సర్వసభ్య సమావేశము
శ్రేష్టమైన గృహాలు
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


11:14

శ్రేష్టమైన గృహాలు

రక్షకుడు పరిపూర్ణుడైన ఇంజనీరు, బిల్డర్, మరియు ఇంటీరియర్ డిజైనర్. మన ఆత్మల పరిపూర్ణత మరియు నిత్య సంతోషమే ఆయన ప్రాజెక్టు.

ఈమధ్య సాల్ట్‌లేక్ సిటీలో ప్రకటనలను ప్రదర్శించే బహిరంగ బోర్డు నన్ను ఆకట్టుకున్నది. అది గృహోపకరణాలు మరియు ఇంటీరియర్ డిజైన్ సంస్థను ప్రచారం చేసింది. అది ఇలా పేర్కోన్నది, “సాల్ట్‌లేక్ సిటీలోని శ్రేష్టమైన గృహాలకు సేవలు అందిస్తోంది.”

ఆ సందేశము ఆకర్షణీయమైనది—“శ్రేష్టమైన గృహమేది”? ఆ ప్రశ్న గురించి ప్రత్యేకంగా నా భార్య, కాథీ నేను పెంచిన పిల్లలు మరియు వారు పెంచుతున్న పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నాను. ప్రతీచోట తల్లిదండ్రులు చేసినట్లుగా, మన కుటుంబము గురించి మనము చింతిస్తాము మరియు ప్రార్ధిస్తాము. మనమింకా అలా చేస్తాము. మనము వారి కోసం చాలా శ్రేష్టమైన దానిని చిత్తశుద్ధిగా కోరతాము. వారు, వారి పిల్లలు శ్రేష్టమైన గృహాలలో ఎలా జీవిస్తారు? కాథీ, నేను దర్శించుటకు విశేషావకాశము కలిగిన సంఘ సభ్యుల గృహాలను గూర్చి నేను లోతుగా ఆలోచించాను. కొరియా, కెన్యాలో, ఫిలిప్పైన్స్, పెరూలో, లావూస్ మరియు లట్వియాలోని గృహాలకు మేము ఆహ్వానించబడ్డాము. శ్రేష్టమైన గృహాలను గూర్చి నాలుగు గమనికలను నేను మీతో పంచుకుంటాను.

మొదట, ప్రభువు యొక్క దృష్టికోణం నుండి, శ్రేష్టమైన గృహాలను స్థాపించుట అక్కడ నివసించే వ్యక్తుల వ్యక్తిగత లక్షణాలతో పూర్తిగా సంబంధించియున్నది. ఈ గృహాలు వాటి గృహోపకరణాలు లేదా వాటిని కలిగియున్న నికర విలువ ద్వారా లేదా వాటిని కలిగియున్న సామాజిక స్థితి ద్వారా ఏ ముఖ్యమైన లేదా శాశ్వతమైన విధానములో శ్రేష్టముగా చేయబడలేదు. ఏ గృహము యొక్క శ్రేష్టమైన లక్షణమేదనగా, క్రీస్తు యొక్క బోధనలు గృహములో నివాసించే వారి ప్రవర్తనలలో గమనించబడును. వారు నివసించే భౌతిక నిర్మాణం యొక్క ఇంటీరియర్ డిజైన్ లేదా భౌతిక అలంకరణల కంటే కుటుంబ సభ్యుల లక్షణాలు మరియు ప్రవర్తనలు ముఖ్యమైనవి.

క్రీస్తు యొక్క లక్షణాలు “కాల ప్రక్రియలో”1 నిబంధన బాట వెంబడి ఉద్దేశ్యపూర్వకంగా వృద్ధి చెందుట ద్వారా సంపాదించబడతాయి. మంచితనముతో జీవించడానికి ప్రయాసపడే వారి జీవితాలను క్రీస్తు లక్షణాలు అలంకరిస్తాయి. నేల మట్టిది లేక చలువరాయి అయినప్పటికినీ, అవి గృహాలను సువార్త వెలుగుతో నింపుతాయి. “ఈ విషయాలను వెదకండి””2 అన్న ఆజ్ఞను పాటించువారు మీ ఇంటిలో మీరు ఒక్కరే అయినప్పటికినీ, మీ కుటుంబ గృహములో ఆత్మీయ లక్షణాలతో మీరు సహాయపడగలరు.

