మారుమనస్సు పొందుటలో మోర్మన్ గ్రంథము యొక్క శక్తి
మోర్మన్ గ్రంథము ఆత్మీయ పోషణనిస్తుంది, ఒక క్రియాశీలక ప్రణాళికను నిర్ధేశిస్తుంది, మరియు పరిశుద్ధాత్మతో మనల్ని జతపరుస్తుంది.
ఈ మధ్య శారీరక పరీక్ష నుండి నివేదికను సమీక్షించిన తరువాత, నేను కొన్ని జీవన శైలి మార్పులు చేయాల్సిన అవసరమున్నదని తెలుసుకున్నాను. నాకు సహాయపడడానికి, నా వైద్యుడు పోషకాహారమును, వ్యాయామ ప్రణాళికను నిర్దేశించాడు, దానిని నేను అనుసరించడానికి ఎంపిక చేసినట్లయితే, అది నన్ను ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారుస్తుంది.
మనలో ప్రతిఒక్కరం ఆత్మీయ పరీక్షను జరిపినట్లయితే, మన గురించి మనము ఏమి నేర్చుకుంటాము? మన ఆత్మీయ వైద్యుడు ఏ సవరణలను నిర్ధేశించవచ్చు? మనము ఎలా కావాలో అలా కావడానికి, మనం ఏమి చేయాలో మనకు తెలియడం మరియు మనకు తెలిసిన దానిని చేయడం చాలా ఆవశ్యకమైనది.
యేసు క్రీస్తు గొప్ప వైద్యుడు.1 ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా, ఆయన మన గాయములను కట్టును, తనపై మన బలహీనతలన్నిటినీ తీసుకొనును, మరియు మన విరిగిన హృదయాలను బాగు చేయును.2 ఆయన కృప ద్వారా మన బలహీనతలు బలముగా కాగలవు.3 ఆయనను గూర్చి నేర్చుకొనుట, ఆయన మాటలను వినుట, మరియు ఆయన ఆత్మ యొక్క దీనత్వమందు నడుచుట ద్వారా5 ఆయనను వెంబడించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు.4 మారుమనస్సు పొందు ఈ జీవితకాల ప్రక్రియలో మనకు సహాయపడతానని ఆయన మనకు వాగ్దానము చేసారు, 6 అది మనల్ని మారుస్తుంది మరియు శాశ్వతమైన ఆనందమును తెస్తుంది.7
మారుమనస్సు పొందుటలో శక్తివంతమైన సాధనముగా సహాయపడుటకు రక్షకుడు మనకు మోర్మన్ గ్రంథమును ఇచ్చారు. మోర్మన్ గ్రంథము ఆత్మీయ పోషణనిస్తుంది, ఒక క్రియాశీలక ప్రణాళికను నిర్ధేశిస్తుంది, మరియు పరిశుద్ధాత్మతో మనల్ని జతపరుస్తుంది. మన కొరకు వ్రాయబడినది,8, అది దేవుని వాక్యమును స్పష్టంగా కలిగియున్నది9 మరియు మన గుర్తింపు, ఉద్దేశము, మరియు గమ్యమును మనకు చెప్తుంది.10 బైబిలుతోపాటు, మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తుంది11 మరియు మనము సత్యమును ఎలా తెలుసుకోగలమో మరియు ఆయన వలె ఎలా మారగలమో బోధిస్తుంది.
