2022
జీవించి ఉన్న ప్రవక్తల నేతృత్వంలో
2022 సెప్టెంబరు


“జీవించి ఉన్న ప్రవక్తల నేతృత్వంలో,” లియహోనా, 2022 సెప్టెంబరు.

2022 సెప్టెంబరు, లియహోనా నెలవారీ సందేశము

జీవించి ఉన్న ప్రవక్తల నేతృత్వంలో

చిత్రం
క్రిస్టస్ విగ్రహం ముందు సంఘ నాయకులు

ప్రవక్తలు, పరలోక తండ్రి కొరకు మాట్లాడేందుకు అధికారమివ్వబడి, ఆయన చేత నియమించబడిన పురుషులు. వారు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి సాక్ష్యమిస్తారు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలను నమ్ముతారు.

దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతారు

ప్రవక్తలు దేవుని నుండి బయల్పాటు పొందుతారు. ప్రవక్తలు మనకు బోధించడానికి ప్రేరేపించబడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నట్లే ( సిద్ధాంతము మరియు నిబంధనలు 1:38 చూడండి) మనము ఏమి తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నారో వారు మనకు చెబుతున్నారని మనం నమ్మవచ్చు.

చిత్రం
బంగారు పలకలతో మోర్మన్

పలకలను సంక్షిప్తపరుస్తున్న మోర్మన్, టామ్ లోవెల్ చేత

ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి బోధిస్తారు

ప్రవక్తలందరూ యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తారు. ఆయన దేవుని కుమారుడని వారు మనకు బోధిస్తారు. వారు ఆయన జీవితం, మాదిరి మరియు ప్రాయశ్చిత్తం గురించి మనకు బోధిస్తారు. ఆయనను ఎలా అనుసరించాలో మరియు ఆయన ఆజ్ఞలను ఎలా పాటించాలో వారు మనకు చూపుతారు.

ప్రవక్తల యొక్క బాధ్యతలు

ప్రవక్తలు యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధిస్తారు. ఆజ్ఞలను పాటించినప్పుడు మనం పొందే ఆశీర్వాదాలను, పాటించకపోతే మనం పొందే పరిణామాలను వారు వివరిస్తారు. కొన్నిసార్లు, వారు భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి మనకు చెప్పడానికి ప్రేరేపించబడవచ్చు.

చిత్రం
పలకలతో మోషే

మోషే మరియు పలకలు, జెర్రీ హార్స్టన్ చేత

ప్రాచీన ప్రవక్తలు

దేవుడు మొదటి నుండి ప్రవక్తల ద్వారా ప్రజలకు బోధించారు. పాత నిబంధన కాలంలో జీవించిన ప్రవక్తలలో ఆదాము, నోవాహు, అబ్రాహాము మోషే, యెషయా మరియు ఇతరులు ఉన్నారు. మోర్మన్ గ్రంథములో తెలుపబడిన ప్రజలలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలలో లీహై, మోషైయ, ఆల్మా మరియు మొరోనై ఉన్నారు. వారు బోధించిన వాటిని మనం లేఖనములు చదవడం ద్వారా నేర్చుకోవచ్చు.

ఆధునిక ప్రవక్తలు

జోసెఫ్ స్మిత్, ఆధునిక కాలంలో మొదటి ప్రవక్త. అతడు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమును భూమిపై పునఃస్థాపించాడు. రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు నేటి ప్రవక్త మరియు సంఘాధ్యక్షులు. ప్రథమ అధ్యక్షత్వములోని ఆయన సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము కూడా ప్రవక్తలు, దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారులు.

చిత్రం
ఫోన్‌లో సమావేశము చూస్తున్న జంట

ప్రవక్త మాటలను ఆలకించుట

సర్వసభ్య సమావేశ సమయంలో మరియు ఇతర సమయాల్లో ప్రవక్త మనతో మాట్లాడతారు. మనం ఏమి తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నారో మరియు నేడు యేసు క్రీస్తును ఎలా అనుసరించాలో ఆయన మనకు బోధిస్తారు. మనము ఆయన బోధనలను లియహోనాలో మరియు ChurchofJesusChrist.org లో కనుగొనవచ్చు.

ప్రవక్తను అనుసరించడం ద్వారా పొందే ఆశీర్వాదాలు

ప్రవక్త బోధలను పాటిస్తే మనం ఆశీర్వదించబడతాము. మనం ప్రవక్తను అనుసరించినప్పుడు, దేవుడు మనలను ఏమి చేయాలని కోరతారో అది మనం చేస్తున్నామని మనం తెలుసుకోవచ్చు. మనం మన జీవితాలలో శాంతిని అనుభూతి చెందగలము మరియు యేసు క్రీస్తుకు దగ్గర కాగలము.

ముద్రించు