పునఃస్థాపన మరియు పునరుత్థానం యొక్క సందేశాన్ని పంచుకోవడం
పునఃస్థాపన ప్రపంచానికి చెందినది, మరియు దాని సందేశం ఈ రోజు ముఖ్యంగా అత్యవసరం.
ఈ సర్వసభ్య సమావేశం అంతా మనం “అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని”1 “సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని,”2 సువార్త, యాజకత్వం మరియు యేసు క్రీస్తు సంఘము యొక్క సంపూర్ణత భూమికి తిరిగి రావడం గురించి చాలా కాలం క్రితం ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడటం గురించి ఆనందంగా మాట్లాడాము మరియు పాడాము. ఇవన్నీ మనం “పునఃస్థాపన” అనే శీర్షికలో పొందుపరిచాము.
కానీ పునఃస్థాపన అనేది మనలో ఈ రోజు దానిలో సంతోషించేవారికి మాత్రమే కాదు. మొదటి దర్శనము యొక్క బయల్పాటులు జోసెఫ్ స్మిత్ కోసం మాత్రమే కాదు, కానీ “జ్ఞానం కొదవగా”3 ఉన్న ఎవరికైనా వెలుగు మరియు సత్యముగా అందించబడుతుంది. మోర్మన్ గ్రంథము మానవజాతి యొక్క ఆస్థి. రక్షణ మరియు మహోన్నత స్థితి యొక్క యాజకత్వ విధులు మర్త్యత్వములో ఇక ఎంతమాత్రము నివసించని వారితో సహా ప్రతి వ్యక్తికి సిద్ధపరచబడ్డాయి. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము మరియు దాని యొక్క దీవెనలు వాటిని కోరుకొనే వారికి ఉద్దేశించబడ్డాయి. పరిశుద్ధాత్మ వరము ప్రతి ఒక్కరి కొరకు ఉద్దేశించబడినది. పునఃస్థాపన ప్రపంచానికి చెందినది, మరియు దాని సందేశం ఈ రోజు ముఖ్యంగా అత్యవసరం.
“అందువలన భూమి యొక్క నివాసులకు ఈ విషయములను తెలియజేయుట ఎంత గొప్ప ప్రముఖ్యమైనది. దేవుని యొక్క సన్నిధిలో ఏ శరీరియు నివసించలేదని వారు తెలుసుకొనునట్లు పరిశుద్ధ మెస్సీయ యొక్క మంచితనము మరియు కనికరము మరియు కృప ద్వారా తప్ప, ఎవరైతే, శరీరానుసారముగా తన ప్రాణమును అర్పించి మరియు ఆత్మ యొక్క శక్తి ద్వారా దానిని తిరిగి పొందునో అతడు ఆ మృతుల యొక్క పునరుత్థానమును తెచ్చునట్లుగా లేపబడవలసిన మొదటివాడు.”4
ప్రవక్త సహోదరుడు, శామ్యూల్ స్మిత్, మోర్మన్ గ్రంథము యొక్క తాజాగా ముద్రించిన ప్రతులతో తన సంచిలో నింపి, క్రొత్త లేఖనగ్రంథాన్ని పంచుకోవడానికి కాలినడకన బయలుదేరిన రోజు నుండి, “భూమి యొక్క నివాసులకు ఈ విషయములను తెలియజేయుటకు” పరిశుద్ధులు ఆగిపోకుండా శ్రమించారు.”
1920 లో, అప్పటి పన్నెండు మంది అపొస్తలుల సమూహమునకు చెందిన ఎల్డర్ డేవిడ్ ఓ. మెఖే, సంఘము యొక్క లక్ష్యముల గురించి సంవత్సరంపాటు పర్యటనను ప్రారంభించారు. మే 1921 నాటికి, ఆయన సమోవాలోని ఫగాలిలో ఒక చిన్న స్మశానవాటికలో ముగ్గురు చిన్న పిల్లలు—థామస్ మరియు సారా హిల్టన్ కుమార్తె మరియు ఇద్దరు కుమారుల సమాధుల యెదుట నిలబడియుండెను. 1800 సంవత్సరము చివరలో థామస్ మరియు సారా యువ మిషనరీ జంటగా పనిచేసిన సమయంలో ఈ చిన్నపిల్లలు—వారిలో పెద్దవారికి రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మరణించారు.