మన జీవితాలను నిర్వహించుకొని, సిద్ధపరచుకొని, మరియు మన భవనాలు లేక స్థలాలు కాకుండా మన ఆత్మీయ జీవితాలను స్థాపించుట ద్వారా “[మనల్ని మనం] నిర్వహించుకొని; అవసరమైన ప్రతీ విషయమును సిద్ధపరచి; గృహమును స్థాపించుటకు” ప్రభువు యొక్క సలహాను మనము అనుసరిస్తాము. రక్షకుని యొక్క నిబంధన బాటను మనము ఓపికగా వెదికినప్పుడు, మన గృహము “మహిమ యొక్క ఒక గృహము, క్రమముగల గృహము, [మరియు] దేవుని యొక్క గృహము”3 అవుతుంది.

రెండవది, శ్రేష్టమైన గృహాలలోని నివాసులు, ప్రతీరోజు లేఖనాలను మరియు జీవిస్తున్న ప్రవక్తల మాటలను అధ్యయనం చేయటానికి సమయాన్ని తీసుకుంటారు. సువార్త అధ్యయనం ద్వారా మన గృహాలను “మార్చుకొనుటకు” “పునర్నిర్మించుటకు” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మనల్ని ఆహ్వానించారు.4 శ్రేష్టమైన గృహాలు, సున్నితమైన, వ్యక్తిగత వృద్ధి యొక్క ముఖ్యమైన కార్యమును మరియు మన బలహీనతలను మార్చుకొనుటకు స్థలమిస్తాయని ఆయన ఆహ్వానము గుర్తించును. ప్రతీరోజు పశ్చాత్తాపపడుట స్వభావాన్ని మార్చే సాధనము, అది మనము కాస్త దయ కలిగి, మరింత ప్రేమగా, మరింత అవగాహన పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. లేఖనాలను అధ్యయనం చేయుట రక్షకునికి మనల్ని దగ్గరగా తెచ్చును, ఆయన ఉదారమైన ప్రేమ మరియు దయ మన ఎదుగుదలకు సహాయపడతాయి.

బైబిలు, మోర్మన్ గ్రంథము మరియు అమూల్యమైన ముత్యము కుటుంబాల వృత్తాంతాలను చెప్తాయి, కనుక ఆ దైవిక గ్రంధాలు శ్రేష్టమైన గృహాలను నిర్మించుటకు సాటిలేని చేతి పుస్తకాలు అనుటలో ఆశ్చర్యం లేదు. అవి తల్లిదండ్రుల చింతలు, శోధన యొక్క అపాయాలు, నీతి యొక్క విజయము, కరవు యొక్క శ్రమలు మరియు సమృద్ధి, యుద్ధము యొక్క భయానకాలు మరియు శాంతి యొక్క వరములను గూర్చి వృత్తాంతమును చెప్తాయి. నీతిగా జీవించుట ద్వారా కుటుంబాలు ఎలా విజయాన్ని సాధిస్తాయి మరియు అవినీతి విషయాలను వెదకుట ద్వారా అవి ఎలా విఫలమవుతాయో లేఖనాలు మరలా, మరలా మనకు చూపిస్తాయి.

మూడవది, శ్రేష్టమైన గృహాలు ప్రభువు తన శ్రేష్టమైన గృహమైన, దేవాలయము చేత సృష్టించబడిన భవన రూపకల్పనను అనుసరిస్తాయి. ఒక దేవాలయమును నిర్మించుట ప్రధాన దశలతో ప్రారంభమవుతాయి—స్థలంలో ఉన్న పొదలను, రాళ్లను, ఆటంకాలను తొలగించుట మరియు ఎత్తు పల్లాలు లేకుండా చేయుట. నేలను సిద్ధపరచడానికి ఆ ప్రారంభపు ప్రయత్నాలు ముఖ్యమైన ఆజ్ఞలను పాటించుటతో పోల్చబడవచ్చు. ఆజ్ఞలు, శిష్యత్యము నిర్మించబడిన పునాది. ఒక దేవాలయము కోసం ఉక్కు చట్రం వలె, స్థిరమైన శిష్యత్వం మనల్ని స్థిరంగా, దృఢంగా, కదలకుండా, మారటానికి నడిపించును.5 ఈ స్థిరమైన ఉక్కు చట్రము మన హృదయాలను మార్చుటకు ప్రభువు తన ఆత్మను పంపుటకు వీలు కల్పిస్తుంది.6 హృదయములో ఒక బలమైన మార్పును అనుభవించుట, దేవాలయ అంతర్గతమునకు అందమైన రూపములను చేర్చుట వలె ఉన్నది.

