2024 రండి, నన్ను అనుసరించండి
అనుబంధము బి: ప్రాథమిక కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట


“అనుబంధము బి: ప్రాథమిక కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“అనుబంధము బి,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024

అనుబంధము బి

ప్రాథమిక కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట

ఐదు ఆదివారాలు ఉన్న నెలల్లో, ఐదవ ఆదివారం ప్రణాళిక చేయబడిన రండి, నన్ను అనుసరించండి సారాంశాన్ని వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అభ్యాస కార్యకలాపాలతో భర్తీ చేయమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.

యేసు క్రీస్తు సువార్త యొక్క సూత్రాలు మరియు విధులు

క్రీస్తు యొక్క సిద్ధాంతము దేవుడి వద్దకు ఎలా తిరిగివెళ్ళాలో మనకు బోధిస్తుంది.

అమెరికాలలోని జనులకు యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన తన సిద్ధాంతాన్ని వారికి బోధించారు. మనం విశ్వాసం కలిగియుండి, పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను పొంది, అంతము వరకు సహించినట్లయితే, మనం దేవుని రాజ్యములో ప్రవేశించగలమని ఆయన చెప్పారు (3 నీఫై 11:31–40; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:29 చూడండి). ఈ సూత్రాలు మరియు విధులు మన జీవితాలంతటా రక్షకునికి దగ్గర కావడానికి మనకు సహాయపడతాయని పిల్లలకు బోధించడానికి క్రింది ప్రోత్సాహ కార్యక్రమాలు మీకు సహాయపడగలవు.

క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని మరి ఎక్కువగా నేర్చుకోవడానికి, 2 నీఫై 31 చూడండి.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • యేసు క్రీస్తునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు నిర్ధారణను సూచించే చిత్రాలను పిల్లలకు ఇవ్వండి. నాల్గవ విశ్వాస ప్రమాణాన్ని పిల్లలతో కలిసి చదవండి లేదా పఠించండి మరియు ఆ సూత్రము లేదా విధి తెలియజేయబడినప్పుడు, వారి చిత్రాలను పైకెత్తి పట్టుకోమని వారిని అడగండి. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వలె ఎక్కువగా కావడానికి ఈ సూత్రాలు మరియు విధులలో ప్రతీఒక్కటి మనకు ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడండి.

  • విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు నిర్ధారణ అనేవి ఒక్కసారి జరిగే సంఘటనలు కావు, కానీ మన జీవితాలంతటా మన ఆధ్యాత్మిక ఎదుగుదలను ప్రభావితం చేస్తాయని అర్థం చేసుకోవడానికి పిల్లలకు మీరు ఎలా సహాయపడగలరు? ఉదాహరణకు, మీరు ఒక విత్తనము మరియు ఒక పెద్ద చెట్టు యొక్క చిత్రాన్ని వారికి చూపించవచ్చు (లేదా బోర్డు మీద వాటిని గీయవచ్చు). విత్తనము పెద్ద చెట్టుగా పెరగడానికి సహాయపడే నీరు, మట్టి మరియు సూర్యరశ్మి వంటివాటి గురించి ఆలోచించడానికి వారికి సహాయపడండి. ఇవి మన జీవితాలంతటా మనం దేవునికి దగ్గరవడానికి చేసే పనులు—యేసు క్రీస్తునందు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, ప్రతీరోజు పశ్చాత్తాపపడడం, మన బాప్తిస్మపు నిబంధనలను జీవించడం మరియు పరిశుద్ధాత్మను ఆలకించడం వంటి వాటివలె ఉన్నాయని చూడడానికి వారికి సహాయపడండి.

  • మనం పశ్చాత్తాపపడినప్పుడు మనమెందుకు ఆనందిస్తాము? మిమ్మల్ని క్షమించమని మీరు పరలోక తండ్రిని అడిగినప్పుడు మీరు అనుభవించిన ఆనందాన్ని, ప్రేమను పిల్లలతో పంచుకోండి.

బాప్తిస్మము

యేసు క్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన నా కొరకు ఉదాహరణగా నిలిచారు.

యేసు ఏ పాపము చేయకపోయినప్పటికీ, పరలోక తండ్రి పట్ల విధేయతకు పరిపూర్ణ మాదిరిగా నిలవడానికి ఆయన బాప్తిస్మము పొందారు (2 నీఫై 31:6–10 చూడండి).

బాప్తిస్మము గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి, సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 కూడా చూడండి.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • రక్షకుని బాప్తిస్మము మరియు మరొక వ్యక్తి బాప్తిస్మము యొక్క చిత్రాన్ని చూపించండి. రెండు చిత్రాలలో ఒకేలా ఉన్నదేమిటో మరియు భిన్నంగా ఉన్నదేమిటో చెప్పమని పిల్లలను అడగండి. కలిసి మత్తయి 3:13–17 చదవండి.

