2022
భయపడకుడి—ప్రభువు మీతో ఉన్నాడు
2022 జూలై


“భయపడకుడి, ప్రభువు మీతో ఉన్నాడు,” యౌవనుల బలము కొరకు, సె 2022, జూలై.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, జూలై 2022

భయపడకుడి—ప్రభువు మీతో ఉన్నాడు

భయము క్రొత్తది కాదు. ప్రాచీన కాలములనుండి, భయము దేవుని పిల్లల యొక్క దృష్టికొణమును పరిమితం చేసింది. 2 రాజులలో, సిరియా రాజు ఎలీషా ప్రవక్తను చెరపట్టి చంపడానికి సైన్యమును పంపాడు.

“[ఎలీషా] యొక్క పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుఱ్ఱములును, రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొనియుండుట కనబడెను. అంతట [ఎలీషా] పనివాడు “అయ్యో, నా యేలీనవాడా, మనము ఏమి చేయుదుము?” అనెను. (2 రాజులు 6:15).

భయము మాట్లాడుతున్నది.

“భయపడవద్దు, మన పక్షమును నున్నవారు వారికంటె అధికులైయున్నారని” ఎలీషా జవాబిచ్చాడు.

“మరియు యెహోవా, చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థించాడు.” యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.”2

మన భయాలను చెదరగొట్టి మన దయ్యాలను జయించడానికి మనకు గుఱ్ఱముల రథములు ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ పాఠము స్పష్టమైనది. ప్రభువు మనతో ఉన్నాడు, మనల్ని గుర్తుంచుకున్నాడు మరియు ఆయన మాత్రమే చేయగల విధానాలలో మనల్ని దీవిస్తున్నాడు.

మనము ప్రభువునందు, ఆయన మార్గములందు చురుకుగా విశ్వసించిన యెడల, ఆయన కార్యములో నిమగ్నమైయున్న యెడల, మనము లోక రీతులకు భయపడము లేక వాటి ద్వారా భయపెట్టబడము. ప్రభువు మనపై కావలి కాస్తున్నాడు, మన కోసం శ్రద్ధ తీసుకొనుచున్నాడు, మరియు మన ప్రక్కన నిలిచియున్నాడు.

ముద్రించు