రండి, నన్ను అనుసరించండి
మే 4–10. మోషైయ 11–17: “ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు”


“మే 4–10. మోషైయ 11–17: ‘ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“మే 4–10. మోషైయ 11–17,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
రాజైన నోవాహ్ ఎదుట అబినడై సాక్ష్యమిచ్చుట

రాజైన నోవాహ్ ఎదుట అబినడై, ఆండ్రూ బోస్లే చేత

మే 4–10

మోషైయ 11–17

“ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు”

రాజైన నోవాహ్ సభలో కనీసం ఒక్క సభ్యునిలో అబినడై మాటలు గొప్ప మార్పు కలుగజేసాయి (మోషైయ 17:2–4 చూడండి). మీరేవిధంగా మార్పుచెందగలరనే దాని గురించి ఆలోచనలను పొందునట్లు మీ హృదయములో ప్రార్థిస్తూ మోషైయ 11–17 చదవండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

పెద్ద మంటలు ఒక చిన్న నిప్పురవ్వతో మొదలు కాగలవు. ఒక శక్తివంతమైన రాజుకు, అతని సభకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్న ఏకైక వ్యక్తి అబినడై మాత్రమే. అధికులచేత అతని మాటలు నిరాకరించబడి, అతనికి మరణశిక్ష విధించబడింది. అయినప్పటికీ, “ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు” (మోషైయ 16:9) అయిన యేసు క్రీస్తు గురించిన ఆయన సాక్ష్యము యౌవన యాజకుడైన ఆల్మాపై ప్రభావం చూపింది. ఆల్మా అనేకమంది ఇతరులను పశ్చాత్తాపమునకు మరియు యేసు క్రీస్తు నందు విశ్వాసమునకు తెస్తుండగా పరివర్తన యొక్క ఆ నిప్పురవ్వ నెమ్మదిగా పెరిగింది. అబినడైను చంపిన అగ్నికీలలు క్రమంగా ఆరిపోయాయి, కానీ అతని మాటలు సృష్టించిన విశ్వాసపు అగ్ని నీఫైయులపైన—మరియు నేడు అతని మాటలు చదివే వారిపైన చిరకాల ప్రభావాన్ని కలిగియుంటుంది. మనలో ఎక్కువమంది మన సాక్ష్యాల కారణంగా అబినడై ఎదుర్కొన్నటువంటి వాటిని ఎన్నడూ ఎదుర్కోరు, కానీ యేసు క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు మన ధైర్యానికి, విశ్వాసానికి పరీక్ష పెట్టే క్షణాలను మనందరం కలిగియుంటాము. బహుశా అబినడై సాక్ష్యాన్ని చదవడం, మీ హృదయంలో కూడా సాక్ష్యము మరియు ధైర్యము యొక్క మంటలు రేపుతుంది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మోషైయ 11–13; 17

నేను ఒంటరిగా ఉన్నప్పటికీ, నేను సత్యము కొరకు నిలబడగలను.

వారి దుష్ట విధానాలను మార్చుకోవడంలో ఏ మాత్రం ఆసక్తి లేని జనులకు పశ్చాత్తాపమును ప్రకటించడం అబినడైను ఎంత నిరుత్సాహపరచి యుండవచ్చో ఊహించండి. అతని సందేశము మళ్ళీ మళ్ళీ నిరాకరించబడింది. అయినప్పటికీ అబినడై ఎన్నడూ నిరాశ చెందలేదు.

సత్యమును కాపాడుటలో మీరు ఒంటరిగా ఉన్నారని మీరెప్పుడు భావించారు? మోషైయ 11–13 మరియు 17 ను మీరు చదువుతున్నప్పుడు, ఆయన సువార్త కోసం మీరు నిలబడాలని ప్రభువు కోరినప్పుడు మీరు సిద్ధంగా ఉండేందుకు సహాయపడేలా మీరేమి నేర్చుకుంటారు? అబినడై మాదిరి నుండి ఏ ఇతర సూత్రాలను మీరు నేర్చుకుంటారు?

మోషైయ 12:19–30

దేవుని వాక్యాన్ని గ్రహించడానికి నేను నా హృదయమును ఉపయోగించాలి.

