సర్వసభ్య సమావేశము
ఆయన మన ముందర నడచును
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


14:52

ఆయన మన ముందర నడచును

ప్రభువు తన సంఘము మరియు సువార్త యొక్క పునఃస్థాపనను నడిపిస్తున్నారు. భవిష్యత్తును ఆయనకు బాగా తెలుసు. ఆయన మిమ్మల్ని పనికి ఆహ్వానిస్తున్నారు.

నా ప్రియమైన సహోదర, సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్దుల సంఘము యొక్క సర్వసభ్య సమావేశములో మీతో సమకూడినందుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. ప్రభువు సంఘము యొక్క పునఃస్థాపన ఈ చివరి యుగములో మనల్ని, మన ప్రియమైన వారిని దీవించిన విధానాన్ని ఆలోచించమని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇచ్చిన ఆహ్వానంలో మన అనుభవం చిరస్మరణీయమైనది మాత్రమే కాదు, మరపురానిదిగా ఉంటుందని వాగ్దానం చేశారు.

నా అనుభవం చిరస్మరణీయమైనది, మీది కూడా ఖచ్చితంగా అలానే ఉందని అనుకుంటున్నాను. అది మరపురానిదా అనేది మనలో ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంటుంది. ఇది నాకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమావేశానికి సిద్ధమైన చిరస్మరణీయ అనుభవం నన్ను నేను కొనసాగించాలనుకునే విధంగా మార్చింది. నన్ను వివిరించనివ్వండి.

నా సిద్ధపాటు నన్ను పునఃస్థాపనలో జరిగిన ఒక సంఘటన యొక్క వృత్తాంతమునకు తీసుకువెళ్ళింది. నేను దాని గురించి చాలాసార్లు చదివాను, కాని పునఃస్థాపన ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ పాల్గొన్న ఒక ముఖ్యమైన సమావేశం యొక్క నివేదికగా ఇది ఎప్పుడూ నాకు అనిపించింది. కాని ఈ సారి ఆ వృత్తాంతములో ప్రభువు మనలను, ఆయన శిష్యులను తన సంఘములో ఎలా నడిపిస్తున్నారో నేను చూశాను. లోక రక్షకుడైన, సృష్టికర్త-భూత, వర్తమాన, మరియు భవిష్యత్తు గురించి అన్ని విషయాలు తెలిసిన ఆయనచేత మర్త్యులమైన మనం నడిపించబడటం అంటే ఏమిటో నేను చూశాను. అతను దశల వారీగా మనకు బోధిస్తారు మరియు మనకు మార్గనిర్దేశం చేస్తారు, ఎప్పుడూ బలవంతం చేయరు.

నేను వివరించే సమావేశం పునఃస్థాపనలో కీలకమైన క్షణం. ఇది ఒహైలో కర్ట్లాం దేవాలయము ప్రతిష్ఠించబడిన ఏడు రోజుల తరువాత, 1836 ఏప్రిల్ 3 న దానిలో జరిగిన సబ్బాతు దిన సమావేశం. ప్రపంచ చరిత్రలో ఈ గొప్ప క్షణాన్ని జోసెఫ్ స్మిత్ సరళంగా వివరించెను. ఆయన వృత్తాంతములో ఎక్కువ భాగం సిద్ధాంతం మరియు నిబంధనలు 110వ ప్రకరణలో నమోదు చేయబడింది:

“మధ్యాహ్న సమయమందు, సంఘమునకు పన్నెండుమంది నుండి పొందిన ప్రభురాత్రి భోజనమును పంచిపెట్టుటలో నేను ఇతర అధ్యక్షులకు సహాయపడితిని, , ఈ దినమున పరిశుద్ధ బల్ల యొద్ద బాధ్యత వహించుటకు వారికి విశేషాధికారము ఇవ్వబడినది. నా సహోదరులకు ఈ కార్యక్రమమును నిర్వహించిన తరువాత, తెరలు వేయబడుచున్నప్పుడు, నేను పీఠము యొద్దకు వెళ్లి, ఆలీవర్ కౌడరీతో కలిసి హృదయపూర్వక మౌనప్రార్థనలో తలవంచితిని. ప్రార్థన నుండి లేచిన తరువాత, ఈ దర్శనము మా ఇరువురికి తెరువబడెను.”1

“మా మనస్సుల నుండి తెర తీసివేయబడెను మా మనోనేత్రములు తెరువబడెను.

