రండి, నన్ను అనుసరించండి
మార్చి 9–15. జేకబ్ 1–4: “క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో సమాధానపడుడి”


“మార్చి 9–15. జేకబ్ 1–4: ‘క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో సమాధానపడుడి” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“మార్చి 9–15. జేకబ్ 1–4,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

యేసు పాదాల వద్ద మోకరిల్లిన స్త్రీ

క్షమించబడెను గ్రెగ్ కె. ఓల్సెన్ చేత

మార్చి 9–15

జేకబ్ 1–4

క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో సమాధానపడుడి

మీరు ఆత్మీయ మనోభావాలను నమోదు చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మీకు బోధించాలని మీరు కోరుకుంటున్నట్లు తెలియజేస్తారు. మీరు జేకబ్ 1–4 చదువుతున్నప్పుడు, మీ అంతర్దుష్టులను వ్రాయడాన్ని పరిగణించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

నీఫైని తమ “గొప్ప రక్షణకర్త” గా నీఫైయులు పరిగణించారు (జేకబ్ 1:10). వారి శత్రువుల నుండి దాడులకు వ్యతిరేకంగా ఆయన వారిని కాపాడెను మరియు ఆత్మీయ ప్రమాదాల గురించి వారిని హెచ్చరించెను ఇప్పుడు ఆయన గతించెను, మరియు నీఫైయులను ఆత్మీయంగా నడిపించే బాధ్యత జేకబ్ పైకి వచ్చింది, నీఫై తనను ప్రజలకు యాజకునిగా మరియు బోధకునిగా నియమించెను ( జేకబ్ 1:18చూడండి). దీని స్ఫూర్తితో, జేకబ్ తన ప్రజలకు “చాలా ధైర్యం” తో బోధించాల్సిన అవసరం ఉందని గ్రహించెను, ఎందుకంటే వారు “పాపమునందు కృషి చేయుట మొదలు పెట్టుచున్నారు” (జేకబ్ 2:7, 5). ఈ పాపాలు మరియు నేడు ప్రజలు కష్టపడుతున్నవి ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి: డబ్బు, సంపద పట్ల వ్యామోహం మరియు లైంగిక అనైతికత. ఈ దుష్టత్వాన్ని తాను ఖండించవలసి ఉందని జేకబ్ భావించినప్పటికీ, అతని హృదయం ఆ బాధితుల కోసం కూడా బాధపడింది, వారి హృదయాలు “లోతైన గాయాల పాలయ్యాయి” (జేకబ్ 2:35). పాపి మరియు ఆత్మీయంగా గాయపడినవారు—ఈ రెండు సమూహాలకు స్వస్థత చేకూర్చడం రక్షకుడైన యేసు క్రీస్తు నుండి వచ్చునని జేకబ్ సాక్ష్యమిచ్చెను. జేకబ్ సందేశం, అతని ముందు నీఫై ఇచ్చిన సందేశం వలె, “క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా [ప్రభువు]తో సమాధానపడటానికి” పిలుపు ఇవ్వబడింది (జేకబ్ 4:11).

వ్యక్తిగత అధ్యయన చిహ్నం

వ్యక్తిగత లేఖన అధ్యయనం కొరకు ఉపాయములు

జేకబ్ 1:6–8, 15–19; 2:1–11

నా పిలుపుకు నేను ఘనతచేకూర్చాలని ప్రభువు కోరుకుంటున్నారు.

జేకబ్‌కు, దేవుని వాక్కును బోధించడం అంటే తన సహోదరుని నుండి అప్పగించబడిన కార్యం కంటే ఎక్కువ—అది “ప్రభువు నుండి ఇవ్వబడిన దూతకార్యం”, కాబట్టి అతను “[తన] స్థానానికి ఘనతచేకూర్చాలని” అత్యంత శ్రద్ధగా శ్రమించెను. (జేకబ్ 1:17, 19). అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ “మనం శ్రద్ధతో సేవ చేస్తున్నప్పుడు, విశ్వాసం మరియు సాక్ష్యాలతో బోధించేటప్పుడు, మనం ఎవరి జీవితాలను స్పృశించినా వారిలో నీతిధర్మం విశ్వాసాలను పెంచడం, బలోపేతం చేయడం, నిర్మించడం” మొదలైనవి చేసినప్పుడు మన పిలుపులకు ఘనతచేకూరుస్తామని బోధించారు. (“మీ పిలుపుకు ఘనతచేకూర్చండి,” ఎన్‌సైన్, మే 1989, 47). మీరు జేకబ్ 1:6–8, 15–19 మరియు 2:1–11 చదువుతున్నప్పుడు, ప్రభువు నుండి మీ స్వంత “[కార్యాల] గురించి ఆలోచించండి”. జేకబ్ ఎందుకు ఇంత నమ్మకంగా సేవ చేసెను? మీ సంఘ పిలుపులను మరియు ఇంట్లో మీ బాధ్యతలకు ఘనతచేకూర్చడానికి ఆయన మాదిరి మీకు ఏమి ప్రేరేపిస్తుంది?

