”జూన్ 1–7. ఆల్మా 5–7: ’మీ హృదయములందు ఈ బలమైన మార్పును మీరు అనుభవించారా?’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
”జూన్ 1–7. ఆల్మా 5–7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
జూన్ 1–7
ఆల్మా 5–7
“మీ హృదయములందు ఈ బలమైన మార్పును మీరు అనుభవించారా?”
యేసు క్రీస్తుకు కొనసాగుతున్న మీ పరివర్తనపై ప్రతిబింబించేందుకు ఆల్మా 5–7 మీకు సహాయపడగలదు. మీరు చదువుతున్నప్పుడు, ఆత్మ మీకు బోధించేదానిని నమోదు చేయండి.
మీ అభిప్రాయాలను నమోదు చేయండి
ఈ రోజుల్లో ప్రాణాలు కాపాడే గుండె మార్పిడి శస్త్రచికిత్సలు, అనగా గాయపడిన లేక వ్యాధికి గురైన గుండెకు బదులుగా ఆరోగ్యంగా ఉండే గుండెను అమర్చడం గురించి ఆల్మాకు తెలియదు. కానీ మరింత అద్భుతమైన “హృదయం యొక్క మార్పు” (ఆల్మా 5:26) గురించి అతనికి తెలుసు—”క్రొత్తగా జన్మించినట్లు” (ఆల్మా 5:14, 49 చూడండి), అందులో రక్షకుడు మనకు ఒక క్రొత్త ఆత్మీయ జీవితాన్నిస్తారు. నీఫైయులలో అనేకులకు అవసరమైనది సరిగ్గా హృదయము యొక్క ఈ మార్పేనని ఆల్మా చూడగలిగాడు. కొందరు ధనవంతులు, మరికొందరు పేదవారు, కొందరు గర్విష్టులు, మరికొందరు వినయము గలవారు, కొందరు హింసించువారు, మరికొందరు హింసింపబడువారు (ఆల్మా 4:6–15 చూడుము). కానీ మనందరం వచ్చినట్లుగానే—వారందరు స్వస్థపరచబడేందుకు యేసు క్రీస్తు యొద్దకు రావలసిందే. మనము గర్వాన్ని జయించాలనుకున్నా లేక బాధలను సహించాలనుకున్నా, ఆల్మా సందేశము ఒక్కటే: “రండి, భయపడకుడి” (ఆల్మా 7:15) కఠినమైన, పాపపూరితమైన లేక గాయపడిన హృదయాన్ని వినయముగల, స్వచ్ఛమైన, క్రొత్తదానిగా రక్షకుడిని మార్చనివ్వండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఆలోచనలు
హృదయమందు ఒక బలమైన మార్పును—నేను తప్పక అనుభవించాలి—మరియు అనుభవించడం కొనసాగించాలి.
జారహెమ్ల యొక్క జనులను ఆల్మా అడిగినవి, ఆల్మా 5:14–33 లో కనుగొనబడే ఆలోచింపజేయు ప్రశ్నలు మీ స్వంత ఆత్మను మీరు వెదికేందుకు మరియు మీ జీవితాంతము ”హృదయము యొక్క ఒక బలమైన మార్పును” అనుభవించడమంటే అర్థమేమిటో గ్రహించేందుకు సహాయపడగలవు. ఈ ప్రశ్నల విలువను అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ వివరించారు: “‘నేను ఎలా ఉన్నాను?’ అని నన్ను నేను ప్రశ్నించుకొనేందుకు క్రమంగా సమయం తీసుకోవాలి. ఇది ఒక రకంగా మీతో మీరు వ్యక్తిగతంగా, ఏకాంతంగా ముఖాముఖి పరీక్ష కలిగియుండడం వంటిది. … ఈ వ్యక్తిగత, ఏకాంత పునశ్చరణలో నాకు మార్గదర్శిలా ఉండేందుకు ఆల్మా యొక్క ఐదవ అధ్యాయములో ఉన్న ఆలోచింపజేసే మాటలను చదివి, ధ్యానించడానికి నేనిష్టపడతాను” (“తిరిగిరండి మరియు పొందండి,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2017, 64).