“మా యెదుట పీఠపు పతకముపైన ప్రభువు నిలువబడగా మేము చూచితిమి; ఆయన పాదముల క్రింది బాట లేత పసుపురంగులో మేలిమి బంగారముతో కప్పబడియుండెను.

“ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెను; ఆయన తలవెంట్రుకలు తెల్లగా శుద్ధమైన హిమమువలే ఉండెను; ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలే ఉండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే, యెహోవా కంఠస్వరమువలే నుండి, ఈలాగు చెప్పుచుండెను:

“ఆదియు అంతమును నేనే; జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే; తండ్రితో మీ న్యాయవాదిగా ఉన్నాను.

“ఇదిగో, మీ పాపములు క్షమించబడియున్నవి; మీరు నా యెదుట పరిశుద్ధముగా నున్నారు; కాబట్టి, మీ తలలెత్తుకొని సంతోషించుడి.

“మీ సహోదరుల హృదయాలు సంతోషింపనీయుడి, నా నామమునకు ఈ మందిరమును తమ శక్తినంతటితో నిర్మించిన నా జనులందరి హృదయాలు సంతోషింపనీయుడి.

“ఏలయనగా ఇదిగో, నేను ఈ మందిరమును అంగీకరించితిని, నా నామము ఇక్కడ ఉండును; కరుణతో ఈ మందిరములో నా జనులకు నన్ను నేను ప్రత్యక్షపరచుకొందును.

“అవును, నా జనులు నా ఆజ్ఞలు పాటించి, ఈ పరిశుద్ధ మందిరమును అపవిత్రము చేయని యెడల నేను నా సేవకులకు ప్రత్యక్షమై, నా కంఠస్వరముతో వారితో మాట్లాడెదను.

“అవును, క్రుమ్మరించబడబోవు దీవెనలకు ఈ మందిరములో నా సేవకులు దీవించబడిన దీవెనకు పర్యవసానముగా వేలు పదివేల కొలది హృదయాలు మిక్కిలి ఆనందించును.

“ఈ మందిరపు ప్రతిష్ఠ విదేశాలకు వ్యాపించును; నా జనుల శిరస్సులపై క్రుమ్మరించబడబోవు దీవెనకు ఇది ఆరంభము. అలాగే జరుగును గాక. ఆమేన్.

“ఈ దర్శనము సమాప్తమైన తరువాత, పరలోకములు మరల తెరువబడెను; మోషే మా యెదుట ప్రత్యక్షమై భూమి యొక్క నలుమూలల నుండి ఇశ్రాయేలీయులను సమకూర్చుటకు ఉత్తర దిక్కునున్న ప్రదేశమునుండి పది గోత్రములను నడిపించు తాళపుచెవులను మాకు ఇచ్చెను.

“ఇది జరిగిన తరువాత, ఏలీయా ప్రత్యక్షమై అబ్రాహాము సువార్త యొక్క యుగమును ఇచ్చి, మాయందు మా సంతానమునందు మా తరువాతి సమస్త తరములు దీవించబడునని చెప్పెను.

“ఈ దర్శనము ముగిసిన తరువాత, మరియొక గొప్ప మహిమకరమైన దర్శనము మాకు చూపబడెను; ఏలయనగా మరణమును రుచిచూడక పరలోకమునకు కొనిపోబడిన ప్రవక్తయైన ఏలియా మా యెదుట నిలబడి ఈలాగు సెలవిచ్చెను:

ఇదిగో, మలాకీ నోటిద్వారా చెప్పబడిన దానికి సమయము ఆసన్నమాయెను— ప్రభువు యొక్క ఆ గొప్ప భయంకరమైన దినము వచ్చుటకు ముందు ఆతడు (ఏలీయా) పంపబడునని సాక్ష్యమిచ్చెను—

“తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పుటకు వచ్చును, లేనియెడల ఈ భూమియంతయు ఒక శాపముతో శపించబడును—

“కాబట్టి, ఈ యుగపు తాళపుచెవులు మీ చేతులకు అప్పగించబడియున్నవి; దీనివలన ప్రభువు యొక్క ఆ గొప్ప భయంకరమైన దినము దగ్గరలో, తలుపు యొద్ద సమీపములో నున్నదని మీరు తెలుసుకొందురు.” 2

నేను ఆ వృత్తాంతాన్ని చాలాసార్లు చదివాను. ఈ వృత్తాంతము నిజమని పరిశుద్ధాత్మ నాకు ధృవీకరించింది. నేను ఈ సమావేశానికి సిద్ధం కావాలని అధ్యయనం చేసి, ప్రార్థిస్తున్నప్పుడు, తన శిష్యులను ఆయన పనిలో వివరంగా నడిపించే ప్రభువు యొక్క శక్తిని నేను మరింత స్పష్టంగా చూశాను.

