గొప్ప ప్రణాళిక
దేవుని ప్రణాళికను తెలిసిన మరియు పాల్గొనడానికి నిబంధన చేసిన మనకు ఈ సత్యాలను బోధించే స్పష్టమైన బాధ్యత ఉంది.
ప్రత్యేకమైన శ్రమలు మరియు సవాళ్ళ మధ్య కూడా, మనం నిజంగా ఆశీర్వదించబడ్డాము! ఈ సర్వసభ్య సమావేశం యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపన యొక్క అమూల్యమైన సత్యాన్ని మరియు ఆనందాన్ని ఇచ్చింది. పునఃస్థాపనను ప్రారంభించిన తండ్రి మరియు కుమారుని దర్శనంలో మేము సంతోషించాము. మోర్మన్ గ్రంథము అద్భుతంగా ముందుకు రావడం మనకు గుర్తు చేయబడింది, దీని ముఖ్య ఉద్దేశ్యం యేసు క్రీస్తు మరియు ఆయన సిద్ధాంతానికి సాక్ష్యమివ్వడం. ప్రవక్తలకు మరియు వ్యక్తిగతంగా మనకు బయల్పాటు యొక్క ఆనందకరమైన వాస్తవికతతో మనము నూతనపరచబడ్డాము. యేసు క్రీస్తు యొక్క అనంతమైన ప్రాయశ్చిత్తం మరియు ఆయన అక్షరార్థ పునరుత్థానం యొక్క విలువైన సాక్ష్యాలను మనం విన్నాము. కొత్తగా పిలువబడిన ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు తండ్రి అయిన దేవుడు వెల్లడించిన సువార్త యొక్క ఇతర సత్యాలు మనకు నేర్పించబడ్డాయి: “ఇది నా ప్రియమైన కుమారుడు. ఈయనను ఆలకించుము!“ జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:17.
యాజకత్వము మరియు దాని తాళపుచేతుల యొక్క పునఃస్థాపన గురించిన మన జ్ఞానంలో మనము బలపరచబడ్డము. ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘాన్ని సరైన పేరుతో అనగా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము అని తెలుసుకోవాలనే మా సంకల్పంలో మేము నూతనపరచబడ్డాము. ప్రపంచవ్యాప్త మహమ్మారి యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రభావాలను తగ్గించడానికి ఉపవాసం మరియు ప్రార్థనలో చేరమని మనము ఆహ్వానించబడ్డాము. ఈ ఉదయం పునఃస్థాపన యొక్క చారిత్రాత్మక ప్రకటనను ప్రదర్శిస్తున్న ప్రభువు యొక్క సజీవ ప్రవక్త ప్రేరణ పొందారు. “పునఃస్థాపన సందేశాన్ని ప్రార్థనతో అధ్యయనం చేసి, విశ్వాసంతో పనిచేసే వారు, దాని దైవత్వం మరియు దాని ఉద్దేశము మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు వాగ్దానం చేసిన రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి అని దాని గురించి వారి స్వంత సాక్ష్యాన్ని పొందటానికి ఆశీర్వదించబడతారు”1అని మేము దాని ప్రకటనను ధృవీకరిస్తున్నాము.