మిమ్మల్ని మీరు ముఖాముఖి పరీక్ష చేసుకుంటున్నట్లుగా మరియు మీ హృదయాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఆల్మా యొక్క ప్రశ్నలను చదవడం గురించి ఆలోచించండి. ఆ ప్రశ్నలకు మీ జవాబులను నమోదు చేయాలని మీరు కోరుకోవచ్చు. మీ ముఖాముఖి పరీక్ష ఫలితముగా ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?
డేల్ జి. రెన్లండ్, “Preserving the Heart’s Mighty Change,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవం. 2009, 97–99 కూడా చుడండి.
రక్షకుడు మరియు ఆయన సువార్త గురించి నా స్వంత సాక్ష్యమును పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందగలను.
రక్షకుడు మరియు ఆయన సువార్త గురించి ఆల్మా శక్తివంతమైన సాక్ష్యమిచ్చెను, మరియు ఆ సాక్ష్యాన్ని తానెలా పొందెనో అది కూడా వివరించెను. అతడు సాక్ష్యమిచ్చినట్లుగా, అతడు ఒక దూతను చూసి, వినడం గురించిన తన అనుభవాన్ని చెప్పలేదు (మోషైయ 27:10–17 చూడండి), కానీ తనంతట తాను సత్యాన్ని తెలుసుకోవడానికి చెల్లించిన వెల గురించి వివరించెను. ఆల్మా ఏవిధంగా సత్యాన్ని తెలుసుకొనెను అనేదాని గురించి ఆల్మా 5:44–51 నుండి మీరేమి నేర్చుకుంటారు? మీ సాక్ష్యాన్ని పొందడానికి లేక బలపరచుకోవడానికి మీ ప్రయత్నాల్లో అతని మాదిరిని మీరెలా అనుసరించగలరు? ఆల్మా 5:33–35, 48–50, మరియు 57–60 లో ఆల్మా యొక్క బోధనల నుండి రక్షకుని గురించి మీరేమి నేర్చుకుంటారు?
“దేవుని రాజ్యమునకు నడిపించు త్రోవలో“ నిలిచియుండేందుకు శ్రద్ధతో కూడిన విధేయత నాకు సహాయపడుతుంది.
జారహెమ్లలోని జనులవలె గిద్యానులోని జనులు అదే సందిగ్ధ స్థితిలో లేరు, కాబట్టి ఆల్మా వారి అవసరాలను గ్రహించి, వారికి వేరేవిధంగా బోధించడానికి ఆత్మ సహాయపడింది (ఆల్మా 7:17, 26 చూడండి). జారహెమ్లలో (ఆల్మా 5 చూడండి) మరియు గిద్యానులో (ఆల్మా 7 చూడండి) ఆల్మా సందేశాల మధ్య కొన్ని తేడాలను మీరు గమనించవచ్చు. ఉదాహరణకు, గిద్యాను జనులు “దేవుని రాజ్యమునకు నడిపించు త్రోవలో ఉన్నారని” (ఆల్మా 7:19) ఆల్మా గ్రహించెను. వారికి తన ప్రసంగమందంతటా, ఆ త్రోవలో ఎలా ఉండాలనే దాని గురించి అనేక విషయాలను ఆల్మా వారికి బోధించెను (ఆల్మా 7 చూడండి). అతడు వారికి ఏమి సలహా ఇచ్చెను? మీ జీవితానికి మీరిప్పుడు ఏమి అన్వయించగలరు?
రక్షకుడు నా పాపములు, బాధలు మరియు శ్రమలను తనపైకి తీసుకున్నారు.
మీ శ్రమలను లేక సవాళ్ళను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీరెప్పుడైనా భావించారా? అలాగైతే, ఆల్మా 7:7–16 లో బోధించబడిన సత్యాలు సహాయపడగలవు. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ సాక్ష్యమిచ్చారు: “దేవుని కుమారుడు సంపూర్ణంగా గ్రహించి, అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మన వ్యక్తిగత శ్రమలను ఆయన అనుభవించారు మరియు భరించారు. ఆయన అనంతమైన మరియు నిత్యమైన త్యాగము వలన (ఆల్మా 34:14 చూడండి), ఆయనకు పరిపూర్ణమైన సానుభూతి కలదు మరియు దయగల తన బాహువులను మనవైపు చాపగలరు” (“Bear Up Their Burdens with Ease,” ఎన్ సైన్ లేక లియహోనా, మే 2014, 90).
