లియహోనా
యౌవనుల బలము కొరకు: మీ కొరకు రక్షకుని యొక్క సందేశం
2024 మార్చి


“యౌవనుల బలము కొరకు: మీ కొరకు రక్షకుని యొక్క సందేశం,” యౌవనుల బలము కొరకు, 2024 మార్చి.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 మార్చి

యౌవనుల బలము కొరకు: మీ కొరకు రక్షకుని యొక్క సందేశం

ఈ మార్గదర్శి, మీ ఎంపికలను యేసు క్రీస్తు మరియు ఆయన సిద్ధాంతానికి అనుసంధానం చేయడంలో మీకు సహాయపడుతుంది.

యేసు క్రీస్తు

I Stand at the Door and Knock [నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను.], జె. కర్క్ రిఛర్డ్స్ చేత

మీరు 2,000 సంవత్సరాల క్రితం పురాతన గలిలయలో నివసిస్తున్నారని ఊహించుకోండి. మీరు మరియు మీ స్నేహితులు, స్థానిక యూదుల ప్రార్థనా మందిరంలో నజరేయుడైన యేసు ప్రత్యేక అతిథి ప్రసంగీకునిగానున్న ఒక యువజన భక్తి సమావేశానికి ఆహ్వానించబడ్డారు. మరియు తన సందేశంలో ఒక నిర్దిష్ట సమయంలో, యేసు తనను ప్రశ్నలు అడగమని ప్రేక్షకులలోని యువతను ఆహ్వానిస్తారు.

మీరు ఎలాంటి ప్రశ్నలను వినవచ్చని మీరు అనుకుంటున్నారు?

కొన్ని ప్రశ్నలు ఆ కాలపు సంస్కృతిని మరియు పరిస్థితులను ప్రతిబింబిస్తాయని నేను అనుకుంటాను. కానీ వాటిలో చాలా వరకు ఈరోజు మనకున్న ప్రశ్నల వలెనే అనిపిస్తాయని నేను నిజంగా నమ్ముతున్నాను.

ఉదాహరణకు, క్రొత్త నిబంధనలో, జనులు రక్షకుడిని ఈ క్రింది ప్రశ్నలను అడిగారు:

  • నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?1

  • నేను అంగీకరించబడ్డానా? నేను చెందినవాడినా?2

  • నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను?3

  • భవిష్యత్తులో ఈ లోకానీకి ఏమి జరగబోతోంది? నేను రక్షించబడతానా?4

  • మీరు నా ప్రియమైన వారిని స్వస్థపరచగలరా?5

  • సత్యమనగా ఏమిటి?6

  • నేను సరైన మార్గములో వెళ్లుచున్నానో లేదో నాకు ఎలా తెలుస్తుంది?7

మనమందరం ఎప్పటికప్పుడు ఇవే విషయాలకు ఆశ్చర్యపడుటలేదా? శతాబ్దాలుగా, ప్రశ్నలు పెద్దగా మారలేదు. మరియు ఆ ప్రశ్నలు అడిగే వారి పట్ల రక్షకుని కనికరము కూడా మారలేదు. జీవితం ఎంత ఇబ్బందికరంగా మరియు గందరగోళంగా ఉంటుందో ఆయనకు తెలుసు. మనం దారి తప్పిపోవడం ఎంత సులభమో ఆయనకు తెలుసు. మనం కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతామని ఆయనకు తెలుసు. మరియు ఆయన చాలా కాలం క్రితం తన అనుచరులతో చెప్పినట్లే, మీకు మరియు నాకు చెప్పుచున్నారు:

  • “మీ హృదయమును కలవరపడనియ్యకుడి.”8

  • “నేనే మార్గమును [మరియు] సత్యమును.”9

  • “నన్ను వెంబడించుము.”10

మీరు ముఖ్యమైన ఎంపికలు చేయవలసి వచ్చినప్పుడు, యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త శ్రేష్ఠమైన ఎంపికలు. మీకు ప్రశ్నలున్నప్పుడు, యేసు క్రీస్తు మరియు పునఃస్థాపించబడిన ఆయన సువార్త శ్రేష్ఠమైన సమాధానము.

