2024 రండి, నన్ను అనుసరించండి
అనుబంధము సి: ప్రాథమిక కొరకు—పాడే సమయం మరియు పిల్లల సంస్కార సమావేశ ప్రదర్శన కొరకు సూచనలు


“అనుబంధము సి: ప్రాథమిక కొరకు—పాడే సమయం మరియు పిల్లల సంస్కార సమావేశ ప్రదర్శన కొరకు సూచనలు” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“అనుబంధము సి,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024

పాట పాడుతున్న పిల్లలు మరియు బోధకురాలు

అనుబంధము సి

ప్రాథమిక కొరకు—పాడే సమయం మరియు పిల్లల సంస్కార సమావేశ ప్రదర్శన కొరకు సూచనలు

పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళిక మరియు యేసు క్రీస్తు సువార్త యొక్క ప్రాథమిక సత్యాల గురించి నేర్చుకోవడానికి పిల్లలకు సహాయపడేందుకు ప్రాథమిక పాటలు ఒక శక్తివంతమైన సాధనము. సువార్త సూత్రాల గురించి పిల్లలు పాడినప్పుడు, వాటి యధార్థత గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తారు. పదాలు మరియు సంగీతము పిల్లల మనస్సుల్లో మరియు హృదయాల్లో వారి జీవితాంతము నిలిచియుంటాయి.

సంగీతం ద్వారా సువార్తను బోధించడానికి మీరు సిద్ధపడినప్పుడు ఆత్మ యొక్క సహాయమును వెదకండి. మీరు పాడే సత్యాలను గూర్చి మీ సాక్ష్యమును పంచుకోండి. ఇంటివద్ద మరియు ప్రాథమిక తరగతులలో వారు నేర్చుకుంటున్న మరియు అనుభూతి చెందుతున్న వాటికి సంగీతంతో ఎలాంటి సంబంధం ఉందో చూడడానికి పిల్లలకు సహాయపడండి.

సంస్కార సమావేశ ప్రదర్శన కొరకు మార్గదర్శకాలు

బిషప్పు మార్గనిర్దేశకత్వంతో, పిల్లల సంస్కార సమావేశ ప్రదర్శన సాధారణంగా సంవత్సరంలోని నాల్గవ త్రైమాసికంలో జరుపబడుతుంది. ప్రదర్శనను ప్రణాళిక చేయడానికి ప్రాథమిక అధ్యక్షత్వము మరియు సంగీత నాయకురాలు ప్రాథమికను పర్యవేక్షించే బిషప్రిక్కులోని సలహాదారునితో పనిచేస్తారు.

వారు మరియు వారి కుటుంబాలు ఇంటివద్ద మరియు ప్రాథమికలో మోర్మన్ గ్రంథము నుండి నేర్చుకున్న దానిని, ఆ సంవత్సరం వారు పాడిన ప్రాథమిక పాటలతో సహా ప్రదర్శించడానికి పిల్లలను ప్రదర్శన అనుమతించాలి. మీరు ప్రదర్శనను ప్రణాళిక చేసినప్పుడు, జనసమూహము రక్షకుడు మరియు ఆయన బోధనలపై దృష్టి కేంద్రీకరించడానికి అది సహాయపడగల విధానాల గురించి ఆలోచించండి.

తక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న యూనిట్లు పిల్లలతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనగలిగే మార్గాల గురించి ఆలోచించవచ్చు. బిషప్రిక్కు సభ్యుడొకరు క్లుప్త వ్యాఖ్యానంతో సమావేశాన్ని ముగించవచ్చు.

మీరు ప్రదర్శనను సిద్ధం చేస్తున్నప్పుడు, క్రింది మార్గదర్శకాలను గుర్తుంచుకోండి:

  • సాధన చేయడానికి ప్రాథమిక తరగతులు లేదా కుటుంబాల నుండి అనవసరంగా సమయాన్ని తీసుకోరాదు.

  • దృశ్యాలు, దుస్తులు మరియు మీడియా ప్రదర్శనలు సంస్కార సమావేశానికి తగినవి కాదు.

See General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints12.2.1.2.