కర్ట్లాండ్ దేవాలయంలో ఇశ్రాయేలును సమకూర్చే తాళపుచేతులను మోషే జోసెఫ్‌కు ఇవ్వడానికి ఏడు సంవత్సరాల ముందు, “జోసెఫ్ మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ నుండి, దాని ఉద్దేశ్యం ‘ఇశ్రాయేలు వంశస్థుల యొక్క శేషమునకు… వారు ప్రభువు యొక్క నిబంధనలను ఎరిగి, వారు సర్వదా విసర్జింపబడకుండునట్లు’ చూపుటయే అని నేర్చుకున్నాడు.” కర్ట్లాండ్‌లో ఇశ్రాయేలు సమకూర్పు ప్రారంభమవుతుందని 1831 లో ప్రభువు జోసెఫ్‌కు చెప్పారు, ‘అక్కడ [కర్ట్లాండ్] నుండి, నేను ఎవరికైతే ఇచ్చయించెదనో వారు సమస్త రాజ్యముల మధ్యకు వెళ్ళవలెను, వారు ఏమి చేయవలెనో వారికది చెప్పబడును; ఏలయనగా … ఇశ్రాయేలు రక్షించబడును, నేను వారిని నడిపించెదను.”3

ఇశ్రాయేలును సమకూర్చడానికి సువార్త పరిచర్య అవసరమే అయినప్పటికీ, ప్రభువు పన్నెండు మందికి ఇలా బోధించారు, వారిలో కొంతమంది ప్రారంభ మిషనరీలు అయ్యారు, “గుర్తుంచుకోండి, మీరు మీ వరము పొందేవరకు మీరు ఇతర దేశాలకు వెళ్లకూడదు.”4

ప్రభువు యొక్క దశల వారీ ప్రణాళికలో కర్ట్లాండ్ దేవాలయం కనీసం రెండు కారణాల వల్ల ముఖ్యమైనదని తెలుస్తోంది: మొదట, ఇశ్రాయేలు సమకూర్పు యొక్క తాళపుచేతులను పునఃస్థాపించడానికి దేవాలయం పూర్తయ్యే వరకు మోషే వేచి యుండెను. రెండవది, అధ్యక్షులు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ ఇలా బోధించారు, “ప్రభువు ఒక దేవాలయాన్ని [కర్ట్లాండ్ దేవాలయాన్ని] నిర్మించమని పరిశుద్ధులకు ఆజ్ఞాపించారు, దీనిలో ఆయన అధికారం యొక్క తాళపుచేతులను బయల్పరచగలరు మరియు చివరిసారిగా తన ద్రాక్షతోటను సేద్యపరచుటకు అపొస్తలులు వరమును పొంది, సిద్ధపడగలరు.”5 ఈ రోజు మనకు తెలిసిన దేవాలయ వరము కర్ట్లాండ్ దేవాలయంలో నిర్వహించబడనప్పటికీ, ప్రవచన నెరవేర్పులో భాగంగా సిద్ధపాటు దేవాలయ విధులు అక్కడ ప్రవేశపెట్టడం మొదలయ్యాయి, వాటితో పాటు ఆత్మీయ ప్రత్యక్షత్తల కుమ్మరింపు మిషన్లకు పిలువబడిన వారిని “ఉన్నత స్థలము నుండి శక్తి”6 వరము యొక్క వాగ్దానముతో సిద్ధపరిచాయి, అది మిషనరీ సేవ ద్వారా గొప్ప సమకూర్పుకు దారితీసింది.

ఇశ్రాయేలును సమకూర్చే తాళపుచేతులు జోసెఫ్‌కు ఇవ్వబడిన తరువాత, పన్నెండు మంది సభ్యులను మిషన్లలో పంపమని ప్రభువు ప్రవక్తకు ప్రేరేపించారు. నేను అధ్యయనం చేస్తున్నప్పుడు, పన్నెండు మందికి విదేశాలలో మిషన్లు వెళ్ళడానికి ప్రభువు వివరంగా సిద్ధం చేశారని నాకు అర్థమైంది, అక్కడ ప్రజలు వాటిని విశ్వసించడానికి మరియు సహకారమందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాలక్రమేణా, వేలాది మంది, వారి ద్వారా, ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘములోకి తీసుకురాబడతారు.

