యూదులు వారి వాగ్దానదేశములన్నిటిలో సమకూర్చబడుదురని జేకబ్ వివరించును—ప్రాయశ్చిత్తము, పతనము నుండి మనుష్యుని విమోచించును—సమాధి నుండి మరణించిన వారి శరీరములు మరియు నరకము నుండి, పరదైసు నుండి వారి ఆత్మలు బయటకు వచ్చును—వారు తీర్పు తీర్చబడుదురు—మరణము, నరకము, అపవాది మరియు అంతము లేని బాధ నుండి ప్రాయశ్చిత్తము రక్షించును—నీతిమంతులు దేవుని రాజ్యములో రక్షింపబడుదురు—పాపముల కొరకు దండనములు చెప్పబడినవి—ఇశ్రాయేలు పరిశుద్ధుడే ద్వారకాపరి. సుమారు క్రీ. పూ. 559–545 సం.