అతను యూటాను విడిచి వెళ్ళే ముందు, ఎల్డర్ మెఖే ఇప్పుడు వితంతువు అయిన సారాకు సమోవాలోని తన పిల్లల సమాధులను సందర్శిస్తానని వాగ్దానం చేశారు, ఎందుకంటే ఆమె అక్కడకు ఎప్పుడు తిరిగి వెళ్ళలేకపోయింది. ఎల్డర్ మెఖే ఆమెకు తిరిగి ఇలా వ్రాసారు, “ సహోదరి హిల్టన్, మీ ముగ్గురు చిన్నపిల్లలు, నిశ్శబ్దంగా చాలా అనర్గళంగా… దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభమైన మీ గొప్ప మిషనరీ పనిని కొనసాగిస్తున్నారు. అప్పుడాయన తన సొంత కూర్పుతో ఒక పద్యం జోడించారు:
ప్రేమగల చేతుల ద్వారా వారి మరణిస్తున్న కళ్ళు మూయబడెను,
ప్రేమగల చేతుల ద్వారా వారి చిట్టి కాళ్ళు చేతులు అమర్చబడ్డాయి,
పరదేశుల చేతుల ద్వారా వారి వినయపూర్వకమైన సమాధులు అలంకరించబడ్డాయి,
అపరిచితులచేత గౌరవించబడ్డారు మరియు అపరిచితులు సంతాపం చెందారు.5
ఈ కథ పునఃస్థాపన సందేశాన్ని పంచుకోవడానికి గత 200 సంవత్సరాలుగా త్యాగం చేసిన సమయం, నిధి మరియు జీవితాల గురించి మాట్లాడే వేల, వందల వేల వాటిలో ఒకటి. ప్రతి జనము, వంశము, భాష మరియు ప్రజలను చేరుకోవాలనే మన ఆకాంక్ష నేడు తగ్గలేదు, ప్రస్తుతం సంఘ సభ్యులచేత పూర్తి కాల మిషను పిలుపుల క్రింద పనిచేస్తున్న 68,000 మందికి పైగా యువకులు, స్త్రీలు మరియు జంటలు, సాధారణంగా వచ్చి చూడుము6 అనే ఫిలిప్పు యొక్క ఆహ్వానాన్ని ప్రతిధ్వనించే వారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రయత్నాన్ని కొనసాగించడానికి సంవత్సరానికి మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారు.
మన ఆహ్వానాలు బలవంతం లేకుండా ఉన్నప్పటికీ, ప్రజలు వాటిని ప్రేరేవించేవిగా భావిస్తారని మేము ఆశిస్తున్నాము. అలా ఉండటానికి, కనీసం మూడు విషయాలు అవసరమని నేను నమ్ముతున్నాను: మొదట, మీ ప్రేమ; రెండవది, మీ ఉదాహరణ; మరియు మూడవది, మోర్మన్ గ్రంథాన్ని మీరు ఉపయోగించడం.
మొదట, మన ఆహ్వానాలు స్వలాభానికి సంబంధించినవి కావు; బదులుగా, అవి నిస్వార్థ ప్రేమ యొక్క వ్యక్తీకరణగా ఉండాలి, అది “భయాన్ని పోగొట్టే ప్రేమ.”7 దాతృత్వం అని పిలువబడే ఈ ప్రేమ, క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ప్రేమ, దానిని పొందడానికి మనం కేవలం అడిగితే చాలు. “ఈ ప్రేమతో [మనం] నింపబడునట్లు హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి”8 అని మనం ఆహ్వానించబడటమే కాదు ఆజ్ఞాపించబడ్డాము కూడా.
