22వ అధ్యాయము
వెయ్యేళ్ళ పరిపాలనలో మనుష్యులందరు ప్రభువును స్తుతించెదరు—ఆయన వారి మధ్య నివసించును—యెషయా 12 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.
1 ఆ దినమున మీరు ఈలాగందురు: ప్రభువా, నేను నిన్ను స్తుతించుచున్నాను; నీవు నా మీద కోపపడినను నీ కోపము చల్లారెను, నీవు నన్ను ఆదరించియున్నావు.
2 ఇదిగో, దేవుడే నా రక్షణకు కారణభూతుడు; నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను; ప్రభువైన యెహోవాయే నాకు బలము, నా కీర్తనకాస్పదము; ఆయన నాకు రక్షణాధారమాయెను.
3 కావున, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్ళు చేదుకొందురు.
4 ఆ దినమున మీరీలాగందురు: ప్రభువును స్తుతించుడి, ఆయన నామమున ప్రార్థించుడి, జనములలో ఆయన క్రియలను ప్రకటించుడి, ఆయన నామము ఘనమైనదని ప్రచారము చేయుడి.
5 ప్రభువును గూర్చి కీర్తన పాడుడి; ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను; భూమియందంతటను ఇది తెలియబడును.
6 సీయోను నివాసీ, బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుము; నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు ఘనుడైయున్నాడు.