మనము విశ్వాసమందు కొనసాగించినప్పుడు, ప్రభువు మనల్ని క్రమంగా మార్చును. మన ముఖములో ఆయన స్వరూపమును మనము పొందుతాము మరియు ఆయన స్వభావం యొక్క ప్రేమ, అందమును తిరిగి ఇస్తాము.7 మనము ఆయన వలె ఎక్కువగా మారినప్పుడు, ఆయన గృహములో మనము స్వంత ఇంటిలా భావిస్తాము, మరియు మన ఇంటిలో ఆయన స్వంతంగా భావిస్తారు.

పరిస్థితులు అనుమతించినంత తరచుగా ఒక దేవాలయ సిఫారసు కొరకు అర్హులుగా ఉండి, ఉపయోగించుట ద్వారా ఆయన ఇంటికి మన ఇంటికి సన్నిహిత సంబంధాన్ని కలిగియుండవచ్చు. మనము ఆవిధంగా చేసినప్పుడు, ప్రభువు మందిరము యొక్క పరిశుద్ధత అదేవిధంగా మన గృహంపై నిలుచును.

అద్భుతమైన సాల్ట్‌లేక్ దేవాలయము దగ్గరలో నిలిచియున్నది. మూలాధార సాధనాలు, స్థానిక సామాగ్రి, అంతులేని కృషితో అగ్రగాముల చేత నిర్మించబడిన ఈ దేవాలయాన్ని 1853 నుండి 1893 వరకు నిర్మించారు. ప్రాచీన సంఘ సభ్యులు ఇంజనీరింగ్, అర్కిటెక్చర్, మరియు ఇంటీరియర్ డిజైన్ లో ఇవ్వగల శ్రేష్టమైనవి మిల్లియన్ల చేత గుర్తించబడిన ఒక కళాఖండాన్ని సృష్టించాయి.

ఆ దేవాలయము సమర్పించినప్పటి నుండి దాదాపు 130 సంవత్సరాలు గడిచాయి. నిన్న ఎల్డర్ గారీ ఈ. స్టీవెన్ గమనించినట్లుగా, దేవాలయమును రూపొందించడానికి ఉపయోగించిన ఇంజనీరింగ్ సూత్రములు క్రొత్తవి, సురక్షితమైన ప్రమాణముల చేత తిరిగి ఉంచబడినవి. దేవాలయ ఇంజనీరింగ్‌ను మెరుగుపరచుటకు మరియు నిర్మాణ బలహీనతలను సరి చేయడంలో విఫలమైతే, వారు చేయగలిన సమస్తము చేసి దేవాలయ సంరక్షణను తరువాత తరాలకు వదిలి పెట్టిన అగ్రగాముల విశ్వాసానికి ద్రోహం చేస్తుంది.

దేవాలయము యొక్క నిర్మాణ మరియు భూకంప ప్రభావ బలమును మెరుగుపరచడానికి నాలుగు-సంవత్సరాల పునరుద్ధరణ ప్రాజెక్టును సంఘము ప్రారంభించింది.8 పునాది, నేలలు, మరియు గోడలు బలపడతాయి. ఈ రోజు అందుబాటులో ఉన్న ఉత్తమ ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఆలయాన్ని ఆధునిక ప్రమాణాలకు తీసుకు వస్తుంది. మనము నిర్మాణ మార్పులు చూడలేము, కానీ వాటి ప్రభావాలు వాస్తవము మరియు ముఖ్యమైనవి. ఈ పని అంతటిలో, దేవాలయము యొక్క అందమైన అంతర్గత రూపకల్పన లక్షణాలు భద్రపరచబడతాయి.

