రండి, నన్ను అనుసరించండి
మే 25–31. మోషైయ 29–ఆల్మా 4: “వారు నిలకడగాను మరియు కదలకయుండిరి”


“మే 25–31. మోషైయ 29–ఆల్మా 4: “వారు నిలకడగాను మరియు కదలకయుండిరి” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“మే 25–31. మోషైయ 29–ఆల్మా 4,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020

చిత్రం
చిన్నవాడైన ఆల్మా ప్రకటించుట

చిన్నవాడైన ఆల్మా ప్రకటించుట, గారీ ఎల్. కాప్ చేత

మే 25–31

మోషైయ 29–ఆల్మా 4

“వారు నిలకడగాను మరియు కదలకయుండిరి”

లేఖనాలను చదువుట బయల్పాటును ఆహ్వానించును. ప్రభువు మీకివ్వాలని కోరిన సందేశాలకు గ్రహీతలుగా ఉండుము.

మీ మనోభావాలను వ్రాయండి

రాజులకు బదులుగా ఎంపిక చేయబడిన న్యాయాధిపతులను ఉంచాలనే రాజైన మోషైయ సూచనను కేవలము ఒక చాతుర్యమైన రాజకీయ మార్పుగా కొందరు జనులు చూడవచ్చు. కానీ నీఫైయులకు, ప్రత్యేకంగా దుష్టుడైన రాజు నోవహు క్రింద జీవించిన వారికి, ఈ మార్పు ఆత్మీయ ప్రాముఖ్యతను కూడా కలిగియున్నది. ఒక అవినీతిపరుడైన రాజు తన జనుల మధ్య ఎలా “అతిక్రమమును,” “గొప్ప నాశనమును,”(మోషైయ 29:17) కలిగించాడో వారు చూసారు, మరియు వారు అటువంటి ప్రభావము నుండి స్వేచ్ఛగా ఉండుటకు “మిక్కిలి ఆతృత,” కలిగియున్నారు. ఈ మార్పు వారు స్వంత నీతి కొరకు మరియు “[వారి] స్వంత పాపముల కొరకు జవాబిచ్చుటకు,” (మోషైయ 29:38; సిద్ధాంతము మరియు నిబంధనలు 101:78 చూడండి) బాధ్యులుగా ఉండుటకు వారిని అనుమతించును.

అవును, రాజుల పాలన ముగింపు అనగా నీఫైయుల సమాజములో సమస్యలకు ముగింపని అర్ధము కాదు. నీహోర్ మరియు అమ్లిసై వంటి కపటమైన జనులు అబద్ధపు ఆలోచనలు వ్యాప్తి చేసారు, అవిశ్వాసులు పరిశుద్ధులను హింసించారు, మరియు అనేకమంది సంఘ సభ్యులు గర్విష్టులయ్యారు మరియు సంఘమును విడిచిపెట్టారు. అయినప్పటికినీ, “దేవుని యొక్క వినయముగల అనుచరులు,” వారి చుట్టూ జరుగుచున్న దానిని లక్ష్యపెట్టకుండా, “నిలకడగాను మరియు కదలక”(ఆల్మా 1:25) నిలిచారు. మోషైయ చేత నియమించబడిన మార్పు వలన, మేలు కొరకు వారి సమాజమును ప్రభావితం చేయుటకు వారు “తమ స్వరసమ్మతిని తెలియజేసారు” ( ఆల్మా 2:6).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మోషైయ 29:11–27; ఆల్మా 2:1–7

నా సమాజములో నేను మంచి ప్రభావమును కలిగియుండగలను.

న్యాయాధిపతుల పాలనలోనికి వచ్చి కేవలము ఐదు సంవత్సరాలలో, జనులలో అనేకులు సాధారణంగా సరైన దానిని ఎంపిక చేస్తారనే మోషైయ యొక్క ప్రకటనను పరీక్షించు ఒక క్లిష్ట పరిస్థితి కలిగింది (మోషైయ 29:26 చూడండి). ఈ సమస్య మత స్వేచ్ఛతో ముడిపడి ఉంది: అమ్లిసై అను పేరుగల వ్యక్తి “(జనులకు) సంఘములో వారి యొక్క హక్కులు మరియు అదనపు సౌకర్యములు లేకుండా చేయును” ఆల్మా 2:4 . మీ దేశములో లేక సమాజములో మతపరమైన హక్కులు బెదిరించబడుట మీరు గమనించారా? ఈ బెదిరింపుకు నీఫైయులు స్పందించిన విధానము నుండి మీరేమి నేర్చుకున్నారు? (ఆల్మా 2:1–7 చూడండి).

