“మే 11–17. మోషైయ 18–24: ‘మేము ఆయనతో ఒక నిబంధనలో ప్రవేశించాము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“మే 11–17. మోషైయ 18–24,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020
మే 11–17
మోషైయ 18-24
మేము ఆయనతో ఒక నిబంధనలో ప్రవేశించాము
అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా బోధించారు, ”మనము లేఖనాలను చదివి, ధ్యానించినప్పుడు, మన ఆత్మలకు ఆత్మ యొక్క మధురమైన గుసగుసలను మనము అనుభూతి చెందుతాము” (“మనమెప్పుడు ఒంటరిగా నడువము,” ఎన్‌సైన్ or లియహోనా, నవం. 2013, 122).
మీ మనోభావాలను వ్రాయండి
మోషైయ 18లో ఆల్మా మరియు అతని జనుల యొక్క వృత్తాంతము; 23–24 “దేవుని యొక్క సముదాయములోనికి రావలెను” (మోషైయ 18:8) అనగా అర్ధమేమిటో చూపును. వారు బాప్తీస్మము పొందినప్పుడు, వారు “ఆయనను సేవించుదురని మరియు ఆయన ఆజ్ఞలు పాటించుదురని” (మోషైయ 18:10), దేవునితో నిబంధన చేసారు. ఇది చాలా వ్యక్తిగతమైన ఒడంబడిక కాగా, అది వారు ఒకరినొకరు ఎలా ఆదరించారో దానికి సంబంధించినది. అవును, పరలోక తండ్రికి తిరిగి వెెళ్లు ప్రయాణము వ్యక్తిగతమైనది మరియు ప్రత్యేకమైనది, ఏ ఒక్కరు మన కొరకు మన నిబంధనలు పాటించలేరు, కానీ దాని అర్ధము మనము ఒంటరివారమని కాదు. మనము ఒకరికొకరం అవసరము. క్రీస్తు యొక్క సంఘ సభ్యులుగా, “ఒకరి భారములు ఒకరు భరించుటకు” (మోషైయ 18:8–10) మనము మార్గము వెంబడి ఒకరినొకరికి సహాయపడటం, సేవ చేయటం ద్వారా దేవునికి సేవ చేస్తామని నిబంధన చేసాము. మనలాగే, ఆల్మా యొక్క జనులు కూడా ఖచ్చితంగా భరించుటకు భారములు కలిగియున్నారు. మనము “(మన) భారములను సునాయాసముగా భరించుటకు”(మోషైయ 24:15) ప్రభువు మనకు సహాయపడే ఒక విధానము ఏమిటంటే మనము వారి కొరకు చేస్తామని వాగ్దానము చేసినట్లుగా మనతో దుఃఖించుటకు మరియు మనల్ని ఓదార్చుటకు వాగ్దానము చేసిన పరిశుద్ధుల సమాజమును మనకివ్వడమే.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
బాప్తీస్మము దేవునితో సేవ చేయుటకు ఒక నిబంధనను మరియు ఆయనను గూర్చి ఒక సాక్షిగా నిలబడుటను కలిపియున్నది.
బాప్తస్మీపు నిబంధన, లేక బాప్తీస్మము వద్ద దేవునితో మనము చేయు వాగ్దానమును గురించి మోషైయ 18:8–10 ఆల్మా యొక్క బోధనలను కలిగియున్నది. మీరు ఈ వచనాలను చదివినప్పుడు, క్రింది ప్రశ్నలను ధ్యానించుము:
-
బాప్తీస్మము వద్ద మీరు చేసిన వాగ్దానములను గూర్చి ఈ వచనములనుండి మీరు ఏమి నేర్చుకున్నారు? దేవుడు మీకు చేసిన వాగ్దానమేమిటి?
-
దేవునికి సేవ చేయు నిబంధన (10వ వచనము చూడండి) ఒకరికొకరం పరిచర్య చేయుటకు మన ప్రయత్నాలకు ఎలా సంబంధించును? (8–9 వచనములు చూడండి).
-
మీ వాగ్దానములు కాపాడుకొనుటకు మీరేమి చేస్తున్నారు?
