లేఖనములు
మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ


మోర్మన్‌ గ్రంథము

నీఫై పలకల నుండి సంగ్రహించబడిన
పలకలపైన
మోర్మన్‌ హస్తము
చేత వ్రాయబడిన ఒక వృత్తాంతము

అందువలన, ఇది నీఫై జనుల వృత్తాంత సంక్షేపము మరియు లేమనీయులది కూడా—ఇశ్రాయేలు వంశస్థుల శేషమైన లేమనీయులకు, యూదునికి మరియు అన్యజనునికి కూడా వ్రాయబడినది—ఆజ్ఞానుసారముగాను, ప్రవచనము మరియు బయల్పాటు ఆత్మ చేత కూడా వ్రాయబడినది—వ్రాయబడి, ముద్రవేయబడి, అది నాశనము కాకుండునట్లు ప్రభువు సంరక్షణలో దాచబడినది—దేవుని వరము మరియు శక్తిచేత దాని అనువాదము కొరకు ముందుకు వచ్చుటకు—మొరోనై హస్తము చేత ముద్రవేయబడి, యుక్త కాలమున అన్యజనుని ద్వారా ముందుకు వచ్చుటకు ప్రభువు సంరక్షణలో దాచిపెట్టబడినది—దాని అనువాదము దేవుని వరము వలన జరుగును.

ఈథర్‌ గ్రంథము నుండి కూడా ఒక సంక్షేపము తీసుకొనబడెను, అది జేరెడ్‌ జనుల యొక్క వృత్తాంతము, వారు పరలోకమునకు చేరుటకు ఒక గోపురము కట్టుచున్నప్పుడు, ప్రభువు ఆ జనుల భాషను తారుమారు చేసిన సమయములో వారు చెదరగొట్టబడిరి—అది ఇశ్రాయేలు వంశస్థుల శేషమునకు, ప్రభువు వారి పితరుల యెడల ఎట్టి గొప్ప కార్యములను చేసెనో చూపుటకును మరియు వారు ప్రభువు యొక్క నిబంధనలను తెలుసుకొని శాశ్వతముగా విసర్జింపబడకుండునట్లును మరియు యేసే క్రీస్తు అని, నిత్యుడగు దేవుడని , సమస్త జనములకు తననుతాను ప్రత్యక్షపరచుకొనునని యూదుని, అన్యజనుని ఒప్పించుటకునై యున్నది—దీనిలో లోపములున్న యెడల, అవి మనుష్యుల పొరపాటులైయున్నవి. అందువల్ల, క్రీస్తు యొక్క తీర్పు సింహాసనము వద్ద మీరు మచ్చలేనివారుగా కనుగొనబడునట్లు దేవుని క్రియలను ఖండించకుడి.

జోసెఫ్‌ స్మిత్‌ జూనియర్‌ చేత పలకల నుండి ఆంగ్లంలోనికి ఆదిమ అనువాదము చేయబడెను.