సంఘసభ్యులలో అనేకమంది అవిశ్వాసుల చేత పాపములోనికి నడిపించబడుదురు—ఆల్మాకు నిత్యజీవము వాగ్దానము చేయబడును—పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొందువారు పాప క్షమాపణ పొందుదురు—పాపము చేసిన సంఘ సభ్యులలో పశ్చాత్తాపపడి, ఆల్మా మరియు దేవుని యెదుట ఒప్పుకొనిన వారు క్షమించబడుదురు; లేని యెడల, వారు సంఘసభ్యుల మధ్య లెక్కింపబడరు. సుమారు క్రీ. పూ. 120–100 సం.