రండి, నన్ను అనుసరించండి
మార్చి 30–ఏప్రిల్ 12. ఈస్టర్: “ఆయన తన రెక్కల యందు స్వస్థత కలిగి లేచును”


“మార్చి 30–ఏప్రిల్ 12. ఈస్టర్: ‘ఆయన తన రెక్కల యందు స్వస్థత కలిగి లేచును,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“మార్చి 30–ఏప్రిల్ 12. ఈస్టర్,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
తన అపొస్తలులతో పునరుత్థానము చెందిన క్రీస్తు

క్రీస్తు మరియు అపొస్తలులు, డేల్ పార్సన్ చేత

మార్చి 30–ఏప్రిల్ 12

ఈస్టర్

“ఆయన తన రెక్కల యందు స్వస్థత కలిగి లేచును”

ఈస్టర్ ఆదివారముకు ముందు రోజులలో, యేసు క్రీస్తు యొక్క జీవితము, మరణము, పునరుత్థానము మరియు ప్రాయశ్చిత్త శక్తిని గూర్చి మోర్మన్ గ్రంథములోని శక్తివంతమైన సాక్ష్యముపై మీ వ్యక్తిగత మరియు కుటుంబ లేఖన అధ్యయనముపై దృష్టిసారించుటకు ఆలోచించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ప్రాచీన అపొస్తలులు యేసు క్రీస్తు, ఆయన పునరుత్థానమును గూర్చి వారి సాక్ష్యములందు ధైర్యముగా ఉన్నారు. బైబిలులో వ్రాయబడిన వారి మాటల వలన మిలియన్లు యేసు క్రీస్తునందు విశ్వసించి, ఆయనను అనుసరించుటకు ప్రయాసపడిరి. అయినప్పటికిని, యేసు క్రీస్తు సర్వలోక రక్షకుడు అయితే, ఆయన ప్రత్యక్ష సాక్ష్యములు ఒక చిన్న ప్రాంతము నుండి కొందరు జనులకు ఎందుకు పరిమితం చేయబడింది? అని కొందరు ఆశ్చర్యపడవచ్చు.

యేసు క్రీస్తు లోకము యొక్క రక్షకుడు అని , “సమస్త జనములకు తనను ప్రత్యక్షపరచుకొనునని” (మోర్మన్ యొక్క శీర్షిక పేజి) ఒప్పించుటకు, మోర్మన్ గ్రంథము అదనపు సాక్ష్యముగా నిలబడును మరియు ఆయన వద్దకు వచ్చు వారందరికి రక్షణను ఇచ్చును. అదనముగా, ఈ రెండవ సాక్ష్యము కూడ రక్షణ అనగా అర్ధమేమిటో స్పష్టముచేయును. అందుకే నీఫై, జేకబ్, మోర్మన్, మరియు ప్రవక్తలందరు—భవిష్యత్తు తరములకు ప్రకటించుటకు “పలకలపై చెక్కుటకు చాలా శ్రద్ధగా,” కృషి చేసారు, ఆవిధంగా వారు కూడా “క్రీస్తును గూర్చి ఎరిగియుంటారు, మరియు … ఆయన మహిమ యొక్క నిరీక్షణ కలిగియుంటారు” (జేకబ్ 4:3–4). ఈస్టర్ సమయానికి కొన్ని వారములు ముందు మరియు తరువాత, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి విశ్వవ్యాప్తమైనది మరియు వ్యక్తిగతమైనది—సమస్త లోకమును విమోచించును మరియు మిమ్మల్ని విమోచించుననే మోర్మన్ గ్రంథములోని సాక్ష్యములను గూర్చి ఆలోచించండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

2 నీఫై 9:6–15,22; ఆల్మా 11:41–45; 40:21–23; 3 నీఫై 26:4–5

యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము వలన, సమస్త జనులు పునరుత్థానము చెందుతారు.

ఈస్టర్ సమయాన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము గురించి ధ్యానించుట సాధారణమైనది, కానీ పునరుత్థానము చెందుట అనగా ఖచ్చితంగా అర్ధమేమిటి? పునరుత్థానము గురించి మోర్మన్ గ్రంథము ఏ అంతరార్థములను ఇస్తుంది? బహుశా మీ ఈస్టర్ ఆచరణలో భాగముగా, 2 నీఫై 9:6–15, 22; ఆల్మా 11:41–45; 40:21–23; మరియు 3 నీఫై 26:4–5 లో పునరుత్థానము గురించి మీరు కనుగొనే సత్యములను వరసగా వ్రాయవచ్చు. ఈ సత్యములలో ప్రతీఒక్కటి తెలుసుకొనుట మీకు ఎందుకు ముఖ్యమైనదని మీరు అనుకుంటున్నారో కూడ వ్రాయవచ్చు.