రాజైన నోవాహ్ యొక్క యాజకులు దేవుని వాక్యమును బాగా ఎరిగినవారు—వారు లేఖన భాగములను ఉదహరించగలరు మరియు ఆజ్ఞలను బోధిస్తున్నామని పేర్కొన్నారు. కానీ ఆ ఆజ్ఞలు “(వారి) హృదయములలో వ్రాయబడిలేవు,” మరియు వాటి “గ్రహింపు కొరకు వారు (తమ) హృదయములను ఉపయోగించలేదు” (మోషైయ 13:11; 12:27). ఫలితంగా, వారి జీవితాలు ఏ మార్పు లేకుండా ఉన్నాయి.

మీరు మోషైయ 12:19–30 చదివినప్పుడు, దేవుని వాక్యమును గ్రహించడానికి మీ హృదయమును ఉపయోగించడం అంటే అర్థమేమిటో ధ్యానించండి. సువార్తను నేర్చుకోవడానికి మీరు అనుసరించే పద్ధతుల్లో ఏవైనా మార్పులు చేయడానికి ఇది మిమ్మల్ని ప్రేరేపిస్తుందా?

మోషైయ 13:1–9

ప్రభువు తన కార్యములో తన సేవకులకు సహకారమందిస్తారు.

ఒక వైపు, ప్రభువు తన సేవకులకు ఎలా సహకరిస్తారనే దానికి అబినడై అనుభవం అనేక ఉదాహరణలనిస్తుంది—మీరు మోషైయ 13:1–9 లో అటువంటి ఉదాహరణలు అనేకము కనుగొనగలరు. మరొక వైపు, అతని సాక్ష్యము మూలంగా అబినడై హింసించబడి, చెరసాలలో వేయబడి, మతం కొరకు చంపబడుటకు కూడా ప్రభువు అనుమతించారు. అబినడై ప్రభువును నమ్మాడని తెలిపే విధంగా ఈ వచనాలలో మీరేమి కనుగొంటారు? మీ పిలుపులు మరియు బాధ్యతలను మీరు చూసే విధానాన్ని అబినడై మాదిరి ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?

మోషైయ 14–15

యేసు క్రీస్తు నా కొరకు బాధననుభవించారు.

రక్షణ మోషే ధర్మశాస్త్రము ద్వారా వచ్చిందని రాజైన నోవాహ్ మరియు అతని యాజకులు నమ్మారు. రక్షణ మెస్సీయ, యేసు క్రీస్తు ద్వారా వస్తుందని వారు తెలుసుకోవాలని అబినడై కోరుకొనెను. మోషైయ 14–15 లో, రక్షకుడు మరియు ఆయన మీ కొరకు పడిన బాధను వివరించే పదాలను, వాక్యభాగాలను గమనించండి. ఆయన పట్ల మీ ప్రేమను, కృతజ్ఞతను హెచ్చించడానికి ఏ వచనాలు సహాయపడతాయి?

మోషైయ 15:1–12

యేసు క్రీస్తు ఏ విధంగా తండ్రి మరియు కుమారుడైయున్నారు?

ఈ వాక్యభాగాలు కొన్నిసార్లు గందరగోళంగా ఉంటాయి, ఎందుకంటే పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు ఇద్దరూ ఒక్కరేనని అబినడై బోధిస్తున్నట్లుగా అనిపించవచ్చు, అయినా వారిద్దరూ వేర్వేరు వ్యక్తులని మనకు తెలుసు. అబినడై చెప్పిన దానికి అర్థమేమిటి? కుమారుడైన దేవుడు—యెహోవా—విమోచకుడని (మోషైయ 15:1 చూడండి), శరీరంలో నివసిస్తున్నారని, కొంత మనిషి మరియు కొంత దేవుడైయున్నారని (వచనాలు 2–3) ఆయన బోధించారు. తండ్రియైన దేవుని చిత్తానికి ఆయన పూర్తిగా తననుతాను అప్పగించుకున్నారు (వచనాలు 5–9). ఇందుమూలంగా, యేసు క్రీస్తు దేవుని కుమారుడు మరియు తండ్రియైన దేవునికి పరిపూర్ణమైన భూలోక ప్రతినిధి (యోహాను 14:6–10 చూడండి).

ఆయన విమోచనను మనం అంగీకరించినప్పుడు మనం “ఆయన సంతానం” అవుతామని, ఆ విధంగా యేసు క్రీస్తు తండ్రి కూడా అవుతారని వివరిస్తూ అబినడై కొనసాగించెను (మోషైయ 15:11–12). మరొక విధంగా, మనము ఆయన ద్వారా ఆత్మీయంగా మరల జన్మిస్తాము (మోషైయ 5:7 చూడండి).