    చదివిన దానిలో చెప్పబడిన విషయాలను పిల్లలు చిత్రాలలో చూపించేలా చేయండి. రక్షకుని కొరకు మీ ప్రేమ మరియు ఆయనను అనుసరించాలనే మీ కోరిక గురించి పిల్లలకు చెప్పండి.

  • బాప్తిస్మము గురించి ఒక పాటను వినండి లేదా పాడండి. పాట నుండి బాప్తిస్మము గురించి మనము ఏమి నేర్చుకుంటాము? 2 నీఫై 31:9–10 చదవండి మరియు యేసు క్రీస్తు ఎందుకు బాప్తిస్మము పొందారనే దాని కొరకు వినమని పిల్లలను ఆహ్వానించండి. వారు బాప్తిస్మము పొందిన రోజు వారున్నట్లుగా చిత్రాన్ని గీయమని వారిని ఆహ్వానించండి.

నేను దేవునితో నిబంధన చేయడానికి మరియు బాప్తిస్మము పొందడానికి ఎంచుకోగలను.

బాప్తిస్మము కొరకు సిద్ధపడడం అంటే అర్థం ఒక కార్యక్రమము కొరకు సిద్ధపడడం కంటే చాలా ఎక్కువ అని. దానర్థం, ఒక నిబంధన చేయడానికి, ఆ తర్వాత జీవితకాలం పాటు ఆ నిబంధనను పాటించడానికి సిద్ధపడడం. పిల్లలు బాప్తిస్మం పొందినప్పుడు పరలోక తండ్రితో వారు చేసే నిబంధనను అర్థం చేసుకోవడానికి వారికి మీరు ఎలా సహాయపడగలరో ధ్యానించండి, అందులో ఆయన వారితో చేసే వాగ్దానాలు మరియు వారు ఆయనతో చేసే వాగ్దానాలు కలిపి ఉంటాయి.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • నిబంధన అనేది పరలోక తండ్రికి మరియు ఒక వ్యక్తికి మధ్య చేయబడే వాగ్దానం అని వివరించండి. దేవునితో మనం చేసే వాగ్దానాలను పాటించడానికి మనం ప్రయత్నించినప్పుడు, మనల్ని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు. బోర్డు మీద దేవునితో నేను చేసే వాగ్దానాలు మరియు దేవుడు నాతో చేసే వాగ్దానాలు అని వ్రాయండి. మోషైయ 18:10, 13 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 కలిసి చదవండి మరియు సరియైన శీర్షికల క్రింద వారు కనుగొనే వాగ్దానాలను జాబితా చేయడానికి పిల్లలకు సహాయపడండి. మీ బాప్తిస్మపు నిబంధనను పాటించడానికి మీరు ప్రయాసపడినప్పుడు పరలోక తండ్రి మిమ్మల్ని ఏవిధంగా దీవించారో పంచుకోండి.

  • యేసు క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన పనుల చిత్రాలను పిల్లలకు చూపించండి. ప్రతీ చిత్రములో యేసు చేస్తున్న దాని గురించి పిల్లలను మాట్లాడనివ్వండి. మోషైయ 18:8–10, 13 చదవండి మరియు వారు బాప్తిస్మం పొందినప్పుడు వారు చేస్తారని వాగ్దానం చేసిన విషయాల కొరకు వినమని పిల్లలను ఆహ్వానించండి. ఈ వాగ్దానాలు ప్రతీరోజు మన క్రియలను ఏవిధంగా ప్రభావితం చేస్తాయి? యేసు చేసినట్లుగా వారు ఎవరికైనా సహాయం చేస్తున్నట్లు వారి చిత్రాన్ని గీయమని పిల్లలను ఆహ్వానించండి. లేదా రక్షకుని పేరుగల ఒక సాధారణ బ్యాడ్జిని పిల్లలు ధరించేలా మీరు చేయవచ్చు.

    బాప్తిస్మము పొందుతున్న బాలుడు

    మనం బాప్తిస్మం పొందినప్పుడు, మనం దేవునితో వాగ్దానాలు చేస్తాము మరియు ఆయన మనతో వాగ్దానాలు చేస్తారు.

నిర్ధారణ

నేను నిర్ధారించబడినప్పుడు, నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా మారతాను.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా మారడం అనేక దీవెనలను తెస్తుంది, వాటిలో దేవుని కార్యములో చురుకుగా పాల్గొనడానికి పిల్లలకు అవకాశాలు కలిపియుంటాయి.