ప్రణాళిక
ఇవన్నీ ఒక దైవిక ప్రణాళికలో భాగం, దీని ఉద్దేశ్యం దేవుని పిల్లలను మహోన్నతస్థితికి చేర్చడం మరియు ఆయనవలె మారడానికి వీలు కల్పించడం. “సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక”, “విమోచనా ప్రణాళిక” మరియు “రక్షణ ప్రణాళిక” (అల్మా 42: 8, 11, 5)) అని లేఖనాలలో సూచించబడింది—పునఃస్థాపనలో వెల్లడైన ఆ ప్రణాళిక –పరలోకములో ఒక ఆలోచన సభతో మొదలైయింది. ఆత్మలుగా, మన పరలోకపు తల్లిదండ్రులు అనుభవిస్తున్న నిత్యజీవాన్ని సాధించాలని మనము కోరుకున్నాము. ఆ సమయంలో భౌతిక శరీరంతో మర్త్య అనుభవం లేకుండా మనము ఎంతవరకు పురోగతిని సాధించగలమో అంతవరకు సాధించాము. ఆ అనుభవాన్ని అందించడానికి, తండ్రి అయిన దేవుడు ఈ భూమిని సృష్టించాలని అనుకున్నారు. ప్రణాళికాబద్ధమైన మర్త్య జీవితంలో, మన ఆత్మీయ అభివృద్ధికి అవసరమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు మనం పాపము చేత అపవిత్రపరచబడతాము. మనము కూడా శారీరక మరణానికి లోనవుతాము. మరణం మరియు పాపం నుండి మనల్ని తిరిగి పొందటానికి, మన పరలోక తండ్రి యొక్క ప్రణాళిక ఒక రక్షకుడిని అందిస్తుంది. ఆయన పునరుత్థానం అందరినీ మరణం నుండి విమోచిస్తుంది, మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగం మన పెరుగుదలను ప్రోత్సహించడానికి సూచించిన షరతులపై పాపం నుండి పరిశుద్ధపరచబడటానికి అవసరమైన వెలను చెల్లిస్తుంది. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం తండ్రి ప్రణాళికకు ప్రధానమైనది.
పరలోకములో ఆ ఆలోచన సభలో, దేవుని ఆత్మ పిల్లలందరూ తండ్రి యొక్క ప్రణాళికకు, దాని మర్త్య పరిణామాలు మరియు శ్రమలు, పరలోకపు సహాయాలు మరియు దాని అద్భుతమైన గమ్యమునకు పరిచయం చేయబడ్డారు. మనము మొదటి నుండి ముగింపు వరకు చూశాము. ఈ భూమిపై జన్మించిన గొప్ప సమూహమైన మానవులందరూ తండ్రి ప్రణాళికను ఎంచుకున్నారు మరియు తరువాత జరిగిన పరలోక పోటీలో దాని కోసం పోరాడారు. మర్త్యత్వంలో వారు ఏమి చేస్తారనే దాని గురించి చాలా మంది తండ్రితో నిబంధనలు చేసుకున్నారు. బయలుపరచబడని మార్గాల్లో, ఆత్మ ప్రపంచంలో మన చర్యలు మర్త్యత్వములో మన పరిస్థితులను ప్రభావితం చేశాయి.
మర్త్యత్వము మరియు ఆత్మల ప్రపంచం
తండ్రి ప్రణాళికలోని కొన్ని ప్రధాన అంశాలను నేను ఇప్పుడు సంగ్రహంగా చెబుతాను, ఎందుకంటే అవి మన మర్త్య ప్రయాణాల్లో మరియు తరువాత వచ్చే ఆత్మ ప్రపంచంలో మనల్ని ప్రభావితం చేస్తాయి.
మర్త్య జీవితం మరియు దానిని అనుసరించగల మరణానంతర అభివృద్ధి యొక్క ఉద్దేశ్యం దేవుని సంతానం ఆయనలాగే మారడం. ఇది తన పిల్లలందరి కొరకు పరలోక తండ్రి యొక్క కోరిక. ఈ సంతోషకరమైన గమ్యాన్ని సాధించడానికి, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా మనం శుద్ధి చేయబడిన జీవులుగా మారాలని నిత్య చట్టాలు కోరుతున్నాయి, తద్వారా మనం తండ్రి మరియు కుమారుని సమక్షంలో నివసించగలము మరియు ఉన్నతమైన ఆశీర్వాదాలను ఆస్వాదించగలము. మోర్మన్ గ్రంథము బోధిస్తున్నట్లుగా, ఆయన “వారందరిని తన వద్దకు రమ్మని మరియు తన మంచితనము నుండి పాలుపొందమని ఆహ్వానించుచున్నాడు; మరియు తన యొద్దకు వచ్చువానిని, నల్లవాడిని మరియు తెల్లవాడిని, దాసుని మరియు స్వతంత్రుని, పురుషుని మరియు స్త్రీని, ఎవ్వరిని ఆయన కాదనడు; ఆయన అన్యులను జ్ఞాపకము చేసుకొనును; మరియు అందరు దేవునికి ఒకే రీతిలో ఉన్నారు.”(2 నీఫై 26:33; ఆల్మా 5:49 కూడా చూడండి).
