“ఏప్రిల్ 13–19. మోషైయ 1–3: ‘దేవుని యొక్క మరియు సమస్త మనుష్యుల యెడల ప్రేమతో నిండియుండెను’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
ఏప్రిల్ 13–19. మోషైయ 1–3,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము: 2020
ఏప్రిల్ 13–19
మోషైయ 1–3
“దేవుని యొక్క మరియు సమస్త మనుష్యుల యెడల ప్రేమతో నిండియుండెను”
మన ఆత్మీయ భావనలు నమోదుచేయుటకు రాజైన బెంజిమెన్ ఒక కారణము తెలిపెను: “ఈ పలకల యొక్క సహాయము చేతనే తప్ప మన పితరుడైన లీహై ఈ విషయములన్నియు జ్ఞాపకముంచుకొని, వాటిని తన సంతానమునకు బోధించియుండుట అసాధ్యము” (మోషైయ 1:4).
మీ మనోభావాలను నమోదు చేయండి
రాజు అనే మాటను మీరు విన్నప్పుడు, మీరు కిరీటాలు, కోటలు, సేవకులు, మరియు సింహాసనములను గూర్చి ఆలోచించవచ్చు. మోషైయ 1–3 లో మీరు వేరే రకమైన రాజును గూర్చి చదువుతారు. జనుల యొక్క శ్రమలపై ఆధారపడుట కంటె, రాజైన బెంజిమెన్ “[తన] స్వహస్తములతో శ్రమపడియున్నాడు” (మోషైయ 2:14). ఇతరులు అతనికి సేవ చేయుటకు బదులుగా, అతడు తన జనులకు “ప్రభువు [అతనికి] దయచేసిన సమస్త బలము, మనస్సు, మరియు శక్తి” (మోషైయ 2:11) తో సేవ చేసారు. ఈ రాజు తన జనులు తనను ఆరాధించాలని కోరలేదు; బదులుగా ఆయన తనకంటే గొప్ప రాజును ఆరాధించమని వారికి బోధించారు, ఏలయనగా అది “పరిపాలించు సర్వశక్తిమంతుడైన ప్రభువు” (మోషైయ 3:5) అని ఆయన గ్రహించారు. దేవుని యొక్క రాజ్యములో ఉన్న గొప్ప నాయకులందరి వలే, రాజైన బెంజిమెన్ యొక్క మాటలు, మాదిరి మనల్ని పరలోకపు రాజు, రక్షకుడైన యేసు క్రీస్తుకు సూచిస్తాయి. యేసు “పరలోకము నుండి దిగి” వచ్చెను మరియు“ గొప్ప అద్భుతములను చేయుచూ మనుష్యుల మధ్య ముందుకు వెళ్ళెను. … మరియు ఇదిగో, ఆయన నామమందు విశ్వాసముంచుట ద్వారా కూడా నరుల యొక్క సంతానమునకు రక్షణ రావలెనని ఆయన తన స్వంత జనుల యొద్దకు వచ్చును” (మోషైయ 3:5, 9 అని రాజైన బెంజిమెన్ సాక్ష్యమిచ్చారు.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
దేవుని వాక్యమును పొందుటకు సిద్ధపాటు అవసరము.
రాజైన బెంజిమెన్ తన జనులతో మాట్లాడాలని తాను కోరుతున్నట్లు ఒక సందేశాన్ని పంపినప్పుడు, అనేకమంది జనులు వచ్చారు “వారిని లెక్కపెట్టలేనంత అధికమైన ఒకగొప్ప సంఖ్య” (మోషైయ 2:2). కొంతమేరకు, వారు తమ నాయకుని కొరకు, వారి కృతజ్ఞత మరియు ప్రేమ వలన వచ్చారు. మరి ముఖ్యముగా, దేవుని వాక్యము చేత బోధింపబడుటకు వారు వచ్చారు.
