2022
సంస్కారము: రక్షకుడిని జ్ఞాపకముంచుకోవడానికి ఒక విధానము
2022 ఏప్రిల్


“సంస్కారము: రక్షకుడిని జ్ఞాపకముంచుకోవడానికి ఒక విధానము,” లియహోనా, ఏప్రి. 2022.

లియహోనా నెలవారీ సందేశము, 2022 ఏప్రిల్

సంస్కారము: రక్షకుడిని జ్ఞాపకముంచుకోవడానికి ఒక విధానము

placeholder altText

ప్రభురాత్రి భోజనం, సైమన్ డ్యువే చేత

ఆయన సిలువ వేయబడకముందు, యేసు క్రీస్తు ప్రభురాత్రి భోజనము వద్ద తన అపొస్తలులను కలుసుకొన్నారు. అక్కడ ఆయన వారికి మొదటసారి సంస్కారము ఇచ్చారు. అది ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక విధానమని ఆయన వివరించారు. సంస్కారము ఒక విధి, అక్కడ మనము క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును జ్ఞాపకము చేసుకోవడానికి రొట్టెను, నీటిని తీసుకుంటాము. రొట్టె క్రీస్తు యొక్క శరీరాన్ని సూచిస్తుంది మరియు నీరు ఆయన రక్తమును సూచిస్తుంది.

ప్రతీ ఆదివారము సంస్కార సమావేశములో మనము సంస్కారమును తీసుకుంటాము. యాజకత్వము గలవారు రొట్టెను చిన్న ముక్కలుగా చేస్తుండగా, మనము ఒక కీర్తన పాడతాము.

రొట్టెను విరిచే యాజకత్వము గలవారు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనలు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 లో కనుగొనబడతాయి. ఈ ప్రార్థనలు మనము పరలోక తండ్రికి వాగ్దానము చేసిన దానిని మరియు ఆయన మనకు వాగ్దానము చేసిన దానిని మనకు గుర్తు చేస్తాయి.

యాజకత్వము గల ఇతరులు వార్డు లేక బ్రాంచి సభ్యులకు సంస్కారమును అందిస్తారు. మనము సంస్కారమును తీసుకొన్నప్పుడు, మనము రక్షకుని మరియు మన కొరకు ఆయన త్యాగము గురించి జ్ఞాపకం చేసుకుంటాము. పరలోక తండ్రితో మనము చేసిన నిబంధనలు పాటించడానికి కూడ మనము తిరిగి ఒడంబడిక చేస్తాము.

సంస్కార సమావేశమందు  సంస్కారమును తీసుకొంటున్న బాలిక

సంస్కారం దీవించబడి, అందించబడినప్పుడు మనము భక్తిగల గౌరవముతో ఉంటాము. అది మనము యేసు క్రీస్తు యొక్క జీవితము, బోధనలు మరియు ప్రాయశ్చిత్తము గురించి ఆలోచించడానికి సమయము. మనము ఆయన మాదిరిని ఎలా అనుసరించగలమో కూడ మనము ఆలోచించగలము.