మన సమాజమును ఎదుర్కొంటున్న అనేక ముఖ్యమైన సమస్యలు ఉండవచ్చు. నీపైయుల వలే, మీరు మీ స్వరము “జనుల యొక్క స్వరము” లో చేర్చబడినట్లు నిశ్చయపరచుటకు ఎలా ఉండగలరు? బహుశా ప్రభుత్వముపై జనుల స్వరముకు పరిమితమైన ప్రభావమును కలిగియున్న చోట మీరు నివసిస్తూ ఉండవచ్చు; ఆలాగైతే, మీ సమాజములో మీరు మంచి ప్రభావముగా ఉండగల ఇతర విధానములు ఏవైనా ఉన్నాయా?

ఆల్మా 1

అబద్ధపు సిద్ధాంతమును నేను గుర్తించగలను మరియు తిరస్కరించగలను.

నీహోర్ చివరకు తాను బోధించినది తప్పని ఒప్పుకొన్నప్పటికినీ, అతడి బోధనలు అనేక సంవత్సరాలు నీఫైయులను ప్రభావితం చేయటం కొనసాగించాయి (ఆల్మా 1:15–16; 2:1–2; 14:14–18; 15:15; 21:4; 24:28 చూడండి). జనులు నీహోర్ యొక్క బోధనలు ఎందుకు ఆకర్షిణీయంగా కనుగొనియుండవచ్చు? మీరు ఆల్మా 1:2–4 చదివినప్పుడు, నీహోర్ యొక్క బోధనలందు అబద్ధాలను మీరు గుర్తించగలరేమో చూడండి; వారు పాక్షిక నిజాలతో బోధింపబడ్డారని బహుశా మీరు గమనించియుంటారు.

గిద్యోన్ “దేవుని యొక్క మాటలతో” ఆల్మా 1:7, 9 నీహోర్‌ను ఎదిరించాడు. నీహోర్ యొక్క అబద్ధములను ఖండించే లేఖనాలను గూర్చి మీరు ఆలోచించగలరా? ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి, కానీ ఇంకా మిగిలినవి అనేకమున్నాయి: మత్తయి 7:21–23; 2 నీఫై26:29–31; మోషైయ 18:24–26; మరియు హీలమన్ 12:25–26. నేడు బోధించబడిన అబద్ధములను మీరు ఖండించుటకు ఈ లేఖనాలు మీకు ఎలా సహాయపడినవి?

ఆల్మా 1ను మీ అధ్యయనమును చేరుకొనుటకు మరొక విధానము నీహోర్ మరియు అతడి అనుచరులను ( 3–9, 16–20 వచనములు) “దేవుని యొక్క జనులతో”(25–30 వచనములు; 2 నీఫై 26:29–31 కూడా చూడండి) పోల్చుట. మీరు దేవుని యొక్క జనుల వలె ఎక్కువగా ఎలా ఉండగలరు? మీ స్వంత సేవలో ఏదైన “యాజకవంచన” మీరు గమనించారా?

ఆల్మా 1:27–31; 4:6–15

యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు వారి హృదయాలను ఐశ్వర్యాలపై ఉంచరు.

ఆల్మా యొక్క అధ్యాయము 1 మరియు4 రెండును సంఘము అభివృద్ధి చెందిన సమయములను వివరించును, కానీ ప్రతీ సందర్భములో ఆ అభివృద్ధికి సంఘ సభ్యులు భిన్నంగా స్పందించారు. ఏ తేడాలను మీరు గమనించారు? మీరు కనుగొన్న దానిపై ఆధారపడి, “దేవుని యొక్క వినయముగల శిష్యులు” (ఆల్మా 4:15) ఐశ్వర్యములు మరియు అభివృద్ధి పట్ల వైఖరిని మీరు ఎలా వర్ణించగలరు? మీ స్వంత వైఖరి గురించి మీరు మార్చుకోవాలని ప్రేరేపించబడినట్లు భావించినదేమిటి?

ఆల్మా 4

“దేవుని యొక్క వాక్యము” మరియు “శుద్ధమైన సాక్ష్యము” హృదయాలను మార్చగలదు.

