రండి, నన్ను అనుసరించండి
మార్చి 23–29. ఈనస్–మోర్మన్ యొక్క వాక్యములు: ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి నా యందు పని చేయును


“మార్చి 23–29. ఈనస్–మోర్మన్ యొక్క వాక్యములు: ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి నా యందు పని చేయును,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“మార్చి 23–29. ఈనస్–మోర్మన్ యొక్క వాక్యములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020

చిత్రం
ఈనస్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తన తండ్రి జేకబ్ మరియు తల్లితో

జేకబ్ మరియు ఈనస్, స్కాట్ స్నో చేత

మార్చి 23–29

ఈనస్మోర్మన్ యొక్క వాక్యములు

ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి నా యందు పని చేయును

మీరు ఈనస్ నుండి మోర్మన్ యొక్క వాక్యములు వరకు చదువుతున్నప్పుడు, మీకు లేదా మీ కుటుంబానికి విలువైన సందేశాల కొరకు చూడండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

జంతువులను వేటాడేందుకు ఈనస్ అడవికి వెళ్లెను, కానీ అతను “రోజంతా … మరియు రాత్రి అయినప్పుడు” ప్రార్థన చేయడానికి అక్కడే ఉండెను” (ఈనస్ 1:3–4). తన పాప క్షమాపణ పొందటానికి అతని ఆత్మ నిజంగా ఆకలితో ఉన్నందున, ఈనస్ అవసరమైనంత సేపు ప్రార్థన చేయడానికి మరియు దేవుని యెదుట “పెనుగులాడుటకు” కూడా సిద్ధంగా ఉండెను (ఈనస్ 1:2). హృదయపూర్వక ప్రార్థన అదే: మనకు కావలసిన దేని కోసమైనా ఎక్కువగా అడగడం కాదు, కానీ దేవునితో సంభాషించి మన చిత్తాన్ని ఆయన చిత్తానికి అనుసంధానించడానికి ఒక హృదయపూర్వక ప్రయత్నం. మీరు ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు, మీ గొంతు “పరలోకములలో వినిపించినప్పుడు”, దేవుడు మీ మాటలు వింటారని, మరియు అయను మీ గురించి, మీ ప్రియమైనవారి గురించి, మీ శత్రువుల గురించి కూడా నిజంగా శ్రద్ధ కనబరుస్తారని ఈనస్ గుర్తించినట్లే మీరు కూడా గుర్తిస్తారు (ఈనస్ 1:4–17 చూడండి). ఆ క్షణాలలో, దేవుడు తన చిత్తాన్ని మీకు తెలియజేయగలరు, మరియు మీరు ఆయనతో ఆనురూప్యంలో ఉన్నందున మీరు ఆయన సంకల్పాన్ని మరింత ఇష్టపడతారు మరియు దానిని చేయడానికి పాటుపడగలరు. మోర్మన్ మాదిరిగా, మీకు “అన్ని విషయాలు తెలియకపోవచ్చు;కాని ప్రభువు రాబోవు సంగతులనన్నిటిని ఎరుగును … [మరియు] ఆయన చిత్తమును బట్టి ఆయన [మీ] యందు పనిచేయును.” (మోర్మన్ యొక్క వాక్యములు 1:7).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు

ఈనస్ 1:1–3

తల్లిదండ్రుల మాటలు శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి.

ఈ వచనాలు తల్లిదండ్రులు మరియు పిల్లలకు ఏ సందేశాలు అందిస్తాయి?

ఈనస్ 1:4–27

నా హృదయపూర్వక ప్రార్థనలకు సమాధానం ఇవ్వబడుతుంది.

ప్రార్థనతో ఈనస్ అనుభవం లేఖనంలో అత్యంత చిరస్మరణీయమైనది. మీ అనుభవాలు తక్కువ నాటకీయంగా ఉండవచ్చు, కానీ అవి తక్కువ అర్థవంతం కానవసరం లేదు. ఈనస్ అనుభవాలు మీ ప్రార్థనలను మెరుగుపరచడానికి మార్గాలను తెరవవచ్చు. మీరు దీర్ఘాలోచన చెయ్యడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి:

  • ప్రార్థించినప్పుడు ఈనస్ చేసిన ప్రయత్నాలను ఏ పదాలు వివరిస్తాయి?

  • ఈనస్ మొదట దేని కోసం ప్రార్థించెను? (ఈనస్ 1:4 చూడండి). ఈనస్‌కు సమాధానం లభించిన తర్వాత అతని స్పందన నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు? (ఈనస్ 1:5–7చూడండి).

