రండి, మాతో కలవండి
ప్రపంచంలోని దేవుని పిల్లలందరినీ ఈ గొప్ప యత్నంలో చేరమని మేము ఆహ్వానిస్తున్నాము.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, నా ప్రియమైన స్నేహితులరా ప్రతీ వారం, ప్రపంచమంటానున్న యేసు క్రీస్తు కడవరిదిన పరిశుద్ధుల సంఘసభ్యులంతా దేవుడు, విశ్వమంతటికీ రాజైన మన ప్రియ పరలోకతండ్రిని, ఆయన యొక్క ప్రియకుమారుడైన యేసు క్రీస్తును ఆరాధిస్తారు. మనం పాపమెరుగక జీవించిన ఒకే ఒక వ్యక్తి, మచ్చలేని గొర్రెపిల్లయైన యేసు క్రీస్తు జీవితాన్ని, బోధనలను ధ్యానిస్తాము. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొంటూ మనం సంస్కారంలో పాలుపంచుకుంటాం, మన జీవితాలలో ఆయనే కేెంద్రమని గుర్తిస్తాం.
ఆయనను మనం ప్రేమిస్తున్నాం, ఆయనను గౌరవిస్తున్నాం. ఆయన యొక్క గాఢమైన, నిత్య ప్రేమ వలన, ఆయన మీ కొరకు, నా కొరకు శ్రమపడి మరణించాడు. ఆయన మరణపు ద్వారాలను విరగగొట్టి తెరిచాడు, స్నేహితులను, ప్రియమైన వారిని వేరుచేసిన అడ్ఢంకులను తునాతునకులు చేసాడు,1, నిరీక్షణ లేనివారికి నిరీక్షణను, రోగులకు స్వస్థతను, బంధింపబడిన వారికి విముక్తిని తెచ్చాడు.2
ఆయనకే మన హృదయాలను, మన జీవితాలను, మన అనుదిన ఆరాధనను సమర్పిస్తున్నాము. ఈ కారణం వలన “మేము క్రీస్తు గురించి మాట్లాడుతాము, మేము క్రీస్తునందు ఆనందిస్తాము, [మరియు] మేము క్రీస్తు గురించి బోధిస్తాము … కావున మా సంతానం వారి పాపనివృత్తి కొరకు వారు ఏ మూలాధారము వైపు చూడవలెనో తెలుసుకొందురు.”3
శిష్యత్వాన్ని అభ్యసించుట
అయితే, యేసు క్రీస్తు శిష్యునిగా ఉండుట క్రీస్తును గూర్చి మాట్లాడుట, బోధించుట కంటే ఇంకా అధికమైనదానిని కలిగియుంది. ఆయన వలే అగు మార్గంలో మనకు సహాయం చేయుటకు రక్షకుడే స్వయంగా ఆయన సంఘాన్ని పునఃస్థాపించాడు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘం శిష్యత్వంలోని మౌలికాంశాలను సాధన చేసే అవకాశాలు కల్పించుటకు నిర్మించబడింది. సంఘంలో మనం పాల్గొనడం ద్వారా, మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణలను గుర్తించి, వాటిని అనుసరించుటను నేర్చుకుంటాం. మనం ఇతరులను దయతో, జాలితో చేరుకునే గుణాన్ని అభివృద్ధి చేసుకుంటాం.
ఇది ఒక జీవితకాల ప్రయత్నం, దానికి సాధన అవసరం.
విజయవంతులైన క్రీడాకారులు వారి క్రీడయొక్క మౌలికాంశాలను సాధనచేయుటలో అనేక గంటలు గడుపుతారు. నర్సులు, నెట్వర్క్ నిపుణులు, అణుసంబంధిత ఇంజనీర్లు, ఇంకా హారియెట్ వంటగదిలో మంచి అభిరుచితో వంటచేసే నేను కూడా మా కళను శ్రద్ధగా అభ్యసించినప్పుడే సామర్థ్యం, నైపుణ్యం కలవారిగా అవ్వగలం.