“మీ పిలుపుకు పైకిలేవండి” కూడా చూడండి (వీడియో, ChurchofJesusChrist.org).

జేకబ్ 2:23–3:12

ప్రభువు పవిత్రత యందు ఆనందించును.

పాపం యొక్క పరిణామాలు వ్యక్తులపైన, సమాజాలపైన ఉంటాయి. లైంగిక పాపం గురించి మాట్లాడేటప్పుడు, జేకబ్ రెండు రకాల పరిణామాల గురించి హెచ్చరించెను. మీరు జేకబ్ 2:31–35 మరియు 3:10 చదువుతున్నప్పుడు, జనులుగా మరియు వ్యక్తులుగా నీఫైయులను ప్రభావితం చేసే అనైతికత మార్గాల గురించి చూడండి. నేటి ప్రపంచంలో మీరు చూసే అనైతికత పరిణామాలకు ఈ మార్గాలు ఎలా సమానంగా ఉంటాయి? పవిత్రత ప్రాముఖ్యత గురించి ప్రియమైన వ్యక్తికి నేర్పించడంలో మీకు సహాయపడే జేకబ్ మాటల్లో మీరు ఏమి కనుగొన్నారు? పవిత్రంగా ఉండటానికి మీరు చేసిన ప్రయత్నాల వలన మీరు ఎలా ఆశీర్వదించబడ్డారు?

ఒకరి కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉన్న పద్ధతిని కూడా జేకబ్ ప్రసంగించెనని గుర్తుంచుకోండి. పరిమిత పరిస్థితులలో, బహుళ వివాహాలు ఆచరణలో పెట్టాలను ప్రభువు తన ప్రజలకు ఎందుకు ఆజ్ఞాపించెనో అర్థం చేసుకోవడానికి జేకబ్ 2:23–30 పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? తన అనుమతి లేకుండా అలా చేసేవారి గురించి ఆయన ఎలా భావిస్తారు?

జేకబ్ 4

యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా నేను దేవునితో సమాధానపడగలను.

జేకబ్ “క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా [దేవుని]తో సమాధానపడుడి” అని తన ప్రజలతో వేడుకొనెను (జేకబ్ 4:11). దాని అర్థం ఏమిటి? నిఘంటువులో సమాధానపడు అనే పదాన్ని వెతకడం మీకు సహాయపడుతుందా? ఈ అధ్యాయంలో మీరు క్రీస్తు యొద్దకు ఎలా రాగలరో మీకు సూచించే పదాలు లేదా పదసముదాయాలను మీరు కనుగొనవచ్చు, తద్వారా మీరు దేవునితో సమాధానపడవచ్చును. ఉదాహరణకు, ప్రజలను యేసు క్రీస్తు వైపు నడిపించడానికి మోషే ధర్మశాస్త్రాన్ని జేకబ్ బోధించెను (జేకబ్ 4:5 చూడండి). మిమ్మల్ని క్రీస్తు వైపు చూపించడానికి దేవుడు ఏమి సమకూర్చెను? దేవుని యొద్దకు వెళ్ళడానికి ఈ అంశాలను మీరు ఎలా ఉపయోగిస్తున్నారు?

2 నీఫై 10:24 కూడా చూడండి.

జేకబ్ 4:8–18

రక్షకునిపై దృష్టి పెట్టడం ద్వారా నేను ఆధ్యాత్మిక అంధత్వాన్ని నివారించగలను.

