రండి, నన్ను అనుసరించండి
ఏప్రిల్ 27–మే 3. మోషైయ 7–10: “ప్రభువు యొక్క బలమందు”


“ఏప్రిల్ 27–మే 3. మోషైయ 7–10: ‘ప్రభువు యొక్క బలమందు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ఏప్రిల్ 27–మే 3. మోషైయ 7–10,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

రాజైన లింహైకు అమ్మోన్ బోధించుట

మినర్వా కె. టీఛర్ట్ (1888-1976), రాజైన లింహై ముందు అమ్మోన్, 1949-1951, కృత్రిమ చెక్కపై తైలవర్ణ చిత్రము 35 15/16 x 48 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, 1969.

ఏప్రిల్ 27–మే 3.

మోషైయ 7–10

“ప్రభువు యొక్క బలమందు”

మీరు చదువుతున్నప్పుడు, నిర్దిష్టమైన వాక్యభాగాలను లేక అంశాలను ఆత్మ మీ దృష్టికి తేవచ్చు. ఆ అంశాలు మీకేవిధంగా అన్వయించబడతాయని మీరనుకుంటున్నారో వ్రాయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

జారహెమ్లలో రాజైన మోషైయ యొక్క జనులు “నిరంతర సమాధానమును” ఆనందిస్తుండగా (మోషైయ 7:1), అనేక సంవత్సరాలకు ముందు లీహై-నీఫై దేశములో నివసించడానికి వెళ్ళిన మరో నీఫైయుల సమూహం పైకి వారి ఆలోచనలు మరిలాయి. తరాలు గడిచిపోయాయి, కానీ వారి గురించి ఎటువంటి సమాచారమును మోషైయ జనులు వినలేదు. కాబట్టి, వెళ్ళిపోయిన నీఫైయులను కనుగొనడానికి ఒక అన్వేషణ బృందమును నడిపించమని మోషైయ, అమ్మోన్ ను అడిగెను. “దుష్టత్వమును బట్టియే” (మోషైయ 7:24) నీఫైయులు, లేమనీయుల దాస్యములో ఉన్నారని అన్వేషణ బృందము కనుగొన్నది. కానీ అమ్మోన్ మరియు అతని సహోదరుల రాకతో అకస్మాత్తుగా అక్కడ విడుదలకు నిరీక్షణ కలిగింది.

కొన్నిసార్లు మనము దాస్యములో ఉన్న ఈ నీఫైయుల వలె ఉన్నాము, మన పాపముల కారణంగా బాధపడుతూ, మరల సమాధానమును ఏవిధంగా పొందగలమని ఆశ్చర్యపడుతూ ఉంటాము. కొన్నిసార్లు మనం అమ్మోన్ వలె ఇతరులను సమీపించాలనే ప్రేరేపణను పొందుతాము మరియు క్రమంగా మన ప్రయత్నాలు వారిని, “(తమ) తలలు పైకెత్తి ఆనందించుచు, దేవుని యందు (తమ) నమ్మికయుంచమని” (మోషైయ 7:19) ప్రేరేపించినట్లు కనుగొంటాము. మన పరిస్థితులు ఏవైనప్పటికీ, మనందరం పశ్చాత్తాపపడవలెను మరియు “ఆయన (మనల్ని) … విడిపించునను” విశ్వాసముతో, “హృదయము యొక్క సంపూర్ణ సంకల్పముతో ప్రభువు తట్టు తిరుగవలెను” (మోషైయ 7:33).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మోషైయ 7:14–33

నేను ప్రభువు తట్టు తిరిగి, ఆయనను నమ్మి, ఆయనను సేవించినట్లయితే, ఆయన నన్ను విడిపిస్తారు.

జారహెమ్ల నుండి వచ్చిన నీఫైయుడైన అమ్మోన్ ను కలుసుకోవడం రాజైన లింహైకు నిరీక్షణనిచ్చింది, మరియు అతడు ఆ నిరీక్షణను తన ప్రజలకు అందించాలనుకున్నాడు. మీరు మోషైయ 7:14–33 చదివినప్పుడు, తన జనులను ప్రోత్సహించడానికి, వారి విశ్వాసాన్ని బలపరచడానికి మరియు దేవుడు వారికి సహాయపడతాడనే నిరీక్షణను వారికివ్వడానికి లింహై వారికి ఏమి చెప్పాడో గమనించండి. లింహై జనుల వలె అవే రకమైన పాపములను బట్టి మీరు అపరాధ భావనలో లేనప్పటికీ, అతని మాటలు ప్రభువు తట్టు తిరగడానికి మీకేవిధంగా సహాయపడగలవు? ఉదాహరణకు, దేవుడు విడిపించినట్టి పూర్వ వృత్తాంతాల గురించి లింహై తన జనులకు గుర్తుచేసాడని మీరు గమనిస్తారు (వచనాలు 18–20 చూడండి). ఈ వృత్తాంతాలు, అలాగే ఇతర లేఖన వృత్తాంతాలు లేక వ్యక్తిగత అనుభవాలు దేవుడిని నమ్మడానికి మీకెలా సహాయపడతాయి?