నిర్ధారణ మరియు పరిశుద్ధాత్మ వరము గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి, గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “పరిశుద్ధాత్మ మీకేవిధంగా సహాయపడగలదు?,” లియహోనా, మే 2017, 117–20 చూడండి.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • ఇటీవల బాప్తిస్మము పొంది, నిర్ధారించబడిన ఒకరిని తరగతికి వచ్చి, నిర్ధారించబడడం ఎలా అనిపించిందో పంచుకోమని ఆహ్వానించండి. ఈ వ్యక్తి అభిప్రాయంలో యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా మారడమంటే అర్థమేమిటి? సంఘ సభ్యులుగా తమ బాప్తిస్మపు నిబంధనను వారు పాటించగల విధానాల గురించి ఆలోచించడానికి పిల్లలకు సహాయపడండి (ఇతరులకు సేవచేయడం, యేసు గురించి మరింతగా నేర్చుకోవడానికి ఇతరులను ఆహ్వానించడం, సమావేశాలలో ప్రార్థనలు చేయడం మరియు మొదలైనవి). ఈ పనులు చేయడం క్రీస్తు సంఘము యొక్క సభ్యుడైనందుకు మీరు ఆనందించడానికి ఎలా సహాయపడిందో పంచుకోండి.

  • మోర్మన్ జలముల వద్దనున్న జనుల చిత్రాన్ని చూపించండి మరియు చిత్రంలో వారు చూస్తున్న దానిని వివరించమని పిల్లలను అడగండి. మోషైయ 18:1–17 ఉపయోగించి ఆల్మా మరియు మోర్మన్ జలముల వద్దనున్న అతని జనుల కథను పునర్వీక్షించండి.

    మోషైయ 18:8–9 పునర్వీక్షించండి మరియు క్రీస్తు సంఘము యొక్క సభ్యులుగా జనులు చేయడానికి ఇష్టపడిన విషయాలను గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడేందుకు చర్యలు తీసుకోమని పిల్లలను ఆహ్వానించండి. ఈ విధానాలలో సంఘ సభ్యులు సేవచేయడాన్ని మీరు చూసిన ఒక అనుభవాన్ని పంచుకోండి.

నేను నిర్ధారించబడినప్పుడు, నేను పరిశుద్ధాత్మ వరమును పొందుతాను.

మనం బాప్తిస్మం పొంది, నిర్ధారించబడినప్పుడు, మనం “ఎల్లప్పుడు ఆయన ఆత్మను [మన]తో కలిగియుండెదము గాక” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77) అని పరలోక తండ్రి వాగ్దానమిస్తారు. దేవుని నుండి ఈ అద్భుతమైన బహుమానము పరిశుద్ధాత్మ వరము అని పిలువబడుతుంది.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 33:15 చదవండి మరియు మనం బాప్తిస్మం పొంది, నిర్ధారించబడినప్పుడు పరలోక తండ్రి మనకిచ్చే ప్రత్యేక బహుమానము కొరకు వినమని పిల్లలను అడగండి. పరిశుద్ధాత్మ వరము వారికి ఎలా సహాయపడుతుంది అనే దాని గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి వారికి సహాయపడేందుకు, యోహాను 14:26; గలతీయులకు 5:22–23; 2 నీఫై 32:5; 3 నీఫై 27:20 కలిసి పునఃసమీక్షించండి.

  • తరగతికి ముందు, వారు పరిశుద్ధాత్మ వరమును కలిగియున్నందుకు వారెలా దీవించబడ్డారో పంచుకోమని ఒకరు లేదా ఎక్కువమంది పిల్లల తల్లిదండ్రులను అడగండి. ఆయన వారికి ఎలా సహాయపడ్డారు? ఆయన స్వరమును వారెలా విన్నారు?

  • కలిసి పరిశుద్ధాత్మ గురించి ఒక పాట పాడండి. పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయపడతారనే దాని గురించి పాట బోధించే దానిని అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడండి.

పరిశుద్ధాత్మ నాతో అనేక విధాలుగా మాట్లాడగలడు.

ఆత్మ యొక్క స్వరాన్ని గుర్తించగల పిల్లలు వారి జీవితాలంతటా వారిని నడిపించడానికి వ్యక్తిగత బయల్పాటును పొందడానికి సిద్ధంగా ఉంటారు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడేందుకు అనేక విధాలున్నాయని వారికి బోధించండి.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • దూరంగా నివసించే ఒక స్నేహితునితో మనం మాట్లాడగల వివిధ మార్గాలు, అనగా ఉత్తరం వ్రాయడం, ఈ మెయిల్ పంపడం లేదా ఫోనులో మాట్లాడడం వంటివాటి గురించి ఆలోచించడానికి పిల్లలకు సహాయపడండి. పరిశుద్ధాత్మ ద్వారా పరలోక తండ్రి మనతో మాట్లాడగలరని వారికి బోధించండి.

