“ఏప్రిల్ 20–26. మోషైయ 4–6: ‘ఒక గొప్ప మార్పు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“ఏప్రిల్ 20–26. మోషైయ 4–6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020
ఏప్రిల్ 20–26
మోషైయ 4–6
“ఒక గొప్ప మార్పు”
మీరు మోషైయ 4–6 చదివినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణలకు ఆసక్తిని చూపండి. మీరు ఏ మంచి విషయాలు చేయుటకు ప్రేరేపించబడ్డారు? (మోషైయ 5:2 చూడండి).
మీ మనోభావాలను నమోదు చేయండి
ఎవరైన ఎప్పుడైన మాట్లాడటం విని, మీ జీవితాన్ని మార్చుకోవటానికి ప్రేరేపించబడినట్లు భావించారా? బహుశా, మీరు వినిన దానిని బట్టి, కాస్త భిన్నంగా జీవించటానికి—లేక ఇంకా ఎక్కువ భిన్నంగా జీవించటానికి మీరు నిర్ణయించుకొన్నారు. రాజైన బెంజిమెన్ యొక్క ప్రసంగము అటువంటి ప్రసంగము, మరియు ఆయన బోధించిన సత్యములు, వాటిని విన్న జనులపై అటువంటి విధమైన ప్రభావమును కలిగియున్నది. రాజైన బెంజిమెన్ తనకు దేవదూత బోధించిన దానిని తన జనులతో పంచుకొనెను—ఆ అద్భుతమైన దీవెనలు “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తము” (మోషైయ 4:2) ద్వారా సాధ్యమగును. ఆయన సందేశము వారి గురించి వారి అభిప్రాయాన్నంతా మార్చివేసింది (మోషైయ 4:2 చూడండి), వారి కోరికలను మార్చివేసింది (మోషైయ 5:2 చూడండి), మరియు వారు ఆయన చిత్తమును ఎల్లప్పుడు చేస్తామని దేవునితో నిబంధన చేయుటకు వారిని ప్రేరేపించింది (మోషైయ 5:5చూడండి). ఈవిధంగా రాజైన బెంజిమెన్ యొక్క మాటలు తన జనులను ప్రభావితం చేసాయి. అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
యేసు క్రీస్తు ద్వారా, నేను నా పాపముల కొరకు పరిహారమును పొంది, దానిని నిలుపుకోగలను.
ప్రకృతి సంబంధియైన మనుష్యుని జయించుట సులభము కాదు. “ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ఒక పరిశుద్ధుడు,” (మోషైయ 3:19) అగుటకు గొప్ప ప్రయత్నము అవసరము. కొన్నిసార్లు, మీ పాపముల కొరకు క్షమించబడినట్లు భావించినప్పుడు కూడ, ఆ భావన నిలుపుకొనుటకు మరియు నీతి మార్గముపై నిలిచియుండుటకు మీరు ప్రయాసపడవచ్చు. రాజైన బెంజిమెన్ తన జనులు పాపముల పరిహారమును ఎలా పొందాలో అదేవిధంగా ఎలా నిలుపుకోవాలి ఈ రెండిటితో పాటు ఒక పరిశుద్ధునిగా నిలకడగా ఎలా జీవించాలో బోధించెను. మీరు మోషైయ 4 అధ్యాయము చదివినప్పుడు, క్రింది వంటి ప్రశ్నలు మీకై మీరు అడగవచ్చు:
-
1–12 వచనములు.రాజైన బెంజిమెన్ జనులకు పాప పరిహారము ఏ దీవెనలు తెచ్చింది? వారి పాప పరిహారమును నిలుపుకొనుటకు వారికి సహాయపడుటకు రాజైన బెంజిమెన్ ఏమి బోధించెను? మనము రక్షణ ఎలా పొందాలో అనే దాని గురించి ఆయన ఏమి బోధించారు? రాజైన బెంజిమెన్ మనము “ఎల్లప్పుడు జ్ఞాపకమందు ఉంచుకోవలెనని” (వచనము 11) చెప్పుట గమనించండి. ఈ విషయాలను జ్ఞాపకముంచుకొనుటకు మీరు ఏమి చేయటానికి ప్రేరేపించబడ్డారు ?
-
12–16 వచనాలు.ఈ వచనాల ప్రకారము, 11వ చనము లో వివరించబడిన విషయాలను మనము చేసిన యెడల మన జీవితాలలో ఏమి జరుగుతుంది? మీ జీవితంలో ఈ మార్పులను అనుభవించారా? మోషైయ 3:19 లో వివరించబడిన మార్పులకు అవి ఏవిధంగా సంబంధాన్ని కలగియున్నాయి ?
-
16–30 వచనాలు.పేదవారితో పంచుకొనుట వలన మన పాప పరిహారమును నిలుపుకొనుటకు మనకు ఏవిధంగా సహాయపడుతుంది? క్రీస్తువలె ఉండుటకు మీరు చేసే ప్రయత్నాలకు 27వ చనమును మీరు ఎలా అన్వయించుకొంటారు?
డేవిడ్ ఏ. బెడ్నార్, “Always Retain a Remission of Your Sins,” Ensign లేదా Liahona, మే 2016, 59–62; డేల్ జి. రెన్‌లన్డ్, “Preserving the Heart’s Mighty Change,” Ensign లేదా Liahona, Nov. 2009, 97–99 కూడా చూడండి.
ప్రభువు యొక్క ఆత్మ నా హృదయములో ఒక గొప్ప మార్పు కలుగజేయగలదు.
