2023
అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట
2023 సెప్టెంబరు


“అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట,” లియహోనా, 2023 సెప్ట.

2023 సెప్టెంబరు, లియహోనా నెలవారీ సందేశము

అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట

చిత్రం
జనులను స్వస్థపరుస్తున్న యేసు

జె. కిర్క్ రిఛర్డ్స్ చేతఆయన అనేక రకాల వ్యాధులను నయం చేశారు, అనుకరించబడదు.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, మనము అవసరతలో ఉన్న వారి పట్ల శ్రద్ధ చూపాలనే ప్రభువు యొక్క బోధనను అనుసరిస్తున్నాము. వారికి సేవ చేయడం ద్వారా, వారు స్వయం-సమృద్ధి గల వారిగా కావడానికి వారికి సహాయపడుట, మరియు మనకున్న దానిని పంచుకొనుట ద్వారా ఇతరుల పట్ల మనము శ్రద్ధ చూపుతాము.

యేసు క్రీస్తు యొక్క మాదిరి

యేసు క్రీస్తు తన చుట్టూ ఉన్న వారిని ప్రేమించారు, ఓదార్చారు, మరియు వారి కోసం ప్రార్థించారు. ఆయన “మేలు చేయుచు సంచరించుచుండెను” (అపొస్తులుల కార్యములు 10:38). మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించుట, ఓదార్చుట, సేవ చేయుట మరియు ప్రార్థించుట ద్వారా ఆయన మాదిరిని మనము అనుసరించగలము. ఇతరులకు సహాయం చేయడానికి మార్గాల కోసం మనం ఎల్లప్పుడు వెదకగలము.

చిత్రం
ఇద్దరు జనులు నడుస్తున్నారు

పరిచర్య

మనము ఒకరినొకరి కోసం ఎలా శ్రద్ధ చూపాలో వివరించడానికి పరిచర్య అనేమాట లేఖనాలలో మరియు ప్రభువు యొక్క సంఘములో ఉపయెగించబడింది. వార్డు లేదా బ్రాంచిలో ప్రతి వ్యక్తి లేదా కుటుంబానికి పరిచర్య చేసే సోదరులుగా యాజకత్వం గలవారు నియమించబడ్డారు. పరిచర్య చేసే సహోదరీలు ప్రతి వయోజన మహిళకు నియమించబడ్డారు. పరిచర్య చేసే సోదరులు మరియు సహోదరీలు సంఘ సభ్యులందరూ జ్ఞాపకముంచుకొనబడి మరియు శ్రద్ధ చూపబడాలని నిశ్చయిస్తారు.

చిత్రం
జనులు విత్తనాలను నాటుతున్నారు

ఇతరులు స్వయం-సమృద్ధి గల వారిగా కావడానికి సహాయపడుట

కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు తమ సమస్యలకు దీర్ఘ-కాల పరిష్కారాలను కనుగొనడానికి వారిని ప్రోత్సహించుట ద్వారా స్వయం-సమృద్ధి గలవారిగా కావడానికి మనము సహాయపడగలము. వారి లక్ష్యములపై వారు పని చేసినప్పుడు, మనము వారికి సహాయపడగలము. 2023 ఆగష్టు, లియహోనాలో సువార్త ప్రధానాలు వ్యాసము లో స్వయం-సమృద్ధి గురించి ఎక్కువ సమాచారాన్ని కనుగొనండి

ఇతరులకు సేవ చేయుట

మన చుట్టు ఉన్నవారికి సేవ చేయడానికి మరియు వారి ఐహిక, ఆత్మీయ, మరియు భావోద్వేగ సమస్యలను తీర్చడానికి సహాయపడటానికి అనేక విధానాలున్నాయి. ఇతరుల గురించి తెలుసుకోవడం మనము వారికి మెరుగైన సేవ ఎలా చేయగలమో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సహాయం చేయడానికి మనము చేయగల దానిని తెలుసుకోవడం కోసం మనము ప్రార్థన కూడ చేయవచ్చు.

చిత్రం
జనులు పండ్లను ఏరుకుంటున్నారు

మనకున్న దానిని పంచుకోవడం

దేవుడు మనల్ని ఆశీర్వదించిన దానిని పంచుకోవడం ద్వారా మనము ఇతరులకు సేవ చేయగలము. ఉదాహరణకు, మనము సంఘ మానవ సంక్షేమ సహాయ నిధికి ఉదారమైన ఉపవాస అర్పణలను ఇవ్వగలము లేదా విరాళమివ్వగలము. మన సమాజము మరియు మన సంఘ పిలుపులలో కూడ సేవ చేయగలము.

సంఘ నాయకుల బాధ్యతలు

బిషప్పు తన వార్డులో అవసరతలో ఉన్న వారి కోసం శ్రద్ధ చూపడానికి సమీక్ష చేస్తాడు. అతడు అవసరతలతో ఉన్న సభ్యులకు సహాయపడటానికి ఉపవాస అర్పణల నుండి డబ్బును ఉపయోగించవచ్చు. అతని సలహాదారులు, ఉపశమన సమాజము మరియు ఎల్డర్ల కోరముల అధ్యక్షత్వములు కలిపి ఇతర నాయకులు, సభ్యుల అవసరాలను తీర్చడానికి వారు ఉపయోగించగల వనరులను కనుగొనడానికి వారికి సహాయపడతారు.

సంఘ మానవతావాద సహాయ ప్రయత్నాలు

ప్రకృతి విపత్తులు వంటి సంఘటనల తరువాత సహాయము, ఉపశమనము అందించుట, సామాజిక ప్రాజెక్టులు, స్వచ్ఛమైన నీరు మరియు రోగనిరోధకత వంటి ఇతర కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సంఘము సహాయం చేస్తుంది. ఎక్కువగా నేర్చుకోవడానికి, డాల్లిన్ హెచ్. ఓక్స్, “పేదలకు మరియు కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుట,” లియహోనా, 2022 నవం, 6–8 చూడండి.

ముద్రించు