“మార్చి 16–22. జేకబ్ 5–7: ‘ప్రభువు మనతో కలిసి పనిచేయును‘” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“మార్చి 16–22. జేకబ్ 5–7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
మార్చి 16–22
జేకబ్ 5–7
ప్రభువు మనతో కలిసి పనిచేయును
లేఖనాలను చదవడం బయల్పాటును ఆహ్వానిస్తుంది. కనుక మీరు జేకబ్ 5–7 చదువుతున్నప్పుడు, మీకు మరియు మీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆత్మ నడిపింపును పొందండి. ప్రభువు మీ కోసం ఏ సందేశాలను కలిగి ఉన్నారు?
మీ మనోభావాలను నమోదు చేయండి
యేసు క్రీస్తు సువార్తను ఇంకా వినని చాలా, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మీరు ఎప్పుడైనా ప్రభువు సంఘములో వారిని పోగుచేసే మహత్వపూర్ణమైన కార్యము గురించి ముంచివేయబడినట్లు భావిస్తే జేకబ్ 5 లోని ఒలీవా చెట్ల ఉపమానము తిరిగి అభయాన్నిచ్చే జ్ఞాపిక కలిగియుంది: తోట ప్రభువుకు చెందినది. ఆయన మనలో ప్రతి ఒక్కరికి తన పనిలో సహాయపడటానికి ఒక చిన్న ప్రాంతాన్ని ఇచ్చారు—మన కుటుంబం, మన స్నేహితుల సమూహం, మన ప్రభావ కూటమి. అలాగే, కొన్నిసార్లు సమకూర్చడానికి సహాయపడే మొదటి వ్యక్తి మనమే. ఈ పనిలో మనం ఎప్పుడూ ఒంటరిగా లేము ఎందుకంటే తోట యొక్క ప్రభువు తన సేవకులతో కలిసి పనిచేస్తున్నారు (జేకబ్ 5:72 చూడండి). దేవుడు ఆయన పిల్లలను యెరిగియుండి, వారిని ప్రేమించును మరియు గతంలో ఆయనను తిరస్కరించిన వారితో పాటు వారిలో ప్రతివారు ఆయన సువార్తను వినుటకు ఒక మార్గము సిద్ధపరచును (జేకబ్ 4:15–18 చూడండి). ఆ తర్వాత, ఈ కార్యం పూర్తయినప్పుడు, “[ఆయనతో] కలిసి పనిచేయుటలో శ్రద్ధగల వారందరూ… [ఆయన] తోట యొక్క ఫలం వల్ల [ఆయనతో] ఆనందం” పొందుతారు (జేకబ్ 5:75).
వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు
ఉపమానం అంటే ఏమిటి?
ఉపమానాలు అనేవి సంకేతాల ద్వారా ఆధ్యాత్మిక సత్యాలను బోధించే కథలు. ఉదాహరణకు, ఒలీవా చెట్ల ఉపమానంలో, ఒక ద్రాక్షతోట ప్రపంచాన్ని సూచిస్తుంది, ఒక పెంపుడు ఒలీవా చెట్టు ఇశ్రాయేలును సూచిస్తుంది (దేవునితో నిబంధన చేసిన వారు), మరియు అడవి ఒలీవా చెట్లు అన్యజనుల దేశాలను సూచిస్తాయి (దేవునితో నిబంధన చేయని వారు).
మీరు జేకబ్ 5 లో ఉపమానాన్ని చదువుతున్నప్పుడు, అదనపు చిహ్నాల కోసం చూడండి మరియు వాటి అర్థం ఏమిటో దీర్ఘాలోచన చెయ్యండి. ఉదాహరణకు, మంచి ఫలము దేనిని సూచిస్తుందని మీరు అనుకుంటున్నారు? చెడు ఫలము దేనిని సూచిస్తుంది?
యేసు క్రీస్తు ద్రాక్షతోట యొక్క ప్రభువు.