మనం ఏమి కావాలని నిర్ణయించబడ్డామో దానికోసం మనకొరకు చేయబడిన ఆ దైవిక ప్రణాళిక—దేవుని ఆజ్ఞలకు మరియు ఆయన ప్రణాళికకు విరుద్ధంగా వ్యవహరించడానికి మానవులను ప్రేరేపించే చెడు వ్యతిరేకతను తిరస్కరించడానికి మనం ఎంపికలు చేయాలని కోరుతుంది. ఇతరుల పాపాల నుండి లేదా పుట్టుకతో వచ్చే కొన్ని లోపాల నుండి మనం ఇతర మర్త్య వ్యతిరేకతలకు లోబడి ఉండాలని అది మనల్ని కోరుతుంది. కొన్నిసార్లు మనకు అవసరమైన అభివృద్ధి, సౌకర్యం మరియు ప్రశాంతత కంటే బాధ మరియు ప్రతికూలత ద్వారా బాగా సాధించబడుతుంది. దైవిక జోక్యం మర్త్యత్వము యొక్క అన్ని ప్రతికూల పరిణామాల నుండి మనలను ఉపశమనం చేస్తే ఈ మర్త్య వ్యతిరేకత ఏదీ దాని శాశ్వతమైన ప్రయోజనాన్ని సాధించలేదు.
ఈ ప్రణాళిక నిత్యత్వంలో మన గమ్యాన్ని, మర్త్యత్వములో మన ప్రయాణం యొక్క ఉద్దేశ్యం మరియు పరిస్థితులను మరియు మనకు లభించే పరలోకపు సహాయాన్ని వెల్లడిస్తుంది. దేవుని ఆజ్ఞలు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా మనల్ని హెచ్చరిస్తాయి. ప్రేరేపిత నాయకుల బోధనలు మన మార్గానికి మార్గనిర్దేశం చేస్తాయి మరియు మన నిత్య ప్రయాణాన్ని ప్రోత్సహించే హామీలు ఇస్తాయి.
మర్త్యత్వము ద్వారా మన ప్రయాణానికి సహాయపడటానికి దేవుని ప్రణాళిక నాలుగు గొప్ప హామీలను ఇస్తుంది. ప్రణాళిక యొక్క కేంద్ర భాగమైన యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా అన్నీ మనకు ఇవ్వబడ్డాయి. మనం పశ్చాత్తాపపడే పాపాల కోసం ఆయన బాధల ద్వారా మనం ఆ పాపాలనుండి శుద్ధి చేయవచ్చని మొదటిది మనకు భరోసా ఇస్తుంది. అప్పుడు దయగల తుది న్యాయమూర్తి “వాటిని ఇక ఎంతమాత్రము జ్ఞాపకముంచుకోరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42).
