప్పుడు గత అనుభవాలను గూర్చి రక్షకుడు మనకు జ్ఞాపకం చేస్తాడు.
మీ స్వంత జీవితం గురించి ఆలోచించుము. సంవత్సరాలుగా, దేవుడు మనలో ప్రతిఒక్కరిని ఎరుగునని, ప్రేమిస్తున్నాడని మరియు మనకు ఆయనను వెల్లడిపరచుటకు ఆతృతగా కోరుతున్నాడని ఏ సందేహము లేకుండా నిశ్చయముగా నాకు నిర్ధారిస్తూ, ప్రపంచమంతటా కడవరి-దిన పరిశుద్ధులనుండి వేలమంది యొక్క లోతైన ఆత్మీయ అనుభవాలను నేను విన్నాను. ఈ అనుభవాలు మన జీవితాలలో ముఖ్యమైన సమయాలలో రావచ్చు లేక మొదట ముఖ్యమైనవిగా కనబడని దానిలో రావచ్చు, కానీ అవి ఎల్లప్పుడు దేవుని ప్రేమ యొక్క అసాధారణంగా బలమైన ఆత్మీయమైన నిర్ధారణ చేత కలిసి వస్తాయి.
ఇటువంటి ఆత్మీయంగా నిర్వచించే అనుభవాలను జ్ఞాపకముంచుకొనుట, ప్రవక్త జోసెఫ్ చేసినట్లుగా ఇలా ప్రకటిస్తూ, కృతజ్ఞతతో మనము ప్రార్ధించునట్లు చేస్తాయి: “నేను పొందినది పరలోకము నుండి వచ్చినది. నేను దానిని ఎరుగుదును, మరియు అది నాకు తెలుసని, దేవునికి తెలుసని నేను ఎరుగుదును.”5
నాలుగు మాదిరులు
ఇతరుల నుండి కొన్ని మాదిరులను నేను పంచుకొన్నప్పుడు, మీ స్వంత ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకాల గురించి ఆలోచించుము.
సంవత్సరాల క్రితం, రెండు విఫలమైన గుండె కవాటాలు గల ఒక వృద్ధ గోత్రజనకుడు, ఆ సమయంలో పాడైన రెండవ కవాటానికి శస్త్ర చికిత్స పరిష్కారము లేనప్పటికినీ, డా. రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను జోక్యం చేసుకోమని వేడుకున్నాడు. డా. నెల్సన్ శస్త్ర చికిత్స చేయటానికి చివరికి అంగీకరించారు. అధ్యక్షులు నెల్సన్ మాటలు ఇక్కడున్నాయి:
“మొదటి కవాటములోని అడ్డంకిని తీసివేసిన తరువాత, మేము రెండవ కవాటాన్ని పరిశోధించాము. అది పూర్తిగా కనబడింది, కానీ చాలా ఎక్కువగా ఉబ్బిపోయింది, అది చేయాల్సినట్లుగా ఇక పనిచేయదు. ఈ కవాటమును పరీక్షిస్తుండగా, నా మనస్సులో ఒక సందేశము ప్రత్యేకంగా నా మనస్సుపై ఆకట్టుకున్నది: కవాటము యొక్క చుట్టుకొలతను తగ్గించుము. నా సహాయకునికి ఆ సందేశాన్ని నేను ప్రకటించాను. ‘చుట్టుకొలతను దాని సాధారణ పరిమాణము వైపు సమర్ధవంతంగా తగ్గించగలిగితే కవాటపు కణజాలం సరిపోతుంది.
“కానీ ఎలా? … ఇక్కడ మడతపెట్టి, అక్కడ లోపలికి లాగటానికి— కుట్లు ఎలా వేయాలో చూపిస్తూ, ఒక చిత్రము నా మనస్సులోనికి స్పష్టంగా వచ్చింది. … కుట్టు ఉంచాల్సిన చోట చుక్కలుగల వరసలతో పూర్తి చేయబడిన—ఆ మానసిక దృశ్యము నాకింకా జ్ఞాపకమున్నది. నా మనస్సులో గీయబడినట్లుగా మరమ్మత్తు పూర్తి చేయబడింది. మేము కవాటమును పరీక్షించాము మరియు లీకు అసాధారణంగా తగ్గించబడుట కనుగొన్నాము. ‘ఇది ఒక అద్భుతము’” నా సహాయకుడు చెప్పాడు.6 ఆ గోత్రజనకుడు అనేక సంవత్సరాలు జీవించాడు.
