మన హృదయపు లోతులో
మనందరం—మన హృదయాలలోనికి ఆయన సువార్తను లోతుగా పొందటానికి—మనకు సహాయపడటానికి ప్రభువు ప్రయత్నిస్తున్నాడు.
సహోదర, సహోదరిలారా, మనము ఎంత అద్భుతమైన సమయంలో జీవిస్తున్నాము. పునఃస్థాపన యొక్క ప్రారంభమును మనము జరుపుకుంటున్నప్పుడు, మనము సాక్ష్యమిస్తున్న, కొనసాగుతున్న పునఃస్థాపనను జరుపుకొనుట కూడ యుక్తమైనది. ఈ సమయంలో జీవిస్తున్నందుకు నేను మీతోపాటు ఆనందిస్తున్నాను.1 ఆయనను స్వీకరించుటకు సిద్ధపడుటకు మనకు సహాయపడుటకు అవసరమైన సమస్తమును, ఆయన ప్రవక్తల ద్వారా, స్థానములో ఉంచుట ప్రభువు కొనసాగించారు.2
అవసరమైన విషయాలలో ఒకటి క్రొత్తదైన పిల్లల మరియు యువత ప్రారంభం. లక్ష్యములను ఏర్పరచుట, చేర్చబడుటకు క్రొత్త చిహ్నములు, మరియు యౌవనుల బలము కొరకు సమావేశాలపై ఈ కార్యక్రమము యొక్క ఉద్ఘాటనతో మీలో అనేకులు పరిచయం కలిగియున్నారు. కానీ అవి కార్యక్రమము నిర్మించబడిన సూత్రములు మరియు వాటి ఉద్దేశమును చూచుటకు లేక గుర్తించుటకు మన సామర్ధ్యమును అస్పష్టంగా చేయనివ్వకూడదు: యేసు క్రీస్తు యొక్క సువార్త మన పిల్లలు మరియు యువత యొక్క హృదయాలలో లోతైన భావనలు, ఆలోచనలు స్థాపించుటకు సహాయపడుట.3
ఈ సూత్రములను ఎక్కువ స్పష్టంగా చూసినప్పుడు, దీనిని 8 నుండి 18 సంవత్సరాల సభ్యులకు ఒక కార్యక్రమముగా కంటే ఎక్కువగా గుర్తిస్తాము. మన హృదయాలలోనికి ఆయన సువార్తను లోతుగా పొందటానికి—మనందరికి—సహాయపడటానికి ప్రభువు ఎలా ప్రయత్నిస్తున్నాడో మనము చూస్తాము. మనము కలిసి నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుందని నేను ప్రార్ధిస్తున్నాను.
అనుబంధాలు—“వారితో ఉండుము”4
మొదటి సూత్రము అనుబంధాలు. వారు యేసు క్రీస్తు సంఘములో సహజమైన భాగము కనుక, క్రీస్తు వద్దకు మన నిరంతర ప్రయాణంలో అనుబంధాల ప్రాముఖ్యతను మనము కొన్నిసార్లు మరచిపోతాము. నిబంధనలు చేసి, పాటించు ప్రక్రియలో మనము ఒంటరిగా నడచుటకు లేక కనుగొనబడుటకు ఆశించబడలేదు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరియు నిబంధన బాటలో కూడ నడుస్తున్న నాయకుల ప్రేమ మరియు సహకారము మనకవసరం.