రెండవది,, మన రక్షకుని ప్రాయశ్చిత్తంలో భాగంగా, ఆయన మిగతా అన్ని మర్త్య బలహీనతలను ఆయనపై తీసుకున్నారు. యుద్ధం మరియు తెగులు వంటి వ్యక్తిగత మరియు సాధారణమైన అనివార్యమైన మర్త్యత్వపు భారాన్ని భరించే శక్తిని ఇవ్వమని ఆయనను ప్రార్థించడానికి ఇది మనలను అనుమతిస్తుంది. ప్రాయశ్చిత్తం యొక్క ఈ ముఖ్యమైన శక్తి గురించి మోర్మన్ గ్రంథము మన స్పష్టమైన లేఖనాత్మక వివరణను అందిస్తుంది. రక్షకుడు తనపై “తన జనుల యొక్క బాధలు మరియు రోగములను [మరియు బలహీనతలను] తీసుకొనెను. … మరియు ఆయన జనులను కట్టి ఉంచు మరణము యొక్క బంధకములను, ఆయన వదులు చేయునట్లు, ఆయన మరణమును తనపైన తీసుకొనెను. మరియు శరీరమును బట్టి ఆయన ప్రేగులు కనికరముతో నిండవలెనని, వారి యొక్క బలహీనతలను బట్టి, తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు ఆయన వారి యొక్క బలహీనతలను తనపైన తీసుకొనెను” (ఆల్మా 7:11–12).
మూడవది, రక్షకుడు, తన అనంతమైన ప్రాయశ్చిత్తం ద్వారా, మరణము తరువాత ఏమి ఉండదు అనేదాన్ని కొట్టివేస్తారు మరియు మనమందరం పునరుత్థానం అవుతామని సంతోషకరమైన హామీని ఇస్తారు. “ఇప్పుడు ఈ పునఃస్థాపన వృద్ధులు మరియు యౌవనస్థులు ఇరువురు, దాసులు మరియు స్వతంత్రులు ఇరువురు, పురుషులు మరియు స్త్రీలు ఇరువురు, దుష్టులు మరియు నీతింతులు ఇరువురు, అందరికి వచ్చును. మరియు వారి తలల యొక్క ఒక్క వెంట్రుక కూడ నశించదు. కాని ప్రతిది ఇప్పుడున్నట్లు గానే లేక శరీరమందు దానిని పరిపూర్ణ ఆకారమునకు పునఃస్థాపించబడను” (ఆల్మా 11:44).
మనం ఈస్టర్ సమయంలో పునరుత్థానం యొక్క వాస్తవికతను జరుపుకుంటాము. మన మర్త్య జీవితాలలో పుట్టుక సమయంలో లేదా అనుభవం ద్వారా మనం పొందే శారీరక, మానసిక లేదా భావోద్రేక లోపాలు వంటివి మనలో ప్రతి ఒక్కరూ మరియు మనం ప్రేమించేవారు ఎదుర్కొను మర్త్య సవాళ్లను భరించే దృక్పథాన్ని మరియు బలాన్ని ఇది మనకు ఇస్తుంది. పునరుత్థానం కారణంగా, ఈ మర్త్య లోపాలు తాత్కాలికమేనని మనకు తెలుసు!
పునఃస్థాపించబడిన సువార్త మన కుటుంబ సభ్యులతో—భర్త, భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి పునరుత్థానంలో అవకాశం ఉందని భరోసా ఇస్తుంది. మర్త్యత్వములో మన కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి ఇది మనకు శక్తివంతమైన ప్రోత్సాహం. వచ్చే జీవితంలో ఆనందకరమైన పునఃకలయికలు మరియు సహవాసాలు ఉంటాయనే అపేక్షతో ఈ జీవితంలో ప్రేమతో కలిసి జీవించడానికి ఇది మనకు సహాయపడుతుంది.
నాల్గవది మరియు చివరిగా, ఆధునిక బయల్పాటు మన పురోగతి మర్త్యత్వపు ముగింపుతో ముగియవలసిన అవసరం లేదని బోధిస్తుంది. ఈ ముఖ్యమైన హామీ గురించి చాలా తక్కువ వెల్లడించబడింది. ఈ జీవితం దేవునిని కలవడానికి సిద్ధపడే సమయం అని మరియు మన పశ్చాత్తాపాన్ని వాయిదా వేయకూడదని మనకు చెప్పబడింది. (ఆల్మా 34:32–33 చూడండి). అయినప్పటికీ, “సత్యాన్ని తిరస్కరించిన దుష్టులకు, అవిధేయులకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 138: 29) ఆత్మ ప్రపంచంలో కూడా సువార్త బోధించబడుతుందని మరియు అంతిమ తీర్పుకు ముందు అక్కడ బోధించబడినవారు పశ్చాత్తాపపడుటకు సమర్థులని మనకు బోధించబడెను.(31–34, 57–59 వచనాలు చూడండి).