  • మీ మనస్సులో ఆలోచనల ద్వారా లేదా మీ హృదయంలో మనోభావన ద్వారా పరిశుద్ధాత్మ మీతో సంభాషించిన ఒక అనుభవాన్ని పంచుకోండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22–23; 8:2–3 చూడండి). అటువంటి విధానాలలో పరిశుద్ధాత్మ వారికి సహాయపడగలడని పిల్లలకు సాక్ష్యమివ్వండి.

  • వారు ఆత్మను అనుభవించిన సమయాల గురించి ఆలోచించడానికి పిల్లలకు సహాయపడండి—ఉదాహరణకు, రక్షకుని గురించి ఒక పాట పాడినప్పుడు లేదా ఇతరుల కోసం దయగల పని చేసినప్పుడు. పరిశుద్ధాత్మ తీసుకువచ్చే ఆత్మీయ మనోభావాలను గుర్తించడానికి వారికి సహాయపడండి. పరిశుద్ధాత్మ మనకు ఆ మనోభావాలను ఎందుకు ఇస్తాడని మీరనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ మనతో మాట్లాడినప్పుడు వినడానికి మనం చేయవలసిన పనుల గురించి ఆలోచించడానికి పిల్లలకు సహాయపడండి. ఆత్మను మరింత స్పష్టముగా వినడానికి మీరేమి చేస్తారనే దాని గురించి మాట్లాడండి.

సంస్కారము

నేను సంస్కారమును తీసుకున్నప్పుడు, నేను రక్షకుని త్యాగమును గుర్తుచేసుకొని, నా నిబంధనలను నూతనంగా చేస్తాను.

మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుంచుకోవడానికి మరియు మన నిబంధనలను నూతనంగా చేసుకోవడానికి మనకు సహాయపడేందుకు రక్షకుడు మనకు సంస్కారమును ఇచ్చారు. ఈ వారపు విధి కారణంగా, మన జీవితాలంతటా మన బాప్తిస్మము యొక్క దీవెనలను ఆనందించడాన్ని మనం కొనసాగించగలము.

మరింత నేర్చుకోవడానికి, మత్తయి 26:26–30; 3 నీఫై 18:1–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • 3 నీఫై 18:1–12 లోని భాగాలను పిల్లల కొరకు చదవండి.ChurchofJesusChrist.org సంస్కారము తీసుకున్నప్పుడు యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకోవడానికి మనము ఏమి చేయగలము?

  • వారు చేయడానికి ఎల్లప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను మీతో చెప్పమని పిల్లలను అడగండి, వారి బూట్ల తాళ్ళు కట్టుకోవడం లేదా వారు తినడానికి ముందు వారి చేతులు కడుక్కోవడం వంటివి. ఈ విషయాలను గుర్తుంచుకోవడం ఎందుకు ముఖ్యము? పిల్లల కోసం మొరోనై 4:3 చదవండి మరియు మనం సంస్కారము తీసుకున్నప్పుడు మనం ఎల్లప్పుడు ఏమి గుర్తుంచుకుంటామని వాగ్దానం చేస్తామో వినమని వారిని ఆహ్వానించండి. యేసు క్రీస్తును గుర్తుంచుకోవడం ఎందుకు ముఖ్యము? యేసు మన కోసం చేసిన దానిని గుర్తుంచుకోవడానికి సంస్కారము యొక్క రొట్టె మరియు నీరు మనకు ఏవిధంగా సహాయపడతాయో అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడండి (మొరోనై 4:3; 5:2 చూడండి).

  • బోర్డు మీద “… అని నేను వాగ్దానం చేస్తున్నాను” అని వ్రాయండి. పిల్లల కోసం సంస్కార ప్రార్థనలు చదవండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి). మనం దేవునితో చేసే ఒక వాగ్దానాన్ని వారు వినినప్పుడు, ఆగి, వారు వినిన వాగ్దానంతో బోర్డు మీద ఉన్న వాక్యాన్ని పూర్తిచేయడానికి వారికి సహాయపడండి. మనం సంస్కారము తీసుకున్నప్పుడు, మన బాప్తిస్మమప్పుడు చేసిన అవే వాగ్దానాలను మనం చేస్తున్నామని అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడండి.

  • యేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకొనుట అనగా అర్థమేమిటి? ఈ ప్రశ్నకు జవాబివ్వడానికి పిల్లలకు సహాయపడేందుకు, మనం మన పేర్లు వ్రాసుకొనే వాటి గురించి పంచుకోండి. ఈ వస్తువులపై మనం మన పేరును ఎందుకు వ్రాసుకుంటాము? ఆయన పేరును మనపై తీసుకోవాలని యేసు క్రీస్తు ఎందుకు కోరుతున్నారు? అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి నుండి ఈ వివరణను పంచుకోవడం గురించి ఆలోచించండి: “రక్షకుని నామాన్ని మనపై తీసుకొనుట ఇతరులకు మన మాటలు, క్రియల ద్వారా యేసే క్రీస్తని-- ప్రకటించడాన్ని, సాక్ష్యమివ్వడాన్ని కలిగియుంటుంది” (“సంఘము యొక్క సరియైన పేరు,” లియహోనా, నవ. 2018, 88).

యాజకత్వ శక్తి, అధికారము మరియు తాళపుచెవులు

యాజకత్వ శక్తి ద్వారా దేవుడు తన పిల్లలను దీవిస్తారు.

స్త్రీలు, పురుషులు, యౌవనులు మరియు వృద్ధులు—దేవుని పిల్లలందరు—ఆయనతో వారు చేసిన నిబంధనలను వారు పాటించినప్పుడు దేవుని శక్తిని పొందుతారు. బాప్తిస్మము వంటి యాజకత్వ విధులను మనం పొందినప్పుడు మనం ఈ నిబంధనలను చేస్తాము (General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 3.5, సువార్త గ్రంథాలయము చూడండి). మరింత నేర్చుకోవడానికి, రస్సెల్ ఎమ్. నెల్సన్, “ఆత్మీయ నిధులు,” లియహోనా, నవ. 2019, 76–79; “Priesthood Principles,” chapter 3 in General Handbook చూడండి.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • యాజకత్వము కారణంగా వారు పొందే దీవెనలను గమనించడానికి పిల్లలకు సహాయపడండి.

  • ఈ దీవెనలను బోర్డు మీద జాబితా చేయడాన్ని పరిగణించండి. ఈ దీవెనలు మనకు ఎందుకు ముఖ్యమైనవి? యేసు క్రీస్తు మరియు ఆయన యాజకత్వ శక్తి కారణంగా ఈ దీవెనలు మనకు వస్తాయని సాక్ష్యమివ్వండి.

  • క్రింది శీర్షికలను బోర్డు మీద వ్రాయండి: దేవుని శక్తి మరియు భూమి మీదనున్న మనుష్యులకు ఇవ్వబడిన దేవుని శక్తి మరియు అధికారము. లోకాన్ని సృష్టించడం, మనకు నడిపింపును, నిర్దేశాన్ని ఇవ్వడం, ఆయన మనల్ని ప్రేమిస్తారని మరియు మనల్ని ఎరుగుదురని, మన ప్రార్థనలను విని, జవాబిస్తారని మనకు చూపడం వంటివాటి ద్వారా మనల్ని దీవించడానికి దేవుడు తన శక్తిని ఎలా ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే చిత్రాలను మొదటి శీర్షిక క్రింద పెట్టమని పిల్లలను అడగండి. రోగులను దీవించడం, బాప్తిస్మమివ్వడం, నిర్ధారించడం, సంస్కారమును నిర్వహించడం, కుటుంబాలను ముద్రించడం వంటివాటి ద్వారా మనల్ని దీవించడానికి భూమిపై నున్న యోగ్యులైన పురుషులు ఎలా దేవుని శక్తిని మరియు అధికారాన్ని ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడే చిత్రాలను రెండవ శీర్షిక క్రింద పెట్టమని వారిని అడగండి. యాజకత్వము మరియు అది తీసుకువచ్చే దీవెనల కొరకు మీరు ఎందుకు కృతజ్ఞతతో ఉన్నారో పంచుకోండి.

  • మన జీవితాల్లో దేవుని శక్తి యొక్క దీవెనలను మనం పొందే ముఖ్యవిధానాల్లో ఒకటి యాజకత్వ విధుల ద్వారా (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20 చూడండి). ఈ సత్యమును నేర్చుకోవడానికి పిల్లలకు సహాయపడేందుకు, మీరు బోర్డు మీద ఈ క్రింది లేఖనాలను జాబితా చేయవచ్చు: 3 నీఫై 11:21–26, 33 (బాప్తిస్మము); మొరోనై 2 (నిర్ధారణ); మొరోనై 4–5 (సంస్కారము). పిల్లలలో ప్రతీఒక్కరు ఈ గద్యభాగాలలో ఒకదానిని ఎంచుకొని, అది వివరించే విధిని గుర్తించవచ్చు. యాజకత్వ విధులను పొందడం ద్వారా వారు వ్యక్తిగతంగా ఎలా దీవించబడ్డారో పంచుకోమని పిల్లలను ఆహ్వానించండి.

