రండి, నన్ను అనుసరించండి
జూన్ 22–28. ఆల్మా 17–22: “నేను మిమ్మును ఒక సాధనముగా చేయుదును”


“జూన్ 22–28. ఆల్మా 17–22: ‘మిమ్మును ఒక సాధనముగా చేయుదును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జూన్ 22–28 ఆల్మా 17–22,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
రాజైన లమోనైతో అమ్మోన్ మాట్లాడుట

రాజైన లమోనైతో అమ్మోన్ మాట్లాడుట, స్కాట్ ఎమ్. స్నో చేత

జూన్ 22–28

ఆల్మా 17–22

“నేను మిమ్మును ఒక సాధనముగా చేయుదును”

ఆల్మా 17–22 మీరు చదువుతున్నప్పుడు, మీకు కలుగు మనోభావాలను నమోదు చేసి, వాటిని అమలు చేయండి. ఆవిధంగా చేయడం వలన ఎక్కువ వ్యక్తిగతమైన బయల్పాటును పొందుటకు మీ అంగీకారమును ప్రభువుకు చూపును.

మీ మనోభావాలను నమోదు చేయండి

సువార్తను పంచుకొనకుండా ఉండటానికి జనులు ఇచ్చే కారణములన్నిటి గూర్చి ఆలోచించండి: “నాకు సరిగా తెలియదు” లేక “వారికి ఇష్టమా కాదో నాకు తెలియదు” లేక “ ఒకవేళ నేను వారిని బాధపెడితే?” కొన్ని సమయాలలో మీరు కూడా అదేవిషయాలను ఆలోచిస్తున్నట్లు కనుగొనియుండవచ్చు. లేమనీయులతో సువార్తను పంచుకొనకుండా ఉండటానికి నీఫైయులకు ఒక అదనపు కారణమున్నది: వారు “ఒక అడవి మనుష్యులైన మరియు ఒక కఠినపరచబడిన మరియు ఒక రౌద్రులైన జనులు; నీఫైయులను హత్యచేయుట యందు ఆనందించు జనులు” (ఆల్మా 17:14; ఆల్మా 26:23–25 కూడా చూడండి). మోషైయ కుమారులు లేమనీయులతో సువార్తను తప్పనిసరిగా పంచుకోవాలని భావించడానికి ఇంకా బలమైన కారణాన్ని కలిగియున్నారు: “రక్షణ ప్రతిప్రాణికి ప్రకటింబడవలెనని వారు కోరిరి, ఏలయనగా ఏ మానవ ఆత్మయు నశించిపోవుట వారు సహించలేకపోయిరి”(మోషైయ 28:3). అమ్మోన్ మరియు అతడి సహోదరులను ప్రేరేపించిన ఈ ప్రేమ మీ కుటుంబము, స్నేహితులు, మరియు పరిచయస్తులతో—దానిని అంగీకరించనట్లు కనబడు వారితో కూడా—సువార్తను పంచుకొనుటకు మిమ్మల్ని కూడా ప్రేరేపించవచ్చు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆల్మా 17:1-4

నా స్వంత విశ్వాసమును నేను బలపరచుకొన్నప్పుడు, నేను ఎక్కువ శక్తివంతంగా సువార్తను పంచుకోగలను.

మీరు ఎప్పుడైన పాత స్నేహితులను తిరిగి కలుసుకొని, వారు విశ్వాసములో బలముగా నిలిచియున్నప్పుడు, ఆల్మా చేసినట్లుగా అమితంగా సంతోషించారా? (ఆల్మా 17:1–2 చూడండి). సువార్తయందు మీ విశ్వాసమును, దానికి మీ నిబద్దతను బలముగా ఎలా నిలుపుకోవాలో మోషైయ యొక్క కుమారుల నుండి మీరు ఏమి నేర్చుకోగలరు? మోషైయ యొక్క కుమారుల ఆత్మీయ బలమును మీరు లోతుగా ఆలోచించినప్పుడు, మీరేమి చేయటానికి ప్రేరేపించబడ్డారు?

మోషైయ యొక్క కుమారుల ఆత్మీయ సిద్ధపాటు లేమనీయులతో వారి పనిని ఎలా ప్రభావితం చేసింది? “దేవుని యొక్క శక్తి మరియు అధికారముతో” ఆల్మా 17:3 సువార్తను బోధించుటకు మీ ప్రయత్నాలను లెక్కించుటకు బహుశా ఈ అవకాశమును మీరు ఉపయోగించవచ్చు.

