మిషను పిలుపులు
ప్రథమ అధ్యక్షత్వ సందేశము


“ప్రథమ అధ్యక్షత్వ సందేశము,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)

“ప్రథమ అధ్యక్షత్వ సందేశము,” నా సువార్తను ప్రకటించండి

ప్రథమ అధ్యక్షత్వ సందేశము

ప్రియమైన తోటి సువార్తికులారా:

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము కొరకు ఒక సువార్తికునిగా కావడానికి మీరు కలిగియున్న గొప్ప అవకాశం కొరకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఇశ్రాయేలును సమకూర్చుట కంటే మరింత నిర్బంధమైన లేదా ముఖ్యమైన పని లేదు.

నా సువార్తను ప్రకటించండి అనేది బాగా సిద్ధపడిన, ఆత్మీయంగా ఎక్కువ పరిపక్వత గల సువార్తికునిగా కావడానికి మీకు సహాయపడేందుకు ఉద్దేశించబడింది. మరింత ప్రభావవంతమైన బోధకునిగా కావడానికి మీకు సహాయపడేందుకు కూడా ఇది ఉద్దేశించబడింది. అనుదినము మీ వ్యక్తిగత మరియు సహచర అధ్యయనంలో దీనిని ఉపయోగించమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. మీ జిల్లా సలహాసభ సమావేశాలలో మరియు జోన్ సభ్యసమావేశాలలో దీనిని ఉపయోగించమని కూడా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. సూచించబడిన లేఖనాలను అధ్యయనం చేయండి మరియు సిద్ధాంతాన్ని, సూత్రాలను నేర్చుకోండి.

పరలోకమందున్న మన తండ్రికి ఆయన మహిమకరమైన కార్యములో సహాయపడేందుకు నిబద్ధత యొక్క క్రొత్త భావానికి ఎదగాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. “నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుట” (మోషే 1:39) అనే ఆయన కార్యములో ప్రభువుకు సహాయపడడంలో ప్రతీ సువార్తికుడు ఒక ముఖ్య పాత్ర కలిగియున్నాడు.

ఆయనను సేవించడానికి వినయంతో మిమ్మల్ని మీరు అంకితం చేసుకుంటే ప్రభువు మిమ్మల్ని దీవిస్తారు. పరలోక తండ్రి యొక్క పిల్లల మధ్య మీరు పని చేస్తున్నప్పుడు, మీరు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని కనుగొనవచ్చు.

ప్రథమ అధ్యక్షత్వము

ముద్రించు