“జేకబ్ మరియు నీఫైలు యేసును చూశారు,” ఫ్రెండ్, 2024 మార్చి, 26–27.
ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2024 మార్చి
జేకబ్ మరియు నీఫైలు యేసును చూశారు
జేకబ్ నీఫై తమ్ముడు. వారి కుటుంబం యెరూషలేమును విడిచిపెట్టిన తర్వాత అతను జన్మించాడు. జేకబ్ చిన్నతనంలో వాగ్దానం చేసిన దేశానికి వచ్చాడు.
జేకబ్ మరియు నీఫైలు ఇరువురూ యేసు క్రీస్తును చూశారు. యేసును గురించి తెలుసుకోవడానికి వారికి సహాయం చేయడానికి వారు వారి సాక్ష్యాలను తమ కుటుంబాలతో పంచుకున్నారు.
వారు యెషయా ప్రవక్త యొక్క మాటలను కూడా పంచుకున్నారు. యెషయా కూడా యేసును చూశాడు మరియు ఆయన యేసును గురించి లేఖనాలలో వ్రాసాడు. జేకబ్ మరియు నీఫై తమ కుటుంబాలకు యేసును గురించి బోధించడానికి లేఖనాల నుండి యెషయా మాటలను ఉపయోగించారు.
యేసు భూమిపైకి వస్తారని ఆయన మరణించి మరల జీవిస్తారని వారు బోధించారు. వారు యేసు క్రీస్తు గురించి తమ సాక్ష్యాన్ని పంచుకున్నారు, తద్వారా వారి కుటుంబాలు ఆయన రాకడ కోసం ఎదురు చూస్తాయి.
© 2024 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2024 మార్చి యొక్క అనువాదము. Telugu. 19287 421