మన లెక్కల ప్రకారం, పన్నెండు బ్రిటిష్ దీవులకు రెండు మిషన్ల సమయంలో 7,500 నుండి 8,000 మధ్య బాప్తీస్మము పొందినట్లు అంచనా. ఇది ఐరోపాలో సువార్త పరిచర్యకు పునాది వేసింది. ఇది ఐరోపాలో మిషనరీ కార్యమునకు పునాది వేసింది, మరియు 19 వ శతాబ్దం చివరి నాటికి 90,000 మంది అమెరికాకు చేరుకున్నారు, వీటిలో ఎక్కువ భాగం బ్రిటిష్ దీవులు మరియు స్కాండినేవియా నుండి వచ్చారు.7 ప్రభువు జోసెఫ్ మరియు నమ్మకమైన మిషనరీలను ప్రేరేపించెను, వారు తమ శక్తికి మించినట్లుగా అనిపించిన పంటను కోసే పనిని చేయుటకు వెళ్ళారు. కానీ ప్రభువు తన పరిపూర్ణ దూరదృష్టితో మరియు సిద్ధపాటుతో అది సాధ్యం చేశారు.

సిద్ధాంతం మరియు నిబంధనల యొక్క 110వ ప్రకరణము నుండి స్పష్టంగా సరళమైన మరియు దాదాపు కవితా భాషను మీరు జ్ఞాపకముంచుకొన్నారు:

“ఇదిగో, మలాకీ నోటిద్వారా చెప్పబడిన దానికి సమయము ఆసన్నమాయెను—ప్రభువు యొక్క ఆ గొప్ప భయంకరమైన దినము వచ్చుటకు ముందు ఆతడు (ఏలీయా) పంపబడునని సాక్ష్యమిచ్చెను—

“తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పుటకు వచ్చును, లేనియెడల ఈ భూమియంతయు ఒక శాపముతో శపించబడును—

“కాబట్టి, ఈ యుగపు తాళపుచెవులు మీ చేతులకు అప్పగించబడియున్నవి; దీనివలన ప్రభువు యొక్క ఆ గొప్ప భయంకరమైన దినము దగ్గరలో, తలుపు యొద్ద సమీపములో నున్నదని మీరు తెలుసుకొందురు.”8

ప్రభువు భవిష్యత్తులో చాలా దూరం చూశారు మరియు చివరి రోజుల్లో తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన మనకు ఎలా సహాయం చేస్తారో నేను సాక్ష్యమిస్తున్నాను.

నేను చాలా సంవత్సరాల క్రితం అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కులో పనిచేస్తున్నప్పుడు, మేము ఫ్యామిలీ సెర్చ్ అని పిలిచే వాటిని సృష్టించిన నమూనా మరియు అభివృద్ధి సమూహాన్ని పర్యవేక్షించుటకు నాకు బాధ్యత అప్పగించారు. నేను దానిని “దర్శకత్వం వహించాను” అని చెప్పకుండా, దాని సృష్టిని “పర్యవేక్షించాను” అని చెప్పడానికి నేను జాగ్రత్త వహిస్తాను. చాలా తెలివైన వ్యక్తులు ఇతర వృత్తిని విడిచిపెట్టి, ప్రభువు కోరుకున్నదాన్ని నిర్మించడానికి వచ్చారు.

ప్రథమ అధ్యక్షత్వము విధుల నకిలీలను తగ్గించే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక వ్యక్తి యొక్క విధులు ఇప్పటికే జరిగాయో లేదో తెలుసుకోలేకపోవడం వారి ప్రధాన ఆందోళన. సంవత్సరాలుగా—లేదా సంవత్సరాలుగా అనిపించి—ప్రథమ అధ్యక్షత్వము నన్ను అడిగింది, “మీరు ఎప్పుడు చేస్తారు?”

ప్రార్థన, శ్రద్ధ మరియు గొప్ప సామర్థ్యం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత త్యాగంతో, ఆ పని నెరవేరింది. అది అంచలంచలుగా జరిగింది. కంప్యూటర్‌లతో సౌకర్యంగా లేనివారికి ఫ్యామిలీ సెర్చ్‌ను ఉపయోగించేవారికి సులభంగా మార్చడం మొదటి పని. మరిన్ని మార్పులు వచ్చాయి, మరియు అవి వస్తూనే ఉంటాయని నాకు తెలుసు, ఎందుకంటే మేము ఒక ప్రేరేపిత సమస్యను పరిష్కరించడానికి ముందుకు వెళ్ళినప్పుడల్లా, కనీసం సమానమైన ప్రాముఖ్యమైనదే కానీ ఇంకా చూడని పురోగతి కోసం మరింత బయల్పాటు కోసం మేము సిద్ధంగా ఉంటాము. నేటికీ, ఫ్యామిలీ సెర్చ్ తన పునఃస్థాపనలో కొంత భాగానికి ప్రభువుకు అవసరమైనది అవుతోంది-కేవలం విధుల నకిలీని నివారించడం కోసం కాదు.

