2024 రండి, నన్ను అనుసరించండి
అనుబంధము డి: అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతుల కొరకు—సమావేశ విషయ పట్టిక


“అనుబంధము డి: అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతుల కొరకు—సమావేశ విషయ పట్టిక” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“అనుబంధము డి,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024

అనుబంధము డి

అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతుల కొరకు—సమావేశ విషయ పట్టిక

సమావేశ తేదీ:

నిర్వహణ (తరగతి లేదా సమూహ అధ్యక్షత్వము యొక్క సభ్యురాలు/సభ్యుడు):

ప్రారంభ

కీర్తన (ఐచ్ఛికం):

ప్రార్థన:

యువతుల ఇతివృత్తము లేదా అహరోను యాజకత్వ సమూహ ఇతివృత్తమును పునరావృతం చేయండి.

కలిసి ఆలోచన చేయండి

సమావేశాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి నాయకత్వం క్రింద, రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యములో తమ బాధ్యతల గురించి కలిసి ఆలోచన చేయడానికి తరగతి లేదా సమూహము 5 నుండి 10 నిమిషాలు వెచ్చిస్తారు. అధ్యక్షత్వ సమావేశము లేదా వార్డు యౌవనుల సలహా సమావేశములో చర్చించబడిన అంశాల గురించి తెలుసుకోవడానికి తరగతి లేదా సమూహ అధ్యక్షత్వానికి ఇది ఒక అవకాశము.

నిర్వహిస్తున్న వ్యక్తి కూడా ఈ ప్రశ్నలలో ఒకటి లేదా ఎక్కువ వాటిని ఉపయోగించవచ్చు:

సువార్తను జీవించుట

  • యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మన సాక్ష్యాలను బలపరచిన ఇటీవలి అనుభవాలేవి?

  • రక్షకునికి దగ్గర కావడానికి మనమేమి చేస్తున్నాము? ఆయన వలె ఎక్కువగా ఉండడానికి మనమెలా ప్రయత్నిస్తున్నాము?

  • మన జీవితాల్లో ప్రభువు యొక్క నడిపింపును మనమెలా భావించాము?

అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట

  • ఎవరికి సహాయం చేయడానికి లేదా సేవ చేయడానికి మేము నడిపించబడ్డాము? అవసరంలో ఉన్నవారికి సహాయపడేందుకు బిషప్రిక్కు నుండి ఏ నియామకాలను మనం పొందాము?

  • మనం అనుభవిస్తున్న విషయాలలో మనము ఒకరికొకరం ఎలా సహకారమిచ్చుకోగలము?

  • ఇటీవల ఎవరైనా మన వార్డులోకి మారారా లేదా సంఘములో చేరారా? స్వాగతించబడినట్లు భావించడానికి వారికి మనమెలా సహాయపడగలము?

సువార్తను పొందడానికి అందరిని ఆహ్వానించుట

  • ఇతరులు దేవుని ప్రేమను అనుభవించేలా సహాయపడడానికి మనం ఏమి చేయగలము?

  • మన స్నేహితులను హాజరుకమ్మని ఆహ్వానించగలిగేలా ఏ ప్రోత్సాహ కార్యక్రమాలు రాబోతున్నాయి?

  • సువార్తను పంచుకోవడానికి ఏ ప్రణాళికలు వార్డు యౌవనుల సలహా సమావేశాలలో చర్చించబడ్డాయి? మన తరగతి లేదా సమూహము ఎలా జతచేరగలదు?

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయుట

  • తాతమామ్మలు మరియు బంధువులతో పాటు, కుటుంబ సభ్యులతో మనం బాగా అనుసంధానింపబడగల కొన్ని విధానాలేవి?

  • దేవాలయ విధులు అవసరమైన మన పూర్వీకుల పేర్లు కనుగొనడానికి మనం ఏమి చేస్తున్నాము? వారి పూర్వీకుల పేర్లు కనుగొనడానికి ఇతరులకు సహాయపడడానికి మనమేమి చేయగలము?

  • దేవాలయ కార్యములో—వ్యక్తిగతంగా మరియు ఒక తరగతిగా లేదా సమూహంగా మనం మరింత ఎక్కువగా ఎలా పాల్గొనగలము?

కలిసి నేర్చుకోండి

పెద్దవారైన ఒక నాయకుడు లేదా సమూహము లేదా తరగతి యొక్క ఒక సభ్యుడు ఈ వారపు రండి, నన్ను అనుసరించండి చదవడం గురించి సూచనను నడిపిస్తారు. రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు లోని అధ్యయన ఉపాయాలను అతడు లేదా ఆమె ఉపయోగిస్తారు. ఈ చిహ్నము గల అధ్యయన ఉపాయము సెమినరీతో సమలేఖనం చేయబడింది మరియు ప్రత్యేకించి యువతకు తగినది. ఏమైనప్పటికీ, అధ్యయన ఉపాయాలలో దేనినైనా ఉపయోగించవచ్చు. సాధారణంగా సమావేశంలోని ఈ భాగము సుమారు 35 నుండి 40 నిమిషాల సమయం తీసుకుంటుంది.

ముగింపు

సమావేశాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి:

  • బోధించబడిన సూత్రాల గురించి సాక్ష్యమిస్తారు.

  • వారు నేర్చుకున్న వాటిపై తరగతి లేదా సమూహము—ఒక సమూహముగా లేదా వ్యక్తిగతంగా ఎలా పనిచేస్తారో చర్చిస్తారు.

ప్రార్థన:

ముద్రించు