పునరుత్థానము గురించి సత్యములు తరచుగా అంతిమ తీర్పు గూర్చిన సత్యములతో కలిసి బోధించబడునని మీరు గమనించవచ్చు. రక్షణ ప్రణాళికలో పునరుత్థానము యొక్క ప్రాముఖ్యత గురించి మీకు బోధించు దానిని ధ్యానించండి.

లూకా 24:36–43; అపొస్తలుల కార్యములు 24:15; 1 కొరింథీయులకు 15:12–23 కూడా చూడండి.

మోషైయ 3:7; 15:5–9; ఆల్మా 7:11–13

యేసు క్రీస్తు నా పాపములు, బాధలు, మరియు బలహీనతలను తనపై తీసుకొనెను.

యేసు క్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసెనని బైబిలు స్పష్టముగా బోధిస్తుంది. అయినప్పటికినీ, మోర్మన్ గ్రంథము, ముఖ్యమైన విధానాలలో క్రీస్తు త్యాగము మరియు అనుభవించిన బాధ గురించి మన అవగాహనను పెంచుతుంది. మోషైయ 3:7; 15:5–9; మోషైయ ఆల్మా 7:11–13లో ఈ బోధనలలో కొన్నిటిని మీరు కనుగొనవచ్చు. ఈ వాక్యభాగములను మీరు చదివిన తరువాత, క్రింది పటములో మీరు కనుగొన్న దానిని వ్రాయుటకు పరిశీలించండి:

రక్షకుడు అనుభవించిన బాధ ఏమిటి?

ఆయన ఎందుకు బాధను అనుభవించెను?

ఇది నాకు ఏ భావమును కలిగియున్నది?

రక్షకుడు అనుభవించిన బాధ ఏమిటి?

ఆయన ఎందుకు బాధను అనుభవించెను?

ఇది నాకు ఏ భావమును కలిగియున్నది?

యెషయా 53; హెబ్రీయులకు 4:14–16 కూడా చూడండి.

చిత్రం
గెత్సేమనే వనములో క్రీస్తు ప్రార్థించుట

గెత్సేమనే, మైఖెల్ టి. మామ్ చేత

మోషైయ 5:1–2; 27:8–28; ఆల్మా 15:3–12; 24:7–19

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము నన్ను శుద్ధి చేయును మరియు నేను పరిపూర్ణుడగుటకు నాకు సహాయపడును.

మోర్మన్ గ్రంథము ప్రధానంగా యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వలన మార్పుచెందిన జనుల వృత్తాంతమని చెప్పబడవచ్చు. వాస్తవానికి, ఆ జనులలో కొందరు ఘోరమైన పాపములు చేసారు మరియు ఆయనయందు వారి విశ్వాసము ప్రకారము రక్షకుని యొక్క శక్తి వారిలో బలమైన మార్పు తేక ముందు దేవుని యొక్క జనులకు శత్రువులుగా వారు ఉన్నారు. మోషైయ 5:1–2; 27:8–28; and ఆల్మా 15:3–12; 24:7–19 లో ఈ అనుభవాలలో కొన్నిటిని మీరు చదవవచ్చు; అదేవిధంగా ఇతర మాదిరులను చదువుటకు మీరు ఆలోచించవచ్చు. ఈ అనుభవాలు ప్రతీదానిలో ఉమ్మడిగా ఉన్నది ఏమిటని మీరు గమనించారు? మీరు గమనించిన తేడాలు ఏమిటి? రక్షకుని ప్రాయశ్చిత్తము మిమ్మల్ని ఏవిధంగా మార్చగలదో ఈ వృత్తాంతములు మీకేమి బోధిస్తాయి?

