సర్వసభ్య సమావేశము
హోసన్నకేక
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


2:28

హోసన్నకేక

ఇప్పుడు నా ప్రియ సహోదర సహోదరీలారా, మనం జోసెఫ్ స్మిత్ కు తండ్రి మరియు కుమారుని యొక్క మొదటి దర్శనం జ్ఞాపకార్థం, హోసన్న కేకలో పాల్గొనడం ద్వారా కలిసి సంతోషించడం సముచితమని మేము భావించాము.

1836, మార్చి 27న కర్ల్టాడ్ దేవాలయం యొక్క సమర్పణ వద్ద ఈ యుగములో ఈ పవిత్రమైన కేక మొదట వేయబడింది. ఇది ఇప్పుడు ప్రతి దేవాలయ సమర్పణ వద్ద వేయబడుతుంది. ఇది తండ్రి మరియు కుమారునికి పవిత్రమైన నివాళి, రక్షకుడు యెరూషలేములో విజయవంతమైన ప్రవేశం చేసినప్పుడు జనసమూహాల స్పందనకు ప్రతీక. పవిత్ర వనములో ఆ రోజు యువ జోసెఫ్ అనుభవించిన విషయాలను కూడా ఇది పునరుద్ఘాటిస్తుంది—అంటే, తండ్రి మరియు కుమారుడు ఇద్దరు మహిమాన్వితమైన వ్యక్తులు, వారిని మనం ఆరాధిస్తాము మరియు స్తుతిస్తాము.

హోసన్న కేక ఎలా వేయబడుతుందో నేను ఇప్పుడు ప్రదర్శిస్తాను. నేను చేసినప్పుడు, ఈ పవిత్రమైన ఆచారాన్ని గౌరవంగా మరియు మర్యాదతో చూడాలని మీడియాలోని మా సహోద్యోగులను ఆహ్వానిస్తున్నాను.

పాల్గొనే ప్రతి ఒక్కరూ శుభ్రమైన తెల్లటి రుమాలు తీసుకొని, దానిని ఒక మూలలో పట్టుకొని, ఊపుతూ ఏకస్వరంతో “దేవునికి, గొర్రెపిల్లకు హోసన్న,హోసన్న,హోసన్న ” అని మూడుసార్లు పునరావృతం చేసిన తరువాత “ఆమేన్, ఆమేన్ మరియు ఆమేన్“ అని అంటారు . మీ దగ్గర రుమాలు లేకపోతే, మీరు మీ చేతిని ఊపవచ్చు.

సహోదర సహోదరీలారా, హోసన్న కేకలో నిలబడి పాల్గొనమని నేను ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, దాని తరువాత “హోసన్న గీతం” మరియు “ద స్పిరిట్ ఆఫ్ గాడ్” 1 పాడబడుతుంది. “

నిర్వాహకుడు సైగ చేసిన తరువాత, దయచేసి “ద స్పిరిట్ ఆఫ్ గాడ్” పాడడంలో చేరండి.

“దేవునికి, గొర్రెపిల్లకు హోసన్న,హోసన్న,హోసన్న.

“దేవునికి, గొర్రెపిల్లకు హోసన్న,హోసన్న,హోసన్న.

“దేవునికి, గొర్రెపిల్లకు హోసన్న,హోసన్న,హోసన్న.

ఆమేన్, ఆమేన్, మరియు ఆమేన్.

వివరణలు

  1. కీర్తనలు, సం. 2.