సాల్ట్‌లేక్ దేవాలయ ఆధునీకికరణ చేత మనకివ్వబడిన మాదిరిని మనం అనుసరించాలి మరియు మన స్వంత ఆత్మీయ భూకంప ఇంజనీరింగ్ ఆధునికంగా ఉందని నిర్ధారించుకోవడానికి సమయాన్ని తీసుకోవాలి. నియమిత కాలములో స్వపరీక్ష, “ఇంకా నేనేమి కొదువుగా ఉన్నాను?”9 అని ప్రభువును అడుగుట ద్వారా జతపరచబడి శ్రేష్టమైన గృహమును నిర్మించుటకు మనలో ప్రతిఒక్కరికి సహాయపడగలదు.

నాలగవది, శ్రేష్టమైన గృహాలు జీవితపు తుఫానుల నుండి ఆశ్రయములు. దేవుని ఆజ్ఞలను పాటించు వారు, “భూమిలో వర్ధిల్లుదురు,”10 ప్రభువు వాగ్ధానమిచ్చారు. దేవుని యొక్క సమృద్ధి జీవితపు సమస్యలు లక్ష్యపెట్టకుండా ముందుకు త్రోసుకొనిపోయే శక్తి.

2002 లో సమస్యలను గురించి ముఖ్యమైన పాఠము నేను నేర్చుకున్నాను. అసున్సియోన్, పరాగ్వేలో ఉండగా, పట్టణ స్టేకు అధ్యక్షులను నేను కలిసాను. ఆ సమయమందు, పరాగ్వే ఒక భయంకరమైన ఆర్ధిక సమస్య ఎదుర్కొన్నది, మరియు అనేకమంది సంఘ సభ్యులు బాధపడ్డారు, అవసరాలు తీర్చుకోవడానికి తగిన డబ్బు సంపాదించలేకపోయారు. నా మిషను నుండి ఇప్పటి వరకు దక్షిణ అమెరికా వెళ్లలేదు మరియు పరాగ్వే ఎప్పుడూ వెళ్లలేదు. కేవలము కొన్ని వారాలుగా నేను ప్రాంతీయ డెబ్బదిలో సేవ చేస్తున్నాను. ఆ స్టేకు అధ్యక్షులకు నడిపింపు ఇచ్చుటలో నా అసమర్ధత గురించి ఆందోళన చెంది, వారి స్టేకులతో జరుగుతున్న దానిని మాత్రమే నాకు చెప్పమని నేను అడిగాను. మొదటి స్టేకు అధ్యక్షుడు అంతా సవ్యంగా ఉందని నాతో చెప్పాడు. తరువాత స్టేకు అధ్యక్షుడు చెప్పబడిన విషయాలు సవ్యంగా ఉన్నాయి మరియు కొన్ని సమస్యలున్నాయి. మేము చివరి స్టేకు అధ్యక్షుని దగ్గరకు వచ్చేసరికి, అతడు చిరాకు కలిగించే సవాళ్ల క్రమములను మాత్రమే తెలిపాడు. స్టేకు అధ్యక్షులు పరిస్థితి యొక్క పరిమాణమును వివరించినప్పుడు, ఏమి చెప్పాలో, నేను ఎక్కువగా ఆందోళన చెందాను, దాదాపు నిరాశ పడ్డాను.

చివరి స్టేకు అధ్యక్షుడు తన వాఖ్యానాలను పూర్తి చేస్తుండగా, ఒక ఆలోచన నా మనస్సులోనికి వచ్చింది: “ఎల్డర్ క్లేటన్ వారిని ఈ ప్రశ్నను అడుగుము: ‘అధ్యక్షులారా, పూర్తి దశమభాగము చెల్లించు వారు, ఉదారమైన ఉపవాస అర్పణను చెల్లించువారు, సంఘములో వారి పిలుపులను నెరవేర్చువారు, ప్రతీ నెల, గృహబోధకులు లేక దర్శించు బోధకులుగా11 వారి కుటుంబాలను వాస్తవంగా దర్శించేవారు, కుటుంబ గృహ సాయంకాలమును జరిపేవారు, లేఖనాలను అధ్యయనము చేసేవారు, మరియు ప్రతీరోజు కుటుంబ ప్రార్ధన జరిపేవారు, సంఘము ముందుకు వచ్చి, వారి కోసం వారి సమస్యలను పరిష్కరించకుండా వారు స్వయంగా తీర్చుకోలేని సమస్యలు ఎంతమంది కలిగియున్నారు?’”