డా. నెల్సన్ నడిపించబడ్డారు. తాను నడిపించబడ్డానని ఆయన ఎరుగునని దేవునికి తెలుసని ఆయన ఎరుగును.
30 సంవత్సరాల క్రితం కాథీ, నేను బియట్రిస్ మాగ్రిని మొదటిసారి కలిసాము. ఒక టీనేజరుగా తన బాప్తీస్మము తరువాత వెంటనే తన ఆత్మీయ జీవితంను ప్రభావితం చేసిన ఒక అనుభవాన్ని గూర్చి ఇటీవల బియట్రిస్ నాకు చెప్పింది. ఆమె మాటలు ఇక్కడున్నాయి:
“బోర్డియక్స్ నుండి గంటన్నర దూరం లాకానౌ బీచ్‌కు, వారి నాయకులతో మా బ్రాంచి యువత ప్రయాణించారు.
“ఇంటికి తిరిగి వెళ్లేముందు, నాయకులలో ఒకరు చివరిగా ఈతకొట్టాలని నిర్ణయించాడు మరియు తన కళ్లద్దాలతో అలలోనికి గెంతాడు. అతడు నీటినుండి పైకి వచ్చాక, అతడి కళ్లద్దాలు అదృశ్యమయ్యాయి. … అవి సముద్రములో పడిపోయాయి.
“అతడి కళ్లద్దాలను కోల్పోవటం అతడు తన కారును నడుపుట నుండి ఆపివేస్తుంది. మేము ఇంటినుండి దూరంగా ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది.
“మేము ప్రార్ధించాలని విశ్వాసముతో నిండిన ఒక సహోదరి సూచించింది.
“ప్రార్ధన ఖచ్చితంగా ఏమీ సహాయపడదని నేను సణిగాను, మరియు నడుము లోతు మురికి నీటిలో మేము నిలబడినప్పుడు, బహిరంగంగా ప్రార్ధించటానికి అసౌకర్యంగా గుంపులో నేను చేరాను.
“ప్రార్ధన ముగిసిన తరువాత, నేను ప్రతిఒక్కరిపై చల్లటానికి నా చేతులు చాపాను. సముద్రపు ఉపరితలముపై చేతిని కదిలించినప్పుడు, అతడి కళ్లద్దాలు నా చేతికి వచ్చాయి. దేవుడు నిజంగా మన ప్రార్ధనలు ఆలకిస్తాడని, జవాబిస్తాడని ఒక శక్తివంతమైన భావన నా ఆత్మలోనికి గ్రుచ్చుకున్నది.”7
నలభైదు సంవత్సరాల తరువాత, నిన్న జరిగినట్లుగా దానిని ఆమె జ్ఞాపకము చేసుకున్నది. బియట్రిస్ దీవించబడింది, మరియు తాను దీవించబడ్డానని ఆమెకు తెలుసని దేవునికి తెలుసని ఆమె ఎరుగును.
అధ్యక్షులు నెల్సన్ మరియు సహోదరి మాగ్రి అనుభవాలు చాలా భిన్నమైనవి, అయినప్పటికినీ ఇద్దరికీ, దేవుని యొక్క ప్రేమను వారు ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనిన, మరచిపోలేని ఆత్మీయంగా నిర్వచించే జ్ఞాపకము.
పునఃస్థాపించబడిన సువార్త గురించి నేర్చుకొనుటలో లేక ఇతరులతో సువార్తను పంచుకొనుటలో ఈ నిర్వచించే సంఘటనలు తరచుగా వస్తాయి.