ఈవిధమైన అనుబంధాలకు సమయం అవసరం. కలిసి ఉండాల్సిన సమయం. నవ్వటానికి, ఆడుకోవటానికి, నేర్చుకోవడానికి, మరియు కలిసి సేవ చేయుటకు సమయం. ఒకరినొకరి ఆసక్తులు మరియు సవాళ్లను అభినందించుటకు సమయం. మనము ఉత్తమంగా ఉండటానికి కలిసి ప్రయాసపడినప్పుడు ఒకరినొకరితో నిష్కపటంగా, నిజాయితీగా ఉండుటకు సమయం. ఈ అనుబంధాలు కుటుంబాలుగా, కోరములుగా, తరగతులుగా, మరియు సమూహములుగా సమావేశామయ్యే ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి. అవి ప్రభావవంతమైన పరిచర్య కోసం పునాది.5
ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ ఇలా చెప్పినప్పుడు, ఈ అనుబంధాలను వృద్ధి చేయుటకు కీలకమైనది మనకిచ్చారు: “ఇతరులకు ప్రభావవంతంగా సేవ చేయుటకు మనము వారిని … పరలోక తండ్రి యొక్క కన్నుల ద్వారా చూడాలి. అప్పుడు మాత్రమే మనము ఆత్మ యొక్క నిజమైన విలువను అర్ధం చేసుకోవడం ప్రారంభించగలము. అప్పుడు మాత్రమే పరలోక తండ్రి తన పిల్లలందరి కోసం కలిగియున్న ప్రేమను మనము గ్రహించగలుగుతాము. 6
దేవుడు చూసినట్లుగా ఇతరులను చూచుట ఒక వరము. ఈ వరమును వెదకమని మనందరిని నేను ఆహ్వానిస్తున్నాను. చూచుటకు మన కన్నులు తెరవబడినప్పుడు,7 దేవుడు చూసినట్లుగా ఇతరులు తమను తాము చూసుకొనుటకు సహాయపడగలుగుతాము.8 అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ దీనిని చెప్పినప్పుడు, దాని శక్తిని ఆయన వక్కాణించారు: “చాలా ముఖ్యమైనది ఏదనగా, వారు నిజముగా ఎవరు మరియు వారు నిజంగా ఏమి కాగలరో [మీ] నుండి [ఇతరులు] నేర్చుకొన్నది. నేను ఊహించేది ఏమిటంటే, ప్రసంగాలనుండి వారు ఎక్కువగా వారు నేర్చుకొనరు. వారు మీరు ఎవరు, వారు ఎవరని మీరనుకుంటున్నారు, మరియు వారు ఏమి కాగలరని మీరనుకుంటున్నారో భావనల నుండి వారు దానిని పొందుతారు.9 వారి నిజమైన గుర్తింపును మరియు ఉద్దేశమును గ్రహించడానికి ఇతరులకు సహాయపడుట మనము ఇవ్వగల మిక్కిలి గొప్ప బహుమానాలలో ఒకటి.10 దేవుడు చూసినట్లుగా ఇతరులను, మనల్ని చూచుట, మన హృదయాలను “ఐక్యత మరియు ప్రేమయందు దగ్గరగా చేర్చును.”11
ఎప్పటికప్పుడు పెరుగుతున్న లౌకిక శక్తులు మనపై ప్రభావం కలిగియుండటంతో, ప్రేమగల అనుబంధాలనుండి వచ్చు బలము మనకవసరం. కనుక మనము కార్యక్రమాలు, సమావేశాలు, మరియు ఇతర కూడికలను ప్రణాళిక చేసినప్పుడు,ఈ కూడికల ప్రధాన ఉద్దేశము, యేసు క్రీస్తు యొక్క సువార్త మన హృదయాలలో లోతుగా వెళ్ళుటకు సహాయపడుట మరియు మనల్ని ఐక్యపరచు ప్రేమగల అనుబంధాలను నిర్మించుట అని మనము జ్ఞాపకముంచుకోవాలి.12
బయల్పాటు, స్వతంత్రత, మరియు పశ్చాత్తాపము—“వారిని పరలోకముతో జతపరచును”13
