రండి, నన్ను అనుసరించండి
జూన్ 15–21. ఆల్మా 13–16: “ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము”


“జూన్ 15–21. ఆల్మా 13–16: ‘ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము,”” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జూన్ 15–21. ఆల్మా 13–16,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

ఆల్మా మరియు అమ్యులెక్ చెరసాల నుండి బయటికి నడుచుట

ఆల్మా మరియు అమ్యులెక్ చెరసాల నుండి విడిపించబడుట యొక్క వివరణ, ఆండ్రూ బోస్లే చేత

జూన్ 15–21

ఆల్మా 13–16

“ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము”

మీరు లేఖనములను ధ్యానించినప్పుడు పొందే ప్రేరణ అమూల్యమైనది. దానిని నమోదుచేసి, దానిపై పనిచేయడం ద్వారా మీరు దానికి విలువిస్తారని చూపగలరు.

మీ మనోభావాలను నమోదు చేయండి

అమ్మోనైహాలో జీవితం అనేక విధాలుగా అమ్యులెక్ మరియు జీజ్రొమ్ ఇరువురికి బాగుండేది. “అనేకమంది బంధువులు, స్నేహితులు” మరియు “ఎంతో ధనము” తో అమ్యులెక్ “తక్కువ ప్రఖ్యాతి గలవాడేమి కాదు”. (ఆల్మా 10:4). జీజ్రొమ్, న్యాయవాదుల మధ్య గల “మిక్కిలి నేర్పరులలో ఒకడైయుండి,” “అధిక వ్యాపారము” కలిగియున్నాడు (ఆల్మా 10:31). అప్పుడు పశ్చాత్తాపపడుము మరియు “ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుము” అనే దైవిక ఆహ్వానముతో ఆల్మా అమ్మోనైహాకి చేరుకున్నాడు (ఆల్మా 13:16). అమ్యులెక్, జోజ్రొమ్ మరియు ఇతరులకు ఈ ఆహ్వానాన్ని అంగీకరించడం గొప్ప త్యాగముతో కూడుకున్నది మరియు దాదాపుగా భరింపజాలని కష్టాలకు దారితీసింది.

కానీ కథ అక్కడే ముగిసిపోలేదు. ఆల్మా 13–16 లో, “రక్షణ నిమిత్తము క్రీస్తు యొక్క శక్తి యందు” (ఆల్మా 15:6) నమ్మేవారికి చివరకు ఏమి జరుగుతుందో మనం నేర్చుకుంటాము. కొన్నిసార్లు విడుదల, కొన్నిసార్లు స్వస్థత—మరి కొన్నిసార్లు జీవితంలో పరిస్థితులు అంత తేలికగా ఉండవు. కానీ ఎల్లప్పుడూ “ప్రభువు (తన జనులను) మహిమలో తన యొద్దకు చేర్చుకొనుచున్నాడు” (ఆల్మా 14:11). ఎల్లప్పుడూ “క్రీస్తునందున్న (మన) విశ్వాసమును బట్టి, ప్రభువు శక్తి ననుగ్రహించును” (ఆల్మా 14:28). మరియు ఎల్లప్పుడూ, “ప్రభువు నందు ఆ విశ్వాసము” “(మనము) నిత్యజీవమును పొందుదుమను నిరీక్షణను” మనకిస్తుంది (ఆల్మా 13:29). మీరు ఈ అధ్యాయాలను చదివినప్పుడు, మీరు ఈ వాగ్దానాలలో ఓదార్పు పొందవచ్చు మరియు “ప్రభువు యొక్క విశ్రాంతి” గురించి ఆల్మా మాట్లాడినప్పుడు అతడు చెప్పేదానిని మీరు బాగా అర్థం చేసుకోగలరు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఆలోచనలు

ఆల్మా 13:1–19

యేసు క్రీస్తు ద్వారా విమోచన పొందడానికి యాజకత్వపు విధులు నాకు సహాయపడతాయి.

