నీతిగల తీర్పును నిశ్చయపరచుట
నీతిగల తీర్పును నిశ్చయపరచుటకు, రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త త్యాగము నిర్లక్ష్యము యొక్క ఆటంకమును మరియు ఇతరుల చేత కలుగచేయబడిన గాయము యొక్క బాధాకరమైన ముండ్లును తీసివేయును.
మోర్మన్ గ్రంథము క్రీస్తు యొక్క సిద్ధాంతమును బోధించును.
గత అక్టోబరు, “మోర్మన్ గ్రంధమునుండి పొందిన మన జ్ఞానము హఠాత్తుగా తీసివేయబడితే”మన జీవితాలు ఎలా భిన్నంగా ఉంటాయో ఆలోచించమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనకు సవాలు చేసారు.1 నేను ఆయన ప్రశ్నను ధ్యానించాను, మీలో అనేకులు అలా చేసియుంటారని నా నిశ్చయము. ఒక ఆలోచన మరలా, మరలా వచ్చును—మోర్మన్ గ్రంధము, క్రీస్తు యొక్క సిద్ధాంతము మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము గురించి దాని స్పష్టత లేకుండా, శాంతి కోసం నేను ఎక్కడికి తిరుగుతాను?
క్రీస్తు యొక్క సిద్ధాంతము—అది రక్షించే సూత్రములు, క్రీస్తుయందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తీస్మము యొక్క విధులు, పరిశుద్ధాత్మ వరము, మరియు అంంతము వరము సహించు—పునఃస్థాపన యొక్క లేఖనాలన్నిటిలో అయితే మోర్మన్ గ్రంధములో ప్రత్యేక శక్తితో అనేకసార్లు బోధించబడినది.2 సిద్ధాంతము క్రీస్తునందు విశ్వాసముతో ప్రారంభమగును, మరియు దాని అంశములలో ప్రతీఒక్కటి ఆయన ప్రాయశ్చిత్త త్యాగమునందు నమ్మకముంచుటపై ఆధారపడును.
అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా, “మోర్మన్ గ్రంధము ఎక్కడైన కనుగొనబడే యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి సంపూర్ణమైన, అత్యంత అధికారపూర్వకమైన అవగాహనను ఇచ్చును.”3 రక్షకుని యొక్క మహోన్నతమైన వరమును గూర్చి మనము ఎంత ఎక్కువగా గ్రహిస్తే, “మోర్మన్ గ్రంధము యొక్క సత్యములు స్వస్థపరచుటకు, పూర్వపు స్థితిని తెచ్చుటకు, సహాయపడుటకు, బలోపేతం చేయుటకు, ఓదార్చుటకు, మరియు మన ఆత్మలను ఆనందపరచుటకు శక్తిని కలిగియున్నదని,” 5 మన మనస్సులు, మన హృదయాలలో4 అధ్యక్షులు నెల్సన్ యొక్క అభయము యొక్క వాస్తవమును ఎక్కువగా తెలుసుకోగలుగుతాము.
రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము న్యాయము యొక్క అన్ని అక్కరలను తీర్చును.
రక్షకుని ప్రాయశ్చిత్తమును గూర్చి మన అవగాహనకు మోర్మన్ గ్రంధము యొక్క కీలకమైన, శాంతిని ఇచ్చే సహకారము ఏదనగా, న్యాయపు అక్కరలు అన్నిటిని క్రీస్తు యొక్క కనికరముగల త్యాగము నెరవేరుస్తుందనే దాని బోధనలు. ఆల్మా వివరించినట్లుగా, “మరియు ఇప్పుడు ఒక ప్రాయశ్చిత్తము చేయబడితేనే తప్ప కనికరము యొక్క ప్రణాళిక తేబడదు. కాబట్టి కనికరము యొక్క ప్రణాళికను తెచ్చుటకు న్యాయము యొక్క అక్కరలను సంతృప్తిపరచుట, దేవుడు ఒక పరిపూర్ణ న్యాయమైన దేవుడు మరియు కనికరము గల దేవునిగా కూడ ఉండునట్లు, దేవుడు తానే లోకము యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయును.”6 తండ్రి కనికరము యొక్క ప్రణాళిక7—దానిని లేఖనాలు సంతోషము యొక్క ప్రణాళిక8 లేక రక్షణ ప్రణాళిక9 అని కూడ పిలుచును—న్యాయపు అక్కరలు అన్నీ సంతృప్తి పరచబడితే తప్ప నెరవేర్చబడదు.