ఉదాహరణగా, సమోవా అపియా మిషన్‌కు అధ్యక్షత వహించే సహోదరి లానెట్ హో చింగ్, ప్రస్తుతం ఆమె భర్త, అధ్యక్షులు ఫ్రాన్సిస్ హో చింగ్‌తో కలిసి పనిచేస్తున్న అనుభవాన్ని నేను పంచుకుంటాను. సహోదరి హో చింగ్ ఇలా తెలియజేసారు:
“చాలా సంవత్సరాల క్రితం, మా యువ కుటుంబం హవాయిలోని లైలోని ఒక చిన్న ఇంటికి వెళ్ళాము. మా ఇంటి కారు షెడ్డు జోనాథన్ అనే వ్యక్తి నివసించే స్టూడియో అపార్ట్‌మెంట్‌గా మార్చబడింది. జోనాథన్ మరొక ప్రదేశంలో మా పొరుగువానిగా ఉండెను. ప్రభువు మమ్మల్ని ఒకచోట చేర్చుకోవడం యాదృచ్చికం కానట్లు అనిపిస్తూ, సంఘంలో మా కార్యకలాపాలు మరియు సభ్యత్వం గురించి మరింత బహిరంగంగా ఉండాలని నిర్ణయించుకున్నాము. జోనాథన్ మా స్నేహాన్ని ఆస్వాదించాడు మరియు మా కుటుంబంతో గడపడం ఇష్టపడ్డాడు. అతను సువార్త గురించి నేర్చుకోవడాన్ని ఇష్టపడ్డాడు, కాని సంఘంలో చేరడానికి వగ్దానము చేయడానికి ఆయన ఆసక్తి చూపలేదు.
“కాలక్రమేణా, జోనాథన్ మా పిల్లలతో ‘అంకుల్ జోనాథన్’ అనే మారుపేరు సంపాదించాడు. మా కుటుంబం పెరుగుతూనే ఉన్నందున, మా సంఘటనలపై జోనాథన్ ఆసక్తిని పెంచుకున్నాడు. మా ఆహ్వానాలు సెలవుదినాలు, పుట్టినరోజులు, పాఠశాల కార్యక్రమాలు మరియు సంఘ కార్యకలాపాల నుండి కుటుంబ గృహ సాయంకాలాలు మరియు పిల్లల బాప్తీస్మము వరకు విస్తరించాయి.
“ఒక రోజు నాకు జోనాథన్ నుండి ఫోన్ వచ్చింది. అతనికి సహాయం అవసరమయ్యింది. అతను మధుమేహవ్యాధితో బాధపడ్డాడు మరియు తీవ్రమైన పాద సంక్రమణ అభివృద్ధి చెంది, అతని ప్రాణాలను కాపాడటానికి పాదం తీసివేయవలసి వచ్చింది. మా కుటుంబం మరియు పొరుగు వార్డు సభ్యులు ఆ శ్రమ కాలంలో అతనికి తోడుగా నిలబడ్డాము. మేము ఆసుపత్రిలో ఒకరి తరువాత ఒకరు ఉండి అతన్ని చూసుకున్నాము మరియు యాజకత్వ దీవెనలు ఇవ్వబడ్డాయి. జోనాథన్ పునరావాసంలో ఉన్నప్పుడు, ఉపశమన సమాజ సహోదరీల సహాయంతో, మేము అతని అపార్ట్మెంట్ను శుభ్రం చేసాము. యాజకత్వ సహోదరులు అతని ఇంటి ద్వారము వరకు వాలు ప్రాంతమును మరియు స్నానాల గదిలో ఇనుప కంచెను నిర్మించారు. జోనాథన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతను ఉద్వేగానికి లోనయ్యాడు.