ఆల్మా 12 లో, దేవుని విమోచన ప్రణాళిక గురించి ఆల్మా బోధించాడని (ఆల్మా 12:24–27 చూడండి) మీరు గుర్తుచేసుకోవచ్చు. 13వ అధ్యాయములో, జనులకు ఈ విషయములను బోధించుటకు (ఆల్మా 13:1) దేవుడు నియమించిన యాజకుల గురించి అతడు మాట్లాడాడు. ఆల్మా మాటలు యాజకత్వము గురించి అనేక శక్తివంతమైన సత్యాలను బయల్పరుస్తాయి. బహుశా ఆల్మా 13:1–9 లో ప్రతి వచనానికి ఒక సత్యము చొప్పున గుర్తించడానికి మీరు ప్రయత్నించవచ్చు. మీరు ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని ఆలోచనలున్నాయి:

వచనము 1.యాజకత్వము, “(దేవుని) కుమారుని క్రమము” అని కూడా పిలువబడును (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1–4 కూడా చూడండి).

వచనము 2.విమోచన కొరకు ఆయన కుమారుని వైపు చూడడానికి జనులకు సహాయపడేందుకు దేవుడు యాజకులను నియమించును.

వచనము 3.యాజకత్వము గలవారు “లోకము పునాది వేయబడినప్పటి నుండి” తమ బాధ్యతల కొరకు సిద్ధపడియున్నారు.

మీరు ఇంకేమి కనుగొంటారు? ఈ సత్యాలను మీరు ధ్యానించినప్పుడు, యాజకత్వము గురించి మీరేవిధంగా భావిస్తారు? విమోచన కొరకు క్రీస్తు వైపు చూడడానికి యాజకత్వపు విధులు మీకేవిధంగా సహాయపడ్డాయి?

అమ్మోనైహాలోని జనులలో అనేకమంది నీహోర్ అనుచరులని గమనించడం ఆసక్తికరమైనది (ఆల్మా 14:18; 15:15 చూడండి). ఆల్మా వివరించినట్లుగా నీహోర్ క్రమము యొక్క యాజకులు (ఆల్మా 1:3–6 చూడండి), “దేవుని కుమారుని క్రమము చొప్పున” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:3) నియమించబడిన యాజకుల నుండి ఏవిధంగా భిన్నంగా ఉన్నారు? (ఆల్మా 13:1–19 చూడండి).

డేల్ జి. రెన్‌లన్డ్ “The Priesthood and the Savior’s Atoning Power,” Ensign or Liahona, Nov. 2017, 64–67 కూడా చూడండి.

సంస్కారపు బల్ల వద్ద యువకులు

విమోచన కొరకు యేసు క్రీస్తు వైపు చూడడానికి యాజకత్వపు విధులు మనకు సహాయపడతాయి.

ఆల్మా 13:3

యాజకత్వము గలవారు మాత్రమే “లోకము పునాది వేయబడినప్పటి నుండి పిలువబడి, సిద్ధపరచబడ్డారా”?

ఆల్మా 13:3 లోని ఆల్మా బోధనలు ప్రత్యేకించి యాజకత్వము గలవారిని సూచిస్తాయి. అయినప్పటికీ, “లోకము పునాది వేయబడినప్పటి నుండి“ వ్యక్తులు నియామకాలను పొందారు మరియు వాటిని నెరవేర్చడానికి సిద్ధపడ్డారు—అని అతడు బోధించిన సూత్రము మనందరికీ వర్తిస్తుంది. అధ్యక్షులు స్పెన్సర్ డబ్య్లు. కింబల్ ఇలా చెప్పారు: “మనం ఇక్కడకు రాకముందు లోకంలో, విశ్వాసులైన స్త్రీలకు కొన్ని నియామకాలు ఇవ్వబడ్డాయి, అలాగే విశ్వాసులైన పురుషులు కొన్ని యాజకత్వపు కార్యములకు ముందుగానే నియమించబడ్డారు. వివరాలు మనకు ఇప్ఫుడు జ్ఞాపకం లేకపోయినా, మనం ఒకప్పుడు ఒప్పుకున్న వాటి యొక్క మహిమకరమైన వాస్తవాన్ని ఇది మార్చదు” (Teachings of Presidents of the Church: Spencer W. Kimball [2006], 215–16; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:55–56 కూడా చూడండి).

ఆల్మా 14

కొన్నిసార్లు నీతిమంతులు బాధపడేందుకు దేవుడు అనుమతించును.

తమ నమ్మకాల కారణంగా బాధపడి, మరణించిన నీతిమంతుల గురించి ఆల్మా 14 చెప్తుంది. నీతిగా జీవించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఎందుకు భయంకరమైన సంగతులు జరుగుతాయోనని అనేకమంది లాగా మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆల్మా 14 లోని ఈ కష్టమైన ప్రశ్నకు జవాబులన్నిటిని మీరు కనుగొనలేకపోవచ్చు, కానీ వారు ఎదుర్కొనిన పరిస్థితులకు ఆల్మా మరియు అమ్యులెక్ స్పందించిన తీరు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు నీతిమంతులు బాధపడేందుకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడనే దాని గురించి వారి మాటలు మరియు చర్యలు మీకేమి బోధిస్తాయి? హింసను ఎదుర్కోవడం గురించి వారి నుండి మీరేమి నేర్చుకుంటారు?