అందుకే నేను యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శిని ప్రేమిస్తున్నాను. ఇది మనలను యేసు క్రీస్తు వైపు చూపుతుంది కాబట్టి మనము ఆయన బలమును పొందవచ్చు. నేను అన్ని సమయాలలో నా జేబులో ఒక ప్రతిని ఉంచుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను నేను కలిసినప్పుడు, యేసు క్రీస్తు సంఘ సభ్యులుగా మనం ఏమి చేస్తున్నామో తెలుసుకోవాలనుకునే వారితో నేను ఈ మార్గదర్శి ప్రతిని పంచుకుంటాను.

యౌవనుల బలము కొరకు, రక్షకుని గురించి మరియు ఆయన మార్గం గురించి నిత్య సత్యాలను బోధిస్తుంది. ఆ సత్యాల ఆధారంగా ఎంపికలు చేసుకోవడానికి ఇది మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మరియు అది ఆయనను అనుసరించే వారికి ఆయన అందించే వాగ్దానం చేయబడిన దీవెనలను పంచుకుంటుంది. దయచేసి ఈ మార్గదర్శిని చదవండి, ధ్యానించండి మరియు పంచుకొనండి!

ఆయనను లోపలికి ఆహ్వానించండి

నిరంతరం, రోజువారీ ఉనికిలో, మంచి సమయాల్లో మరియు చెడు సమయాల్లో—యేసు క్రీస్తు మీ జీవితంలో భాగమవ్వాలని కోరుకుంటున్నారు. ఆయన కేవలం మార్గం చివరలో నిలబడటం లేదు, మీరు ఆయనను కలుసుకోవాలని వేచియున్నారు. మార్గమందు ప్రతీ అడుగుతో ఆయన మీతో నడుస్తారు. ఆయనే మార్గము!

కానీ ఆయన మీ జీవితంలోకి తన మార్గాన్ని బలవంతం చేయడు. మీరు మీ ఎంపికల ద్వారా ఆయనను లోపలికి ఆహ్వానించండి. అందుకే యౌవనుల బలము కొరకు, ఎంపికలు చేయడానికి ఒక మార్గదర్శిగా చాలా విలువైనది. రక్షకుని యొక్క నిత్య సత్యాల ఆధారంగా మీరు నీతియుక్తమైన ఎంపిక చేసిన ప్రతిసారీ, మీ జీవితంలో ఆయనను కోరుకుంటున్నట్లు మీరు చూపుతారు. ఆ ఎంపికలు పరలోకపు ద్వారములను తెరుస్తాయి, మరియు ఆయన బలము మీ జీవితంలోకి ప్రవహిస్తుంది.11

ఒక బలమైన సంబంధమును ఏర్పరుచుకోండి

రక్షకుడు తన మాటలు విని మరియు ఆచరించేవారిని “బండ మీద తన ఇల్లు కట్టుకొనిన” జ్ఞానితో పోల్చాడని మీరు గుర్తుంచుకోవచ్చు. ఆయన ఇలా వివరించారు:

“వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.”12

ఒక ఇల్లు బలంగా ఉన్నందున ఒక తుఫానులో ఆ ఇల్లు తట్టుకొని నిలబడదు. రాయి బలంగా ఉన్నందున కూడా అది తట్టుకొని నిలబడదు. ఆ బలమైన బండమీద స్థిరంగా పునాది వేయబడెను గనుక ఇల్లు తుఫానును తట్టుకొని నిలబడింది. బండమీద బలమైన పునాదిని ఏర్పరుచుకోవడం అనేది ముఖ్యం.

అదేవిధంగా, మనం మన జీవితాలను నిర్మించుకునేటప్పుడు, మంచి ఎంపికలు చేసుకోవడం చాలా ముఖ్యమైనది. మరియు రక్షకుని యొక్క నిత్య సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. కానీ, జీవితపు తుఫానులను తట్టుకోవడానికి మనకు అవసరమైన శక్తి మనం మన ఎంపికలను యేసు క్రీస్తుతో మరియు ఆయన సిద్ధాంతంతో అనుసంధానించినప్పుడు వస్తుంది. యౌవనుల బలము కొరకు మనకు సహాయం చేసేది అదే.