సహోదరుడు సా పొలొ యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తకు పరిచయము చేయబడినప్పుడు అతడు 58 సంవత్సరాల వాడు. నేను అతడిని కలుసుకొన్నప్పుడు, అతడు అనేక సంవత్సరాలుగా శాఖాధ్యక్షునిగా సేవ చేస్తున్నాడు, కానీ అతడు ఎన్నడూ మోర్మన్ గ్రంథము చదవలేదని నేను తెలుసుకున్నాను, ఎందుకనగా అది అతని మాతృభాషయైన బర్మీస్ లో లభ్యముకాలేదు. దానిని చదవకుండా ఆ గ్రంథము నిజమని అతడు ఎలా ఎరుగునని నేను అతడిని అడిగినప్పుడు, మోర్మన్ గ్రంథ కధలు చిత్రముల పుస్తకమును దృష్టాంతములను చూడడం ద్వారా, ఆంగ్ల పదాలను అనువదించడానికి నిఘంటువును ఉపయోగిస్తూ, ప్రతీరోజు చదివానని మరియు తాను చదివిన దాని వివరణలు జాగ్రత్తగా తీసుకున్నానని అతడు జవాబిచ్చాడు. అతడిలా వివరించాడు, “నేను చదివిన ప్రతీసారి, నేను నేర్చుకున్నదాని గురించి ప్రార్థన చేస్తాను, నేను శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తాను, నా మనస్సు స్పష్టముగా ఉంటుంది, మరియు నా హృదయము మృదువుగా ఉంటుంది. అది సత్యమని పరిశుద్ధాత్మ నాతో సాక్ష్యమిచ్చుటను నేను భావించాను. మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని నాకు తెలుసు.”
సహోదరుడు సా పొలొ వలె, మనలో ప్రతీఒక్కరము మన పరిస్థితుల ప్రకారము మోర్మన్ గ్రంథమును అధ్యయనము చేయగలము. దాని బోధనలు నమ్మి, మన హృదయాలలో వాటిని ధ్యానించడానికి మనము కోరుకున్నప్పుడు, ఆ బోధనలు సత్యమా అని విశ్వాసముతో మనము దేవుడిని అడుగగలము.12 తెలుసుకోవాలనే మన కోరికలో చిత్తశుద్ధి ఉండి, అమలు చేయడానికి నిజమైన ఉద్దేశమును కలిగియున్నట్లయితే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలోనికి జవాబిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము అన్ని విషయాల యొక్క సత్యమును తెలుసుకుంటాము.13 మోర్మన్ గ్రంథమును గూర్చి మనము దైవిక సాక్ష్యమును పొందినప్పుడు, అదే శక్తి ద్వారా మనము యేసు క్రీస్తు లోక రక్షకుడని, జోసెఫ్ స్మిత్ ఆయన ప్రవక్త అని, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము పునఃస్థాపించబడిన ఆయన సంఘమని కూడా తెలుసుకుంటాము.14
నా మిషనరీ సేవను ప్రారంభించిన యువకునిగా, నేను ఆస్ట్రేలియాకు బయలుదేరిన విమానములో కూర్చున్నాను. చాలా ఒంటరిగా, ఆందోళనగా, మరియు సరిపోనట్లు భావించాను, కానీ సేవ చేయుటకు కట్టుబడియున్నందున, నేను నమ్మినది నిజమని నాకు భరోసా అవసరము. నేను ప్రార్థన చేసాను, చిత్తశుద్ధితో లేఖనాలు చదివాను, కానీ విమానము కదిలినప్పుడు, నా స్వంత-సందేహము తీవ్రమైంది మరియు నా శారీరక స్థితి క్షీణించింది. కొన్ని గంటలు నేను ప్రయాసపడిన తరువాత, ఒక విమాన సహాయకుడు నా వైపు నడిచి వచ్చి, నా సీటు ప్రక్కన ఆగాడు. నా చేతుల్లో నుండి నేను చదువుతున్న మోర్మన్ గ్రంథమును అతడు తీసుకున్నాడు. అతడు అట్ట వైపు చూసి, “ఇదొక గొప్ప పుస్తకము!” అన్నాడు, తరువాత ఆ పుస్తకాన్ని నాకు తిరిగి ఇచ్చి, నడవసాగాడు. నేను మరలా ఎన్నడూ అతడిని చూడలేదు.
అతడి మాటలు నా చెవులలో ప్రతిధ్వనిస్తుండగా, “నేను ఇక్కడున్నాను, నీవెక్కడ ఉన్నావో నాకు తెలుసు. నీ శాయశక్తులా పనిచేయి, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను,” అని నేను స్పష్టంగా విన్నాను మరియు హృదయములో భావించాను. పసిఫిక్ సముద్రముపైగా ఆ విమానములో, నా మోర్మన్ గ్రంథ అధ్యయనము ద్వారా మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలద్వారా, నేను ఎవరో నా రక్షకునికి తెలుసని మరియు సువార్త సత్యమని ఒక వ్యక్తిగత సాక్ష్యమును నేను పొందాను.
ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు: “సువార్త సత్యమని తెలుసుకొనుట సాక్ష్యము యొక్క సారము. నిరంతరము సువార్తకు యధార్థముగా ఉండుట మారుమనస్సు పొందుట యొక్క సారము.”15 మారుమనస్సు పొందుటకు మనము “వినువారు మాత్రమైయుండక, వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై యుండుట,”16 అవసరము. మన కొరకు ప్రభువు ప్రతిపాదించిన వ్యూహము—క్రీస్తు యొక్క సిద్ధాంతము—మోర్మన్ గ్రంథములో మిక్కిలి స్పష్టముగా బోధించబడింది.17 అందులో:
-
మొదటిది, ఆయనను నమ్మి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మనకు సహాయపడతారని తెలుసుకోవడం ద్వారా యేసు క్రీస్తునందు విశ్వాసమును సాధన చేయుట. 18
-
రెండవది, మన పొరపాట్లను బట్టి రోజూ పశ్చాత్తాపపడుట మరియు ఆయన మనల్ని క్షమించినప్పుడు ఆనందమును, శాంతిని అనుభవించుట. 19 పశ్చాత్తాపమునకు ఇతరులను మనము క్షమించుట అవసరము20 మరియు ముందుకు సాగుటకు అది మనకు సహాయపడును. మనము పశ్చాత్తాపపడినప్పుడల్లా రక్షకుడు మనల్ని క్షమిస్తానని వాగ్దానమిచ్చారు.21
-
మూడవది, బాప్తీస్మము వంటి విధుల ద్వారా దేవునితో నిబంధనలు చేయుట మరియు పాటించుట. ఆయన వద్దకు నడిపించే నిబంధన బాటపై ఇది మనల్ని ఉంచుతుంది.22
-
నాల్గవది, పరిశుద్ధాత్మ వరమును పొందుట. ఈ వరము మనల్ని పరిశుద్ధపరచి, ఓదార్చి, నడిపించే వాని యొక్క నిరంతర సహవాసానికి మనల్ని అనుమతిస్తుంది.23
-
మరియు ఐదవది, క్రీస్తు యొక్క వాక్యమును ప్రతీరోజు విందారగించుచుండగా, స్థిరముగా ముందుకు త్రోసుకొనిపోవుట ద్వారా అంతము వరకు సహించుట. 24 మోర్మన్ గ్రంథము నుండి విందారగించుట మరియు దాని బోధనలను గట్టిగా పట్టుకొనుట ద్వారా, మనము శోధనలను జయించగలము మరియు మన జీవితములంతటా నడిపింపును, భద్రతను పొందగలము.25
క్రీస్తు యొక్క సిద్ధాంతమును మన జీవితాలలో నిరంతరం అన్వయించడం ద్వారా, మనము మార్పును అడ్డుకునే జడత్వాన్ని మరియు క్రియను విఫలము చేసే భయాన్ని జయిస్తాము. మనము వ్యక్తిగత బయల్పాటును పొందుతాము, ఏలయనగా పరిశుద్ధాత్మ “మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు చూపును,” 26 మరియు “క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు చెప్పును.” 27
20 సంవత్సరాలుగా, సహోదరుడు హువాంగ్ జంకాంగ్ మద్యపానము, సిగరెట్లు, మరియు బలవంతమైన జూదముతో పోరాడాడు. యేసు క్రీస్తు మరియు పునస్థాపించబడిన ఆయన సువార్తకు పరిచయము చేయబడినప్పుడు, తన చిన్న కుటుంబము కోసం మారాలని సహోదరుడు హువాంగ్ అనుకున్నాడు. అతడి గొప్ప సవాలు పొగ త్రాగటం. తీవ్రంగా ధూమపానము చేసే అతడు మానివేయడానికి అనేకసార్లు ప్రయత్నించి, విఫలమయ్యాడు. ఒకరోజు మోర్మన్ గ్రంథములో నుండి ఈ మాటలు అతడి మనస్సులో నాటబడ్డాయి: “ఒక యధార్థమైన హృదయముతో, నిజమైన ఉద్దేశముతో.”28 ఇదివరకటి ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నుండి సహాయముతో తాను మారగలనని బహుశా అతడు భావించాడు.