కానీ “న్యాయపు అక్కరలు” అంటే ఏమిటి? ఆల్మా యొక్క స్వంత అనుభవమును ఆలోచించుము. యువకునిగా, ఆల్మా “సంఘమును నాశనము చేయుటకు,”10 కోరుతూ వెళ్ళెనని జ్ఞాపకముంచుకొనుము. వాస్తవానికి, ఆల్మా తన కుమారుడైన హీలమన్‌తో ఇలా చెప్పాడు, అతడు “నరకము యొక్క బాధలతో వేధింపబడెను” ఎందుకనగా అతడు శక్తివంతంగా “వారిని నాశనమునకు” నడిపివేయుట ద్వారా “[దేవుని యొక్క] అనేకమంది పిల్లలను హత్య చేసాడు.”11
“లోకము యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు … యేసు క్రీస్తు … యొక్క రాకడ గురించి”12 అతడి తండ్రి యొక్క బోధన అతడి “మనస్సునకు ఆలోచన” వచ్చినప్పుడు చివరకు అతడికి శాంతి కలిగిందని ఆల్మా హీలమన్‌కు వివరించాడు. పశ్చాత్తాపడిన ఆల్మా క్రీస్తు యొక్క కనికరము కొరకు వేడుకున్నాడు13 మరియు తరువాత క్రీస్తు తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసి న్యాయముకు అవసరమైన సమస్తమును చెల్లించాడని అతడు గ్రహించినప్పుడు ఆనందమును మరియు ఉపశమనమును అనుభవించాడు. మరలా, ఆల్మా నుండి న్యాయమునకు కావలసినదేమిటి? తరువాత ఆల్మా తనకు తానే బోధించినట్లుగా, “అపవిత్రమైనదేదియు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేదు.”14 కాబట్టి, ఆల్మా యొక్క ఉపశమనములో భాగము, కనికరము మధ్యవర్తిత్వము చేయకపోతే, న్యాయము అతడు పరలోక తండ్రితో జీవించుటకు తిరిగి వెళ్ళుట నుండి ఆపివేసియుండవచ్చు.15
మనము బాగు చేయలేని గాయములను రక్షకుడు స్వస్థపరచును.
కానీ ఆల్మా యొక్క సంతోషము అతడిపైన—అతడు శిక్షను తప్పించుకొనుట మరియు అతడు తండ్రి వద్దకు తిరిగి వెళ్లుటను ఆపివేయుటపై మాత్రమే దృష్టిసారించబడిందా? అతడు సత్యము నుండి దూరముగా నడిపించిన వారి గురించి కూడా ఆల్మా వేదన చెందాడని మనము ఎరుగుదుము.16 కానీ ఆల్మా దూరముగా నడిపించిన వారందరిని తనకు తాను స్వస్థపరచలేడు మరియు పూర్వపు స్థితికి తేలేడు. క్రీస్తు యొక్క సిద్ధాంతమును నేర్చుకొనుటకు మరియు దాని సంతోషకరమైన సూత్రములను జీవించుట ద్వారా ఆశీర్వదించబడుటకు వారు న్యాయమైన అవకాశమివ్వబడతారని అతడు స్వయంగా నిర్ధారించలేకపోయాడు. అతడి తప్పుడు బోధనతో గ్రుడ్డివారై చనిపోయిన వారిని అతడు తిరిగి తీసుకొనిరాలేడు.
అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ ఒకసారి బోధించినట్లుగా: “ఆల్మాను రక్షించిన ఆలోచన … ఇది: మీరు పూర్వపు స్థితికి తేలేని దానిని తెచ్చుట, స్వస్థపరచలేని గాయమును స్వస్థపరచుట, మీరు విరుగగొట్టిన దానిని, సరిచేయలేని దానిని సరిచేయుట, క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క ముఖ్యమైన ఉద్దేశము.”17 ఆల్మా యొక్క మనస్సు “లోనికి వచ్చిన” ఆనందకరమైన సత్యము అతడు తనకు తానే శుద్ధి చేయబడతాడని కాదు కానీ తాను గాయపరచిన వారు కూడ స్వస్థపరచబడి, బాగవుతారని.
రక్షకుని యొక్క త్యాగము నీతిగల తీర్పును నిశ్చయపరచును.