ఒక విమానసంస్ధ కెప్టెన్ గా, నేను తరచూ పైలట్లను విమాన అనుకరణయంత్రం అనబడే విమానాన్ని నడిపడాన్ని అనుకరించే అధునాతన యంత్రంపై తర్ఫీదు చేసేవాడిని. ఆ అనుకరణయంత్రం విమానాన్ని నడపడం యొక్క మౌలికాంశాలను నేర్చుకోవడానికి సహాయం చేయడమే కాకుండా; అది వారు నిజమైన విమానాన్ని నడుపుతున్నప్పుడు వారికి ఎదురయ్యే ఆకస్మిక సంఘటనలను అనుభవించుటకు వాటికి ప్రతిస్పందించుటకు అనుమతించును.
అవే సూత్రాలు యేసు క్రీస్తు యొక్క శిష్యులకు వర్తిస్తాయి.
యేసు క్రీస్తు సంఘంలో ఉత్తేజంగా పాల్గొనుట, దానిలోని వివిధ రకాల గొప్ప అవకాశాలు మార్పుచెందే మన జీవితపు పరిస్థితులు అవి ఏవైనప్పటికీ వాటి కొరకు ఉత్తమంగా సిద్ధపడడానికి సహాయం చేస్తాయి. సంఘసభ్యులుగా, ప్రాచీన మరియు, ఆధునిక ప్రవక్తల ద్వారా ఇవ్వబడే దేవుని వాక్యాలలో మనలను మనం నిమగ్నం చేసుకోవాలని మనం ప్రోత్సహించబడ్డాము. పరలోకతండ్రికి హృదయపూర్వకంగా, వినయంగా ప్రార్థించుట ద్వారా, పరిశుద్ధాత్మస్వరాాన్ని గుర్తించుట మనం నేర్చుకుంటాం. సేవచేయుటకు, బోధించుటకు, ప్రణాళిక చేయుటకు, పరిచర్య చేయుటకు, నిర్వహించుటకు మనం పిలుపులను అంగీకరిస్తాం. ఈ అవకాశాలు మనలను ఆత్మలోను, మనస్సులోను, గుణంలోను ఎదుగుటకు అనుమతిస్తాయి.
అవి ఈ జీవితంలోను, రాబోయే జీవితంలోను మనలను దీవించే పరిశుద్ధ నిబంధనలు చేయుటకు, అనుసరించుటకు సిద్ధపడేలా సహాయం చేస్తాయి.
వచ్చి, మాతో చేరండి!
ప్రపంచంలోని దేవుని పిల్లలందరినీ ఈ గొప్ప యత్నంలో చేరమని మేము ఆహ్వానిస్తున్నాము. రండి, చూడండి! కరోనా వైరస్ ఉన్న ఈ క్లిష్టసమయంలో కూడా, మాతో ఆన్ లైన్ లో కలవండి. మా సువార్త పరిచారకులను ఆన్ లైన్ లో కలుసుకొండి. ఈ సంఘం అసలు ఏమిటో మీకుమీరే తెలుసుకొండి! ఈ కష్టసమయం దాటిపోయిన తర్వాత, మమ్మల్మి మా గృహాలలో, మా ఆరాధనా స్థలాలలో కలుసుకొండి.
మిమ్మల్ని వచ్చి సహాయం చేయమని ఆహ్వానిస్తున్నాము! రండి మాతో సేవ చేయండి, దేవుని పిల్లలకు పరిచర్య చేయడం, రక్షకుని అడుగుజాడలలో అనుసరించడం, ఆలోకాన్ని ఉత్తమమైన ప్రదేశంగా చేయగలదు.
రండి మాతో కలవండి! మీరు మమ్మల్ని బలోపేతం చేస్తారు. మీరు కూడా ఇంకా ఉత్తమంగా, దయగలవారిగా, సంతోషవంతులుగా అవుతారు. జీవితంలో అకస్మాత్తుగా వచ్చే శోధనలు, ఒడిదొడుకులను ఇంకా సామర్థ్యవంతంగా ఎదుర్కొనునట్లు మీ విశ్వాసం మరింత లోతుగా ఇంకా బలంగా పెరుగుతుంది.