మీరు మోషైయ 2:1–9 చదివినప్పుడు, జనులు దేవుని వాక్యమునకు విలువిచ్చారని చూపుటకు వారేమి చేసారో దానికోసం వెతకండి. దేవుని వాక్యమును వినుటకు సిద్ధపడుటకు ఏమి చేయమని రాజైన బెంజిమెన్ వారిని అడిగెను? (9వ వచనము చూడండి). మీ వ్యక్తిగత , కుటుంబ అధ్యయనములో, మరియు సంఘ సమావేశములందు దేవుని వాక్యమును పొందుటకు మిమ్మల్ని మీరు ఉత్తమంగా ఎలా సిద్ధపరచుకుంటారు?
మత్తయి 13:18–23; ఆల్మా 16:16–17 కూడా చూడండి.
నేను ఇతరులకు సేవ చేసినప్పుడు, నేను దేవునికి కూడా సేవ చేస్తున్నాను.
సేవ చేయుటకు సమయాన్ని కనుగొనుటకు మీరు ప్రయాసపడుతున్నారా లేక మీ సేవ మీకు ఎక్కువ ఆనందమును తేవాలని కోరుతున్నారా? ఆయన “సమస్త బలము, మనస్సు, మరియు శక్తి” తో ఎందుకు సేవ చేసారో అని మీరు ఆయనను అడిగినట్లైతే, రాజైన బెంజిమెన్ ఏమని చెప్తారని మీరనుకుంటున్నారు??మోషైయ 2:11 మోషైయ 2:10–26 మీరు చదివినప్పుడు, సేవ గురించి రాజైన బెంజిమెన్ బోధించిన సత్యములను గుర్తించండి మరియు మీ జీవితంలో వాటిని ఎలా ఉపయోగించగలో ధ్యానించండి. ఉదాహరణకు, మీరు ఇతర జనులకు సేవ చేసినప్పుడు, మీరు దేవునికి కూడ సేవ చేస్తున్నారని తెలుసుకొనుట మీకు ఏమి అర్ధాన్ని కలిగియున్నది? (మోషైయ 2:17 చూడుము). ఈ వారములో ఎవరికైనా మీరు సేవ చేయగల విధానము గూర్చి ఆలోచించండి!
మత్తయి 25:40 కూడా చూడండి.
నేను ప్రకృతి సంబంధియైన మనుష్యుని జయించగలను మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ఒక పరిశుద్ధునిగా మారగలను.
అతని జనులు “వారి పాపముల యొక్క క్షమాపణ పొందునట్లు మరియు అత్యధికమైన గొప్ప సంతోషముతో ఆనందించునట్లు” (మోషైయ 3:13) రాజైన బెంజిమెన్, ప్రవక్తలందరి వలే యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చెను. ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా రక్షకుడు, మనల్ని శుద్ధి చేయటమే కాదు కానీ “ప్రకృతి సంబంధియైన మనుష్యుని” జయించి మరియు “ఒక పరిశుద్ధునిగా” అగుటకు శక్తిని మనకు ఇచ్చునని కూడా ఆయన బోధించెను (మోషైయ 3:19; లేఖన దీపిక, “ప్రకృతిసంబంధియైన మనుష్యుడు,” scriptures.ChurchofJesusChrist.org కూడా చూడండి).
ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా వివరించారు: “యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము శుద్ధి చేయు మరియు విమోచించు శక్తి రెండిటిని ఇచ్చును, అది మనము పాపము జయించుటకు సహాయపడును మరియు మన స్వంత బలముపై ఆధారపడుట ద్వారా మనము ఎప్పటికి సాధించలేని దానిని పరిశుద్ధపరచు మరియు బలపరచు శక్తి మనం ఉత్తమంగా మారుటకు మనకు సహాయపడుతుంది. అనంతమైన ప్రాయశ్చిత్తము మనలో ప్రతీఒక్కరిలో ఉండు పాపి మరియు పరిశుద్ధుడు ఇరువురి కొరకైనది” (“Clean Hands and a Pure Heart,” Ensign లేదా Liahona, నవం. 2007, 82).
