“యేసు లాజరును మృతులలో నుండి లేపును,” ఫ్రెండ్, 2023 ఏప్రి , 46–47.
ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2023 ఏప్రిల్
యేసు లాజరును మృతులలో నుండి లేపును
మరియ మరియు మార్తలకు లాజరు అనే సోదరుడు ఉన్నాడు. వారు యేసు క్రీస్తు స్నేహితులు.
లాజరు చాలా జబ్బుపడ్డాడు. త్వరలో, అతను మరణించాడు. మరియ మరియు మార్త విచారంగా ఉన్నారు. యేసు వచ్చినప్పుడు, ఆయన వారితో పాటు ఏడ్చాడు.
అప్పుడు యేసు వారితో పాటు లాజరు సమాధి వద్దకు వెళ్ళాడు. “లాజరూ, బయటికి రా” అన్నాడు.
లాజరు నిలబడి, సమాధి నుండి బయటకు నడిచాడు. అతను మళ్ళీ జీవించాడు! యేసు కారణంగా, మనమందరం మళ్ళీ జీవిస్తాము!
రంగులువేసే పేజీ
యేసు క్రీస్తు సజీవుడు
ఏప్రిల్ స్టాట్ చేత వివరణ
ఈస్టర్ సమయంలో మీరు యేసును ఎలా గుర్తుంచుకుంటారు?
© 2023 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా.లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, April 2023 యొక్క అనువాదము. Language. 19006 421