“బాధపడుతున్న రక్షకుడు,” యౌవనుల బలము కొరకు, 2022, ఏప్రి.
యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2022 ఏప్రిల్
బాధపడుతున్న రక్షకుడు
యేసు క్రీస్తు రాకడకు వందల సంవత్సరాలకు ముందు, మన పాపముల కొరకు ఆయన బాధపడుటను యెషయా ముందుగా చూసాడు.
తృణీకరించబడెను మరియు తిరస్కరించబడెను
యేసు క్రీస్తు భూమి మీదకు వచ్చినప్పుడు, కొందరు జనులు ఆయనయందు నమ్మకముంచారు, కానీ అనేకమంది నమ్మలేదు. వారు ఆయనను చిన్నచూపు చూసారు, మరియు అనేకమంది ఆయనను ద్వేషించారు. చివరకు, జనులు ఆయన హింసింపబడి మరియు చంపబడుటకు ఎన్నుకున్నారు. (1 నీఫై 19:9 చూడండి.)
ఆయన మన రోగములను భరించెను
యేసు క్రీస్తు మన బాధ, వ్యాధి మరియు బలహీనతలను తనపై తీసుకొనెను. ఆయన మనపై దయ చూపాలని మరియు మనకు ఎలా సహాయపడాలో తెలుసుకోవాలని దీనిని చేసారు. (ఆల్మా 7:11–13 చూడండి.)
ఆయన మన అతిక్రమముల కొరకు గాయపరచబడ్డారు.
యేసు క్రీస్తు మన పాపముల కొరకు బాధపడ్డారు. మనము పశ్చాత్తాపపడినప్పుడు మనము క్షమించబడునట్లు ఆయన దానిని చేసారు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:11,; 19:15–19 చూడండి.)
ఆయన పొందిన దెబ్బలతో మనము స్వస్థపరచబడ్డాము
“ఆయన దెబ్బలు” ఆయన గాయములు. ఇవి ఆయన చిందించిన రక్తము మరియు ఆయన మరణము కలిపి, ఆయన మన కొరకు భరించిన సమస్త బాధలన్నిటి కొరకు నిలుస్తాయి. యేసు క్రీస్తు మన కొరకు బాధపడ్డారు గనుక, మనము మరలా స్వస్థపరచబడగలము. ఆయన త్యాగము మన పాపములు క్షమించబడుటకు సాధ్యపరచును. మనము పశ్చాత్తాపపడి, మన నిబంధనలు పాటించడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన మనల్ని స్వస్థపరచును మరియు మనల్ని మార్చును. (మోషైయ 3:7–11; విశ్వాస ప్రమాణాలు 1:3.చూడండి.)
Intellectual Reserve, Inc. చేత © 2022 All rights reserved. అ.సం.రాలలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, April 2022 యొక్క అనువాదం. Telugu. 18314 421