“జోనాథన్ మళ్ళీ మిషనరీ పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. నూతన సంవత్సరానికి వారం ముందు, అతను నన్ను పిలిచి, ‘మీరు నూతన సంవత్సర పండుగ సందర్భంగా ఏమి చేస్తున్నారు?’ అని అడిగారు. మా వార్షిక వేడుక గురించి నేను అతనికి గుర్తు చేశాను. కానీ బదులుగా, ‘మీరు నా బాప్తీస్మానికి రావాలని నేను కోరుకుంటున్నాను! అని జవాబిచ్చాడు. ఈ కొత్త సంవత్సరాన్ని నేను సరిగ్గా ప్రారంభించాలనుకుంటున్నాను.’ 20 సంవత్సరాల ‘వచ్చి చూడండి,’ ‘వచ్చి సహాయం చేయండి’ మరియు ‘వచ్చి ఉండండి’ అనే పిలుపు తరువాత ఈ విలువైన ఆత్మ బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.”9
“2018 లో, సమోవాలో మేము మిషను అధ్యక్షుడు మరియు సహచరునిగా పిలవబడినప్పుడు, జోనాథన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. మేము తిరిగి రావడానికి బలంగా ఉండాలని మేము అతనిని వేడుకున్నాము. అతను దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగాడు, కాని ప్రభువు అతన్ని ఇంటికి రమ్మని సిద్ధం చేసేను. 2019 ఏప్రిల్‌లో ఆయన శాంతియుతంగా కన్నుమూశారు. నా కుమార్తెలు వారి ‘అంకుల్ జోనాథన్’ అంత్యక్రియలకు హాజరయ్యారు మరియు అతని బాప్తీస్మం వద్ద మేము పాడిన పాటను పాడారు.”
పునఃస్థాపన సందేశాన్ని ఈ ప్రశ్నతో విజయవంతంగా పంచుకోవడానికి నేను రెండవ అవసరాన్ని పరిచయం చేస్తున్నాను: మీ ఆహ్వానం ఎవరినైనా ఆకర్షించేలా చేసేది ఏమిటి? ఇది మీ జీవితానికి ఉదాహరణ కాదా? పునఃస్థాపన సందేశాన్ని విన్న మరియు స్వీకరించిన చాలామంది మొదట్లో యేసు క్రీస్తు సంఘ సభ్యుడు లేదా సభ్యులలో వారు గ్రహించిన దాని ద్వారా ఆకర్షించబడ్డారు. వారు ఇతరులతో ప్రవర్తించిన విధానం, వారు చెప్పిన లేదా చెప్పని విషయాలు, క్లిష్ట పరిస్థితులలో వారు ప్రదర్శించిన స్థిరత్వం లేదా సహజంగా వారి ముఖవైఖరి కావచ్చు.9
ఏది ఏమైనప్పటికీ, మన ఆహ్వానాలు ఆహ్వానించదగినవిగా ఉండుటకు పునఃస్థాపించబడిన సువార్త యొక్క సూత్రాలను మనకు సాధ్యమైనంత ఉత్తమంగా అర్థం చేసుకోవాలి మరియు జీవించాలి అనే వాస్తవం నుండి మనం తప్పించుకోలేము. ఇది నేడు తరచుగా ప్రామాణికత అని పిలువబడుతుంది. క్రీస్తు ప్రేమ మనలో నివసిస్తుంటే, ఇతరుల పట్ల మనకున్న ప్రేమ నిజమైనదని ఇతరులు తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మ యొక్క వెలుగు మనలో రగులుతుంటే, అది వారిలో క్రీస్తు వెలుగును తిరిగి పుంజుకుంటుంది.10 యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణత యొక్క ఆనందాన్ని అనుభవించడానికి మీరు ఇచ్చే ఆహ్వానానికి మీ క్రియలు మరియు ప్రవర్తన ప్రామాణికతను ఇస్తాయి.
నేను ఉదహరించే మూడవ అవసరం ఏమిటంటే ఈ చివరి సువార్త యుగములో పరివర్తన సాధనముగా ప్రభువు రూపొందించిన మోర్మన్ గ్రంథమును ఉదారంగా ఉపయోగించడం. ఇది జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనాత్మక పిలుపు మరియు యేసు క్రీస్తు యొక్క దైవత్వం మరియు పునరుత్థానం యొక్క నమ్మదగిన సాక్ష్యం. మన పరలోక తండ్రి యొక్క విమోచన ప్రణాళిక యొక్క దీని వివరణ అసమానమైనది. మీరు మోర్మన్ గ్రంథాన్ని పంచుకున్నప్పుడు, మీరు పునఃస్థాపనను పంచుకుంటారు.