మత్తయి 5:43–44; మార్కు 14:55–65; రోమీయులకు 8:35–39; 1 పేతురు 4:12–14; సిద్ధాంతము మరియు నిబంధనలు 122:5–9 కూడా చూడండి.

ఆల్మా 15:16, 18

శిష్యత్వానికి త్యాగము అవసరము.

సువార్తను హత్తుకోవడానికి అమ్యులెక్ విడిచిపెట్టిన విషయాల జాబితా తయారు చేసి(ఆల్మా 10:4–5; 15:16 చూడండి), అతడు పొందిన వాటి జాబితాతో దానిని పోల్చడం (ఆల్మా 15:18; 16:13–15; 34:8 చూడండి) ఆసక్తికరంగా ఉండవచ్చు. మరింత విశ్వాసము గల శిష్యులవడానికి ఏమి త్యాగం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 13

ఆల్మా 13 లో ”విశ్రాంతి” అనే పదము కనిపించిన ప్రతిసారి మీ కుటుంబం దానిని గుర్తించడం ద్వారా లాభపడవచ్చు. దానితోపాటు కనిపించే ఇతర పదాలు, ఆలోచనలేవి? ”ప్రభువు యొక్క విశ్రాంతి” అంటే అర్థమేమిటో తెలుసుకోవడానికి ఇది మనకెలా సహాయపడుతుంది? శారీరక విశ్రాంతి నుండి ఇది ఏవిధంగా భిన్నంగా ఉంది?

ఆల్మా 13:10–12

ఈ వచనాలు బోధించేదానిని మీ కుటుంబం ఊహించడానికి సహాయపడేందుకు మీరు ఒక తెల్లని వస్త్రం వంటిదానిని కలిసి ఉతకవచ్చు. మనము మలినంగా ఉన్నప్పుడు మనమెలా భావిస్తాము? మరల మనం శుభ్రమైనప్పుడు మనమెలా భావిస్తాము? ఈ భావనలు, మనము పాపము చేసి, తర్వాత పశ్చాత్తాపపడి, రక్షకుని ప్రాయశ్చిత్తము ద్వారా శుభ్రపడినప్పుడు మనం భావించేవాటిని ఏవిధంగా పోలియున్నాయి?

ఆల్మా 15:1–12

మన తప్పులు చేసినప్పుడు కూడా మనల్ని బలపరచి, స్వస్థపరచు ప్రభువు యొక్క శక్తి గురించి జీజ్రొమ్ అనుభవం నుండి మనమేమి నేర్చుకుంటాము? మనం ఆయన బలమును, స్వస్థతను పొందుటలో యాజకత్వము ఎటువంటి పాత్ర పోషించగలదు?

ఆల్మా 16:1–10

ఈ వచనాలను చదివిన తర్వాత, మీరు ఆల్మా 9:4 చదవవచ్చు. ప్రవక్త మాటల గురించి అమ్మోనైహా జనులు భావించిన విధానానికి విరుద్ధంగా జోరమ్ భావించిన విధానం నుండి మనమేమి నేర్చుకుంటాము? జీవించియున్న మన ప్రవక్త మాటలకు విశ్వాసంగా ఉండేందుకు మనమేమి చేస్తున్నాము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. బోధించగల క్షణాలు త్వరగా గడిచిపోతాయి, కాబట్టి అవి వచ్చినప్పుడు వెంటనే ఉపయోగించుకోండి. ఉదాహరణకు, అమాయకులు బాధపడేలా కొన్నిసార్లు ప్రభువు ఎందుకు అనుమతిస్తారనే దాని గురించి ఆల్మా 14 నుండి సూత్రాలను పంచుకోవడానికి లోకంలోని విషాదం ఒక అవకాశం కాగలదు. (Teaching in the Savior’s Way, 16 చూడండి.)

చెరసాలలో ఆల్మా మరియు అమ్యులెక్

చెరసాలలో ఆల్మా మరియు అమ్యులెక్, గ్యారీ ఎల్. కాప్ చేత