పాడే సమయం కొరకు సూచనలు

5 నిమిషాలు (ప్రాథమిక అధ్యక్షత్వము): ప్రారంభ ప్రార్థన, లేఖనము లేదా విశ్వాస ప్రమాణము మరియు ఒక ప్రసంగము

20 నిమిషాలు (సంగీత నాయకురాలు): పాడే సమయం

పిల్లలు వారి తరగతుల్లో మరియు ఇంటి వద్ద నేర్చుకుంటున్న సూత్రాలను బలోపేతం చేయడానికి ప్రాథమిక అధ్యక్షత్వము మరియు సంగీత నాయకురాలు కలిసి ప్రతీ నెల కొరకు పాటలను ఎంపిక చేస్తారు. ఈ సూత్రాలను బలోపేతం చేసే పాటల జాబితా ఈ దీపికలో చేర్చబడింది.

పిల్లలకు మీరు పాటలను బోధిస్తున్నప్పుడు, ఆ పాటలు బోధించే కథలు మరియు సిద్ధాంతపరమైన సూత్రాల గురించి వారు ఇదివరకే నేర్చుకున్న దానిని పంచుకోమని వారిని ఆహ్వానించండి. పాటలలో కనుగొనబడే సత్యాల గురించి వారి ఆలోచనలను, మనోభావాలను పంచుకోమని పిల్లలను ఆహ్వానించండి.

కీర్తనలు మరియు పిల్లల పాటలు అనేది ప్రాథమికలోని సంగీతం కొరకైన మూల వనరు. కీర్తనల పుస్తకంలోని కీర్తనలు కూడా తగినవి. ప్రాథమికలో మరేయితర సంగీతమైనా ఉపయోగించాలంటే, అది తప్పనిసరిగా బిషప్రిక్కు చేత ఆమోదించబడాలి (see General Handbook12.3.4).

పాడుతున్న పిల్లలు

పాడే సమయం కొరకు సంగీతము

జనవరి

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

ఫిబ్రవరి

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

మార్చి

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

ఏప్రిల్

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

మే

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

జూన్

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

జూలై

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

ఆగష్టు

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

సెప్టెంబరు

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

అక్టోబరు

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

నవంబరు

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

డిసెంబరు

  • రండి, నన్ను అనుసరించండి లో ఈ నెల బోధించబడిన సిద్ధాంతానికి సహకారమిచ్చే ఒక పాటను ఎంచుకోండి.

సిద్ధాంతాన్ని బోధించడానికి సంగీతాన్ని ఉపయోగించుట

సువార్త సత్యాల గురించి నేర్చుకోవడానికి పిల్లలకు సహాయపడేందుకు పాడే సమయం ఉద్దేశించబడింది. కీర్తనలు మరియు ప్రాథమిక పాటలలో కనుగొనబడే సువార్త సూత్రాలను బోధించే మార్గాలను మీరు ప్రణాళిక చేసినప్పుడు, క్రింది ఉపాయాలు మిమ్మల్ని ప్రేరేపించగలవు.

సంబంధిత లేఖనాలను చదవండి. ఈ గద్యభాగాలలో కొన్నింటిని చదివి, లేఖనాలు ఆ పాటతో ఎలా సంబంధం కలిగియున్నాయో మాట్లాడడానికి పిల్లలకు సహాయపడండి. మీరు బోర్డు మీద కొన్ని లేఖన సూచికలను జాబితా చేయవచ్చు మరియు ప్రతీ సూచికను ఒక పాటతో లేదా పాటలోని ఒక చరణంతో జత చేయమని పిల్లలను ఆహ్వానించవచ్చు.

ఖాళీ పూరించండి. అనేక ముఖ్యపదాలను వదిలివేస్తూ బోర్డు మీద ఒక పాట యొక్క చరణాన్ని వ్రాయండి. తర్వాత ఆ పాట పాడమని, ఖాళీలలో పూరించగల పదాల కొరకు వినమని పిల్లలను అడగండి. ప్రతీ ఖాళీని వారు పూరించినప్పుడు, వదిలివేయబడిన పదాల నుండి ఏ సువార్త సూత్రాలను మీరు నేర్చుకుంటారో చర్చించండి.