జేసన్ ఓల్సన్ యుక్తవయసులో ఉన్నప్పుడు, క్రైస్తవుడిగా మారకుండా ఉండాలని కుటుంబ సభ్యులు మరియు ఇతరులు పదేపదే హెచ్చరించారు. అయినప్పటికీ అతనికి ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు, వారు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యులు మరియు వారు తరచూ మతం గురించి చర్చించేవారు. యేసు క్రీస్తుపై విశ్వాసానికి వ్యతిరేకంగా ఇతరులు జేసన్‌తో చేసిన వాదనలను అతని స్నేహితులు షియా మరియు డేవ్ గౌరవంగా ఎదుర్కొన్నారు. చివరగా, వారు ఆయనకు మోర్మన్ గ్రంథ ప్రతిని ఇచ్చి, “ఈ గ్రంథము నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. దయచేసి దీనిని చదువు” అని చెప్పారు. అతను అయిష్టంగానే ఆ గ్రంథాన్ని అంగీకరించి తన వీపున తగిలించుకొనే సామాను సంచిలో ఉంచాడు, అక్కడ అది చాలా నెలలు ఉండిపోయింది. అతను దానిని తన కుటుంబం చూడగలిగే ఇంట్లో వదిలివేయడానికి ఇష్టపడలేదు మరియు తిరిగి ఇవ్వడం ద్వారా షియా, డేవ్‌లను నిరాశపరచడానికి అతను ఇష్టపడలేదు. చివరగా, అతను గ్రంథాన్ని కాల్చేయడమే పరిష్కారం అని నిర్ణయించుకున్నాడు.
ఒక రాత్రి ఒక చేతిలో లైటర్, మరొక చేతిలో మోర్మన్ గ్రంథాన్ని పట్టుకొని ఆ గ్రంథానికి నిప్పంటించాలనుకొన్నప్పుడు, “నా గ్రంథాన్ని కాల్చవద్దు” అని తన మనస్సులో ఒక స్వరం విన్నాడు. ఆశ్చర్యపోయి, అతను ఆగాడు. తరువాత, అతను ఆ స్వరాన్ని ఊహించాడని అనుకుంటూ, అతను లైటర్‌ను వెలిగించటానికి ప్రయత్నించాడు. మళ్ళీ, ఆ స్వరం అతని మనసులోకి వచ్చింది: “మీ గదికి వెళ్లి నా గ్రంథం చదువు.” జేసన్ లైటర్‌ను దూరంగా ఉంచాడు, తిరిగి తన పడకగదికి నడిచాడు, మోర్మన్ గ్రంథాన్ని తెరిచి, చదవడం ప్రారంభించాడు. అతను ప్రతి రోజు చదువుతూ, తరచుగా తెల్లవారుజాము వరకు కొనసాగాడు. జేసన్ చివరి వరకు చదివి ప్రార్థన చేస్తున్నప్పుడు, అతను ఇలా నమోదు చేశాడు, “నేను ఆపాద మస్తకం ఆత్మతో నింపబడ్డాను. … నేను కాంతితో నిండిపోయినట్లు భావించాను. … ఇది నా జీవితంలో నాకు లభించిన అత్యంత ఆనందకరమైన అనుభవం.” అతను బాప్తీస్మమును కోరాడు మరియు తరువాత స్వయంగా మిషనరీ అయ్యాడు.
నిజమైన ప్రేమ మరియు చిత్తశుద్ధి ఉన్నప్పటికీ, పునఃస్థాపన సందేశాన్ని పంచుకోవటానికి మన ఆహ్వానాలు అన్నీ కాకపోయినా చాలా వరకు తిరస్కరించబడతాయని మనం చెప్పనవసరం లేదు. అయితే దీన్ని గుర్తుంచుకోండి: ప్రతి ఒక్కరూ అలాంటి ఆహ్వానానికి అర్హులు- “దేవునిక అందరూ సమానులే”;11 ఫలితంతో సంబంధం లేకుండా మనం చేసే ప్రతి ప్రయత్నానికి ప్రభువు సంతోషిస్తారు; తిరస్కరించబడిన ఆహ్వానం మన సహవాసం ముగియడానికి కారణం కాదు; మరియు ఈ రోజు ఆసక్తి లేకపోవడం కొన్ని భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఆసక్తిని కలిగించవచ్చు. ఏదిఏమైనప్పటికి, మన ప్రేమ స్థిరంగా ఉంటుంది.
