లీహై జీవవృక్ష దర్శనమును చూచును—అతడు దాని ఫలమును తిని, తన కుటుంబము కూడా ఆ విధముగా చేయవలెనని కోరును—అతడు ఒక ఇనుప దండమును, తిన్నని ఇరుకైన ఒక మార్గమును, మనుష్యులను పూర్తిగా కప్పివేయు అంధకారపు పొగమంచును చూచును—శరయ, నీఫై, శామ్లు ఆ ఫలమును తిందురు, కానీ లేమన్, లెముయెల్లు తిరస్కరించెదరు. సుమారు క్రీ. పూ. 600–592 సం.