2004 లో, సావో పౌలో, బ్రెజిల్‌లో ఈ చిత్రము తీసుకోబడింది. బ్రెజిల్ స్టేకుకు చెందిన ఫ్లోరిప్స్ లుజియా డమాసియోకు 114 సంవత్సరాలు. తన మారుమనస్సు గురించి మాట్లాడుతూ, తన గ్రామములోని మిషనరీలు తీవ్ర అనారోగ్యం చెందిన ఒక బిడ్డకు యాజకత్వ దీవెన ఇచ్చారు, ఆమె అద్భుతంగా బాగైందని సహోదరి డమాసియో నాతో చెప్పింది. ఆమె ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకున్నది. వారి సందేశము గురించి ఆమె ప్రార్ధించినప్పుడు, జోసెఫ్ స్మిత్ దేవుని యొక్క ప్రవక్త అని ఆత్మ యొక్క నిరాకరించబడని సాక్ష్యము ఆమెకు నిర్ధారించబడింది. 103 సంవత్సరంలో, ఆమె బాప్తీస్మము పొందింది, మరియు 104 లో, ఆమె ఎండోమెంట్ పొందింది. తరువాత ప్రతీ సంవత్సరం, ఆమె దేవాలయంలో ఒక వారం గడపటానికి 14-గంటలు బస్సులో ప్రయాణం చేసింది. సహోదరి డమాసియో పరలోకపు నిర్ధారణను పొందింది, మరియు సాక్ష్యము సత్యమని ఆమెకు తెలుసని దేవునికి తెలుసని ఆమె ఎరుగును.
48 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్‌కు నా మొదటి మిషను నుండి ఒక ఆత్మీయ జ్ఞాపకం ఇక్కడున్నది.
జనుల ఇంటి తలుపులు తట్టినప్పుడు, నా సహవాసి నేను ఒక వృద్ధ మహిళకు ఒక మోర్మన్ గ్రంథము ఇచ్చాము. దాదాపు ఒక వారము తరువాత, ఆ మహిళ ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, ఆమె తలుపు తెరచింది. ఏ మాటలు మాట్లాడబడకముందు, నేను స్పషమైన ఆత్మీయ శక్తిని అనుభూతి చెందాను. మేడమ్ ఆలిస్ ఆడుబర్ట్ మమ్మల్ని లోపలికి పిలిచి, తాను మోర్మన్ గ్రంథాన్ని చదివానని, అది సత్యమని తాను ఎరుగుదునని మాతో చెప్పింది. ఆ రోజు ఆమె ఇంటిని విడిచి మేము వెళ్లినప్పుడు, “పరలోక తండ్రి, ఇప్పుడే నేను అనుభూతిచెందిన దానిని ఎన్నడూ మరచిపోకుండా దయచేసి నాకు సహాయపడుము,” అని నేను ప్రార్ధించాను. నేనెప్పుడు మరచిపోలేదు.
సాధారణమైనదిగా కనబడిన క్షణములో, మిగిలిన వందల తలుపుల వంటి ఒక తలుపు వద్ద, నేను పరలోకపు శక్తిని అనుభవించాను. మరియు ఒక ఆకాశపు వాకిలి తెరవబడిందని నాకు తెలుసని దేవునికి తెలుసని నేను ఎరుగుదును.
వ్యక్తిగతీకరించబడినది మరియు తిరస్కరించలేనిది
ఆ ఆత్మీయంగా నిర్వచించే క్షణాలు వేర్వేరు సమయాలలో, వేర్వేరు విధాలుగా వస్తాయి, మనలో ప్రతిఒక్కరికి వ్యక్తిగతీకరించబడింది.