ఈ అభయమిచ్చు సిద్ధాంతము చేత రక్షించబడక సంవత్సరాలకు ముందు, రాజైన బెంజిమెన్ రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగము చేత ఇవ్వబడిన స్వస్థత యొక్క విశాలత గురించి బోధించాడు. అతడికి “దేవుని నుండి ఒక దూత ద్వారా” “గొప్ప సంతోషము యొక్క ఆనందకరమైన వర్తమానము”18 ఇవ్వబడ్డానని రాజైన బెంజిమెన్ ప్రకటించాడు. ఆ ఆనందకరమైన వర్తమానముల మధ్య “నరుల యొక్క సంతానముపై నీతిగల తీర్పు వచ్చునట్లు నిశ్చయపరచుటకు క్రీస్తు మన పాపములు, తప్పుల కొరకు బాధింపబడి, చనిపోతాడనే సత్యమున్నది.19
“నీతిగల తీర్పుకు” ఖచ్చితంగా ఏమి అవసరము? తరువాత వచనములో, నీతిగల తీర్పును నిశ్చయపరచుటకు, రక్షకుని రక్తము “ఆదాము యొక్క అతిక్రమము ద్వారా పతనమైన వారి పాపముల కొరకు” మరియు “దేవుని చిత్తమును తెలియకనే మరణించియున్న లేక ఆజ్ఞానము వలన పాపము చేసియున్న వారి కొరకు” ప్రాయశ్చిత్తము చేసిందని రాజైన బెంజిమెన్ వివరించాడు.20 నీతిగల తీర్పుకు కూడా అవసరమైనది, చిన్నపిల్లల యొక్క పాపముల “కొరకు క్రీస్తు యొక్క రక్తము ప్రాయశ్చిత్తము చేయుట,”21 అని అతడు బోధించాడు.
ఈ లేఖనాలు మహిమకరమైన సిద్ధాంతమును బోధిస్తాయి: ఒక ఉచితమైన బహుమానముగా, “ధర్మశాస్త్రము ఇవ్వబడని వారికి,”22 అని జేకబ్ చెప్పినట్లుగా, తెలియక పాపము చేసిన వారిని రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగము స్వస్థపరచును. పాపము కొరకు జవాబుదారిత్వము మనకు ఇవ్వబడిన వెలుగుపై ఆధారపడును మరియు మన స్వతంత్రతను సాధన చేసే మన సామర్ధ్యముపై ఆధారపడును.23 ఈ స్వస్థత, ఆదరించు సత్యము మోర్మన్ గ్రంధము మరియు ఇతర పునఃస్థాపించబడిన లేఖనము వలన మాత్రమేనని మనము ఎరుగుదుము.24
వాస్తవానికి ధర్మశాస్త్రము ఇవ్వబడిన చోట, దేవుని చిత్తము మనము ఎరిగినప్పుడు, మనము జవాబుదారులము. రాజైన బెంజిమెన్ నొక్కి చెప్పాడు: “కానీ అతడు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుచున్నాడని ఎరుగు వానికి ఆపద! ఏలయనగా పశ్చాత్తాపము మరియు ప్రభువైన యేసు క్రీస్తు పైన విశ్వాసము ద్వారానే తప్ప రక్షణ ఎవనికినీ రాదు.”25
ఇది కూడ క్రీస్తు సిద్ధాంతము యొక్క ఆనందకరమైన వర్తమానము. తెలియక పాపము చేసిన వారిని రక్షకుడు స్వస్థపరచి, పూర్వపు స్థితికి తేవటమే కాదు కానీ, వెలుగుకు వ్యతిరేకంగా పాపము చేసిన వారి కొరకు, పశ్చాత్తాపము మరియు ఆయనయందు విశ్వాసము షరతుపై రక్షకుడు స్వస్థత ఇచ్చును.26
ఆల్మా ఈ రెండు సత్యములను “పట్టుకొనియుండవచ్చు.” క్రీస్తు అతడిని రక్షించి, అతడు సత్యము నుండి దూరముగా నడిపించిన వారిని శాశ్వతంగా గాయపరచి విడిచిపెట్టెనని అనుకుంటే ఆల్మా వర్ణించిన “మధురమైన … ఆనందము”27 అతడు నిజముగా అనుభవించియుండేవాడా? నిశ్చయముగా కాదు. ఆల్మా సంపూర్ణ శాంతిని అనుభవించుటకు, అతడు హాని చేసిన వారికి కూడ పూర్తిగా స్వస్థపడే అవకాశము అవసరము.