-
మీ బాప్తీస్మపు నిబంధనను పాటించుట మీరు “ఆత్మతో నింపబడుటకు” ఎలా సహాయపడింది? మోషైయ 18:14 మీ నిబంధన పాటించుటకు ఆత్మ మీకు ఎలా సహాయపడింది?
బాప్తీస్మము సరిగా తీసుకునే విధానమును కూడా ఈ వృత్తాంతము బయల్పరుస్తుంది. బాప్తీస్మము ఎలా ఇవ్వాలో 14–17 వచనములలో మీరు ఏమి నేర్చుకున్నారు? మత్తయి 3:16; రోమా 6:3–5; 3 నీఫై 11:21–28; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 20:72–74 లో బాప్తీస్మము గురించి మీరు ఇంకా ఏమి నేర్చుకున్నారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37, 77, 79 కూడా చూడండి.
దేవుని యొక్క జనులు ఏకమైయుండాలి.
ఆల్మా మరియు అతని జనులు కనుగొన్నట్లుగా, యేసు క్రీస్తును అనుసరించుట అనగా కొన్నిసార్లు ఎదైనా క్రొత్తది, ప్రత్యేకమైన దాని కొరకు పరిచయమైన జీవిత విధానమును విడిచిపెట్టుట అని అర్ధము. కానీ ఆల్మా యొక్క జనులు “క్రీస్తు యొక్క సంఘము” మోషైయ 18:17 లో భాగముగా ఒకరినొకరి నుండి బలమును పొందారు. మోషైయ18:17–30 లోని బోధనలు ఉత్తమమైన సంఘ సభ్యునిగా ఉండుటకు మిమ్మల్ని ఎలా ప్రేరేపించాయి? మీ వార్డు లేక బ్రాంచి సభ్యలు “ఒకరి యెడల ఒకరు ఐక్యతయందు మరియు ప్రేమ యందు వారి హృదయములు కలసి మెలసియుండుటకు” సహాయపడుటకు మీరేమి చేయగలరు?మోషైయ 18:21.
హెన్రీ బి. ఐరింగ్, “మన హృదయాలు ఒకటిగా అల్లికచేయబడ్డాయి,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2008, 68–71 కూడా చూడండి.
ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్చబడును.
రాజైన నోవహు మరియు అతడి జనులు పశ్చాత్తాపపడుటకు తిరస్కరించిన యెడల వారి గురించి అబినడై కొన్ని ప్రత్యేక ప్రవచనాలను చేసాడు. అయినప్పటికినీ, ప్రత్యేకంగా నీఫైయులు దాదాపు 50 సంవత్సరాలుగా లేమనీయులకు వ్యతిరేకంగా తమను విజయవంతంగా కాపాడుకున్నారు కనుక (మోషైయ 9:16–18; 11:19 చూడండి), కొందరికి ఈ ప్రవచనాలు నమ్మశక్యము కానివిగా కనబడినవి (మోషైయ 12:1–8, 14–15 చూడండి). కానీ అబినడై వలే మన కాలములో—ప్రవక్తల యొక్క మాటలన్నీ నెరవేర్చబడతాయి.
అబినడై యొక్క ప్రవచనాలు నెరవేర్చబడినవని ప్రకటించుటకు గిద్యోనును నడిపించిన మోషైయ 19–20లో మీరు కనుగొన్నదేమిటి? (మోషైయ 20:21 చూడండి). దేవుని యొక్క ప్రవక్తల హెచ్చరికలు, సలహాయందు మీ విశ్వాసమును, మరియు వారి మాటలు అనుసరించుటకు మీ ఒడంబడికను ఈ వృత్తాంతము ఎలా బలపరచును? మన కాలములో ఒక ప్రవక్తల యొక్క మాటలు నెరవేరుట మీరు ఎప్పుడు చూసారు?
దేవుడు నా భారములు తేలికగా చేయగలడు.