మన పరలోక తండ్రి ప్రణాళిక యొక్క కొన్ని ఇతర ప్రాథమిక అంశాలు ఇక్కడ ఉన్నాయి.
యేసు క్రీస్తు పునఃస్థాపించబడిన సువార్త పవిత్రత, వివాహం మరియు పిల్లలను కనడం అనే అంశాలపై ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని ఇస్తుంది. దేవుని ప్రణాళిక యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి, మర్త్య జననానికి దైవికంగా నియమించబడిన అమరికను అందించడానికి మరియు కుటుంబ సభ్యులను శాశ్వతమైన జీవితానికి సిద్ధం చేయడానికి వివాహం అవసరమని ఇది బోధిస్తుంది. “వివాహం దేవుని నుండి మనిషికి నియమించబడింది,” “. … తద్వారా భూమి దాని సృష్టి ముగింపుకు సమాధానం ఇవ్వవచ్చును” అని ప్రభువు చెప్పెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 49:15). ఇందులో, ఆయన ప్రణాళిక, చట్టం మరియు ఆచారంలో కొన్ని బలమైన ప్రాపంచిక శక్తులకు వ్యతిరేకంగా నడుస్తుంది.
దేవుడు తన పిల్లలకు ఇచ్చిన అత్యంత మహోన్నత శక్తి మర్త్య జీవితాన్ని సృష్టించే శక్తి. దాని ఉపయోగం ఆదాము మరియు హవ్వలకు మొదటి ఆజ్ఞలో తప్పనిసరి, కానీ దాని దుర్వినియోగాన్ని నిషేధించడానికి మరొక ముఖ్యమైన ఆజ్ఞ ఇవ్వబడింది. వివాహ బంధాల వెలుపల సంతానోత్పత్తి శక్తి యొక్క అన్ని ఉపయోగాలు, ఒక స్థాయి లేదా మరొక స్థాయిలో స్త్రీ పురుషుల యొక్క అత్యంత దైవిక లక్షణం యొక్క పాపాత్మకమైన మరియు అవమానకరమైన వక్రీకరణ. ఈ పవిత్రత చట్టం గురించి పునఃస్థాపించబడిన సువార్త ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో మన సంతానోత్పత్తి శక్తుల ఉద్దేశ్యం.
తరువాత ఏమిటి?
పునఃస్థాపనను ప్రారంభించిన మొదటి దర్శనము యొక్క ఈ 200 వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రభువు యొక్క ప్రణాళిక మనకు తెలుసు మరియు ఆయన పునఃస్థాపించిన సంఘము ద్వారా రెండు శతాబ్దాల ఆశీర్వాదాల ద్వారా మనము ప్రోత్సహించబడ్డాము. ఈ 2020 సంవత్సరంలో, గత సంఘటనలను వైద్య వృత్తి పిలిచే 20/20 సాధారణ కనుదృష్టి అనే పరిస్థితిని కలిగియున్నాము.