అవును, కేవలం కలిసి కట్టుబడియుండుట మాత్రమే సరిపోదు. వివిధ కారణాల చుట్టూ ఐక్యతను సాధించే అనేక సమూహాలు మరియు సంస్థలున్నాయి. కానీ మనము వెదికే ఐక్యత క్రీస్తుయందు ఒకటిగా అగుట, ఆయనతో మనల్ని జతపరచుకొనుట.14 పరలోకముతో మన హృదయాలను జతపరచుటకు, ఇప్పుడే ఎల్డర్ ఆండర్సన్ వాగ్ధాటితో మాట్లాడినట్లుగా, మనకు వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలు అవసరము.15 పరిశుద్ధాత్మ వాక్యమును మరియు దేవుని ప్రేమను మన మనస్సు, హృదయములోనికి తీసుకొనిపోయినప్పుడు ఈ అనుభవాలు కలుగుతాయి.16
ఈ బయల్పాటు లేఖనాల ద్వారా, ప్రత్యేకంగా మోర్మన్ గ్రంథము; జీవిస్తున్న ప్రవక్తలు మరియు మిగిలిన విశ్వాసులైన శిష్యుల నుండి ప్రేరేపించబడిన మాటల ద్వారా; మరియు మిక్కిలి నెమ్మదియైన స్వరము ద్వారా మనకు వచ్చును.17 ఈ మాటలు ఒక పేజీపై సిరాను, మన చెవులలో అలల ధ్వని, మన మనస్సులు, హృదయాలలోని ఆలోచనలు లేక భావనలను మించినవి. దేవుని వాక్యము ఆత్మీయ శక్తిని కలిగియున్నది.18 అది సత్యమును, వెలుగును.19 ఆవిధంగా మనము ఆయనను వింటాము! వాక్యము క్రీస్తుయందు మన విశ్వాసమును ప్రారంభించును మరియు హెచ్చించును, రక్షకుని వలె ఎక్కువగా మారటానికి ఒక కోరికను మనలో ప్రేరేపించును—అంటే పశ్చాత్తాపపడుట, మరియు నిబంధన బాటలో నడుచుట.20
గత ఏప్రిల్, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బయల్పాటు ప్రయాణములో పశ్చాత్తాపము యొక్క ప్రధాన పాత్రను గ్రహించుటకు మనకు సహాయపడ్డారు.21 ఆయన అన్నారు: “పశ్చాత్తాపపడుటకు మనం ఎంచుకొన్నప్పుడు, మారుటకు మనం ఎంచుకుంటాము! రక్షకుడు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చుటకు మనం అనుమతిస్తాము. … మనము యేసు క్రీస్తు వలె ఎక్కువగా మారటానికి ఎన్నుకుంటాము!”22 దేవుని వాక్యము చేత ప్రేరేపించబడి, ఈ మార్పు యొక్క ప్రక్రియ, పరలోకముతో మనల్ని జతపరచు విధానము.
పశ్చాత్తాపపడమనిన అధ్యక్షులు నెల్సన్ యొక్క ఆహ్వానంలో అంతర్లీనమైనది స్వతంత్రత యొక్క సూత్రము. మనకై మనం మనం పశ్చాత్తాపమును తప్పక ఎంపిక చేసుకోవాలి. సువార్త మన హృదయాలలోనికి నెట్టడం సాధ్యం కాదు. ఎల్డర్ రెన్‌లండ్ ఇలా చెప్పారు, “తల్లిదండ్రులుగా మన పరలోక తండ్రి యొక్క లక్ష్యము, ఆయన పిల్లలు సరైనది చేయునట్లు చేయుట కాదు; అది ఆయన పిల్లలు సరైనది చేయుటకు ఎంపిక చేయునట్లు” చేయుట.23
పిల్లలు మరియు యువత ద్వారా భర్తీ చేయబడిన కార్యక్రమంలో, వివిధ గుర్తింపులను పొందుటకు బదులుగా పూర్తి చేయుటకు 500 పైగా వేర్వేరు అర్హతలున్నాయి.24 ఈరోజు, తప్పనిసరిగా ఒక అవసరమున్నది. అది రక్షకుని వలె ఎక్కువగా మారటానికి ఎంపిక చేయమనే ఒక ఆహ్వానమును కలిగియున్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యమును పొందుట మరియు క్రీస్తు మనలను శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చుటకు అనుమతించుట ద్వారా దీనిని మనం చేస్తాము.
