“దేవుడు ఆల్మా మరియు అమ్యులెక్ లను విడిపించును”ఫ్రెండ్, 2024 జూన్, 26–27.
జూన్ 2024, నెలవారీ ఫ్రెండ్ సందేశం
దేవుడు ఆల్మా మరియు అమ్యులెక్ లను విడిపించును
ఆల్మా మరియు అమ్యులెక్ అమ్మోనిహా అనబడిన పట్టణమునకు వెళ్ళారు. వారు యేసు క్రీస్తును గురించి ప్రజలకు బోధించారు. కాని, ఆ ప్రజలు వారి బోధనపై కోపించారు ఆల్మా మరియు అమ్యులెక్ లను చెరసాలలో బంధించారు.
ఆ ప్రజలు ఆల్మా మరియు అమ్యులెక్ లను గాయపరచారు. వారు చెరసాలలో అనేక దినములు ఉన్నారు.
ఆల్మా మరియు అమ్యులెక్ ప్రార్ధించి బలము కొరకు అడిగారు. వారికి దేవునియందు విశ్వాసము ఉండెను. ఆయన వారి ముంజేతులపై ఉన్న త్రాటిని త్రెంచివేయుటకు వారికి శక్తి నిచ్చెను.
అప్పుడు భూమి కంపించెను. చెరసాల యొక్క గోడలు కూలిపోయెను! దేవుడు ఆల్మా మరియు అమ్యులెక్ లను విడిపించుటకు సహాయము చేసెను ఇతర జనులకు యేసు క్రీస్తును గురించి బోధించుటకు వారు అమ్మోనిహాను విడిచిరి.
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, June 2024 యొక్క అనువాదము. Telugu. 19289 421