“నేను మారలేను. నేను ఎప్పుడూ ఇంతే,” అని జనులు చెప్పుట సర్వసాధారణము. దానికి వ్యతిరేకంగా, రాజైన బెంజిమెన్ యొక్క జనుల అనుభవము ప్రభువు యొక్క ఆత్మ మన హృదయాలను నిజముగా ఎలా మార్చగలదో మనకు చూపుతుంది. అధ్యక్షలు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “మన ప్రవర్తనను మనము మార్చుకోగలము. మన కోరికలు మారగలవు. … నిజమైన మార్పు— శాశ్వతమైన మార్పు— యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క స్వస్థపరచు, శుద్ధి చేయు, మరియు సమర్ధించు శక్తి ద్వారా మాత్రమే వస్తుంది. … యేసు క్రీస్తు యొక్క సువార్త మార్పు యొక్క సువార్త!” (“Decisions for Eternity,” Ensign or Liahona, Nov. 2013, 108).
రాజైన బెంజిమెన్ యొక్క జనులు అనుభవించిన మార్పు గురించి మీరు చదివినప్పుడు, నిజమైన పరివర్తనకు నడిపించు “గొప్ప మార్పు“ మీ జీవితంలో ఎలా జరిగిందో— లేదా జరుగగలదో—ఆలోచించండి. కొన్ని “గొప్ప” క్షణములు మీ హృదయము యొక్క మార్పుకు నడిపించాయా, లేక మీ పరివర్తన ఎక్కువ క్రమంగా జరిగిందా?
యెహెజ్కేలు 36:26–27; ఆల్మా 5:14; David A. Bednar, “Converted unto the Lord,” Ensign or Liahona, నవం. 2012, 106–9 కూడా చూడండి.
నేను నిబంధనలు చేసినప్పుడు, నేను క్రీస్తు యొక్క నామమును నాపై తీసుకొంటాను.
రాజైన బెంజిమెన్ తన జనులకు ప్రసంగించుటకు ఒక కారణము, “ఈ జనులకు ఒక పేరును ఇచ్చుట.” కొందరు నీఫైయులు మరియు మిగిలిన వారు మ్యులెక్ యొక్క సంతానము, కానీ అతని మనస్సులో ఉన్నవి ఈ పేర్లు కాదు. దేవునికి విధేయులుగా ఉండుటకు వారి నిబంధనలో భాగముగా “క్రీస్తు యొక్క నామము” (మోషైయ 1:11; 5:10) వారిపై తీసుకోమని జనులను ఆయన ఆహ్వానించెను. క్రీస్తు యొక్క నామమును మీపై తీసుకొనుట అనగా అర్ధమేమిటో మోషైయ 5:7–9 నుండి మీరేమి నేర్చుకుంటారు?
ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ బోధించారు, “ [నైతిక మరియు ఆత్మీయ శక్తికి] ఆధారము దేవుడే. ఆయనతో మనం నిబంధలు చేయడం ద్వారా ఆ శక్తిని మనం పొందగలము” (“The Power of Covenants,” Ensign or Liahona, మే 2009, 20). మోషైయ 5:5–15 మీరు చదివినప్పుడు, దేవునితో మీరు చేసిన నిబంధనలను మీరు పాటించినప్పుడు మీ జీవితములోనికి వచ్చు దీవెనలను ఒక జాబితా చెయ్యండి. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా మీలో వచ్చిన “గొప్ప మార్పు” నిలుపుకొనుటకు మీ నిబంధనలు పాటించడం మీకు ఎలా సహాయపడతాయి?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
మోషైయ 4:9–12
మీ కుటుంబము ఎక్కువ సంపూర్ణంగా “దేవునియందు విశ్వసించి” (మోషైయ 4:9) మరియు “దేవుని యొక్క గొప్పతనమును ఎల్లప్పుడు ఎలా జ్ఞాపకముంచుకొన” గలదు? (మోషైయ 4:11). బహుశా మీ కుటుంబ సభ్యులు మోషైయ 4:9–12 చదివి, దేవునియందు వారి విశ్వాసమును పెంపొందించుకొనుట సహాయపడు వాక్యభాగములను గుర్తించగలరు. తరువాత వారు ఈ వాక్యభాగములను వ్రాసియుంచి జ్ఞాపకార్ధములుగా ఇల్లంతా వాటిని ఉంచగలరు. ఈ విషయాలను జ్ఞాపకముంచుకొనుట మనము “ఎల్లప్పుడు ఆనందించుటకు” మరియు “[మన] పాపములకు పరిహారమును నిలుపుకొనుటకు” మనకు ఎలా సహాయపడును? (మోషైయ 4:12).
మోషైయ 4:14–15
ఈ వచనముల నుండి పోట్లాడుట మరియు కలహించుట గురించి మనము ఏమి నేర్చుకున్నాము?
మోషైయ 4:16–26
ఏ భావనలో మనమందరము బిచ్చగాళ్ళము? ఈ వచనముల ప్రకారము, మనము దేవుని యొక్క పిల్లలందరిని ఎలా ఆదరించాలి? (మోషైయ 4:26 చూడండి). మన సహాయము ఎవరికి అవసరము?
మోషైయ 4:27
మీ కుటుంబము మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయటానికి ప్రయత్నిస్తుందా ? కుటుంబ సభ్యులు శ్రద్ధ కలిగియున్నవారు మాత్రమే కాదు, తెలివైన వారని కూడ నిశ్చయపరచుటకు వారి కార్యక్రమాలను విశ్లేషించమని మీరు వారిని అడగవచ్చు.
మోషైయ 5:5–15
క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొనుట ఆయనతో మన అనుబంధము గురించి ఏమని సూచించును? కొన్నిసార్లు జనులు వారికి చెందిన వాటిపై వారి పేర్లు ఎందుకు వ్రాస్తారో మాట్లాడుట సహాయపడవచ్చు. మనము రక్షకునికి “చెందిన” వారమని మనము ఎలా చూపగలము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.