పునఃస్థాపన తీవ్రమైన పరీక్ష మరియు త్యాగం నుండి బయటకు వచ్చిందని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అది మరో రోజుకు సంబంధించిన విషయం. ఈ రోజు మనం పునఃస్థాపన ఫలాలలో ఆనందిస్తున్నాము, వాటిలో అతి ముఖ్యమైనది భూమిపై మరియు పరలోకంలో బంధించగల శక్తి మరోసారి ఇవ్వబడింది.12 సంవత్సరాల క్రితం అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ వ్యక్తం చేసినట్లుగా, “కుటుంబాలను శాశ్వతంగా బంధించే పవిత్ర యాజకత్వం యొక్క ముద్రించు శక్తి కంటే మరేమి పునఃస్థాపన యొక్క దుఃఖం మరియు వేదన మరియు బాధల నుండి మరేమీ బయటకు రాకపోతే, దానికి చెల్లించిన వెల అన్నింటికీ విలువైనది.” 13
పునఃస్థాపన యొక్క వాగ్దానం యేసు క్రీస్తు ద్వారా విమోచన కలిగించడం. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం, తన వద్దకు వచ్చే వారందరినీ దుఃఖం, అన్యాయం, విచారం, పాపం మరియు మరణం నుండి విమోచించే శక్తి ఆయనకు ఉందని రుజువు. ఈ రోజు మట్టల ఆదివారము; ఈ రోజు నుండి ఒక వారం తరువాత ఈస్టర్. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి క్రీస్తు బాధలు మరియు మరణాన్ని మనం గుర్తుంచుకుంటాము, మనం ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాము మరియు ఆదివారాలలో చాలా అద్భుతమైనది, ప్రభువు దినం, ఆయన మృతులలోనుండి లేచిన దినాన్ని మనం వేడుకు చేసుకుంటాము. యేసు క్రీస్తు పునరుత్థానం కారణంగా, పునఃస్థాపనకు అర్థం ఉంది, మన మర్త్య జీవితాలకు అర్థం ఉంది మరియు చివరికి మన ఉనికికి అర్థం ఉంది.
పునఃస్థాపన యొక్క గొప్ప ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్, పునరుత్థానం చెందిన, జీవిస్తున్న క్రీస్తుకు మన కాలంలో విస్తృతమైన సాక్ష్యాన్ని అందించును.14 మేము ఆయనను దేవుని కుడి వైపున చూశాము.” 14 నజరేయుడైన యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ, దేవుని ఏకైక కుమారుడు, మరియు సమస్త మానవజాతికి విమోచకుడు అన్న నా సాక్ష్యాన్ని జోసెఫ్‌కు మరియు ఆయన ముందు ఉన్న అపొస్తలులు, ప్రవక్తలు మరియు అతని తరువాత వచ్చిన అపొస్తలులు మరియు ప్రవక్తలందరికీ నేను వినయంగా జోడిస్తున్నాను.
“పునఃస్థాపన సందేశాన్ని ప్రార్థనతో అధ్యయనం చేసి, విశ్వాసంతో పనిచేసే వారు, దాని దైవత్వం మరియు దాని ఉద్దేశము మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు వాగ్దానం చేసిన రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి అని దాని గురించి వారి స్వంత సాక్ష్యాన్ని పొందటానికి ఆశీర్వదించబడతారు”15అని మేము దాని ప్రకటనను ధృవీకరిస్తున్నాము. క్రీస్తు పునరుత్థానం ఆయన వాగ్దానాలను ఖచ్చితం చేస్తుంది. యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.