లియహోనా
యువ యోధులు
2024 ఆగష్టు


“యువ యోధులు” ఫ్రెండ్, 2024 ఆగష్టు, 26–27.

ఆగష్టు 2024, ఫ్రెండ్ యొక్క నెలవారీ సందేశం

యువ యోధులు

చిత్రం
ప్రజలు తమ ఆయుధములను ఒక గోతిలో పాతిపెట్టుట

ఆండ్రూ బోస్లీ చేత సచిత్ర వర్ణన

అమ్మోను మరియు అతని సోదరులు బోధించిన ఆ ప్రజలు యేసు క్రీస్తును అనుసరించుటకు కోరుకొనిరి. వారు తమ ఆయుధములను భూమిలో పాతిపెట్టిరి మరియు ఎన్నటికి యుద్ధము చేయబోమని దేవునికి వాగ్దానము చేసిరి.

చిత్రం
వృద్ధులు సంభాషించుకొనుచున్న ఒక ఇంటిని కొందరు యువకుల గుంపు సమీపించెను

కాని, వారు వెంటనే తమ కుటుంబములను కాపాడుకొనవలసి వచ్చెను. ఏ తండ్రులైతే ఆయుధములను భూమిలో పాతిపెట్టిరో వారు దేవునితో తమ వాగ్దానమును ఉల్లంఘించడానికి ఇష్టపడలేదు. కనుక వారి కుమారులు వారి స్థానములో యుద్ధము చేయుటకు సిద్ధపడిరి. రెండు వేల యువ యోధులు అని వారు పిలువబడిరి. యువ అనగా “యవ్వన” అని అర్ధము.

చిత్రం
ఒక యౌవనుడు తన తల్లితో కలిసి ప్రార్ధించుచున్నాడు ఆ సమయంలో మిగిలిన యౌవనులు ఆయుధములను సమకూర్చుచున్నారు.

ఆ యువ యోధులు అంతకు ముందెన్నడు యుద్ధము చేయలేదు. కాని వారు సిద్ధపడుటకు వారి తల్లులు సహాయము చేసిరి మరియు దేవుని యందు విశ్వసించుట వారికి నేర్పిరి.

చిత్రం
హీలమన్ యువ యోధులను కవాతు చేస్తూ నడిపించెను; ఒక యౌవనుడు గాయపడిన మరొక యౌవనుడు నడవడానికి సహాయపడుచున్నాడు.

వారు హీలమన్ను తమ నాయకునిగా ఎంచుకున్నారు వారు ధైర్యవంతులు, మరియు దేవుడు వారికి సహాయము చేసెను వారందరు గాయపడ్డారు, ఐతే వారు ఒకరికొకరు సహాయము చేసుకున్నారు. దేవుడు వారి విశ్వాసమును అభినందించెను, మరియు వారందరు బ్రతికిరి!

రంగులువేసే పేజీ

లేఖనాలు నాకు ప్రతీరోజు సహాయపడగలవు.

చిత్రం
మోర్మను గ్రంధము యొక్క రంగులు వేయు పేజీ, తెరచియున్న ఒక గ్రంధము యొక్క పేజీలనుండి వేరుపడుచున్నది.

ఆడమ్ కోఫోర్డ్ చేత సచిత్ర వర్ణన

మీకు ఏ లేఖన కథనము బాగా నచ్చింది?

ముద్రించు