  • తనకు వచ్చిన సమాధానాలపై ఈనస్ ఎలా వ్యవహరించెను?

  • ప్రభువు పట్ల విశ్వాసం “స్థిరంగా” ఎలా ఉంచాలనే దాని గురించి ఈనస్ నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు? (ఈనస్ 1:11).

జోరంఓంనై

నేను ఆజ్ఞలను పాటించినప్పుడు, ప్రభువు నన్ను దీవించును.

మోర్మన్ గ్రంథములో దేవుడు పదేపదే ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి, నీఫైయులు ఆజ్ఞలను పాటిస్తే, వారు అభివృద్ధి చెందుతారు (2 నీఫై 1:20; జోరం 1:9–12; ఓంనై 1:6 చూడండి). జోరం మరియు ఓంనై గ్రంథాలు ఈ వాగ్దానం నెరవర్చే కొన్ని మార్గాలను చూపుతాయి. “భూమిపై అభివృద్ధి చెందడానికి” మీకు సహాయపడగల ఈ వృత్తాంతాల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

ఓంనై 1:14, 21

జారహెమ్ల ప్రజలు ఎవరు?

నీఫై ప్రాంతం నుండి నీఫైయులు పారిపోయిన తరువాత, వారు జారహెమ్ల అనే ప్రదేశంలో నివసిస్తున్న అనేక మందిని ప్రజలను కనుగొన్నారు. జారహెమ్ల ప్రజలు ఇశ్రాయేలీయుల సమూహం వారసులు, వారు లీహై కుటుంబం వలె, యెరూషలేమును విడిచిపెట్టి, వాగ్దాన దేశమునకు దేవుని చేత నడిపించబడ్డారు. క్రీస్తు పూర్వం 587లో బబులోనువారి ద్వారా బంధించబడిన యూదా రాజు సిద్కియా కుమారులలో ఒకరైన మ్యూలెక్ కూడా ఆ సమూహంలో ఉన్నాడు (యిర్మీయా 52:1–11; మోషైయ 25:2; హీలమన్ 8:21 చూడండి).

జారహెమ్ల ప్రజలు వాగ్దాన దేశమునకు వచ్చిన తరువాత, వారు కొరియాంటమర్‌ను కలిశారు (ఓంనై 1:21 చూడండి), ఈథర్ పుస్తకంలో జారేడీయులలో చివరిగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి గురించి ఈ కథ చెప్పబడింది.

మోర్మన్ యొక్క వాక్యములు

మోర్మన్ యొక్క వాక్యములు ఏమిటి?

మోర్మన్ యొక్క వాక్యములు మోర్మన్ గ్రంథమును కూర్పుచేయు రెండు జతల పలకల మధ్య వంతెనగా పనిచేస్తుంది. ఇక్కడ మోర్మన్ ఈ రెండు వృత్తాంతాల గురించి వివరణ ఇచ్చును, మరియు అతని మాటలు ప్రభువును విశ్వసించడం గురించి ఆయన దిశను మనం పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, అవి ఒక ముఖ్యమైన సందేశాన్ని బోధిస్తాయి.

నీఫై తన ప్రజల వృత్తాంతమును వ్రాస్తున్నప్పుడు, నీఫై చిన్న పలకలు మరియు పెద్ద పలకలు అని పిలువబడే రెండు జతల పలకలను సృష్టించమని దేవుడు అతనిని ఆదేశించెను. ప్రభువు రెండు జతల పలకలను సృష్టించమని ఎందుకు ఆదేశించారో నీఫైకి తెలియదు, కాని ఆయన “తెలివైన ఉద్దేశం ఉంటుంది…, ఆ ఉద్దేశ్యం నాకు తెలియదు” అని విశ్వసించెను. (1 నీఫై 9:5; “మోర్మన్ గ్రంథం గురించి సంక్షిప్త వివరణ.”) కూడా చూడండి.

శతాబ్దాల తరువాత, నీఫై పెద్ద పలకలను మోర్మన్ సంక్షిప్తీకరిస్తున్నప్పుడు, ఆయన చిన్న పలకలను చూసెను. మోర్మన్ అప్పటికే సంక్షిప్తీకరించిన పెద్ద పలకలలో వివరించిన అనేక సంఘటనలు అప్పటికే చిన్న పలకలలో అందించబడ్డాయి, కానీ చిన్న పలకలు ఆధ్యాత్మిక విషయాలపై మరియు ప్రవక్తల పరిచర్య మరియు బోధనలపై ఎక్కువ దృష్టి సారించాయి. పెద్ద పలకలతో పాటు నీఫై చిన్న పలకలను తన గ్రంథంలో చేర్చే విధంగా దేవుడు మోర్మన్‌ను ప్రేరేపించెను.