జేకబ్ తన ప్రజలను మరింత పూర్తిగా ప్రభువు వైపునకు తిప్పడానికి ప్రయత్నించినప్పుడు, ఆధ్యాత్మికంగా అంధుడిగా ఉండవద్దని మరియు సువార్త యొక్క “సరళమైన మాటలను” తృణీకరించవద్దని అతను హెచ్చరించెను (జేకబ్ 4:13–14 చూడండి). ఎల్డర్ క్వింటన్ ఎల్. కుక్ మన రోజులో ఇలాంటి సమస్యల గురించి హెచ్చరించారు: “మనలో కొంతమంది సువార్త ప్రాథమిక అంశాలపై సాక్ష్యాన్ని కొనసాగించడం కంటే ‘గుర్తును దాటి చూడటం’ అనే ధోరణి ఉంది. సువార్త సత్యాలను మనుష్యుల తత్వాలతో భర్తీచేసినప్పుడు, సువార్త అతివాదంలో నిమగ్నమైనప్పుడు … లేదా సిద్ధాంతం కంటే నియమాలను ఎక్కువచేసినప్పుడు మనం దీన్ని చేస్తాము. ఈ ప్రవర్తనలను నివారించడం వల్ల జేకబ్ వివరించిన వేదాంత అంధత్వం మరియు పొరపాట్లను నివారించవచ్చు” (“గుర్తును దాటి చూడటం,” ఎన్‌సైన్, మార్చి 2003, 42).

జేకబ్ 4:8–18 ప్రకారం, రక్షకుడిపై దృష్టి పెట్టడానికి మరియు ఆత్మీయ అంధత్వాన్ని నివారించడానికి మనం ఏమి చేయవచ్చు?

కుటుంబ అధ్యయన చిహ్నం

కుటుంబ లేఖన అధ్యయనం మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

జేకబ్1:6–8, 15–19; 2:1–11; 4:18

ఈ వచనాలలోని ఏ పదాలు మరియు పదసముదాయాలు జేకబ్ తాను నడిపించిన వారి పట్ల చూపిన ప్రేమను తెలియజేస్తాయి? మన సంఘ నాయకులు “[మన] ఆత్మల సంక్షేమం కోసం వారి కోరిక మరియు ఆతృత”ను మనం అనుభూతి చెందడానికి ఏమి చేశారు? (జేకబ్ 2:3). బహుశా మన సంఘ నాయకులకు సహకారమందించగల మార్గాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. స్థానిక సంఘ నాయకులకు వారి సేవకు కృతజ్ఞతలు చెప్పడానికి వివరణలు రాయడం లేదా మీ ప్రార్థనలలో వారిని మరియు వారి కుటుంబాలను గుర్తుంచుకోవడం వంటి వాటి కోసం కుటుంబంగా ఏదైనా చెయ్యాలని మీరు ప్రణాళిక చెయ్యవచ్చు.

జేకబ్ 2:8

దేవుని వాక్యము “గాయపడిన ఆత్మ”కు ఎలా స్వస్థత చేకూరుస్తుంది?

జేకబ్ 2:12–21

భౌతిక సంపదను మనం ఎలా చూడాలి అనే దాని గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి? మన సహాయం అవసరమైన ఇతరులను చేరుకోవడానికి మనం ఏమి చేస్తున్నాము?

జేకబ్ 3:1–2

“హృదయ శుద్ధిగలవారు” మరియు “దృఢమైన మనస్సుతో దేవుని వైపు చూడటం” అంటే ఏమిటి?

జేకబ్ 4:4–11

మీ కుటుంబం వారి విశ్వాసంలో “స్థిరంగా” ఉండడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పని చేయమని చెప్పండి, సమీపంలో ఉన్న ఒక పెద్ద చెట్టును కనుగొని, ఆ చెట్టు యొక్క విడివిడి కొమ్మలను ఊపాల్సిందిగా కుటుంబ సభ్యులకు చెప్పండి. ఆ తర్వాత చెట్టు మొండెమును ఊపడం ప్రయత్నించమని చెప్పండి. చెట్టు మొండెమును ఊపడం ఎందుకు కష్టం? “స్థిరమైన” విశ్వాసం ఎలా పెంచుకోవాలో జేకబ్ బోధనల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

ఒక ఉద్యానవనంలో పెద్ద చెట్టు

చెట్టు మొండెము వలె క్రీస్తుపై మన విశ్వాసం “కదిలించబడదు.”

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనం మెరుగుపరచడం

ఆత్మను వినండి. మీరు అధ్యయనం చేసినప్పుడు, మీ ఆలోచనలు, భావనల పట్ల శ్రద్ధ వహించండి (సి&ని 8:2–3 చూడండి), మీరు చదువుతున్న వాటికి ఏవైనా అసంబంద్ధంగా అనిపించినా కూడా శ్రద్ధ వహించండి. మీరు తెలుసుకోవాలని మరియు చేయాలని దేవుడు కోరుకునే విషయాలే ఆ మనోభావాలు కావచ్చు.

జేకబ్ బంగారు పలకలపై వ్రాయుట

నేను వారి మాటలను ముందుకు పంపెదను (బోధకుడైన జేకబ్), ఎల్స్‌పెత్ కైట్లిన్ యంగ్ చేత