ఇది లక్ష్యమును ఏర్పరచుట లేక స్వీయ అభివృద్ధి కంటె చాలా ఎక్కువ. లక్ష్యములు కేవలము ఒక సాధనము అది బయల్పాటు, స్వతంత్రత, మరియు పశ్చాత్తాపము ద్వారా పరలోకముతో జతపరచబడుటకు—క్రీస్తునొద్దకు వచ్చుటకు, ఆయన సువార్తను మన హృదయాలలో లోతుగా తీసుకొనుటకు మనకు సహాయపడును.
ఒడంబడిక మరియు త్యాగము—“వారిని నడిపించనియ్యుము”25
చివరిగా, యేసు క్రీస్తు యొక్క సువార్త మన హృదయాలలో లోతుగా పొందటానికి, మనము దానిలో ఒడంబడిక చేసుకొనుట—మన సమయాన్ని, ప్రతిభలను దానికి ఇచ్చుట, దానికోసం త్యాగము చేయుట అవసరము.26 మనమందరం అర్ధవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాము, మరియు ఇది యువతరం విషయంలో ప్రత్యేకంగా వర్తిస్తుంది. వారు ఒక హేతువులో భాగముగా ఉండాలని కోరతారు.
యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రపంచంలో మిక్కిలి గొప్ప హేతువు. అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ ఇలా చెప్పారు: “ఈ సువార్తను సమస్త లోకమునకు తీసుకొని వెళ్లాలని మనము దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాము. నేడు ఈ హేతువందు మనము తప్పనిసరిగా ఏకమవ్వాలి. సువార్త మాత్రమే లోకమును దాని స్వంత స్వీయ -విధ్వాంసము నుండి రక్షించును. సువార్త మాత్రమే అన్ని జాతులు, జాతీయత యొక్క పురుషులు [మరియు స్త్రీలను] శాంతియందు ఏకము చేస్తుంది. సువార్త మాత్రమే మానవ కుటుంబానికి సంతోషము, ఆనందమును, మరియు రక్షణను తెచ్చును.”27
ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ వాగ్దానమిచ్చారు, “యువతను మనము ఆహ్వానించి, ఆచరించుటకు అనుమతించుట ద్వారా వారికి అధికారము ఇచ్చినప్పుడు, అద్భుతమైన విధానాలలో సంఘము ముందుకు సాగుతుంది.”28 చాలా తరచుగా మనము యువతను క్రీస్తు యొక్క ఈ గొప్ప హేతువు కొరకు త్యాగము చేయటానికి ఆహ్వానించలేదు మరియు అనుమతించలేదు. ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ గమనించారు, “[మన] యువత [దేవుని యొక్క కార్యము చేత], తక్కువగా ప్రభావితం చేయబడితే, బహుశా వారు లోకము చేత ఎక్కువగా క్షీణింపజేయబడతారు.”29
పిల్లలు మరియు యువత కార్యక్రమము యువతను శక్తివంతం చేయడంపై కేంద్రీకరిస్తుంది. వారు తమ స్వంత లక్ష్యాలను ఎన్నుకుంటారు. కోరము మరియు తరగతి అధ్యక్షత్వములు వాటి సరైన పాత్రలో ఉంచబడతాయి. వార్డు యువత సలహాసభ, వార్డు సలహా సభ వలె, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యముపై కేంద్రీకరిస్తాయి.30 కోరములు మరియు తరగతులు దేవుడు వారికి ఇచ్చిన కార్యమును ఎలా చేయాలో సలహా ఇచ్చుట ద్వారా వాటి సమావేశాలను ప్రారంభిస్తారు.31