మోషైయ 8:5–12

లింహై జనుల చేత కనుగొనబడిన 24 పలకలు ఏమిటి?

లింహై జనులలో కొందరు జారహెమ్ల దేశాన్ని కనుగొనడానికి విఫలయత్నం చేస్తుండగా, తెలియని భాషలో చెక్కడములున్న 24 బంగారు పలకలను వారు కనుగొన్నారు. కాలక్రమంలో రాజైన మోషైయ చేత అనువదించబడిన ఈ పలకలు జెరెడీయులనబడే జనుల గురించి చెప్పాయి, వారు బాబెలు గోపురం నుండి వాగ్దాన దేశానికి వచ్చి, క్రమంగా నాశనం చేయబడ్డారు (మోషైయ 28:11–19 చూడండి). తరువాత మొరోనై ఈ పలకలను సంక్షేపం చేసాడు (ఈథర్ 1:1–2 చూడండి), అది ఈథర్ గ్రంథంగా మారింది. మోషైయ 28:18 లో మోషైయ జనులపై ఈ గ్రంథం యొక్క ప్రభావాన్ని గమనించండి.

మోషైయ 8:12–19

మనుష్యులకు లాభం చేకూర్చడానికి ప్రభువు ప్రవక్తలను, దీర్ఘదర్శులను, బయల్పాటుదారులను ఏర్పాటు చేస్తారు.

ప్రభువు ఒక దీర్ఘదర్శిని లేవనెత్తాడని అమ్మోన్ సాక్ష్యమును లింహై వినినప్పుడు, లింహై “మిక్కిలి సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించెను” (మోషైయ 8:19). అతడు ఆవిధంగా భావించాడని మీరెందుకు అనుకుంటున్నారు? మోషైయ 8:13–19 లో అమ్మోన్ మాటల నుండి దీర్ఘదర్శుల గురించి మీరేమి నేర్చుకుంటారు? మన కాలములో, “ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది సలహా సభ ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారులుగా ఆమోదించబడ్డారు” (బైబిల్ నిఘంటువు, “దీర్ఘదర్శి”). భూమిపై ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారులను కలిగియుండు దీవెన గురించి చివరగా ఎప్పుడు మీరు ధ్యానించారు? ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారులు ఏవిధంగా మీకు “గొప్ప ప్రయోజనకారులుగా” (మోషైయ 8:18) ఉన్నారో మీరు వ్రాయవచ్చు.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ గొప్ప దీర్ఘదర్శి, ఆయన మన యుగానికి అధిపతిగా నిలిచారు (సి&ని 21:1; 124:125; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:62 చూడండి). తన పరిచర్యలో, అమ్మోన్ వర్ణించిన దీర్ఘదర్శికి ఆయన ఏవిధంగా మాదిరినుంచారు?

మోషైయ 9–10.

“ప్రభువు యొక్క బలమందు” నేను నా సవాళ్ళను ఎదుర్కోగలను.

తాను తప్పులు చేసానని జెనిఫ్ ఒప్పుకున్నాడు. రాజైన లేమన్ తో తెలివితక్కువ సంధి చేసుకోవడం ద్వారా అతడు కొన్నిసార్లు అత్యాశక్తి గలవాడై తన జనులను—లింహై జనుల యొక్క పూర్వీకులు—కష్టాలలో పడవేసాడు. కానీ తర్వాత, అతడు లేమనీయులకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు, తన జనులు విశ్వాసంతో తమ సవాళ్ళను ఎదుర్కోవడానికి అతడు సహాయపడ్డాడు. మీరు మోషైయ 9–10 చదివినప్పుడు, తమ విశ్వాసాన్ని చూపడానికి జెనిఫ్ యొక్క జనులు ఏమి చేసారో చూడండి. దేవుడు వారినెలా బలపరిచెను? మీ దృష్టిలో “ప్రభువు యొక్క బలమందు” ముందుకు వెళ్ళడమంటే అర్థమేమిటి? (మోషైయ 9:17; 10:10–11).