లేఖనాలలో మీ ప్రియమైన మాదిరులను గూర్చి ఆలోచించుము. అపొస్తులుడైన పేతురును వినువారు “హృదయము[ల]లో నొచ్చుకొనిరి.”8 లేమనీయ స్త్రీ ఏబిష్ “ఆమె తండ్రి యొక్క అసాధారణమైన దర్శనమును,”9 నమ్మెను. మరియు ఈనస్ మనస్సులోనికి ఒక స్వరము వచ్చింది.10
నా స్నేహితుడు క్లేటన్ క్రిస్టెన్‌సన్ మోర్మన్ గ్రంథమును చాలా ప్రార్ధనాపూర్వకంగా చదివినప్పుడు ఒక అనుభవాన్ని వివరించాడు: “ఒక మనోహరమైన, అప్యాయత, ప్రేమగల ఆత్మ … నన్ను చుట్టుముట్టింది మరియు నేను అనుభవిస్తానని ఊహించని ప్రేమగల భావనయందు నన్ను చుట్టివేస్తూ, నా ఆత్మను సర్వత్రా వ్యాపించింది, [రాత్రి తరువాత రాత్రి ఈ భావనలు కొనసాగాయి].”11
మన ఆత్మను వెలిగించే అగ్ని వలె ఆత్మీయ భావనలు మన హృదయములోనికి వెళ్లినప్పటి సమయాలున్నాయి. కొన్నిసార్లు మనము “హఠాత్తుగా కలిగిన ఆలోచనలు ” మరియు అప్పుడప్పుడు జ్ఞానము స్వచ్ఛంగా ప్రవహము పొందుతామని జోసెఫ్ స్మిత్ వివరించాడు.12
అటువంటి అనుభవము ఎన్నడూ కలిగిలేదని చెప్పిన నిజాయితీగల వ్యక్తికి స్పందించి, అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్, సలహా ఇచ్చారు, “బహుశా మీ ప్రార్ధనలు మరలా, మరలా జవాబివ్వబడినవి, కానీ మీరు చాలా గొప్ప సూచన లేక బిగ్గరగల స్వరము కొరకు చూసి మీకు జవాబు రాలేదని మీరు అనుకుంటున్నారు.”13 “అగ్నితోను మరియు పరిశుద్ధాత్మోను [దీవించబడ్డారు], [కానీ] దానిని ఎరుగని,”14 జనుల యొక్క గొప్ప విశ్వాసము గురించి రక్షకుడు స్వయంగా మాట్లాడాడు.
ఆయనను మీరు ఎలా వింటారు?
ఇటీవల అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పటం మేము విన్నాము: “ఈ ముఖ్యమైన ప్రశ్న గురించి మీరు లోతుగా, తరచుగా ఆలోచించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నను: ఆయనను మీరు ఎలా ఆలకిస్తారు? మంచిగా, మరింత తరచుగా ఆయనను వినటానికి అవసరమైనది చేయమని కూడ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.”15 ఈ ఉదయము ఆ ఆహ్వానమును ఆయన మరలా ఇచ్చారు.
సంస్కారమును యోగ్యతగా తీసుకొన్నప్పుడు, మన విశ్వాసమును ప్రకటించినప్పుడు, మనము ఇతరులకు సేవ చేసినప్పుడు, మరియు సహ విశ్వాసులతో మనము దేవాలయమునకు హాజరైనప్పుడు, మన ప్రార్ధనలందు, మన గృహాలందు, లేఖనములందు, మన కీర్తనలందు మనము ఆయనను వింటాము. సర్వసభ్య సమావేశమును మనము ప్రార్ధనాపూర్వకంగా విన్నప్పుడు మరియు ఆజ్ఞలను మనము బాగా పాటించినప్పుడు ఆత్మీయంగా నిర్వచించే క్షణాలు వస్తాయి. పిల్లలారా, ఈ అనుభవాలు మీ కోసము కూడా. జ్ఞాపకముందా, యేసు “పిల్లలకు బోధించెను మరియు పరిచర్య చేసెను … మరియు [పిల్లలు] గొప్ప మరియు ఆశ్చర్యకరమైన విషయములను … మాట్లాడారు.”16 ప్రభువు చెప్పెను:
“[ఈ జ్ఞానము] మీకు నా ఆత్మ చేత ఇవ్వబడింది, … మరియు నా శక్తి ద్వారా తప్ప మీరు [దానిని] కలిగియుండలేరు;
“కాబట్టి, మీరు నా స్వరము విన్నారని, నా మాటలను ఎరుగుదురని మీరు సాక్ష్యమివ్వగలరు.”17
రక్షకుని సాటిలేని ప్రాయశ్చిత్తఃము యొక్క దీవెన వలన మనము “ఆయనను ఆలకిస్తాము.”