ఆల్మా 17:6-12

ఆయన పిల్లలకు రక్షణ తెచ్చుటకు దేవుని హస్తములలో ఒక సాధనముగా నేను ఉండగలను.

అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ ఇలా చెప్పారు, “ఆయనకు ఏదైనా పని ఉన్నయెడల, టామ్ మాన్సన్ ప్రభువు కొరకు ఆ పనిని నెరవేరుస్తాడని ఆయన తెలుసుకోవాలని నేను ఎల్లప్పుడు కోరతాను” (“On the Lord’s Errand: The Life of Thomas S. Monson,” video, ChurchofJesusChrist.org). మీరు ఆల్మా 17:6–12 చదివినప్పుడు, దేవుని యొక్క హస్తములలో వారు సాధనములుగా ఉండగలుగుటకు మోషైయ కుమారులు చేసిన దాని కొరకు వెతకండి. ఇతరులను దీవించుటకు మీరు దేవుని హస్తములలో సాధనములుగా ఎలా ఉండగలరు? ప్రభువు మీరు చేయాలని కోరిన దానిని చేయుటకు మీకు ధైర్యమిచ్చుటకు వారి మాదిరి నుండి మీరేమి నేర్చుకొనగలరు?

డాలిన్ హెచ్. ఓక్స్ “పునఃస్థాపించబడిన సువార్తను పంచుకొనుట,” ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2016, 57–60 కూడా చూడండి.

ఆల్మా 17–18

సువార్తను పంచుకొనుటకు ఇతరులకు నేను సహాయపడగలను.

“ఒక అడవి మనుష్యులైన మరియు ఒక కఠినపరచబడిన మరియు ఒక రౌద్రులైన జనులకు” ఆల్మా 17:14{ లమోనై నాయకుడు అయినప్పటికినీ, సంవత్సరాల సంప్రదాయాన్ని జయించి, అతడు యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించాడు. లమోనైతో అమ్మోన్ పరస్పర స్పందనలను గూర్చి మీరు చదివినప్పుడు, అతడి సందేశానికి లమోనై ఎక్కువ గ్రహీతగా ఉండుటకు సహాయపడునట్లు అమ్మోన్ చేసిన దానిని గమనించండి. ఇతరులతో సువార్త పంచుకొనుటకు మీరు చేయగల దాని గురించి ఆలోచనలు కలిగిన యెడల, ఈ ప్రేరేపణలను వ్రాయండి.

అమ్మోన్ లమోనైకు బోధించిన సత్యములను ( ఆల్మా 18:24–39 చూడండి) మరియు అహరోను బోధించిన సత్యములను (ఆల్మా 22:1–16 చూడండి) గుర్తించుట లేక వ్రాయుట సహాయకరముగా ఉండవచ్చు. సువార్త యొక్క సాక్ష్యమును కోరుటకు వారికి సహాయపడుటకు మీరు ఇతరులతో పంచుకొనగల సత్యములను గూర్చి ఈ వచనములు మీకేమి సూచిస్తాయి?

చిత్రం
రాజు యొక్క గొఱ్ఱెలను అమ్మోన్ రక్షించుట

మినెర్వా కె. టైచెర్ట్ (1888–1976), రాజు యొక్క గొఱ్ఱెలను అమ్మోన్ రక్షించుట, 1935–1945, కృత్రిమ చెక్కపై తైలవర్ణ చిత్రలేఖనము, 35 x 48 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయము ఆర్ట్ మ్యూజియమ్.

ఆల్మా 18–22

నా సాక్ష్యము అనేకమందిని ప్రభావితం చేయగలదు.

లేఖనాలలో మనము చదివే మార్పు చెందిన వృత్తాంతాలు తరచుగా నాటకీయమైన సంఘటనలను కలిగియున్నప్పటికి, వృత్తాంతములో అతి ముఖ్యమైన భాగము ధైర్యముగా మాట్లాడగలిగి, ఇతరులతో వారి సాక్ష్యమును పంచుకునే వ్యక్తులు. ఆల్మా 18–22 లో సంఘటనలను అధ్యయనము చేయుటకు ఒక విధానము ఒక వ్యక్తి అతడు లేక ఆమె సాక్ష్యమును పంచుకొనుట యొక్క విస్తృతమైన ప్రభావముల కోసం వెతకడం. ఈ క్రింది రేఖాచిత్రములో మీరు కనుగొన్న దానిని మీరు వ్రాసియుంచవచ్చు:

అమ్మోన్ తో సువార్త పంచుకున్నాడు, ఎవరితో పంచుకున్నాడు , మరియు దాని ఫలితము .