నేను పొందిన ప్రేరేపణను అనుసరించి, స్టేకు అధ్యక్షునిని ఆ ప్రశ్న నేను అడిగాను.

వారు మౌనంగా ఆశ్చర్యంతో నావైపు చూసారు, తరువాత చెప్పారు “Pues, ninguno,” అనగా, “ఎవరూ లేరు.” తరువాత ఆ విషయాలను చేసిన సభ్యులలో ఎవరికీ వారు స్వంతంగా పరిష్కరించుకోలేని సమస్యలు లేవని, వారు నాతో చెప్పారు. ఎందుకు? ఎందుకనగా వారు శ్రేష్టమైన గృహాలలో నివసించారు. వారు విశ్వసనీయమైన జీవనం వారికి బలము, దర్శనము, మరియు వారిని చుట్టుముట్టిన ఆర్ధిక సంక్షోభములో వారికి అవసరమైన పరలోక సహాయమును వారికి అందించింది.

దీని అర్ధము నీతిమంతులు అస్వస్థత చెందరు, ప్రమాదాలు కలగవు, వ్యాపారం ముందున్నంత సఫలంగా ఉండకపోవటం, లేక జీవితంలో ఇతర కష్టాలను ఎదుర్కొనరని దాని అర్ధము కాదు. మర్త్యత్వము ఎల్లప్పుడు సవాళ్లను తెస్తుంది, కాని సమయం తరువాత సమయం ఆజ్ఞలు పాటించుటకు ప్రయాసపడేవారు శాంతి మరియు నిరీక్షణతో ముందుకుసాగటానికి మార్గమును కనుగొనటానికి దీవించబడ్డారు. ఆ దీవెనలు ప్రతిఒక్కరికి లభ్యమవుతున్నాయి.12

దావీదు ప్రకటించాడు, “యెహోవా ఇల్లు కట్టించని యెడల, దాని కట్టువారి ప్రయాసము వ్యర్ధమే.”13 మీరెక్కడ నివసిస్తున్నప్పటికినీ, మీ గృహము ఎలా కనిపిస్తున్నప్పటికినీ, మీ కుటుంబము యొక్క కూర్పు ఏదైనప్పటికినీ, మీ కుటుంబము కోసం మీరు శ్రేష్టమైన గృహాన్ని నిర్మించడానికి సహాయపడగలరు. పునఃస్థాపించబడిన సువార్త ఆ గృహము కోసం ప్రణాళికలను సమకూర్చును. రక్షకుడు పరిపూర్ణుడైన ఇంజనీరు, బిల్డర్, మరియు ఇంటీరియర్ డిజైనర్. మన ఆత్మల యొక్క పరిపూర్ణత మరియు నిత్య సంతోషమే ఆయన ప్రాజెక్టు. ఆయన ప్రేమగల సహాయముతో, మీ ఆత్మ ఆయన కోరుకున్నట్లుగా కావచ్చు, మీరు మీ యొక్క శ్రేష్టమైన నివేదికగా ఉండవచ్చు, మరియు ఒక శ్రేష్టమైన గృహములో నివసించవచ్చు.

మనందరి యొక్క తండ్రియైన దేవుడు జీవిస్తున్నాడని నేను కృతజ్ఞతతో సాక్ష్యమిస్తున్నాను. ఆయన కుమారుడు, ప్రభువైన యేసు క్రీస్తు, సమస్త మానవాళి యొక్క రక్షకుడు మరియు విమోచకుడు. వారు మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క కడవరి పరిశుద్ధుల సంఘము భూమి మీద ప్రభువు యొక్క రాజ్యము. జీవిస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తులులు నేడు దానిని నడిపిస్తున్నారు. మోర్మన్ గ్రంధము సత్యము. పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు యొక్క సువార్త శ్రేష్టమైన గృహాలను స్థాపించుటకు పరిపూర్ణమైన నమూనా చిత్రము. యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.