  • వారు బాప్తిస్మము పొంది, వారి బాప్తిస్మపు నిబంధనను పాటించినప్పుడు, వారు దేవుని నుండి శక్తిని పొందుతారని అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడండి. ఈ శక్తి వారికి ఎలా సహాయపడగలదో పిల్లలను అడగండి.

దేవుని కార్యము యాజకత్వ తాళపుచెవులతో నిర్దేశింపబడుతుంది మరియు యాజకత్వ అధికారముతో సాధించబడుతుంది.

సంఘము యొక్క యోగ్యులైన పురుష సభ్యులు యాజకత్వములోని ఒక స్థానానికి నియమించబడగలరు. అదనంగా, ఒక వ్యక్తి ఒక పిలుపు కొరకు ప్రత్యేకపరచబడినప్పుడు లేదా దేవుని కార్యములో సహాయపడేందుకు నియమించబడినప్పుడు, అతడు లేదా ఆమె వారికి అప్పగించబడిన యాజకత్వ అధికారాన్ని వినియోగించగలరు. సంఘములో యాజకత్వ అధికారము యొక్క ఉపయోగమంతా యాజకత్వ తాళపుచెవులు కలిగియున్న వ్యక్తులు, అనగా స్టేకు అధ్యక్షుడు, బిషప్పు మరియు సమూహ అధ్యక్షులు వంటివారి చేత నిర్దేశించబడుతుంది. ప్రభువు యొక్క కార్యమును చేయుటలో యాజకత్వపు ఉపయోగమును నిర్దేశించు అధికారమే యాజకత్వ తాళపుచెవులు.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • పిల్లలతో కలిసి మార్కు 3:14–15 చదవండి మరియు అక్కడ వివరించబడిన సంఘటన యొక్క చిత్రాన్ని వారికి చూపించండి. ఎవరైనా ఒకరు యాజకత్వ స్థానానికి నియమించబడడాన్ని లేదా ఒక పిలుపు కొరకు ప్రత్యేకపరచబడడాన్ని వారెప్పుడైనా చూసారా అని పిల్లలను అడగండి (లేదా మీకు కలిగిన అనుభవాల గురించి వారికి చెప్పండి). రక్షకుడు తన అపొస్తలులతో చేసిన దానిని అది ఎలా పోలియున్నది? సంఘ సభ్యులకు ఇవ్వబడగల పిలుపులు లేదా యాజకత్వ స్థానాలు, అనగా ఒక నిర్మాణములో బోధకుడు లేదా నాయకుడు వంటివాటిని బోర్డు మీద జాబితా చేయడానికి పిల్లలకు సహాయపడండి. ప్రతీ స్థానము లేదా పిలుపు ప్రక్కన, ఆ స్థానము లేదా పిలుపు కలిగియున్న వారు ఏమి చేయడానికి అధికారము కలిగియున్నారో మీరు వ్రాయవచ్చు. యాజకత్వ తాళపుచెవుల నిర్దేశము క్రింద ఒకరి చేత ప్రత్యేకపరచబడడం మీరు సేవచేయడానికి ఎలా సహాయపడిందో పిల్లలకు చెప్పండి.

  • తెరవడానికి మీకు ఒక తాళంచెవి అవసరమైన ఒక కారు లేదా ఒక తలుపు వంటివాటి గురించి ఆలోచించమని పిల్లలను ఆహ్వానించండి. మీ దగ్గర తాళంచెవి లేకపోతే ఏమవుతుంది? కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 65:2 చదవండి మరియు భూమిపై యాజకత్వ తాళపుచెవులను కలిగియుండవలసిన ప్రాముఖ్యత గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.

  • వార్డులో తాళపుచెవులు కలిగియున్న ఒకరిని తరగతికి వచ్చి, యాజకత్వ తాళపుచెవులను కలిగియుండడమంటే అర్థమేమిటో పంచుకోమని ఆహ్వానించండి. అతని బాధ్యతలను వివరించమని అతడిని ఆహ్వానించండి. ప్రభువు కార్యములో ఏయే భాగాలకు అతడు నాయకత్వం వహిస్తాడు? రక్షకుడు అతనికి ఎలా సహాయపడతారు?

దేవాలయము మరియు సంతోష ప్రణాళిక

దేవాలయము ప్రభువు యొక్క మందిరము.

