2023
యేసు క్రీస్తు నందు విశ్వాసము
2023 ఏప్రిల్


“యేసు క్రీస్తు నందు విశ్వాసము,” లియహోనా, 2023 ఏప్రిల్.

లియహోనా నెలవారీ సందేశము, 2023 ఏప్రిల్

యేసు క్రీస్తు నందు విశ్వాసము

చిత్రం
యేసు యొక్క వ్యక్తిత్వ వర్ణన

యేసు క్రీస్తు, హ్యారీ ఆండర్సన్ చేత

యేసు క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండడం సువార్త యొక్క మొదటి నియమము (విశ్వాస ప్రమాణాలు 1:4 చూడండి). మనల్ని మన పరలోకపు తండ్రి వద్దకు తిరిగి నడిపించే ఎంపికలు చేయడానికి మన విశ్వాసం మనకు సహాయం చేస్తుంది. మన జీవితమంతా మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మనం పని చేయగలము.

చిత్రం
ఒక పుస్తకం చుట్టూ గుమికూడిన పిల్లలు మరియు యౌవనులు

విశ్వాసము అనగా ఏమిటి?

విశ్వాసము అంటే ఏదో ఒకదానిపై దృఢమైన నమ్మకం లేదా నమ్ముట. విశ్వాసం కలిగియుండడమనేది సత్యమైన సంగతులను మనం చూడలేనప్పటికీ లేదా పూర్తిగా వాటిని గ్రహించలేనప్పటికీ, వాటి కొరకు నిరీక్షించడాన్ని మరియు వాటియందు నమ్మడాన్ని కలిపియుంది (హెబ్రీయులకు 11:1; ఆల్మా 32:21 చూడండి).

చిత్రం
యేసు క్రీస్తు యొక్క చిత్రము

హెన్రిచ్ హాఫ్‌మన్ గీసిన Christ and the Rich Young Ruler [క్రీస్తు మరియు ధనవంతుడైన యౌవన అధికారి] నుండి వివరణ

యేసు క్రీస్తులో కేంద్రీకృతమైయున్న విశ్వాసము

రక్షణకు నడిపించడానికి, మన విశ్వాసము మన రక్షకునిగా మరియు విమోచకునిగా యేసు క్రీస్తుపై తప్పక కేంద్రీకృతమై ఉండాలి. క్రీస్తు నందు విశ్వాసం కలిగియుండడం అంటే ఆయన యందు నమ్మకం కలిగియుండడం. దాని అర్థము ఆయనపై పూర్తిగా ఆధారపడడం—ఆయన శక్తియందు, తెలివి మరియు ప్రేమ యందు నమ్మికయుంచడం. అది ఆయన బోధనలను నమ్మడాన్ని మరియు అనుసరించడాన్ని కూడా కలిపియున్నది.

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న జంట

మన విశ్వాసాన్ని పెంపొందించుకొనుట

విశ్వాసం అనేది దేవుడి నుండి వచ్చిన బహుమతి, కాగా మనం దాని కోసం వెతకాలి మరియు దానిని బలంగా ఉంచడానికి కృషి చేయాలి. ప్రార్థించడం ద్వారా, లేఖనాలను మరియు కడవరి దిన ప్రవక్తల బోధనలను అధ్యయనం చేయడం ద్వారా మనం మన విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. మనం నీతిగా జీవిస్తూ, మన నిబంధనలను పాటించడం ద్వారా కూడా మన విశ్వాసాన్ని బలపరుస్తాము.

విశ్వాసంతో జీవించడం

విశ్వాసమనేది కేవలం నమ్మకం కంటే చాలా ఎక్కువైనది. ఆ నమ్మకంపై పనిచేయడాన్ని అది కలిగియున్నది. మనం జీవించే విధానం ద్వారా మన విశ్వాసాన్ని మనం చూపిస్తాం. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఆయన పరిపూర్ణ మాదిరిని అనుసరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మన విశ్వాసము మనలను ఆజ్ఞలు పాటించేలా చేస్తుంది, మన పాపాల గురించి పశ్చాత్తాపపడేలా చేస్తుంది మరియు నిబంధనలను చేసి, పాటించేలా చేస్తుంది.

చిత్రం
ఒక అంధుడిని స్వస్థపరుస్తున్న యేసు

విశ్వాసము అద్భుతాలకు దారితీయగలదు

నిజమైన విశ్వాసం అద్భుతాలను తెస్తుంది, అందులో దర్శనాలు, కలలు, స్వస్థతలు మరియు దేవుని నుండి వచ్చే ఇతర బహుమతులు ఉండవచ్చు. ప్రభువు యందు వారి విశ్వాసం కారణంగా ఆయన నుండి అద్భుతాలను పొందిన వ్యక్తుల కథలు లేఖనాలలో చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణల కొరకు లేఖన దీపికలో “అద్భుతము” చూడండి.

విశ్వాసము శాంతిని తీసుకురాగలదు

దేవునిపై మరియు ఆయన రక్షణ ప్రణాళికపై విశ్వాసం కలిగియుండడం మన సవాళ్ళ సమయంలో మనల్ని బలపరచగలదు. విశ్వాసము మనకు ముందుకు సాగడానికి మరియు మన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు శక్తిని ఇవ్వగలదు. భవిష్యత్తు అస్థిరంగా అనిపించినప్పటికీ, రక్షకునిపై మన విశ్వాసం మనకు శాంతిని అనుగ్రహించగలదు.

చిత్రం
యేసు చిత్రలేఖనమును వారు చూస్తుండగా తన బిడ్డను పట్టుకొనియున్న తండ్రి

యేసు క్రీస్తునందు విశ్వాసం రక్షణకు దారితీస్తుంది

క్రీస్తునందు విశ్వాసమును అభ్యసించడం మన రక్షణకు దారితీస్తుంది. నిత్య జీవమును పొందేందుకు క్రీస్తు మన కొరకు మార్గాన్ని సిద్ధం చేశారు. మనము ఆయనయందు మన విశ్వాసము చేత జీవిస్తున్నప్పుడు, మన పాపములు క్షమించబడగలవు మరియు మరలా మనము దేవునితో జీవించడానికి తిరిగి వెళ్ళగలము.

ముద్రించు