ఆల్మా 7:7–16 మీరు చదివినప్పుడు, రక్షకుని త్యాగము యొక్క ఉద్దేశాల గురించి ఏమి గ్రహించడానికి ఈ వచనాలు మనకు సహాయపడతాయనే దానిపై ప్రతిబింబించండి. మన జీవితాల్లో మనం ఆయన శక్తిని ఏవిధంగా పొందుతాము? మీ ఆలోచనలు నమోదు చేయడం గురించి ఆలోచించండి.
యెషయా 53:3–5 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఆలోచనలు
మీరు మీ కుటుంబ సభ్యులతో లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
ఆల్మా 5:6–13
తన జనులు వారి పూర్వీకుల పట్ల ప్రభువు యొక్క దయను జ్ఞాపకముంచుకోవాలని ఆల్మా ఎందుకు కోరుకొనెను? మీ కుటుంబ చరిత్ర నుండి ఏ కథలు ఆయన దయ గురించి మీకు బోధిస్తాయి? ఈ కథలను నమోదు చేయడానికి మీరు familysearch.org/myfamily ను సందర్శించవచ్చు.
ఆల్మా 5:14–33
ఒక క్యాంపుకు వెళ్ళడం, బడిలో పరీక్ష, లేక ఉద్యోగ ముఖాముఖి పరీక్ష కొరకు—సిద్ధపడియుండడం—లేక సిద్దపడకుండా ఉండడం ఎలా ఉంటుందో మీ కుటుంబ సభ్యులకు తెలిసియుండవచ్చు. సిద్ధపడియుండడం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఇటీవలి అనుభవాలు వేటిని వారు పంచుకోగలరు? ఆల్మా 5:14–33 ను పునస్సమీక్షించమని మరియు దేవుడిని కలుసుకొనేందుకు తన జనులను సిద్ధపరచడానికి ఆల్మా అడిగిన ప్రశ్నలను కనుగొనమని మీరు కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు. బహుశా ప్రతి కుటుంబ సభ్యుడు ఒక ప్రశ్నను ఎంచుకొని, దేవుని కలుసుకోవడానికి సిద్ధపడేందుకు అది మనకెలా సహాయపడగలదో పంచుకోవచ్చు. కుటుంబ సభ్యులు ధ్యానించడం కోసం మీ ఇంటిలో ఆల్మా యొక్క అనేక ప్రశ్నలను కూడా మీ కుటుంబము ప్రదర్శించవచ్చు.
ఆల్మా 6:4–6
మనం పరిశుద్ధులుగా కూడుకొనుటకు గల కొన్ని కారణాలేవి? సంఘములో మన సమయాన్ని మన కొరకు మరియు ఇతరుల కొరకు మరింత సహాయకరముగా మనమెలా చేయగలము?
ఆల్మా 7:9–16
మనం పశ్చాత్తాపపడి, మారవలసినప్పుడు మనము “భయపడకుండా” ఆల్మా 7:15 సహాయపడేందుకు ఈ వచనాల నుండి మనం ఏమి నేర్చుకుంటాము? మనకు సహాయం అవసరమైనప్పుడు రక్షకుని వైపు తిరగడం గురించి ఈ వచనాలు మనకేమి బోధిస్తాయి? ఆయన సహాయమును పొందడానికి మనం చేసిన ఇతర కార్యాలేవి? ఆయన మనకెలా సహాయపడ్డారు?
ఆల్మా 7:23
ఈ వచనంలో జాబితా చేయబడిన సుగుణాలలో ఒకటి లేక ఎక్కువ వాటికి ఒక మంచి మాదిరిగా ఉన్న వారెవరిని మనమెరుగుదుము? ఈ సుగుణాలను వృద్ధిచేసుకోవడం ఎందుకు ముఖ్యము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లోని ఈ వారం సారాంశం చూడండి.