ఆల్మా 4 లో (ఆల్మా 4:15) ఏది ఆల్మా “మిక్కిలి దుఃఖాక్రాంతుడు” అగునట్లు చేసెను? తన జనుల మధ్య అతడు చూచిన సమస్యలను పరిష్కరించుటకు శ్రేష్టమైన స్థానములో ప్రధాన న్యాయాధిపతి కార్యాలయము ఆల్మాను ఉంచియుండవచ్చని కొందరు చెప్పవచ్చు. కానీ ఒక ఉత్తమమైన విధానము ఉన్నదని ఆల్మా భావించెను. తన జనులకు సహాయపడు అతని విధానము గురించి మీకు ఆశ్చర్యము కలిగించేది ఏది? మీ చుట్టు ఉన్నవారిని మీరు నీతిగా ఎలా ప్రభావితం చేయవచ్చో మీ అధ్యయనము ఆలోచనలు ప్రేరేపించవచ్చు; ఆలాగైతే, ఆలోచనలపై అమలు చేయుము.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలను చదివినప్పుడు, ఏ సూత్రములను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 1:19-25

ఈ వచనాలలో హింసకు సంఘ సభ్యులు స్పందించిన వేర్వేరు విధానములను గుర్తించుట నుండి మీ కుటుంబము ప్రయోజనము పొందవచ్చు. మన నమ్మకాలపై ఇతరులు దాడి చేసినప్పుడు తగినట్లుగా స్పందించు విధానాలను మీరు సాధన చేయవచ్చు. మత స్వేచ్ఛ వీడియోలు సహాయపడవచ్చు.

ఆల్మా 3:4

వారు “తమను తాము ముద్ర వేసుకొనియున్నప్పుడు” అమ్లిసీయులు ఏ సందేశమును తెలపాలని కోరుతున్నారు? (ఆల్మా 3:4, 13 చూడండి). మనము కనిపించే తీరు—ఉద్దేశ్యపూర్వకంగా లేక అనుకోకుండా—మనము ఏ సందేశాలను పంపవచ్చు? యౌవనుల బలము కొరకు (2011), 6–8 లో “దుస్తులు మరియు ఆకృతి” సమీక్షించుటకు ఇది మంచి సమయమ.

ఆల్మా 4:2-3

ఏ విషయాలు లేక అనుభవాలు “(మన) కర్తవ్యము యొక్క జ్ఞాపకమునకు (మనల్ని) మేల్కొలిపాయి”? (ఆల్మా 4:3). మీ కుటుంబము ఉదయము మేల్కొన్న తరువాత ఈ వచనాలు పంచుకొనుటకు శక్తివంతంగా ఉండవచ్చు. తరువాత శారీరకంగా మేల్కొనే సవాళ్లు ఆత్మీయంగా మేల్కొనే సవాళ్లను మనము సరిగా గ్రహించుటకు ఎలా సహాయపడతాయో మీరు చర్చించవచ్చు.

ఆల్మా 4:10-11

“సంఘమునకు చెందని వారికి ఒక గొప్ప ఆటంకము” అగుటను మనము ఎలా మానగలము? (ఆల్మా 4:10). ఇతరుల యొక్క, మరిముఖ్యముగా తోటి సంఘ సభ్యుల యొక్క చర్యలు, మన ఆత్మీయ అభివృద్ధికి ఆటంకము కాకుండా ఉండేలా మనము ఎలా నిశ్చయపరచగలమో దాని గురించి మాట్లాడటం కూడా ఉపయోగపడవచ్చు.

ఆల్మా 4:19

మీ కుటుంబము సాక్ష్యము యొక్క శక్తిని గ్రహించుటకు సహాయపడుటకు, ఎవరిదైనా సాక్ష్యము విన్నప్పుడు వారిని బలముగా ప్రభావితం చేసిన సమయాన్నిగూర్చి ఆలోచించమని మీరు వారిని అడగవచ్చు. జనుల యొక్క హృదయాలను ప్రభావితం చేయు సాక్ష్యమును మరియు దేవుని యొక్క మాటను ఉపయోగించుటకు ఆల్మా ఎందుకు ఎన్నుకున్నాడు? (ఆల్మా 31:5 కూడా చూడండి). ఇతరులు మారుటకు ఒప్పించుటకు జనులు ఉపయోగించు మిగిలిన పద్ధతుల కంటే ఇది ఎందుకు ఎక్కువ శక్తివంతమైనది? మన సాక్ష్యములను వారితో పంచుకొనుట ద్వారా మనము ఎవరిదైన విశ్వాసమును బలపరచగల జనులు ఉన్నారా?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

లేఖనములను మీకు పోల్చుకొనుట. లేఖనముల వృత్తాంతములు మరియు బోధనలు మీ జీవితానికి ఎలా అన్వయించబడతాయో ఆలోచించండి. ఉదాహరణకు, నేటి లోకము మరియు ఆల్మా 1—4లో నీఫైయులు అనుభవించిన సంప్రదాయ సమస్యల మధ్య పోలికలను మీరు కనుగొనవచ్చు ఆల్మా 1–4.

చిత్రం
అమ్లిసీయులతో పోరాడుతున్న నీఫైయులు

ఆల్మా మరియు అమ్లిసై, స్కాట్ ఎమ్. స్నో చేత

ముద్రించు