లేఖనములు
1 నీఫై 6


6వ అధ్యాయము

నీఫై దేవుని కార్యములను గూర్చి వ్రాయును—అబ్రాహాము యొక్క దేవుని యొద్దకు వచ్చి, రక్షింపబడుడని మనుష్యులను ఒప్పించుటయే నీఫై ఉద్దేశ్యము. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 ఇప్పుడు నీఫైయను నేను, నా వృత్తాంతము యొక్క ఈ భాగమందు నా పితరుల వంశావళిని ఇచ్చుట లేదు లేదా నేను వ్రాయుచున్న ఈ పలకలపైన మరెన్నడూ కూడా ఇవ్వను. ఏలయనగా, అది నా తండ్రి చేత చేయబడిన వృత్తాంతములో ఇవ్వబడినది. అందువలన, దానిని ఈ గ్రంథములో నేను వ్రాయుట లేదు.

2 మేము యోసేపు వంశస్థులమని చెప్పుటయే నాకు చాలును.

3 నా తండ్రిని గూర్చిన విషయములన్నిటి యొక్క పూర్తి వృత్తాంతమును వ్రాయుదునా లేదా అనునది నాకు ముఖ్యమైనది కాదు, అవి ఈ పలకలపైన వ్రాయబడలేవు, ఏలయనగా దేవుని కార్యములను గూర్చి వ్రాయుటకు నేను స్థలమును కోరుచున్నాను.

4 అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుని యొద్దకు వచ్చి రక్షింపబడుడని మనుష్యులను ఒప్పించుటయే నా పరిపూర్ణ ఉద్దేశ్యము.

5 కావున, లోకమునకు ప్రీతికరమైన విషయములను నేను వ్రాయను, కానీ దేవునికి మరియు లోక సంబంధులు కాని వారికి ప్రీతికరమైనవే వ్రాయుదును.

6 అందువలన, నరుల సంతానమునకు విలువ లేని వాటితో వారు ఈ పలకలను నింపరాదని నేను నా సంతానమునకు ఒక ఆజ్ఞనిచ్చెదను.

ముద్రించు