మీరు ఎలా ప్రారంభించాలి? సాధ్యమయ్యే మార్గాలు అనేకం ఉన్నాయి.
మోర్మన్ గ్రంథం చదమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీ వద్ద ఒక ప్రతి లేనట్లైతే, మీరు ChurchofJesusChrist.org4 లో చదవవచ్చు లేదా మోర్మన్ గ్రంథం ఏప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మోర్మన్ గ్రంథం యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన, పాత మరియు క్రొత్తనిబంధనలకు సహచరి. మేము ఈ పరిశుద్ధలేఖనాలన్నింటినీ ప్రేమించి, వాటినుండి నేర్చుకుంటాం.
మీరు కొద్ది సమయాన్ని ComeuntoChrist.org వద్ద గడిపి సంఘసభ్యులు ఏమి నమ్ముతారో, ఏమి బోధిస్తారో కనుగొనుటకు మేము ఆహ్వానిస్తున్నాం.
సువార్త పరిచారకులను మీతో ఆన్ లైన్ లో లేదా వీలైనప్పుడు మీ గృహాలలో ప్రత్యేకంగా దర్శించుటకు ఆహ్వానించండి - వారు నిరీక్షణ మరియు స్వస్థతనిచ్చు సందేశాన్ని కలిగియున్నారు. ఈ సువార్త పరిచారకులు వారి స్వంత సమయం, స్వంత ఖర్చులతో ప్రపంచంలో అనేక ప్రాంతాలలో సేవచేసే మా ప్రశస్తమైన కుమారులు కుమార్తెలు.
యేసు క్రీస్తు సంఘంలో, మీకంటే పెద్ద వ్యత్యాసంలేని ఒక కుటుంబంను పోలిన ప్రజలను కనుగొంటారు. మీ సహాయం అవసరమైన వారిని, మీరు ఇంకా ఉత్తమమైన మీరుగా అనగా దేవుడు మీరు ఏమికావాలని మిమ్మల్ని సృజించారో అలా అగుటకు మీ యొక్క ప్రయాసలో మీకు సహాయపడాలనుకునే వారిని కనుగొంటారు.
రక్షకుని కౌగిలు అందరి కొరకు చాపబడింది.
మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, “నేను నా జీవితంలో తప్పులు చేశానే. యేసు క్రీస్తు సంఘంలో నేనెప్పటికైనా కలవగలనని భావించలేకపోతున్నాను. దేవుని నాలాంటి వారిపై ఆసక్తి చూపించకపోవచ్చు.”
యేసు క్రీస్తు, ఆయన “రాజులకు రాజు,”5 మెస్సియా, “సజీవదేవుని కుమారుడు”6 అయినప్పటికీ, దేవుని ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రగాఢమైన శ్రద్ధను కలిగియున్నాడు. వ్యక్తుల స్థానమేదైనప్పటికీ - ఎంత ధనికులైనా లేదా పేదవారైనా, ఎంత అసంపూర్ణులైనా లేదా ఎంత నిరూపించుకున్న వారైనా ఆయన ఒకే విధమైన శ్రద్ధ వహిస్తారు. తన భూలోక జీవితంలో, రక్షకుడు: సంతోషంగా ఉన్న వారికి, సాధించిన వారికి, విరిగిన, పొగొట్టుకొనిన వారికి, నిరీక్షణలేని వారందరికీ పరిచర్య చేసారు. తరచూ, ఆయన పరిచర్య చేసిన వారు పలుకుబడి, అందం, సంపద ఉన్న వ్యక్తులు కాదు. అయన పైకి లేవనెత్తిన వారు తిరిగి ఇచ్చుటకు ఏమి లేనివారు, కానీ వారు కృతజ్ఞత, వినయంగల హృదయం, విశ్వాసం కలిగియుండుటకు కోరిక కలిగియున్నారు.