యోహాను 5:25–27; 8:28–29; 17:20–23; “The Father and the Son,” Ensign, Apr. 2002, 12–18 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మోషైయ 11–13; 17

అలా చేయడం జనసమ్మతం కానప్పటికీ, సత్యానికి యదార్థముగా నిలిచియుండడానికి ప్రేరేపించు ఉదాహరణలు అబినడై మరియు ఆల్మా. తమ ప్రమాణాలతో రాజీ పడమనే సాంఘిక ఒత్తిడిని మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటుండవచ్చు. సత్యము కొరకు నిలిచియుండుట గురించి అబినడై మరియు ఆల్మా నుండి వారేమి నేర్చుకోగలరు? ఈ వివరణకు సంబంధించిన కళాఖండము ఈ వృత్తాంతాన్ని ఊహించడానికి మీ కుటుంబానికి సహాయపడగలదు. ఈ అధ్యాయాలు చదివిన తర్వాత, నిజ జీవిత సందర్భాలను నటించి చూపడం గురించి ఆలోచించండి, ఆ విధంగా తమ ప్రమాణాలతో రాజీపడమనే ఒత్తిడికి స్పందించడాన్ని మీ కుటుంబ సభ్యులు సాధన చేయగలరు. లేదా సత్యము కొరకు నిలిచియుండడంలో మీకు కలిగిన అనుభవాలను మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

మోషైయ 12:33–37; 13:11–24

దేవుని ఆజ్ఞలు “(మన) హృదయములలో వ్రాయబడియుండుట” అనగా అర్థమేమిటి? (మోషైయ 13:11). హృదయాకారంలో ఉన్న పెద్ద కాగితం పైన మీరు కొన్ని ఆలోచనలను వ్రాయవచ్చు (లేక మీ ఆలోచనలను బొమ్మలుగా గీయవచ్చు). ఆజ్ఞలు మనకెందుకంత విలువైనవి? వాటిని మన హృదయాలలో మనమెలా వ్రాసుకోగలము?

చిత్రం
తండ్రీ కొడుకులు లేఖనములు చదువుట

ఆజ్ఞలను మన హృదయాలలో వ్రాసుకోవడానికి లేఖనములు చదువుట మనకు సహాయపడగలదు.

మోషైయ 14

ఈ అధ్యాయములో యేసు క్రీస్తును వర్ణించు అనేక పదాలు మరియు వాక్యభాగాలను మీరు కనుగొంటారు. వాటిని మీరు కనుగొనినప్పుడు, మీ కుటుంబము వాటిని జాబితా చేయవచ్చు. మనము ఈ పదాలు మరియు వాక్యభాగాలను చదివినప్పుడు, కుటుంబ సభ్యులు రక్షకుని గురించి ఏవిధంగా భావిస్తారు?

మోషైయ 15:26–27; 16:1–13

యేసు “లోకములోనికి వచ్చియుండని” యెడల (మోషైయ 16:6) లేక వారు ఆయనను అనుసరించని యెడల, దేవుని పిల్లలకు ఏమి జరుగునో ఈ వచనాలు వివరిస్తాయి. ఆయన వచ్చి, మన కొరకు ప్రాయశ్చిత్తము చేసినందువలన జరిగిన మంచి సంగతులేవి? “Why We Need a Savior” (ChurchofJesusChrist.org) అనే వీడియో కూడా చూడండి.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

సువార్త సూత్రాలను బోధించడానికి కథలను, ఉదాహరణలను ఉపయోగించండి. కథలు మరియు ఉపమానాలను ఉపయోగించి రక్షకుడు తరచు సువార్త సూత్రాలను బోధించారు. మీ జీవితం నుండి, మీ కుటుంబం కొరకు ఒక సువార్త సూత్రాన్ని సజీవంగా చేయగల ఉదాహరణలు మరియు కథల గురించి ఆలోచించండి (Tరక్షకుని విధానంలో బోధించుట, 22 చూడండి).

చిత్రం
రాజైన నోవాహ్ ఎదుట అబినడై సాక్ష్యమిచ్చుట

ఆయన ముఖము అత్యంత ప్రకాశముతో మెరిసెను, జెరెమి విన్బార్గ్ చేత

ముద్రించు