పాడే సమయపు నాయకురాలు

సాక్ష్యమివ్వండి. ప్రాథమిక పాటలో కనుగొనబడు సువార్త సత్యాల గురించి పిల్లలకు క్లుప్తంగా సాక్ష్యమివ్వండి. పాడడమనేది వారు సాక్ష్యాన్నివ్వగల మరియు ఆత్మను అనుభవించగల ఒక విధానమని అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడండి.

సాక్షిగా నిలబడండి. ఒకరి తర్వాత ఒకరు లేచి నిలబడి, వారు పాడుతున్న పాట నుండి వారు నేర్చుకున్న దానిని లేదా పాటలో బోధించబడిన సత్యాల గురించి వారి భావాలను పంచుకోమని పిల్లలను ఆహ్వానించండి. వారు పాట పాడుతున్నప్పుడు ఎలా భావించారో అడగండి మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని గుర్తించడానికి వారకి సహాయపడండి.

చిత్రాలను ఉపయోగించండి. పాటలో ముఖ్యమైన పదాలు లేదా వాక్యభాగాలకు సరిపోయే చిత్రాలను కనుగొనడానికి లేదా తయారు చేయడానికి మీకు సహాయపడమని పిల్లలను అడగండి. చిత్రాలు పాటతో ఎలా సంబంధం కలిగియున్నాయో మరియు పాట ఏమి బోధిస్తుందో పంచుకోమని వారిని ఆహ్వానించండి. మీరు కలిసి పాట పాడుతున్నప్పుడు చిత్రాలను సమకూర్చి, సరైన క్రమములో వాటిని ఎత్తి పట్టుకోమని పిల్లలను అడగండి.

ఒక వస్తు పాఠమును పంచుకోండి. ఒక పాట గురించి చర్చను ప్రేరేపించడానికి మీ ఒక వస్తువును ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు పిల్లలతో కలిసి విశ్వాసం గురించి ఒక పాట పాడవచ్చు. మీరు పిల్లలకు ఒక విత్తనాన్ని చూపించవచ్చు మరియు మనం ఒక విత్తనాన్ని నాటినప్పుడు మనమెలా విశ్వాసాన్ని చూపుతామో మాట్లాడవచ్చు; పాటలో వివరించబడినట్లుగా, యేసు క్రీస్తు యందు మనం విశ్వాసం చూపగల విధానాల గురించిన చర్చకు ఇది దారితీయవచ్చు.

వ్యక్తిగత అనుభవాలను పంచుకోమని ఆహ్వానించండి. పాటలో బోధించబడిన సూత్రాలను, ఈ సూత్రాలతో వారు కలిగియున్న అనుభవాలతో అనుసంధానించడానికి పిల్లలకు సహాయపడండి. ఉదాహరణకు, దేవాలయాల గురించి ఒక పాట పాడడానికి ముందు, వారు దేవాలయాన్ని చూసినట్లయితే చేతులు ఎత్తమని మీరు పిల్లలను అడగవచ్చు. వారు పాడుతున్నప్పుడు, వారు దేవాలయాన్ని చూసినప్పుడు ఎలా భావించారో ఆలోచించమని వారిని ఆహ్వానించండి.

ప్రశ్నలు అడగండి. మీరు పాటలు పాడుతున్నప్పుడు, మీరు అడగడానికి చాలా ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు, పాటలోని ప్రతీ చరణం నుండి వారు నేర్చుకున్న దాని గురించి మీరు పిల్లలను అడగవచ్చు. పాట జవాబులిచ్చే ప్రశ్నల గురించి ఆలోచించమని కూడా మీరు వారిని అడగవచ్చు. పాటలో బోధించబడిన సత్యాల గురించిన చర్చకు ఇది దారితీయవచ్చు.

సాధారణ చేతి కదలికలను ఉపయోగించండి. పాటలోని పదాలు మరియు సందేశాలను గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడేందుకు సాధారణ చేతి కదలికల గురించి ఆలోచించమని పిల్లలను ఆహ్వానించండి.