యేసు తన మర్త్యజీవితాన్ని “వీరిలో అల్పలైనవారికి”7 పరిచర్య చేయుటకు గడిపినప్పుడు, ఆయన వారిని ఈరోజు ప్రేమించరా? ఆయన సంఘంలో దేవుని పిల్లలందరికీ స్థలం లేదా? ఎవరైతే అనర్హులుగా, మరువబడినవారిగా, ఒంటరివారిగా భావిస్తున్నారో వారికి?
దేవుని దయకు పాత్రులగుటకు మీరు సంపాదించవలసిన పరిపూర్ణత యొక్క ప్రవేశార్హత ఏమీ లేదు. మీ ప్రార్థనలు పరలోకం చేరుటకు బిగ్గరగా, వ్యాకరణపరంగా సక్రమంగా ఉండవలసిన అవసరం లేదు
నిజానికి, దేవుడు పక్షపాతం చూపించడు8 - లోకం విలువనిచ్చే వస్తువులు ఆయన దృష్టిలో విలువలేనివి. మీ హృదయాలను ఆయనెరుగును, ఆయన నీ శీర్షిక, ఆర్ధిక నికర విలువ, లేదా ఇంస్టాగ్రాంలో అనుచరుల సంఖ్యతో సంబంధం లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
మన పరలోకతండ్రివైపు మన హృదయాలను త్రిప్పినప్పుడు, ఆయనకు దగ్గరగా మనం వెళ్లినప్పుడు, ఆయన మనకు దగ్గరవ్వుటను మనం అనుభవిస్తాము.9
మనమంతా ఆయన ప్రియమైన పిల్లలం.
ఆయనను నిరాకరించేవారు కూడా.
తలబిరుసుతో, అవిధేయ బిడ్డ వలే, దేవుడు, ఆయన సంఘంపై కోపంతో, ముఠాముళ్లు సద్దుకొని, మేమెళ్లిపోతున్నాం, ఇంక తిరిగి రాము అని చెప్పేవారు కూడా ఆయన పిల్లలే.
ఇంటినుండి పారిపోయే పిల్లలు, వారివైపు కిటికీలోంచి బయటకు వేదనతో చూచే తల్లిదండ్రులను గమనించకపోవచ్చు. దయగల హృదయాలతో, వారు వారి కుమారుడు లేదా కుమార్తె వెళ్లిపోవుటను చూస్తూ - వారి ప్రసస్థమైన బిడ్డ ఆ గుండెపగిలే అనుభవంనుండి కొంత నేర్చుకుని, జీవితాన్ని కొత్తకళ్లతో చూడగలిగి - క్రమంగా ఇంటికి తిరిగివస్తారని నిరీక్షిస్తారు.
మన ప్రేమగల పరలోకతండ్రి కూడా అలాగే చూస్తారు. ఆయన మనం తిరిగివస్తామని వేచిచూస్తున్నారు.
మీ రక్షకుడు, ప్రేమభాష్పాలతో, తన కళ్లలో జాలితో, మీ తిరుగురాకకై ఎదురుచూస్తున్నారు. మీరు దేవునినుండి దూరమయ్యారని భావించినప్పటికీ, ఆయన మిమ్మల్ని చూస్తారు; మీ కొరకు దయగలిగి, మిమ్మల్ని హత్తుకొనుటకు పరిగెత్తుకొస్తారు.10
రండి మాతో కలవండి.
దేవుడు మన తప్పిదాలనుండి మనం నేర్చుకోవడానికి అనుమతిస్తారు.
మనం మర్త్యమార్గంలో అర్ధం కోసం, తిరుగులేని సత్యం కోసం గొప్పపరిశోధనలో ఉన్న యాత్రికులం. తరచూ, మనం మనకు ముందున్న మార్గాన్ని మాత్రమే చూస్తాం - మార్గంలోని మలుపులు ఎక్కడకు తీసుకెళ్తాయో మనం చూడలేం. మన పరలోకతండ్రి ప్రతిసమాధానాన్ని మనకు ఇవ్వలేదు. అనేకవిషయాలను మనకు మనమే తెలుసుకోవాలని ఆయన ఆశిస్తారు. అది కష్టమైనదైనప్పటికీ మనం విశ్వసించాలని ఆయన కొరుకుంటారు.