మనము భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు, మన దృష్టి చాలా తక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. పునఃస్థాపన జరిగిన రెండు శతాబ్దాల తరువాత, అక్కడ జరిగే బోధను నెరవేర్చడానికి ఆత్మ ప్రపంచం ఇప్పుడు చాలా మంది అనుభవజ్ఞులైన పనివారిని కలిగి ఉందని మనకు తెలుసు. మర్త్యత్వము యొక్క తెరకు ఇరువైపులా పశ్చాత్తాపపడి ప్రభువు సువార్తను స్వీకరించేవారికి నిత్య విధులు చేయటానికి ఇప్పుడు మనకు ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయని మనకు తెలుసు. ఇవన్నీ మన పరలోక తండ్రి ప్రణాళికను మరింత ముందుకు తీసుకువెళ్తాయి. దేవుని ప్రేమ చాలా గొప్పది, ఉద్దేశపూర్వకంగా నాశనపు కుమారులుగా మారిన కొద్దిమంది తప్ప, ఆయన తన పిల్లలందరికీ మహిమ యొక్క గమ్యాన్ని సమకూర్చారు.(సిద్ధాంతము మరియు నిబంధనలు 76:43 చూడుము).
రక్షకుడు తిరిగి వస్తారని మరియు దేవుని ప్రణాళిక యొక్క మర్త్య భాగాన్ని ముగించడానికి శాంతియుత పాలన యొక్క వెయ్యేండ్లు ఉంటాయని మనకు తెలుసు. ప్రతి వ్యక్తి తన పునరుత్థానాన్ని ఎల్లప్పుడూ అనుసరిస్తూ తుది తీర్పుతో నీతిమంతులు మరియు అనీతిమంతులు అనే వేర్వేరు పునరుత్థానాలు ఉంటాయని మనకు తెలుసు.
మన చర్యలు, మన హృదయపు కోరికలు, మనం ఎలాంటి వ్యక్తిగా మారామో దానిని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. ఈ తీర్పు దేవుని పిల్లలందరూ వారి విధేయత వారికి అర్హతనిచ్చిన మరియు ఎక్కడైతే వారు సౌకర్యవంతముగా ఉంటారో ఆమహిమగల రాజ్యానికి వెళ్లడానికి కారణమవుతుంది. దానికి న్యాయవ్యాది మన రక్షకుడైన, యేసు క్రీస్తు (యోహాను 5:22; 2 నీఫై 9:41 చూడుము). ఆయన సర్వజ్ఞానం మన పశ్చాత్తాపం లేని లేదా మారని మరియు పశ్చాత్తాపముగల లేదా నీతిమంతులైన మన చర్యలు మరియు కోరికలన్నింటి యొక్క పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అందువల్ల, ఆయన తీర్పు తరువాత మనమందరం “ఆయన తీర్పులు న్యాయమైనవని” అంగీకరిస్తాము. (మోషైయ 16:1).
ముగింపులో, పేరు తొలగించిన లేదా భ్రష్టత్వము చెందిన తరువాత సంఘానికి తిరిగి రావాలని చాలా లేఖలు మరియు అనేక అభ్యర్థనలను సమీక్షించడం ద్వారా నాకు కలిగిన దృఢవిశ్వాసం గురించి నేను పంచుకుంటాను. రక్షణకు సంబంధించిన ఈ ప్రణాళికను మన సభ్యుల్లో చాలామంది అర్థం చేసుకోలెదు, ఇది పునఃస్థాపించబడిన సంఘము యొక్క సిద్ధాంతం మరియు ప్రేరేపిత విధానాల గురించి చాలా ప్రశ్నలకు సమాధానమిస్తుంది. దేవుని ప్రణాళికను తెలుసుకున్న మరియు దానిలో పాల్గొనడానికి నిబంధన చేసిన మనకు, ఈ సత్యాలను బోధించడానికి మరియు మర్త్యత్వములో మన స్వంత పరిస్థితులలో మరియు ఇతరుల కోసం వాటి గురించి అవగాహనను మరింతగా పెంచడానికి మనము చేయగలిగినదంతా చేసే స్పష్టమైన బాధ్యత ఉంది. మన రక్షకుడైన మరియు విమోచకుడైన యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, వీటన్నిటిని సాధ్యముచేసే యేసు క్రీస్తు పేరిట, ఆమెన్.