దేవాలయాలు ఆయన పిల్లల కొరకు పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో భాగము. దేవాలయాల్లో మనం ఆయనతో పవిత్ర నిబంధనలు చేస్తాము, యాజకత్వ శక్తితో వరమివ్వబడతాము, బయల్పాటు పొందుతాము, మరణించిన మన పూర్వీకుల కొరకు విధులు నిర్వహిస్తాము మరియు నిత్యత్వము కొరకు మన కుటుంబాలతో ముద్రింపబడతాము. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము కారణంగానే ఇదంతా సాధ్యము.

ప్రభువు మందిరము యొక్క పవిత్రతను గుర్తించి, దేవాలయ విధులలో పాల్గొనడానికి యోగ్యులుగా తమనుతాము సిద్ధపరచుకోవడానికి మీరు బోధించే పిల్లలకు మీరెలా సహాయపడగలరు? ఈ వనరులను పునర్వీక్షించడాన్ని పరిగణించండి: సిద్ధాంతము మరియు నిబంధనలు 97:15–17; రస్సెల్ ఎమ్. నెల్సన్, “ముగింపు వ్యాఖ్యలు,” లియహోనా, నవ. 2019, 120–22; “Why Latter-day Saints Build Temples,” temples.ChurchofJesusChrist.org

దేవాలయము బయట యువత

దేవాలయాలు ఆయన పిల్లల కొరకు పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో భాగము.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేవాలయాల చిత్రాలను ప్రదర్శించండి. దేవాలయాన్ని ప్రత్యేక స్థలముగా చేసేది ఏది అని పిల్లలను అడగండి. ప్రతీ దేవాలయ ప్రవేశ ద్వారం మీద “ప్రభువుకు పరిశుద్ధత: ప్రభువు మందిరము” అనే పదాలు చెక్కబడ్డాయని ఎత్తిచూపండి. “ప్రభువుకు పరిశుద్ధత” అంటే అర్థమేమిటని వారు అనుకుంటున్నారో పిల్లలను అడగండి. దేవాలయము ప్రభువు యొక్క మందిరము అని ఎందుకు పిలువబడుతుంది? దేవాలయము గురించి ఇది మనకేమి బోధిస్తుంది? ఎవరైనా పిల్లలు దేవాలయానికి వెళ్ళినట్లయితే, వారు అక్కడ ఉన్నప్పుడు వారెలా భావించారో కూడా వారు పంచుకోవచ్చు. మీరు దేవాలయానికి వెళ్ళినట్లయితే, అక్కడ ప్రభువు యొక్క సన్నిధిని మీరెలా భావించారో పంచుకోండి మరియు దేవాలయము మీకెందుకు పవిత్ర స్థలము అనే దాని గురించి మాట్లాడండి.

  • కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 97:15-17 చదవండి. ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించే వారి నుండి ప్రభువు ఏమి ఆశిస్తున్నారో చూడమని పిల్లలను అడగండి. ఆయన మందిరంలో ప్రవేశించడానికి మనం యోగ్యులుగా ఎందుకు ఉండాలి? ఈ సంభాషణలో భాగంగా, దేవాలయ సిఫారసులు మరియు వాటిని ఎలా పొందాలనే దాని గురించి పిల్లలతో మాట్లాడండి. దేవాలయ సిఫారసు మౌఖికము ఎలా ఉంటుందో మరియు అందులో ఏ ప్రశ్నలు అడుగుతారో వారితో పంచుకోమని బిషప్రిక్కు సభ్యుడొకరిని మీరు ఆహ్వానించవచ్చు.

దేవాలయములో, మనం దేవునితో నిబంధనలు చేస్తాము.

“యేసు క్రీస్తు మన పరలోక తల్లిదండ్రులు, మనం ప్రేమించేవారున్న గృహానికి తీసుకొనివెళ్లే నిబంధన మార్గాన్ని ఎంచుకోమని ఆహ్వానిస్తున్నారు” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు (“రండి, నన్ను వెంబడించుడి,” లియహోనా, మే 2019, 91). నిబంధన మార్గంలో బాప్తిస్మము, నిర్ధారణ, దేవాలయ వరము మరియు ముద్రణ ఉన్నాయని అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడండి.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • మనం బాప్తిస్మము పొందినప్పుడు మనం దేవునితో చేసేది మరియు మనం సంస్కారములో పాలుపంచుకున్నప్పుడు మనం నూతనంగా చేసే నిబంధనను పునర్వీక్షించడానికి మీకు సహాయపడమని పిల్లలను అడగండి (మోషైయ 18:10; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77, 79 చూడండి). దేవాలయము యొక్క చిత్రాన్ని చూపించండి మరియు దేవాలయంలో మనకు ఇవ్వడానికి పరలోక తండ్రి చాలా దీవెనలు కలిగియున్నారని వివరించండి.