మన భుజాలను నిటారుగా చేసి, కొంచెం సంకల్పాన్ని, కొంచెం ధైర్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఆశిస్తారు.
మనం నేర్చుకొని, ఎదిగే మార్గం ఇదే.
ప్రతీది వివరంగా చెప్పబడాలని మీరు నిజాయితీగా కోరుకుంటున్నారా? ప్రతీ ప్రశ్నకు సమాధానమివ్వబడాలని, ప్రతీ గమ్యం గుర్తించబడాలని కోరుకుంటున్నారా?
మనలో అనేకులుఈ విధమైన పరలోకపు సూక్ష్మ నిర్వహణకు చాలా తొందరగా అలసిపోతామని నేను భావిస్తున్నాను. జీవితపు ప్రాముఖ్యమైన పాఠాలను అనుభవం ద్వాారా మనం నేర్చుకుంటాం. మన తప్పిదాలనుండి నేర్చుకోవడం ద్వారా. పశ్చాత్తాపపడుట ద్వారా, “దుష్టత్వం ఎప్పటికీ సంతోషకరం కాదని”11 మనకుమనమే గుర్తించడం ద్వారా నేర్చుకుంటాం.
మన తప్పిదాలు మనలను ఖండించకుండా, మన యెదుగుదలను ఎప్పటికీ ఆపేయకుండా ఉండునట్లు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మరణించారు. ఆయన మూలంగా, మనం పశ్చాత్తాపపడగలం, మన తప్పిదాలు గొప్ప మహిమకు ఎక్కే మెట్లు కాగలవు.
ఈ మార్గంలో నీవు ఒంటరిగా నడవవలసిన అవసరం లేదు. మన పరలోకతండ్రి చీకటిలో సంచరించుటకు మనలను వదిలివేయలేదు.
ఇందుకే, 1820 వసంతకాలంలో, ఆయన తన కుమారుడు, యేసు క్రీస్తుతో పాటు యవ్వనుడైన జోసెఫ్ స్మిత్ కు కనిపించారు.
దాని గురించి ఒక క్షణం ఆలోచించండి! ఈ విశ్వం యొక్క దేవుడు నరునికి కనిపించాడు!
ఇది జోసెఫ్ తో దేవుడు, మరియు ఇతర పరలోకవాసులు జరిపిన అనేకసమావేశాలలో మొదటిది. ఈ దైవిక వాసులు అతనితో మాట్లాడిన అనేక వాక్యాలు యేసు క్రీస్తు యొక్క కడవరిదిన పరిశుద్ధుల సంఘ లేఖనాలలో నమోదు చేయబడ్డాయి. అవి సులువుగా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే వాటిని చదివి మన దినాలలో మన కొరకు దేవుడు కలిగియున్న సందేశాన్ని వారికి వారే నేర్చుకోవచ్చు.
వాటి మీకు మీరే చదువమని మేము ఆహ్వానిస్తున్నాం.
జోసెఫ్ స్మిత్ ఈ బయల్పాటులను పొందినప్పుడు అతడు చాలా యవ్వనంలో ఉన్నాడు. వాటిలో అనేకం అతనికి 30 సంవత్సరాలు రావడానికి ముందే ఇవ్వబడ్డాయి.12 అతనికి అనుభవం లేదు, కొందరికి అతడు దేవుని ప్రవక్తగా ఉండుటకు అర్హత లేనివాడిగా కనబడియుండవచ్చు.
అయినప్పటికి—పవిత్ర గ్రంథాలలో మనకు కనిపించే ఒక నమూనాను అనుసరించుచు ప్రభువు అతన్ని పిలిచెను.
దేవుడు సువార్తను పునరుద్ధరించడానికి సంపూర్ణమైన వ్యక్తిని కనుగొనేవరకు వేచియుండలేదు.
ఆయన అట్లు చేసినట్లైతే, ఇంకా వేచిచూస్తూనే ఉండేవాడు.