ఈ జేకబ్ 5 లో ఒలీవా చెట్ల ఉపమానము గురించి అధ్యయనం ప్రారంభించే ముందు, జేకబ్ ఈ ఉపమానాన్ని తన జనులతో పంచుకోవడానికి ఎందుకు ప్రేరేపించబడ్డాడో తెలుసుకోవడానికి జేకబ్ 4:10–18 సమీక్షించడం సహాయకరంగా ఉండవచ్చు. ఈ జేకబ్ 6:3–5 లో, జేకబ్ నొక్కిచెప్పాలనుకున్న కొన్ని అదనపు సందేశాలను మీరు కనుగొనవచ్చు; ఉపమానములో ఈ సందేశాల కోసం వెతకండి. మీయంతట మీరు ఏ సందేశాలను జేకబ్ 5లో కనుగొన్నారు?
జేకబ్ 5 చాలా పెద్ద అధ్యయం—మోర్మన్ గ్రంథములో అత్యంత సుదీర్ఘమైనది. బహుశా ప్రపంచ చరిత్రలోని కాలాలను వివరించే కింది విభాగాలుగా విభజించడానికి ఇది సహాయపడవచ్చు:
-
వచనాలు 3–14.క్రీస్తు కాలానికి ముందు చెదిరిపోయిన ఇశ్రాయేలు
-
వచనాలు 15–28.క్రీస్తు మరియు అపొస్తలుల పరిచర్య
-
వచనాలు 29–49.గొప్ప భ్రష్టత్వం
-
వచనాలు 50–76.కడవరి దినాలలో ఇశ్రాయేలు సమకూర్చబడుట
-
వచనాలు 76–77.వెయ్యేండ్ల పరిపాలన మరియు లోకము అంతమగుట
ఉపమానము గురించి అదనపు లోతైన అవగాహనల కోసం, ఈ సారాంశముతో కూడిన రేఖాచిత్రాన్ని చూడండి.
తన పిల్లలను సమకూర్చడానికి సహాయం చెయ్యమని దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నారు.
ప్రభువు తోటలోకి పిలువబడే “ఇతర సేవకులలో” (జేకబ్ 5:70) మీలాంటి వారు ఉన్నారు—సంఘ సభ్యులుగా, దేవుడు తన పిల్లలను సమకూర్చుటలో సహాయపడవలసిన బాధ్యత మనందరికి ఉంది. ప్రభువు తోటలో పనిచేయడం గురించి జేకబ్ 5 లో, ముఖ్యంగా వచనాలు 61–62 మరియు 70–75 లో మీరు ఏ సూత్రాలను కనుగొన్నారు? తన తోటలో సేవ చెయ్యమని ఆయన మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎలా భావించారు? ఆయన కార్యంలో పాల్గొనేటప్పుడు మీకు ఏ అనుభవాలు కలిగాయి?
“సువార్త పరిచర్య,” సువార్త అంశాలు, topics.ChurchofJesusChrist.org; “పాత నిబంధన ఒలీవా తోట,” “సంఘము అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి” (వీడియోలు, ChurchofJesusChrist.org) కూడా చూడండి.
ఇతరులు నా విశ్వాసాన్ని సవాలు చేసినప్పుడు నేను బలంగా నిలబడగలను.
షేర్రమ్‌తో నీఫైయుల అనుభవం ఈ రోజు తరచుగా పునరావృతమవుతుంది: మీ విశ్వాసాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే, బాగా మాట్లాడే వ్యక్తులు ఉండవచ్చు. కానీ జేకబ్ “కదిలింపబడలేదు” (జేకబ్ 7:5). తన విశ్వాసంపై దాడి జరిగినప్పుడు జేకబ్ ఎలా స్పందించెను? అతని ప్రతిస్పందనల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? మీ విశ్వాసం సవాలు చేయబడే సమయాల్లో సంసిద్ధంగా ఉండటానికి మీరు ఇప్పుడు ఏమి చేయవచ్చు?