ఈ నిర్వచించే క్షణాలను పొందే సమయాన్ని మనము ఎంపిక చేయలేనప్పటికినీ, మన సిద్ధపాటులో అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఈ సలహాను ఇచ్చారు: “ఈరోజు, రేపు రాత్రి, ఈ ప్రశ్నలు అడుగుతూ, మీరు ప్రార్ధించి, ధ్యానించవచ్చు: దేవుడు నాకు మాత్రమే ఒక సందేశాన్ని పంపాడా? నా జీవితం లేక నా [కుటుంబము] యొక్క జీవితాలలో ఆయన హస్తమును నేను చూసానా?”18 విశ్వాసము, విధేయత, దీనత్వము, మరియు నిజమైన ఉద్దేశము పరలోకపు వాకిండ్లను తెరచును.19
ఒక దృష్టాంతము
మీ ఆత్మీయ జ్ఞాపకాలను గూర్చి మీరు ఈవిధంగా ఆలోచించవచ్చు. నిరంతర ప్రార్ధన, మన నిబంధనలు పాటించుటకు ఒక తీర్మానము, మరియు పరిశుద్ధాత్మ యొక్క వరముతో, జీవితం గుండా మార్గమును మనము దాటతాము. వ్యక్తిగత కష్టము, అనుమానము, లేక నిరాశ మనము కొనసాగించుటకు కష్టమైనదిగా చేసినప్పుడు, లేక మన అదీనములో లేని లోక పరిస్థితులు భవిష్యత్తు గురించి మనము ఆశ్చర్యపడుటకు మనల్ని నడిపిస్తాయి. మన జీవిత గ్రంథము నుండి ఆత్మీయంగా నిర్వచించే క్షణాలు, దేవుడు మనల్ని ఎరుగునని, మనల్ని ప్రేమిస్తున్నారని, మరియు ఇంటికి తిరిగి వెళ్లుటకు సహాయపడుటకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును పంపారని అభయమిస్తూ, ముందున్న రోడ్డును వెలుగుమయం చేసే ప్రకాశించే రాళ్లవలె ఉన్నాయి. ఎవరైన వారి నిర్వచించే జ్ఞాపకాలను ప్రక్కన పెట్టి, తప్పిపోయి, లేక కలవరపడినప్పుడు, మన విశ్వాసము మరియు జ్ఞాపకాలను వారితో మనం పంచుకొన్నప్పుడు, ఒకసారి వారికి విలువైన, ప్రశస్తమైన ఆత్మీయ క్షణములను వారు తిరిగి కనుగొనటానికి సహాయపడుతూ, రక్షకుని వైపు మనం వారిని త్రిప్పుతాము.
కొన్ని అనుభవాలు ఎంత పరిశుద్ధమైనవి అంటే మన ఆత్మీయ జ్ఞాపకములో వాటిని కాపాడి, వాటిని పంచుకోము.20
“దేవదూతలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాట్లాడుదురు, అందువలన వారు క్రీస్తు యొక్క మాటలను మాట్లాడుదురు.”21
“నరుల యొక్క సంతానమునకు దేవదూతలు పరిచర్య చేయుట మానివేయ[లేదు.]
“ఏలయనగా ఇదిగో వారు బలమైన విశ్వాసము కలిగి మరియు దైవభక్తి యొక్క ప్రతి విధమందు ఒక నిబ్బరమైన మనస్సు కలిగిన వారికి తమను చూపుకొనుచూ, ఆయన ఆజ్ఞ యొక్క మాట ప్రకారము పరిచర్య చేయుటకు వారు ఆయనకు లోబడియున్నారు.”22
“ఆదరణ కర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును.”23
మీ పరిశుద్ధ జ్ఞాపకాలను హత్తుకొనుము. వాటిని విశ్వసించుము. వాటిని వ్రాసియుంచుము. మీ కుటుంబముతో వాటిని పంచుకొనుము. మీ పరలోక తండ్రి మరియు ఆయన ప్రియమైన కుమారుని నుండి అవి మీకు వచ్చాయని విశ్వసించుము.24 అవి మీ అనుమానాలకు సహనమును మరియు మీ కష్టాలకు అవగాహనను తేనివ్వండి.25 మీ జీవితంలో ఆత్మీయంగా నిర్వచించే సంఘటనలు మీరు ఇష్టపూర్వకంగా అంగీకరించి, జాగ్రత్తగా దాచుకున్నప్పుడు, అవి మీకు మరి ఎక్కువగా వస్తాయని నేను మీకు వాగ్దానమిస్తున్నాను. పరలోక తండ్రి మిమ్మల్ని ఎరుగును మరియు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు!
యేసే క్రీస్తు, ఆయన సువార్త పునఃస్థాపించబడింది, మరియు మనము విశ్వసనీయంగా నిలిచియున్నప్పుడు, మనము శాశ్వతంగా ఆయన వారమని నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.