జోసెఫ్ చాలావాటిలో మీరు మరియు నా వంటి వాడు. అతడు తప్పిదాలు చేసినప్పటికీ, దేవుడు అతనిని ఆయన యొక్క గొప్ప ఉద్ధేశ్యాలు నెరవేర్చడానికి వాడుకున్నాడు.
అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ తరచూ ఈ సలహాను పదేపదే చెప్పేవారు: “ప్రభువు చేత పిలవబడిన వారిని, ప్రభువే అర్హునిగా చేయును.”13
కొరింథీలోని పరిశుద్ధులకు అపోస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, సహోదరసహోదరీల్లారా: మీలో అనేకులు లోకరీతిగా జ్ఞానులు, ఘనులు, గొప్ప వంశమువారు కానప్పటికీ పిలువబడ్డారు.”14
తన ఉద్ధేశ్యములు నెరవేర్చుటకు బలహీనులను, సరళమైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. భూమిపై ఆయన కార్యసాధన నరుని వలన కాక, అది దేవుని శక్తిచేతనే సాధ్యమగునను సత్యమునకు సాక్షియైయుండును.15
ఆయనను వినండి, ఆయనను వెంబడించండి
దేవుడు జోసెఫ్ స్మిత్ నకు కనబడినప్పుడు, ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును పరిచయం చేసి, ఇలా చెప్పెను, “ఆయనను వినుము!”16
జోసెఫ్ తన మిగిలిన జోవితమంతా ఆయనను వినుచు, వెంబడించుచూ గడిపెను.
జోసెఫ్ వలే, మన శిష్యత్వం కూడా రక్షకుడైన యేసు క్రీస్తును విని, వెంబడించుటతోనే మొదలగును.
ఆయనను అనుసరించుటకు మీరు ఆశపడుచున్నట్లైతే, మీ విశ్వాసాన్ని కూడగట్టుకొను, ఆయన సిలువను మోయండి.
మీరు ఆయన సంఘానికి - అనగా సక్యతగల ఆహ్వానించబడే స్థలముగా, ఎక్కడైతే శిష్యత్వం, సంతోషం యొక్క గొప్ప యత్నంలో మీరు చేరగలరో దానికి చెందినవారని మీరు కనుగొంటారు.
మొదటి దర్శనం యొక్క ఈ రెండవ శతాభ్ధసంవత్సరంలో, మనం యేసు క్రీస్తు సంఘం యొక్క పునఃరుద్ధరణ గూర్చి ధ్యానించి, నేర్చుకొనినప్పుడు, మనం అది ఒక చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదనే అవగాహనకు వస్తామని నేను నిరీక్షిస్తున్నాను. మీరు, నేను కొనసాగే ఈ గొప్ప కథనంలో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాము.
అయితే, మీ యొక్క నా యొక్క పాత్రయేమిటి?
అది యేసు క్రీస్తును గూర్చి తెలుసుకొనుట. ఆయన మాటలను పఠించుట. ఆయనను వినుటకు, వెంబడించుటకు ఉత్సాహంతో ఈ గొప్పకార్యంలో పాలుపంచుకొనుట. వచ్చి మాతో కలవమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను!
మీరు సంపూర్ణులైయుండక్కరలేదు. మీరు ప్రతి దినమూ మీ విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవాలని, ఆయనకు చేరువవ్వాలని కోరికను కలిగియుంటే చాలు.
మన పాత్ర దేవునిని ప్రేమించి, సేవించుట, ఆయన పిల్లలను ప్రేమించి, వారికి సేవ చేయటం.
అలా మీరు చేసినప్పుడు, తన ప్రేమతో, ఆనందంతో, మరియు ఈ జీవితమంతటిలో, అతి మిక్కిలి ప్రమాదకర పరిస్థితులలో మార్గదర్శకంతో దేవుడు మీకు కావలికాస్తారు.
లోతైన కృతజ్ఞతతో, మీలో ప్రతీవారికొరకు గల నా ప్రేమతో మీపై నా దీవెనను అనుగ్రహిస్తూ, యేసు క్రీస్తు నామంలో ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిస్తున్నాను, ఆమెన్.