మోషైయ 10:11–17

నా ఎంపికలు తరతరాలను ప్రభావితం చేయగలవు.

మోషైయ 10:11–17 ప్రకారం, లేమనీయుల పూర్వీకుల చర్యలు మరియు దృక్పథాలు సత్యాన్ని తెలుసుకోకుండా లేమనీయులను ఏవిధంగా అడ్డుకున్నాయి? లేమనీయుల పూర్వీకుల ఎంపికలు భవిష్యత్ తరాలను ఏవిధంగా ప్రభావితం చేసాయి? మీ నమ్మకాలు మరియు ఎంపికల చేత ప్రభావితం చేయబడగల వారి గురించి ఆలోచించండి; క్రీస్తు నందు పరిపూర్ణ విశ్వాసం కలిగియుండేందుకు వారికి సహాయపడడానికి మీరేమి చేస్తున్నారు?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మోషైయ 7:19–20

విశ్వాసము కలిగియుండడానికి తన జనులను ప్రోత్సహించేందుకు లింహై చెప్పిన ఉదాహరణలను గమనించండి. “దేవుని యందు నమ్మకముంచడానికి” లేఖనములలోని ఏ మాదిరులు మనల్ని ప్రేరేపిస్తాయి? దేవుని యందు మన నమ్మకముంచడమనగా అర్థమేమిటి? (మోషైయ 9:17; 10:19 చూడండి). దేవుని యందు గొప్ప నమ్మకమును ప్రేరేపించడానికి మన జీవితాలు లేక మన పూర్వీకుల జీవితాల నుండి ఏ కథలను మనం పంచుకోగలము?

మోషైయ 7:26–27

ఈ వచనాల నుండి రక్షకుని గురించి మనమేమి నేర్చుకుంటాము? (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22 కూడా చూడండి) ఈ విషయాలను తెలుసుకోవడానికి మనమెందుకు కృతజ్ఞత కలిగియున్నాము?

మోషైయ 8:13–18

దీర్ఘదర్శి అంటే ఏమిటో కుటుంబ సభ్యులు అర్థం చేసుకొనేలా సహాయపడేందుకు మీరు, మనం మరోలా చూడలేని వాటిని చూడడానికి సహాయపడే దుర్బిణీ, టెలిస్కోపు లేక మైక్రోస్కోపు వంటిదేదైనా సాధనం యొక్క చిత్రాలు వారికి చూపించవచ్చు. ఈ సాధనాలు ఏ విధంగా ఒక దీర్ఘదర్శిలా ఉన్నాయి? (మోషే 6:35–36 చూడండి). మనం చూడలేని వేటిని దీర్ఘదర్శులు చూడగలరు? జోసెఫ్ స్మిత్ ఒక దీర్ఘదర్శి అనడానికి మన దగ్గర ఏ సాక్ష్యమున్నది?

జీవించియున్న మన ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారుల చిత్రాలను చూపించి, వారి గురించి ఏమి తెలుసునని మీరు మీ కుటుంబమును అడగవచ్చు. మనము వారిని ఏవిధంగా అనుసరిస్తున్నాము?

మోషైయ 9:14–18; 10:1–10

లేమనీయులు దాడిచేసినప్పుడు, జెనిఫ్ యొక్క జనులు శారీరకంగా, ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నారు. సవాళ్ళ కొరకు సిద్ధపడడం గురించి జెనిఫ్ మరియు అతని జనుల నుండి మనమేమి నేర్చుకోగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీ స్వంత ఆత్మీయ మనోభావాలను వెదకండి. ఈ సారాంశము దృష్టిపెట్టవలసిన వాక్యభాగాలను, సూత్రాలను సూచిస్తుంది, కానీ ఈ సూచనలు మీ అధ్యయనాన్ని పరిమితం చేయనీయకండి. ఇక్కడ ప్రస్తావించబడని వచనాల చేత మీరు ఆకట్టుకోబడవచ్చు లేదా సూత్రాలను కనుగొనవచ్చు. ఆత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి.

మొరోనైతో జోసెఫ్ స్మిత్

జోసెఫ్ స్మిత్ కు దర్శనము, క్లార్క్ కెల్లీ ప్రైస్ చేత