ఆల్మా 19:36

నేను పశ్చాత్తాపపపడినప్పుడు, ప్రభువు యొక్క బాహువు చాపబడింది.

లమోనై యొక్క పరివర్తన వృత్తాంతము ముగింపులో, ప్రభువు యొక్క స్వభావము గురించి ఎదైనా ముఖ్యమైన దానిని మోర్మన్ బోధించెను. ప్రభువు యొక్క స్వభావము గురించి ఆల్మా 19:36 ఏమి సూచించును? ప్రభువు యొక్క బాహువు మీ వైపు చాపబాడుట మీరు ఎప్పుడు భావించారు? మీరు ప్రేమించువారు ఆయన కనికరమును అనుభవించుటకు మీరేవిధంగా సహాయపడగలరు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో లేఖనాలు చదివినప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు బదులుగా ఏ సూత్రములను నొక్కిచెప్పాలి మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడును. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 17-19

మీ కుటుంబము కొరకు ఈ అధ్యాయములకు జీవము వచ్చునట్లు మీరేలా చేయగలరు? గొఱ్ఱెలను కాపాడుతున్న అమ్మోన్ వృత్తాంతమును లేక దేవుని యొక్క శక్తిని సాక్ష్యమిచ్చుటకు సమూహమును సమవేశపరుస్తున్న అబీష్ యొక్క వృత్తాంతమును మీరు అభినయించవచ్చు. బహుశా కుటుంబ సభ్యులు వృత్తాంతములో వేర్వేరు భాగముల చిత్రములను గీయవచ్చు మరియు వృత్తాంతమును చెప్పుటకు చిత్రములను ఉపయోగించవచ్చు. అమ్మెన్ మరియు అబీష్ యొక్క మాదిరులను అనుసరించుటకు మీ కుటుంబము ఏమి చేయబోతుంది?

ఆల్మా 18:24-39

బహుశా మీ కుటుంబము కలిసి ఆల్మా 18:24–39 చదవవచ్చు మరియు అమ్మెన్ లమోనైకు బోధించిన సత్యములను గుర్తించవచ్చు. అమ్మెన్ ఈ సత్యములను లమోనైకు ఎందుకు బోధించాడని మీరు అనుకుంటున్నారు? ఈ సత్యములను గూర్చి ఒక సాక్ష్యము కలిగియుండుట మనకు ఎందుకు ముఖ్యమైనది?

ఆల్మా 20:8-15

లమోనై తన తండ్రికి స్పందించిన దానినుండి మనము ఏమి నేర్చుకొనగలము? సరైన దాని కొరకు నిలబడుటకు లమోనై యొక్క మాదిరిని మనము ఎలా అనుసరించగలము? (కొన్ని ఉదాహరణలకు, ChurchofJesusChrist.org) లో “Dare to Stand Alone” అనే వీడియోను చూడండి.

ఆల్మా 22:15-18

లమోనై తండ్రి తన ప్రాణమును కాపాడుకొనుటకు బదులుగా ఏది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడో చూడటానికి ఆల్మా 20:23 సమీక్షించండి. సువార్త యొక్క సంతోషమును పొందుటకు బదులుగా అతడు దేనిని ఇచ్చివేయుటకు సిద్ధంగా ఉన్నాడో చూడటానికి ఆల్మా 22:15 సమీక్షించండి. దేవునిని తెలుసుకొనుటకు బదులుగా దేనిని ఇచ్చివేయటానికి అతడు సమ్మతిస్తున్నాడు? (వచనము 18 చూడండి). బహుశా కుటుంబ సభ్యులు దేవునిని ఎక్కువ సంపూర్ణంగా తెలుసుకొనుటకు బదులుగా ఏదైన ఇచ్చివేయటానికి ఒక ప్రణాళికను ప్రతీఒక్కరు వ్రాయవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు {లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

సూత్రములను గుర్తించి అన్వయించుట. లేఖన వృత్తాంతముల వివరణలు మీకు వర్తించినట్లు కనబడినప్పటికి, ఈ వృత్తాంతములలో సూత్రములు తరచుగా మీకు వర్తిస్తాయి. అమ్మోన్ మరియు అహరోను గురించి మీరు చదివినప్పుడు, మీరు పంచుకొనుటకు కనుగొనే సూత్రాలేవి?

చిత్రం
రాజైన లమోనై యొక్క భార్య సొమ్మసిల్లుట

రాజైన లమోనై యొక్క భార్య నేలపై నుండి లేచి, యేసును స్తుతించును. ఓహ్, ఆశీర్వదించ బడిన యేసు, వాల్టర్ రేని చేత

ముద్రించు