మోషైయ 3:1–20 లో రక్షకుని గూర్చి రాజైన బెంజిమెన్ యొక్క సాక్ష్యమును మీరు చదివినప్పుడు ధ్యానించుటకు ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి:
-
రక్షకుడు, ఆయన నియమితకార్యము గురించి ఈ వచనముల నుండి మనము ఏమి నేర్చుకుంటాము?
-
పాపము జయించుటకు యేసు క్రీస్తు నాకు ఏవిధంగా సహాయపడెను? నా స్వభావము మార్చుకొని ఒక పరిశుద్ధుని వలే మారుటకు ఆయన నాకు ఏవిధంగా సహాయపడెను?
-
మోషైయ 3:19 నుండి ఒక పరిశుద్ధునిగా మారడం గురించి నేనేమి నేర్చుకోగలను?
“పరలోకము మరియు భూమి యొక్క తండ్రిగా” యేసును రాజైన బెంజిమెన్ ఎందుకు సూచించెను?
అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ వివరించారు: “మనము యెహోవాగా కూడ ఎరిగిన యేసు క్రీస్తు, సృష్టి యొక్క కార్యములో ఎలోహిము, తండ్రి యొక్క సూచనలను అనుసరించెను. … సృష్టికర్తయైన యేసు క్రీస్తు, పరలోకము మరియు భూమి యొక్క తండ్రిగా ఏకరీతిగా పిలవబడెను… ; మరియు ఆయన సృష్టి శాశ్వతమైన నాణ్యతను కలిగియున్నందున, ఆయన పరలోకము మరియు భూమి యొక్క నిత్య తండ్రిగా సరిగా పిలవబడుతున్నారు” (Teachings of Presidents of the Church: Joseph F. Smith [1998], 357).
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
మోషైయ 1:1–7
ఇత్తడి పలకలు మరియు నీఫై పలకలు రాజైన బెంజిమెన్ యొక్క జనులను ఏవిధంగా దీవించాయి? లేఖనాలు మన కుటుంబాన్ని ఎలా దీవిస్తాయి?
మోషైయ 2–3
రాజైన బెంజిమెన్ యొక్క ప్రసంగము కొరకు సందర్భమును ఏర్పరుచుట మీ కుటుంబానికి వినోదముగా ఉండవచ్చు. మీరు ఒక చిన్న కోటను చేసి, కుటుంబ సభ్యులు ఒకరి తరువాత ఒకరు దానిపై నిలబడియుండగా రాజైన బెంజిమెన్ మాటలు చదవవచ్చు. మిగిలిన కుటుంబము తాత్కాలిక గుడారము లోపలినుండి వినవచ్చు.
మోషైయ 2:9–19
రాజైన బెంజిమెన్ బోధనలు, మాదిరినుండి సేవ గురించి మనము ఏమి నేర్చుకోగలము? మనము ఏమి చేయటానికి ప్రేరేపించబడుచున్నాము?
మోషైయ 2:15–25
దీనత్వము గురించి చర్చించుట మీ కుటుంబానికి ప్రయోజనము కలుగుతుందా? తాను చేసిన సమస్తము గురించి రాజైన బెంజిమెన్ ఎందుకు గొప్పలు చెప్పలేదు? దేవునితో మన అనుబంధము గురించి అతని బోధనలనుండి మనము ఏమి నేర్చుకోగలము?
మోషైయ 2:36–41
సత్యమును ఎరిగియుండి, దాని ప్రకారం జీవించపోవటం వలన కలుగు పర్యవసానములను గూర్చి రాజైన బెంజిమెన్ ఏమని బోధించెను? నిజమైన సంతోషము గురించి ఆయన మనకు ఏమి బోధించెను?
మోషైయ 3:19
పరిశుద్ధులగుటకు మనము ఏమి చేయాలి? ఒక కుటుంబముగా ఈ వచనము నుండి ఏ స్వభావమును వృద్ధి చేసుకొనుటకు మనము దృష్టిసారించవచ్చు?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాధమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.