ఆల్మా 5:6–14; 13:11–12; 18; 19:1–16; 22:1–26; 36:16–21; ఈథర్ 12:27; మొరోనై 10:32–33 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీరు మీ కుటుంబముతో ఈస్టర్‌ను జరుపుకుంటున్నప్పుడు, రక్షకుడు మరియు పునరుత్థానము కలిపి, ప్రాయశ్చిత్తము గురించి కలిసి నేర్చుకొను విధానముల కొరకు చూడండి. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

3 నీఫై 11; 17

కొన్ని కుటుంబాలు పునరుత్థానుడైన యేసు క్రీస్తు అమెరికాను సందర్శించిన వృత్తాంతమును ప్రత్యేకంగా ఈస్టర్ సమయమందు అధ్యయనము చేయుట అర్ధవంతమైనదిగా కనుగొన్నారు. ఆయన గాయములు తాకుట (3 నీఫై 11:14–15) లేక ఆయన దీవించిన పిల్లలలో ఒకరిగా ఉండుట ఎలా ఉండియుండ వచ్చో ఊహించమని కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి (3 నీఫై 17:21 చూడండి). ఈ వృత్తాంతము రక్షకుని యొక్క పునరుత్థానము కొరకు మన కృతజ్ఞతను ఎలా హెచ్చించును? ఈ సంగ్రహముతోపాటు ఉన్న వృత్తాంతమును చూపు ఒక ఛాయాచిత్రము; మిగిలినవి ChurchofJesusChrist.org వద్ద కనుగొనబడతాయి. మీ కుటుంబ సభ్యులు చదువుతున్న దాని గురించి వారి స్వంత చిత్రములను గీయుటను కూడా ఆనందించవచ్చు.

సర్వసభ్య సమావేశము నుండి సందేశములు

ప్రపంచములో అనేక భాగాలలో, ఈ సంవత్సరములో ఏప్రిల్ సర్వసభ్య సమావేశము ఈస్టర్‌కు ముందు వారములో జరుగుతుంది. బహుశా సమావేశ సందేశాలను వినుట ఈ ఈస్టర్ సమయంలో రక్షకునిపై దృష్టిసారించుటకు మీ కుటుంబానికి సహాయపడవచ్చు. ఉదాహరణకు, యేసు క్రీస్తు మరియు ఆయన పునరుత్థానము గురించి సాక్ష్యమిచ్చు సమావేశ సందేశాలను—ప్రత్యేకంగా యేసు క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులైన, అపొస్తలుల నుండి వినుటకు కుటుంబ సభ్యులను మీరు ఆహ్వానించవచ్చు. తరువాత మీరు కలిసి ఈ సందేశాలను సమీక్షించవచ్చు మరియు రక్షకుని గూర్చి మీ సాక్ష్యములను బలపరచు బోధనలను గుర్తించవచ్చు.

జీవముగల క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము

జీవముగల క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము” (ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2017, మొదటిపేజి లోపల; ChurchofJesusChrist.org కూడా చూడండి) మరియు ఇతరులతో పంచుకొనుటకు ఈ సాక్ష్యము నుండి ఈస్టర్ సందేశము ఎంచుకొనమని ప్రతీ కుటుంబ సభ్యుని ఆహ్వానించండి. ఉదాహరణకు, సోషల్ మీడియాలో, మీ ముందు ద్వారముపై, లేక కిటికీలో ప్రదర్శించుటకు పోస్టరులు మీరు తయారు చేయవచ్చు.

వీడియోలు: క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులు

ChurchofJesusChrist.org మరియు Gospel Library app క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులు అని పిలవబడిన వీడియో పరంపరలను కలిగియున్నది. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహములో ప్రతీ సభ్యుని యొక్క వీడియోలను అది కలిగియున్నది. మీ కుటుంబము ఈ వీడియోలలో ఒకటి లేక ఎక్కువ చూడవచ్చు మరియు రక్షకుడు మన కొరకు చేసిన దాని గురించి అవి బోధించే దానిని చర్చించండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కొసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించుట. ఒక తల్లితండ్రిగా మీరు చేయగల అత్యంత ముఖ్యమైన విషయము మీ పూర్ణ హృదయముతో సువార్తను జీవించుట. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కొరకు అర్హులగుటకు ఇది శ్రేష్టమైన విధానము. మీరు పరిపూర్ణంగా ఉండనవసరం లేదు, కేవలము మీ శాయశక్తులా ప్రయత్నించుట మరియు రక్షకుని యొక్క త్యాగము ద్వారా క్షమాపణ వెతుకుట. (రక్షకుని విధానములో బోధించుట, 13–14 చూడండి.)

చిత్రం
క్రీస్తు నీఫైయులను పలుకరించుట

నీఫైయులతో క్రీస్తు యొక్క చిత్రపటము, బెన్ సోవార్డ్స్ చేత

ముద్రించు