  • ఒక మార్గానికి దారితీసే ప్రవేశద్వారాన్ని గీయండి. నడవడానికి ఒక మార్గం ఉండడం సహాయకరంగా ఉంటుందని వారెందుకు అనుకుంటున్నారో పిల్లలను అడగండి. కలిసి 2 నీఫై 31:17–20 చదవండి, అందులో బాప్తిస్మపు నిబంధనను నీఫై ఒక ద్వారముతో పోల్చుతాడు మరియు బాప్తిస్మము తర్వాత ఆ మార్గంలో కొనసాగమని మనల్ని ఆహ్వానిస్తాడు. దేవాలయంలో చేసే నిబంధనలతో కలిపి, బాప్తిస్మము తర్వాత మనం చేయవలసిన నిబంధనలు అనేకం ఉన్నాయి. ఈ మార్గాన్ని అధ్యక్షులు నెల్సన్ “నిబంధన మార్గము” అని పిలిచారని వివరించండి.

దేవాలయంలో, మరణించిన పూర్వీకుల కొరకు మనం బాప్తిస్మము పొందగలము మరియు నిర్ధారించబడగలము.

సువార్త జ్ఞానము లేకుండా వారు మరణించినప్పటికీ, ఆయనతో జీవించడానికి తిరికి వెళ్ళడాన్ని దేవుని పిల్లలందరికి యేసు క్రీస్తు యొక్క సువార్త సాధ్యం చేసింది. దేవాలయంలో, మనం వారి తరఫున బాప్తిస్మము పొందగలము మరియు యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యులుగా నిర్ధారించబడగలము.

సాధ్యమైన ప్రోత్సాహకార్యక్రమాలు

  • మీ కోసం మీరు చేసుకోలేని ఒక పనిని వేరెవరో మీ కోసం చేసినప్పటి సమయం గురించి మాట్లాడండి. అటువంటి అనుభవాలను పంచుకోమని పిల్లలను ఆహ్వానించండి. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు, మరణించిన వారి కొరకు బాప్తిస్మము వంటి పవిత్ర విధులను మనం పొందవచ్చని వివరించండి. మరణించిన వారి కొరకు మనం పని చేసినప్పుడు మనం యేసు వలె ఎట్లున్నాము? మనకై మనం చేసుకోలేని దేనిని ఆయన మన కొరకు చేసారు?

  • వారి పూర్వీకుల కొరకు బాప్తిస్మము పొందిన ఒకరు లేదా ఎక్కువమంది యౌవనులను వారి అనుభవాన్ని పంచుకోమని ఆహ్వానించండి. దేవాలయంలో ఉండడం ఎలా ఉన్నదని వారిని అడగండి. వారి పూర్వీకుల కొరకు ఈ పని చేయడం వారికెలా అనిపించిందో పంచుకోమని వారిని ఆహ్వానించండి.

  • బోర్డు మీద ఒక చెట్టును, దాని వేర్లు మరియు కొమ్మలతో సహా గీయండి. కుటుంబము ఒక చెట్టు వలె ఎట్లున్నదో ఆలోచించమని పిల్లలను అడగండి. వేర్లకు పూర్వీకులు అని, కొమ్మలకు వంశస్థులు అని మరియు చెట్టు కాండానికి మీరు అని పేరు పెట్టండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 128:18 నుండి ఈ వాక్యాన్ని కలిసి చదవండి: “[మన పూర్వీకులు] లేకుండా మనము పరిపూర్ణులము కాలేము; అలాగే మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు.” క్రింద ఉన్నటువంటి ప్రశ్నలు అడగండి: “మనకు మన పూర్వీకులు ఎందుకు అవసరము? మన పూర్వీకులకు మనం ఎందుకు అవసరము? మన తల్లిదండ్రులు, తాతమామ్మలు మరియు ఇతర పూర్వీకులు మనకెలా సహాయపడ్డారు? మనం మన పూర్వీకులకు ఎలా సహాయపడగలమో వివరించే వాక్యభాగం కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 128:18లో మిగిలిన భాగాన్ని పరిశోధించమని పిల్లలను ఆహ్వానించండి.

  • ప్రతీ బిడ్డ దేవాలయానికి తీసుకువెళ్ళడానికి ఒక పూర్వీకుని పేరు కనుగొనడానికి బిడ్డ యొక్క తల్లిదండ్రులతో పనిచేయడం గురించి ఆలోచించండి (FamilySearch.org చూడండి).