వేర్వేరు కారణములు, వేర్వేరు పరిస్థితుల వలన అయినప్పటికినీ, లీంహై యొక్క జనులు మరియు ఆల్మా యొక్క జనులు ఇరువురు దాస్యములో పడిపోయారు. మోషైయ 19–22 లోని లీంహై యొక్క జనుల యొక్క మోషైయ 18; 23–24లో ఆల్మా యొక్క జనుల యొక్క వృత్తాంతములను పోల్చుట ద్వారా మీరేమి నేర్చుకొనగలరు? ఈ గుంపులలో ప్రతీ ఒక్కటి దాస్యమునకు ఎలా స్పందించారు లేక ప్రతీ ఒక్కటి చివరకు విడిపించబడ్డారో మీరు గమనించగలరు. మీరు చేసినప్పుడు, మీ జీవితానికి అన్వయించు సందేశాల కొరకు చూడండి. ఉదాహరణకు, మీ భారములు భరించుటకు సహాయపడునట్లు ఈ వృత్తాంతముల నుండి మీరేమి నేర్చుకోగలరు?
నేను ప్రభువును నమ్మగలను.
వారు తమ పాపముల కొరకు పశ్చాత్తాపపడినప్పటికినీ, ఆల్మా మరియు అతడి జనులు ఇంకా దాస్యములో తమను తాము కనుగొన్నారు. ప్రభువునందు నమ్మకముంచి, మన నిబంధనలు జీవించుట ఎల్లప్పుడు కష్టములను ఆపవు కానీ వాటిని జయించుటకు అది మనకు సహాయపడగలదని వారి అనుభవాలు చూపుతాయి. మోషైయ 23:21–24 మరియు 24:8–17 మీరు చదివినప్పుడు, మీ పరిస్థితులను లక్ష్యపెట్టకుండా, దేవునియందు విశ్వసించుటకు నేర్చుకొనుటకు మీకు సహాయపడు మాటలు మరియు వాక్యభాగములను గమనించండి.
థామస్ ఎస్. మాన్సన్, “నిన్ను నేను విడువను, ఎడబాయను,” ఎన్‌సైన్ లేదా లియహోనా నవం. 2013, 85–87 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదివినప్పుడు, మీ కుటుంబము యొక్క అవసరాలను తీర్చుటకు బదులుగా ఏ సూత్రములను నొక్కి చెప్పాలి మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయాలు ఇవ్వబడ్డాయి.
మోషైయ 18:1–4
ఒక ఆపిల్‌లో ఉన్న విత్తనాలను మీరు లెక్కించగలరు, కానీ ఒక విత్తనమునుండి వచ్చే ఆపిల్ పండ్లను మీరు లెక్కించలేరనే ఒక సామెత ఉన్నది. అబినడై యొక్క సాక్ష్యముకు ఒక వ్యక్తి మాత్రమే గ్రహీతగా ఉన్నాడు, కానీ ఆ ఒక్క వ్యక్తి—ఆల్మా—నీఫైయుల తరములను ప్రభావితం చేసాడు. ఈ సూత్రమును రుజువు చేయుటకు విత్తనములుగల ఫలమును మీరు ఉపయోగించవచ్చు. మన కుటుంబానికి ఈ సందేశము ఎలా వర్తిస్తుంది? ఇతరులతో మన సాక్ష్యములను పంచుకొనుటకు మనము చేయగల దేమిటి?
మోషైయ 18:8–10
(సిద్ధాంతము మరియు నిబంధనలు 20:73, 77–79 కూడా చూడండి) ఈ వచనముల నుండి మన బాప్తీస్మపు నిబంధనను గూర్చి మనము ఏమి నేర్చుకోగలము? మన బాప్తీస్మపు నిబంధన కొరకు లేక కాపాడుకొనుటకు సిద్ధపడుటకు మనమేమి చేస్తున్నాము?
మోషైయ 18:30
అక్కడ మనము కలిగియున్న ఆత్మీయ అనుభవాల వలన మనకు ప్రత్యేక అర్ధము కలిగియున్న స్థలములేవి?
మోషైయ 21:11-16; 24:10-15.
ఆల్మా యొక్క జనులు మరియు లీంహై యొక్క జనుల దాస్యమును పోల్చుట ద్వారా మనము ఏమి నేర్చుకోగలము?
మోషైయ 21:15; 24:11–15
ప్రభువు ప్రార్థనలకు జవాబిచ్చు విధానములలో కొన్నిటిని గూర్చి ఈ వచనములు మనకు ఏమి బోధిస్తాయి?
పిల్లలకు బోధించు మరిన్ని ఆలోచనల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.