పూర్తి-కాల మిషనరీలు తమ విశ్వాసమును అతడితో ఏకము చేసారు, మరియు భారీ మోతాదులో ప్రార్థన మరియు దేవుని వాక్యమును అధ్యయనము చేయడంతో పాటు పొగత్రాగటం మానేయడానికి అతడికి సహాయపడేందుకు సాధారణమైన, మృదువైన వ్యూహములతో ఒక క్రియాశీలక ప్రణాళికను అందించారు. నిష్కపటముతో, నిజమైన ఉద్దేశముతో సహోదరుడు హూవాంగ్ విశ్వాసమైన తీర్మానముతో పనిచేసాడు మరియు తాను వృద్ధి చేయాలని కోరిన మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం వంటి క్రొత్త అలవాట్లపై ఎక్కువగా అతడు దృష్టిసారించినప్పుడు, తాను వదులుకోవాలనుకున్న అలవాట్లపై అతడు తక్కువగా దృష్టిసారించినట్లు కనుగొన్నాడు.
15 సంవత్సరాల క్రితం తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, అతడు వ్యాఖ్యానించాడు, “నేను పొగ త్రాగటం ఎప్పుడు మానేసానో నాకు గుర్తు లేదు, కానీ నా జీవితంలోనికి ప్రభువు యొక్క ఆత్మను ఆహ్వానించడానికి నేను చేయాలని తెలిసిన విషయాలను చేయడానికి ప్రతీరోజు నేను గట్టిగా ప్రయత్నించినప్పుడు మరియు నేను వాటిని చేసినప్పుడు, నేను ఇకపై సిగరెట్లకు ఆకర్షించబడలేదు మరియు అప్పటి నుండి తీసుకోలేదు.” మోర్మన్ గ్రంథములోని బోధనలు అన్వయించుకోవడం ద్వారా, సహోదరుడు హువాంగ్ జీవితం మార్చబడింది, మరియు అతడు మంచి భర్తగా, తండ్రిగా మారాడు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వాగ్దానమిచ్చారు: “మీరు ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు, మీరు ప్రతిరోజు— మంచి నిర్ణయాలను తీసుకుంటారు. మీరు చదివిన దానిని ధ్యానించినప్పుడు, ఆకాశపు వాకిండ్లు తెరుచుకుంటాయి, మీ స్వంత ప్రశ్నలకు మీరు సమాధానాలను మరియు మీ స్వంత జీవితానికి మార్గనిర్దేశాన్ని పొందుతారని నేను వాగ్దానమిస్తున్నాను. ప్రతిరోజు మోర్మన్ గ్రంథములో మీరు నిమగ్నమైతే, అశ్లీలత అనే పటుత్వముగల తెగులు మరియు మనసుకు స్తబ్ధత కలిగించు ఇతర వ్యసనాలతో పాటు నేటి దుశ్చర్యలనుండి మీరు విముక్తి పొందగలుగుతారు అని నేను వాగ్దానమిస్తున్నాను.”29
ప్రియమైన స్నేహితులారా, మోర్మన్ గ్రంథము దేవుని వాక్యము, మనము దానిని అధ్యయనము చేసినట్లయితే మనము ఆయనకు దగ్గరవుతాము.30 దాని మాటలపై మనము ప్రయోగము చేసినప్పుడు, దాని యధార్థతను గూర్చి ఒక సాక్ష్యమును మనము పొందుతాము.31 మనము దాని బోధనల ప్రకారము నిరంతరము జీవించినప్పుడు, మనము “కీడు చేయుటకు ఇక ఎట్టి కోరిక కలిగియుండము.”32 రక్షకుని వలె ఎక్కువగా కావడానికి మన హృదయము, ముఖ కవళిక, మరియు స్వభావము మార్పు చెందుతాయి.33 యేసే క్రీస్తని, మన రక్షకుడు, విమోచకుడు మరియు స్నేహితుడనే నా నిశ్చయమైన సాక్ష్యమును పంచుకుంటున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.