ప్రజలు పరిచయ భావనలను పొందటానికి, వారి పూర్వీకుల పట్ల ప్రేమను పొందడానికి మరియు వారి దేవాలయ విధులు పూర్తి చేయడానికి సహాయపడుటకు దానిని మెరుగు పరచడానికి మనల్ని ప్రభువు అనుమతిస్తారు. ఇప్పుడు, ప్రభువుకు ఖచ్చితంగా తెలుసు, యువకులు వారి తల్లిదండ్రులకు మరియు వార్డు సభ్యులకు కంప్యూటర్ సలహాదారులుగా మారుతున్నారు. ఈ సేవలో అందరూ ఎంతో ఆనందం పొందారు

ఏలియా యొక్క ఆత్మ యువకులు మరియు ముసలివారు, పిల్లలు మరియు తల్లిదండ్రులు, మనవరాళ్ళు మరియు తాతామామల హృదయాలను మారుస్తోంది. దేవాలయాలు బాప్తీస్మపు అవకాశాలను మరియు ఇతర పవిత్ర విధులను సంతోషంగా కాలపట్టీలో చేర్చబడతాయి. మన పూర్వీకులకు సేవ చేయాలనే కోరిక, తల్లిదండ్రులు మరియు పిల్లల బంధం పెరుగుతోంది.

ప్రభువు ఇవన్నీ రావడం చూశారు. ఆయన తన సంఘములో ఇతర మార్పుల విషయంలో చేసినట్లుగా, దశల వారీగా దాని కోసం ప్రణాళిక చేసారు. కష్టమైన వాటిని బాగుగా చేయుటకు ఎంచుకునే నమ్మకమైన ప్రజలను ఆయన ఎంచుకొని, సిద్ధపరిచారు. “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇక్కడ కొంచెం మరియు అక్కడ కొంచెం”9 నేర్చుకోవడంలో ఆయన ఎల్లప్పుడూ ప్రేమతో సహనంతో ఉన్నారు. ఆయన తన ఉద్దేశ్యాలను నెరవేర్చే సమయం విషయంలో స్పష్టంగా ఉన్నారు, అయినప్పటికీ త్యాగం తరచూ జరుగుతుందని లేదా మనం ఊహించని ఆశీర్వాదం తెస్తుందని ఆయన నిర్ధారిస్తారు.

ప్రభువుకు నా కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా నేను ముగిస్తున్నాను—ఆయన ఈ సమావేశానికి సిద్ధపడటానికి త్యాగం చేయమని నన్ను ఆహ్వానించమని అధ్యక్షుడలు నెల్సన్‌ను ప్రేరేపించారు. నా సిద్ధపాటు సమయంలో ప్రతి గంట మరియు ప్రతి ప్రార్థన ఒక ఆశీర్వాదం తీసుకొనివచ్చింది.

ఈ సందేశాన్ని విన్న లేదా ఈ పదాలు చదివిన వారందరినీ ప్రభువు తన సువార్త మరియు ఆయన సంఘము యొక్క పునఃస్థాపనకు నాయకత్వం వహిస్తున్నారని నమ్మమని నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన మన ముందర నడచును. భవిష్యత్తును ఆయనకు బాగా తెలుసు. ఆయన మిమ్మల్ని పనికి ఆహ్వానిస్తున్నారు. అందులో ఆయన మీతో కలుస్తారు. ఆయన మీ సేవ కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. మరియు మీరు త్యాగం చేస్తున్నప్పుడు, ఇతరులు ఆయన రాక కోసం సిద్ధంగా ఉండటానికి మీరు సహాయం చేస్తున్నప్పుడు మీరు ఆనందం పొందుతారు.

తండ్రియైన దేవుడు జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసే క్రీస్తు. ఇది ఆయన సంఘము. ఆయన మిమ్ములను యెరిగియుండి, ప్రేమిస్తున్నారు. అతను మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన మీ కొరకు మార్గమును సిద్ధపరచెను. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.