సంఘ యువతతో అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు: “మీరు ఎంపిక చేస్తే, మీరు కోరిన యెడల, … మీరు ఏదైన పెద్దది, ఏదైన మహాగొప్పది, ఏదైనా అద్భుతమైన దానిలో పెద్ద భాగముగా ఉండగలరు! … ఈ లోకమునకు ప్రభువు ఎప్పటికీ పంపిన శ్రేష్టమైన వారిమధ్య మీరున్నారు. మీరు తెలివిగా, జ్ఞానం కలిగియుండే సామర్ధ్యమును కలిగియున్నారు, మరియు లోకముపై ముందు తరము కంటె ఎక్కువ ప్రభావాన్ని కలిగియున్నారు!”32 మరొక సందర్భంలో అధ్యక్షులు నెల్సన్ యువతకు ఇలా చెప్పారు: “మీ యందు నాకు పూర్తి విశ్వాసమున్నది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మరియు ప్రభువు ప్రేమిస్తున్నారు. మనము ఆయన పిల్లలము, ఆయన పరిశుద్ధ కార్యములో కలిసి ఒడంబడిక చేసుకున్నాము.”33 యువ జనులారా, అధ్యక్షులు నెల్సన్ మీయందు కలిగియున్న నమ్మకాన్ని మరియు ఈ కార్యమునకు మీరు ఎంత ముఖ్యమైన వారో మీరు భావించగలరా?
తల్లిదండ్రులు మరియు పెద్ద నాయకులారా, అధ్యక్షులు నెల్సన్ యువతను చూసినట్లుగా చూడమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ ప్రేమను, నమ్మకాన్ని యువత అనుభూతి చెందినప్పుడు, ఎలా నడిపించాలో మీరు వారిని ప్రోత్సహించి, బోధించినప్పుడు—తరువాత వారి మార్గములో నుండి తప్పుకొన్నప్పుడు—వారి అంతర్‌జ్ఞానములు, సామర్ధ్యములు, మరియు సువార్తకు ఒడంబడికతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు.34 క్రీస్తు యొక్క హేతువు కొరకు ఒడంబడిక చేసుకొనుటలో మరియు త్యాగము చేయుటకు ఎంపిక చేయటంలో ఆనందమును వారు అనుభవిస్తారు. ఆయన సువార్త వారి హృదయాలలోనికి లోతుగా వెళ్లును, మరియు కార్యము అద్భుతమైన విధానాలలో ముందుకు సాగుతుంది.
వాగ్దానము మరియు సాక్ష్యము
అనుబంధాలు, బయల్పాటు, స్వతంత్రత, పశ్చాత్తాపము, మరియు త్యాగము—ఈ సూత్రములపై మనము కేంద్రీకరించినప్పుడు—యేసు క్రీస్తు యొక్క సువార్త మన హృదయాలలోనికి లోతుగా చొచ్చుకొనిపోవునని నేను వాగ్దానము చేస్తున్నాను. పునఃస్థాపన దాని అంతిమ ఉద్దేశమునకు ముందుకుసాగుట, ఇశ్రాయేలు యొక్క విమోచన మరియు సీయోను యొక్క స్థాపనను మనము చూస్తాము, అక్కడ రాజులకు రాజుగా క్రీస్తు పరిపాలిస్తాడు.
ఆ దినము కొరకు తన జనులను సిద్ధపరచుటకు అవసరమైన అన్ని విషయాలను చేయుట దేవుడు కొనసాగిస్తాడని నేను సాక్ష్యమిస్తున్నాను. “క్రీస్తు నొద్దకు రమ్ము మరియు ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము,”36 ఇలా చేయుటకు మనమందరం ప్రయాసపడినప్పుడు ఈ మహిమకరమైన కార్యములో ఆయన చేతి హస్తమును మనము చూచెదముగాక. యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.