ఉదాహరణకు, మీరు అభ్యంతరకరమైన లేదా బాధ కలిగించే భాషను ఉపయోగించకుండా ఉండటానికి మీరు ప్రయత్నిస్తున్నారని మీ స్నేహితులకు తెలిసియుండవచ్చు. పాఠశాలలో చాలా మంది వ్యక్తులు విస్మరించే లేదా బెదిరించే పిల్లవాడిని మీరు చేరుకోవడం వారు చూసియుండవచ్చు. కానీ యేసు క్రీస్తు “మీకంటే భిన్నంగా ఉన్న వ్యక్తులతో … సహా—జనులందరూ మీ సోదరులు మరియు సోదరీమణులు—” అని బోధించినందు వలన మీరు ఈ ఎంపికలు చేస్తున్నారని వారికి తెలుసా?13

మీరు ప్రతి ఆదివారం సంఘమునకు వెళ్తారని మీ స్నేహితులకు తెలిసియుండవచ్చు. మీరు నిర్దిష్ట పాటను ఆపివేసినప్పుడు లేదా నిర్దిష్ట చలనచిత్రాన్ని చూడాలనే ఆహ్వానాన్ని తిరస్కరించినప్పుడు వారు గమనించియుండవచ్చు. అయితే మీరు “పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో సంతోషకరమైన నిబంధన సంబంధాన్ని,” కలిగి ఉన్నందున మీరు ఈ ఎంపికలు చేస్తున్నారని మరియు రక్షకుని అనుసరించడానికి ఆ నిబద్ధతలో భాగంగా, “పరిశుద్ధాత్మను మీ నిరంతర సహచరుడిగా కలిగి ఉన్నందుకు” మీరు కృతజ్ఞతతో ఉన్నారని వారికి తెలుసా?14

మీరు మద్యపానం లేదా ధూమపానం చేయరని లేదా ఇతర హానికరమైన మాదకద్రవ్యాలను ఉపయోగించరని ప్రజలకు తెలిసియుండవచ్చు. కానీ యేసు క్రీస్తు “మీ శరీరం పవిత్రమైనది,” “మీ పరలోక తండ్రి నుండి ఆయన స్వరూపమందు రూపొందిచబడిన అద్భుతమైన బహుమతి,” అని బోధించినందు వలన మీరు ఈ ఎంపికలు చేస్తున్నారని వారికి తెలుసా? 15

మీరు మోసం చేయరని లేదా అబద్ధాలు చెప్పరని మరియు మీరు విద్యను ముఖ్యమైనదిగా పరిగణిస్తారని మీ స్నేహితులకు తెలిసియుండవచ్చు. అయితే “సత్యం మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుందని” యేసు క్రీస్తు బోధించడమే ఇందుకు కారణమని వారికి తెలుసా?16

అన్నింటికంటే ముఖ్యంగా, “యేసు క్రీస్తే మీ బలం” అని మీకు తెలుసు కాబట్టి మీరు క్రీస్తు ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు కొన్నిసార్లు ఈ జనాదరణ పొందని ఎంపికలు చేస్తారని మీ స్నేహితులకు తెలుసా?17

ఆయనే మీ బలము

యేసు క్రీస్తు ఉజ్వలమైన మరియు మహిమాన్వితమైన మీ భవిష్యత్తుకు మార్గమని నేను మీకు నిశ్చయమైన సాక్ష్యమిస్తున్నాను. మరియు ఆయన ఉజ్వలమైన మరియు అద్భుతమైన వర్తమానానికి కూడా మార్గము. ఆయన మార్గమందు నడుచుకోండి, ఆయన మీతో నడుస్తారు. మీరు దీనిని చేయగలరు!

నా ప్రియమైన యువ స్నేహితులారా, యేసు క్రీస్తు మీ బలము. ఆయనతో నడుస్తూ ఉండండి, మరియు ఆయన మీ కోసం సిద్ధం చేసిన నిత్యమైన ఆనందం వైపు “పక్షిరాజులవలె రెక్కలతో”18 ఎగరడానికి ఆయన మీకు సహాయం చేస్తారు.