కానీ వారు—లేక మనము హాని చేయువారు—ఎలా పూర్తిగా స్వస్థపరచబడతారు? రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త త్యాగము స్వస్థపరచి, బాగుచేయు పరిశుద్ధ పద్ధతులను మనము పూర్తిగా గ్రహించనప్పటికినీ, నీతిగల తీర్పును నిశ్చయపరచుటకు, నిర్లక్ష్యము మరియు ఇతరుల చేత గాయపరచబడిన బాధాకరమైన బలహీనతలు మరియు ఆత్మీయ బాధ యొక్క ఆటంకాలను రక్షకుడు తీసివేయును.28 దీని ద్వారా దేవుని యొక్క పిల్లలందరు, ఆయనను వెంబడించుటకు మరియు సంతోషము యొక్క గొప్ప ప్రణాళికను అంగీకరించుటకు ఎన్నుకొనుటకు స్పష్టమైన దృష్టితో, అవకాశమివ్వబడతారు.29
మనము విచ్చిన్నము చేసిన వాటన్నిటిని రక్షకుడు స్వస్థపరచును.
ఈ సత్యములే ఆల్మాకు శాంతిని కలిగించియుండవచ్చు. ఈ సత్యములే మనకు అదేవిధంగా గొప్ప శాంతిని కలిగిస్తాయి. ప్రకృతి సంబంధియైన పురుషులు, స్త్రీలుగా, మనము ఒకరినొకరం దూసుకొనిపోయి, లేక కొన్నిసార్లు గుద్దుకొని, హాని కలిగిస్తాము. ఏ తల్లి, తండ్రి అయినా సాక్ష్యమివ్వగలిగినట్లుగా, మన తప్పులకు సంబంధించిన బాధ మన స్వంత శిక్ష వలన భయముతో మాత్రమే కాదు కానీ మన పిల్లల యొక్క సంతోషమును పరిమితం చేయవచ్చని లేక సత్యమును చూచుట మరియు గ్రహించుట నుండి వారిని ఏవిధంగానైనా ఆటంకపరచియుండ వచ్చనే భయము. రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త త్యాగము యొక్క మహిమకరమైన వాగ్దానము ఏదనగా తల్లిదండ్రుల విషయానికొస్తే మన తప్పుల వరకు, ఆయన మన పిల్లలను నిర్ధోషులుగా ఎంచి, వారి కోసం స్వస్థతను వాగ్దానమిస్తున్నాడు.30 మనమందరం చేసినట్లుగా—వారు వెలుగుకు వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు కూడా—ఆయన కనికరముగల హస్తము చాపబడింది,31 మరియు వారు ఆయన వైపు చూసి, జీవించిన యెడల ఆయన వారిని విడిపిస్తాడు.32
మనము సరిచేయలేని దానిని బాగు చేయటానికి రక్షకుడు శక్తి కలిగియున్నప్పటికినీ, మన పశ్చాత్తాపములో భాగముగా నష్టపరిహారమును చేయుటకు మనము చేయగల సమస్తమును చేయమని ఆయన మనకు ఆజ్ఞాపించాడు.33 మన పాపములు మరియు తప్పులు దేవునితో మన అనుబంధమును మాత్రమే కాదు కానీ ఇతరులతో మన అనుబంధాలను కూడ తారుమారు చేస్తాయి. కొన్నిసార్లు స్వస్థపరచుటకు, పూర్వపు స్థితికి తెచ్చుటకు మన ప్రయత్నాలు ఒక క్షమాపణ అంత సులభమైనది కావచ్చు, కానీ మిగిలిన సమయాలలో నష్టపరిహారమునకు సంవత్సరాల వినయముగల ప్రయత్నము అవసరం కావచ్చు.34 అయినప్పటికినీ, మన పాపములు మరియు తప్పులలో అనేకము కోసం, మనము గాయపరచిన వారిని పూర్తిగా బాగు చేయటం మనము ఒక్కరమే చేయలేము. మోర్మన్ గ్రంధము యొక్క అద్భుతమైన, శాంతిని-ఇచ్చు వాగ్దానము ఏదనగా, మనము విచ్ఛిన్నం చేసిన వాటన్నిటిని రక్షకుడు చక్కదిద్దుతాడు.35 మరియు విశ్వాసమందు మనము ఆయన వైపు తిరిగి, మనము కలుగజేసిన గాయమును బట్టి పశ్చాత్తాపపడిన యెడల, ఆయన మనల్ని కూడా బాగు చేస్తాడు.36 ఆయన పరిపూర్ణమైన ప్రేమతో మనందరిని ప్రేమిస్తున్నాడు కనుక37 మరియు న్యాయము, కనికరము రెండిటిని గౌరవించు నీతిగల తీర్పును నిశ్చయపరచుటకు ఆయన ఒడంబడిక చేసుకున్నాడు కనుక ఆయన ఈ రెండు వరములను ఇస్తాడు. ఇది సత్యమని యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.