“సువార్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం,” సువార్త అంశాలు, topics.ChurchofJesusChrist.org; జెఫ్రీ ఆర్. హాలాండ్, “శిష్యత్వం—వెల—మరియు దీవెనలు,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2014, 6–9 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలం కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
జేకబ్ 5
కొన్ని కుటుంబాలు ఒలీవా చెట్ల ఉపమానమును చదివేటప్పుడు ఉన్న చిహ్నాలను గీయడం సహాయకరంగా ఉన్నట్లు గుర్తించాయి. మీ కుటుంబం ఆ విధానాన్ని ఆస్వాదించవచ్చు లేదా ఉపమానంలో ఉన్న చిహ్నాలను దృశ్యమానం చేయడానికి కుటుంబ సభ్యులకు మీరు సహాయపడగల మరొక మార్గం ఉండవచ్చు. తోటను (లేదా ప్రపంచాన్ని) సూచించడానికి మీరు ఒక బల్ల లేదా నేలపై ఒక ప్రాంతాన్ని గుర్తించి, పెంపుడు ఒలీవా చెట్టును (లేదా ఇశ్రాయేలు ఇంటిని) ఒక పజిల్ వంటి వస్తువుతో చిత్రీకరించవచ్చు, దానిని ముక్కలుగా విభజించవచ్చు (ఇశ్రాయేలు చెల్లాచెదరును సూచిస్తుంది) ఆపై తిరిగి కలపవచ్చు (ఇశ్రాయేలీయులు సమకూర్చబడటాన్ని సూచిస్తుంది). ఈ ఉపమానము ప్రభువు గురించి, అతని సేవకుల గురించి మనకు ఏమి బోధిస్తుంది?
జేకబ్ 5:70–77
ప్రభువు తన ద్రాక్షతోటలో శ్రమించే “చివరిసారి” గురించి మీరు చదువుతున్నప్పుడు, “మీ శక్తితో” ప్రభువును సేవించటానికి మీకు మరియు మీ కుటుంబానికి ఏది ప్రేరణగా నిలిచింది? (జేకబ్ 5:71). ఈ వచనంలో వారి పేర్లను చేర్చడం ద్వారా వచనం 75 వ్యక్తిగతీకరించడానికి మీరు కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు—ఉదాహరణకు, “నీవు ధన్యుడవు, [పేరు].” తోట యొక్క యజమానిని సేవిస్తున్నప్పుడు వారు ఆనందం పొందిన అనుభవాలను పంచుకోవచ్చు, ఉదాహరణకు సువార్తను పంచుకోవడం, దేవాలయంలో సేవ చేయడం లేదా సంఘ సభ్యులను బలోపేతం చేయడం. (ఎమ్. రసెల్ బ్యాలర్డ్ “ప్రభువుపై నమ్మకం ఉంచండి,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2013, 43–45 కూడా చూడండి.)
జేకబ్ 6:4–7
ప్రభువు తన కరుణామయ హస్తాన్ని మన వైపు ఎలా చూపించారు? ఈ వచనాలలో “హత్తుకోవడం” అనే పదానికి అర్థం ఏమిటి? ప్రభువు మనల్ని ఎలా హత్తుకుంటారు? మనం ఆయను ఎలా హత్తుకోగలము?
జేకబ్ 7:1–12
ప్రజలు ఇతరులను ఎలా దారితప్పించడానికి ప్రయత్నిస్తారనే దాని గురించి తెలియజేసే ఈ వచనాల నుండి మనం ఏమి నేర్చుకున్నాము? జేకబ్ చూపిన దృష్టాంతాన్ని మనం ఎలా అనుసరించగలము మరియు క్రీస్తుపై మన విశ్వాసంలో స్థిరంగా ఉండగలము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారపు సారాంశం చూడండి.