నీఫై మాదిరిగా, మోర్మన్ కూడా రెండు జతల పలకలను కలిగి ఉండటానికి దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయెను, కానీ అది “తెలివైన ఉద్దేశం నిమిత్తము” అని అతను విశ్వసించెను. (మోర్మన్ యొక్క వాక్యములు 1:7).

ఈ రోజు మనకు దేవుని ఉద్దేశం ఏమిటో తెలిసింది. 1828లో, నీఫై పెద్ద పలకలు (116 రాతప్రతి పేజీలు)లో మోర్మన్ సంక్షిప్తీకరించిన భాగాన్ని జోసెఫ్ స్మిత్ అనువదించిన తర్వాత, మార్టిన్ హారిస్ ఆ పేజీలను కోల్పోయాడు. దుర్మార్గులైన వ్యక్తులు ఈ మాటలు మార్చుకుని జోసెఫ్‌ను కించపరచడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఈ భాగాన్ని తిరిగి అనువదించవద్దని దేవుడు జోసెఫ్‌ను ఆజ్ఞాపించెను (సి&ని 10, విభాగం శీర్షికలు; సి&ని 10:14–19, 30–45 చూడండి). అదృష్టవశాత్తు, దేవుడు దీనిని ముందుగానే ఊహించి, చిన్న పలకలను అందించెను. ఇది 116 పేజీలతో పోగొట్టుకున్న అదే చరిత్ర అంతా కలిగి ఉంది. చిన్న పలకలు మోర్మన్ యొక్క వాక్యములకు ముందు వచ్చే గ్రంథాలతో కూర్చబడ్డాయి, పెద్ద పలకలలో మోర్మన్ సంక్షిప్తీకరించినవి మోర్మన్ యొక్క వాక్యముల తర్వాత ప్రారంభమవుతాయి.

చిత్రం
మోర్మన్ బంగారు పలకలను సంకలనం చేయుట

మోర్మన్ బంగారు పలకలను సంకలనం చేయట, జార్జ్ కోకో చేత

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఈనస్ 1:1–17

మీ కుటుంబం ఈనస్ ప్రార్థన చేసుకుంటున్న చిత్రాన్ని చూడవచ్చు మరియు చిత్రానికి శీర్షికగా ఉపయోగించగల పదబంధాల కోసం ఈనస్ 1:1–17లో వెతకవచ్చు. ఈనస్ అనుభవంలోని చిత్రాలను గీయమని మీరు కుటుంబ సభ్యులను కూడా అడగవచ్చు. క్షమాపణ కోరడం గురించి ఈనస్ చెప్పిన విషయాల నుండి మనం ఏమి నేర్చుకున్నాము?

జోరం 1:2

మోర్మన్ గ్రంథము గురించి మన అధ్యయనం ఎలా “రక్షణకు సంబంధించిన ప్రణాళికను వెల్లడించింది”?

ఓంనై 1:12–22

మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి?

మోర్మన్ యొక్క వాక్యములు 1:3–9

వ్యక్తిగత, కుటుంబ వృత్తాంత గ్రంథాలను కాపాడుకోవడం ద్వారా మనం ఎలా ప్రభువు దీవెనలు పొందుతాము? మన గ్రంథాలలో క్రీస్తుపై ఎక్కువ దృష్టి పెట్టి సారిస్తూ, వాటిని ఎలా వ్రాయవచ్చు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచడం

తరచుగా అంతా కలవండి. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు: “యేసు క్రీస్తు సిద్ధాంతాన్ని తెలుసుకోవడానికి పిల్లలందరినీ ఒక చోట చేర్చుకునే అవకాశాన్ని ఎన్నడూ వదలుకోకండి. శత్రువు ప్రయత్నాలతో పోల్చితే ఇటువంటి క్షణాలు చాలా అరుదు” (“బోధనా సిద్ధాంతం శక్తి,” ఎన్‌సైన్, మే 1999, 74).

చిత్రం
ఈనస్ ప్రార్థన

ఈనస్ ప్రార్థన, రాబర్ట్ టి. బారెట్ చేత

ముద్రించు